అనుభవాలు
-జ్ఞాపకాలు-9
డాక్టర్
. చిలకమర్తి దుర్గాప్రసాదరావు .
ఇది పుష్కరకాలం నాటి మాట . నేను A. N. R.
కళాశాలలో V.R.S తీసుకుని
దయల్బాగ్ విశ్వవిద్యాలయంలో పని చేస్తున్న రోజుల్లో అమెరికాలో consciousness studies అంశానికి
సంబంధించిన అంతర్జాతీయ సదస్సును University of Arizona వారు
నిర్వహించారు. అవకాశం
రాక పోతుందా అని ఒక నేను కూడ ఒక రాయి విసిరా . ఆశ్చర్యం! నా పేపరు కూడ select
అయింది . ఇంతకు నా పేపర్ పేరు “The nature of consciousness of a Jivanmukta” .
అది select
కాకుండా ఉంటే ఎలా ఉండేదో చెప్పలేను గాని select అయ్యాక నాలో ఉత్సాహం పెరిగింది. కాని అంత సులభంగా పోవడానికి అది
అంతర్వేది కాదు అమెరికా . వెళ్ళాలంటే passport కావాలి. ఆఫీసు ఘజియాబాద్ లో ఉంది . మా అబ్బాయి నాతొ ‘నాన్న!
passport కోసం
నువ్వు ఎలాగూ చాల దూరం వెల్తున్నావు గదా! నీతో పాటు అమ్మ , ఆరతి ( మా అమ్మాయి) కూడ అప్లై చేస్తే
బాగుంటుంది’ అన్నాడు
. ముగ్గురు అప్లై చేశాం . వాళ్ళ ఇద్దరికీ శాంక్షన్ అయ్యింది. నాది reject
అయ్యింది . ఎందుకంటే నా s.s.c certificate లో
chilakamarti
అని, degree
సర్టిఫికేట్లో chilakamarthi
అని, Ph.D certificate లో
chilakamarthy
అనీ వేరు వేరుగా ఉన్నాయి . అందుకే reject
చేశారు . తిరిగి వచ్చేశాను . Court ద్వారా ఆ మూడు పేర్లు ఒకరికి సంబంధించినవే అని affidavit తెచ్చుకుని
మరలా ప్రయత్నిస్తే పని జరిగింది.
మనం సాధారణంగా పిల్లల సర్టిఫికేట్
చూస్తున్నప్పుడు మార్కులు, ర్యాంకుల వైపే దృష్టి సారిస్తాం గాని పేరు సరిగ్గా ఉందో
లేదో పరిశీలించం. అందులోనూ మన పేర్లు కొల్లేటి చేంతాళ్ళల్లా చాల పొడుగ్గా ఉంటాయి .
అందువల్ల తల్లిదండ్రులు పేర్ల విషయంలో ప్రత్యేక
శ్రద్ధ వహించాలి . ఇక మరల ఘజియాబాద్
వెళ్లి pass port
పని పూర్తి చేసుకున్నా. ఇక వీసా రావాలి . “ మీకు టిక్కట్టు తీసి ఉంచారు . visa
వస్తే మిమ్మల్ని పంపిస్తాం రాకపోతే మరొకరు వెళతారు” అని ఖచ్చితంగా చెప్పేశారు
విశ్వవిద్యాలయం వారు. ఒకరోజు తెల్లవారు జామున మూడు గంటలకే బయల్దేరి visa కోసం Delhi వెళ్లి ఆఫీసుకు చేరుకున్నాను . visa ఇవ్వడానికి చాల norms ఉంటాయట.
అవేమీ నాకు తెలియదు .
ఏవేవో సుమారు ఎనిమిది ప్రశ్నలు
వేశారు . తోచిన సమాధానాలు చెప్పేను . ‘సరే వెళ్ళండి’ అంటే మనకు visa వస్తుందని ‘passport మన చేతిలో పెట్టేస్తే’ visa
రాదని అనుకోవాలని మా మిత్రులు అన్నారు. ప్రశ్నలడిగాక మీరు వెళ్ళవచ్చు అన్నారు . తిరిగొచ్చేశాను
. వారం పది రోజుల తరువాత visa ఇంటికొచ్చింది. ప్రయాణం
ఖాయం అయ్యింది. ఇక మా అమ్మ నాన్నల ఆశీస్సులు తీసుకోవడం అనే ఒక్క పని మిగిలింది . వెంటనే
నరసాపురం వచ్చాను . ఆ పని కూడ పూర్తయింది. ఇక పేపర్ బాగుండాలి . ‘మంత్రాలు
తక్కువ తుంపర్లు ఎక్కువ’ మాదిరిగా ఉండకూడదు. ఎందుకంటే సంస్థ కొన్ని లక్షలు ఖర్చుపెట్టి
పంపిస్తుంది . వారి నమ్మకాన్ని వమ్ము చెయ్య కూడదు . పేపరుపై కసరత్తు ప్రారంభమయింది. అంతకు ముందు
పంపింది కేవలం synopsis
మాత్రమే. నిద్ర, ఆహారాలు
మానేసి paper
మరియు power point presentationకి కావలసిన ఆ పని కూడ మిత్రుల
సహకారంతో పూర్తి చేశాను.
