Saturday, August 3, 2024

తెలుసుకుందాం . డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు

1. తెలుసుకుందాం డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాదరావు సాధారణంగా మన ఇళ్లల్లో శుభకార్యాలు జరిగినా అశుభకార్యాలు జరిగినా రెండు సందర్భాల్లోనూ కొన్ని గింజల్ని (నవధాన్యాలపేరిట) పెంచుతారు. ఇది ప్రాచీనకాలం నుంచి మనకు వస్తున్నటువంటి వైదికపరమైన ఆచారం. ఈ ఆచారం కొంతమంది చాదస్తమని కొట్టి పరేస్తున్నారు . మరి కొంతమంది విధిగా పాటిస్తున్నారు. పాటిస్తున్న్నవాళ్ళకి ఎందుకు పాటిస్తున్నామో తెలీదు, కొట్టి పారేసేవాళ్లకి కూడ దాని ఆంతర్యం తెలియదు . “ స్థితస్య గతి: చింతనీయా” అనేది మన సనాతనధర్మం. అంటే ఒక ఆచారం ఉంటే దాని ఆశయం తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. కాబట్టి ఇందులో ఉండే అంతరార్థాన్ని మనం తెలుసుకుందాం. విశ్వశ్రేయస్సు కోరే వేదం ఎట్టి పరిస్థితిలోను ఒక్క మొక్క కూడ నాశనం కావడానికి అంగీకరించలేదు . పైగా “వృక్షేభ్యో హరికేశేభ్యశ్చ నమో నమ:” అంటు పచ్చని చెట్లను దైవ స్వరూపంగా పేర్కొన్నది. కానీ శుభకార్యాలు జరిగినప్పుడు అగ్నిహోత్రం పేరుతోనూ అలాగే అశుభ కార్యాలు అనగా దహన ఖననాదిసంస్కారాలు జరిగినప్పుడు కొన్ని మొక్కలు విధిగా అనివార్యంగా చచ్చిపోతాయి. అందువల్ల వాటిని (ఆ నష్టాన్ని) భర్తీచేయడం కోసం వేదం ఈ కార్యకలాపం విధించింది. అందువల్ల మనం ప్రతికార్యక్రమానికి నవధాన్యాలు పెంచడం రివాజు . అందువల్ల ఒక మొక్క పొతే వందమొక్కలు పెంచాలనేదే ఇందులో ఆంతర్యంగా గ్రహించాలి . ఆ మొక్కల్ని జాగ్రత్తగా పెంచి రక్షించాలి . <><><>