అమెరికా వెళ్ళ వలసిన సమయం
ఆసన్నమైంది. “ మీరు అమెరికా చేరాక మంచినీరు తప్ప ఎక్కడ ఏమీ తీసుకోకండి . మేమే
అన్ని ఏర్పాట్లు చేస్తామని” అన్నారు కార్యక్రమ నిర్వాహకులు .అన్నమాట ప్రకారమే బయలు దేరిన నాటి
తిరిగివచ్చే వరకు pure - vegetarian food ఏర్పాటు చేశారు . అది తప్ప ఎక్కడ , ఎప్పుడు , ఏదీ తినలేదు .
ఇక ముందుగా 1-4-12న అర్థరాత్రి దాటిన తరువాత డిల్లీ
నుండి non-stop
విమానంలో బయలు దేరి 3-4-12 ఉదయం చికాగోనగరం చేరాము. సుమారు 15 గంటలు పైగా పట్టింది
. నానా స్టాప్ ఐతే ఇంకా ఎక్కువ సమయం పట్టేదని అన్నారు . అక్కడకు చేరాక మిత్రులు మిమ్మల్ని వారి ఇంటికి తీసుకెళ్ళారు .
అక్కడ సుమారు ఐదు రోజులున్నాము. ఈ ఐదు
రోజుల్లోనే ఒకనాడు మాన్య మిత్రులు శ్రీ K. రామకోటేశ్వరరావు గారు నన్ను వారింటికి తీసుకుని వెళ్ళారు.
స్వామికార్యం స్వకార్యం అన్నట్లుగా నాకు వారి ఇంటికెళ్లే అవకాశం కూడ లభించింది. ఆ
ఐదు రోజుల్లోనే university of Chicago , మరో సుప్రసిద్ధ విశ్వవిద్యాలయం (పేరు
గుర్తుకు రావడం లేదు) , స్థానిక రామకృష్ణా మిషన్ , ఇంకా ఎన్నెన్నో ప్రదేశాలు చూడడం
జరిగింది . అతి ముఖ్యమైన మైన మరొక ప్రదేశం
చూడడం జరిగింది . అది వివేకానంద స్వామి congress of world religions లో మాట్లాడిన ప్రదేశం . నా
జీవితంలో అటువంటి పరమపవిత్రమైన ప్రదేశం చూడగలుగుతానని అక్కడున్న పెద్దలతో
మాట్లాడగలనని అనుకోలేదు .
ఆ తరువాత 11-4-12 ‘ఆరిజోనా’ విశ్వవిద్యాలయం లో జరిగే conference స్థలానికి
చేరాం. నాలుగు రోజులు జరిగింది.
ఒక్కొక్కరికి 20 ని||లు టైం అని, ఆ తరువాత ఏమి మాట్లాడినా అది గాలిలో కలిసి పోతుందని నిర్వాహకులు
మాకు ముందే చెప్పేశారు.
ఇక దేశ, విదేశాలనుండి కొన్ని వందల మంది హాజరయ్యారు. భారతీయులే నాకు
తెలిసిన వారు ఏబది మందికి పైగా ఉన్నారు . మా
విశ్వవిద్యాలయ మిత్రులందరూ కూడ వివిధ అంశాలపై papers సమర్పించారు . ఈ conference ఒక విలక్షణ మైనదిగా నాకనిపిం
చింది. ఎందుకంటే చాల చోట్ల కొంరురు వారి వారి పేపర్ చదవడం పూర్తి కాగానే బయటకు
వెళ్లి పోతారు . మిగిలిన వారివి వినేవారు చాల తక్కువ. అక్కడలా కాదు అన్ని పత్రాలు అందరు వింటారు . చర్చ కూడ చాల
విస్తృతంగానే జరుగుతుంది . ఇది నేను గమనించిన విషయం
Conference పూర్తయిన తరువాత ఒక రోజు Grand caneon
తీసుకెళ్ళారు . ప్రయాణమే రాను పోను పదమూడు గంటలు పట్టింది . ఆ ప్రదేశాన్ని చూడటానికి
రోజు కొన్ని వేల మంది అక్కడకు వస్తుంటారట. నేను అక్కడున్న వారిని , అక్కడ
కొచ్చిన వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకున్నాను . అవి వాస్తవాలో అవాస్తవాలో
తెలియదు . నేను విని తెలుసుకున్నవి మాత్రమే. ఆ ప్రదేశంలో పూర్వం Red Indians ఉండే
వారట. Red Indians అంటే
ఎవరో కాదు. Colombus ఇండియా
కోసం ప్రయాణం అయ్యాడు. అనుకోకుండా అమెరికా చేరుకున్నాడు. అందుకని అక్కడున్న వారికి
red Indians అని
పేరు పెట్టడం జరిగిందట . అది చాల గొప్ప జాతి. వారంతా ప్రకృతిని ప్రేమించేవారు,
మాయా, మర్మం తెలియని అమాయకులు . చెట్ల
పళ్ళు కోసుకు తినేవారే గాని చెట్లను నరికేవారు కాదట . జంతువుల పాలు పిండుకుని త్రాగే
వారు గాని జంతువులను చంపేవారు కాదట . ఇక
క్రమక్రమంగా అనేక దేశాల నుండి అక్కడకు settlers గా
వెళ్లిన వాళ్ళు వాళ్ళని ఆ ప్రదేశం ఖాళీ చెయ్యమన్నారట! . వారు మేం ఎందుకు ఖాళీ
చేస్తాం . ఇది మా ప్రాంతం. మేం తరతరాలుగా
ఇక్కడే ఉంటున్నాం . మీరే కొత్తగా ఎక్కడి నుంచో వచ్చారు. మీరే ఖాళీ చెయ్యండి
అన్నారు . ఇద్దరి మధ్య చాల ఘర్షణలు
జరిగాయి . అటు ఇటు కూడ చాల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక settlers
వాళ్ళ అమాయకత్వాన్ని కనిపెట్టి మాకు
ప్రభువు ఇవి మీ కిమ్మని కలలో కనిపించి చెప్పాడని కొన్ని కంబళ్ళు పంచిపెట్టారట . ప్రతి
కంబళీలోను కొన్ని మసూచి పొక్కులు పెట్టారట . అవి కప్పుకుని వారు అందరు చని పోయారట.
క్రమంగా ఆ జాతి అంతం అయ్యింది . అమెరికాకు
స్వతంత్రం వచ్చి 500 సంవత్సరాలైన సందర్భంగా ఇటీవలి కాలంలో అమెరికన్ దేశీయులు పండుగ
జరుపుకోవాలని నిర్ణయించారు . కాని ఆ జాతిలో ఇంకా కొంచెం మిగిలి యున్న వారు ‘మీ వల్ల
మా జాతి పూర్తిగా నశించి పోయింది. ఇది పండుగ చేసుకునే తరుణం కాదు’ అని ఈ
నిర్ణయాన్ని తీవ్రంగా ప్రతిఘటించారట! . ఆ దేశపు పెద్దలు ఏ నిర్ణయం తీసుకోవాలో
తెలియక పార్లమెంటుకు వదిలేశారట. వారు అన్నీ నిశితంగా పరిశీలించి ఇది నిజమే! అని
నిర్ణయించి ఉత్సవాలు చేసుకునే ఆలోచనలకు స్వస్తి పలికారట. ఇంతటి విశిష్టత కల ప్రదేశం అది .ఆ తరువాత Fenix నగరం చేరుకుని అక్కడ రెండు రోజులున్న తరువాత
మరల చికాగో మీదుగా మాతృభూమి చేరాము. అక్కడ నన్ను ఎవరెవరి ఇంటికి తీసుకెళ్ళారో
వారందరూ నాకు స్టూడెంట్స్ (students of Theology ) అవడం నాకు చాల
ఆనందాన్ని కలిగించింది . వారు చూపించిన ఆదరం మఱపురానిది, మఱువలేనిది . ముఖ్యంగా
ఎంతోమంది మహాపండితుల యొక్క స్నేహం లభించింది . అమెరికాలో ఉన్నది కేవలం 15 రోజులే
అయినా మరపురాని అనుభూతిని కలిగించింది. అందరికీ
నమస్కారం .
<><><>