Sunday, January 26, 2014

శ్రీ జాషువ కవితలో మృత్యుతత్త్వవిశ్లేషణ

శ్రీ జాషువ కవితలో మృత్యుతత్త్వవిశ్లేషణ 
Dr. Chilakamarthi Durgaprasada Rao
3/106, Premanagar, Dayalbagh, AGRA.
9897959425.
  
                                ధునికాంధ్ర కవులలో శ్రీ గుర్రం జాషువ గార్కి ఒక సమున్నతమైన  స్థానం ఉంది. తన సహజకవితాశక్తిని స్వార్థానికి కాక విశ్వకళ్యాణానికి వెచ్చించిన మహనీయుడాయన. ఆయన కొంతమంది సామాన్యకవుల వలె అందమైన భవనాల్లో నివసిస్తూ విరహగీతాలు ఆలపించలేదు. ప్రజలబాధల్ని ఉత్ప్రేక్షించుకుంటూ కవితలు చెప్పలేదు.  ఖ్యాతిలాభగౌరవాలను ఆశించి తన కవితాశక్తిని ఏ సిద్ధాంతానికో తాకట్టు పెట్టలేదు  సమాజంపై ద్వేషం పెంచే ఆకలికవిత్వాలు చీకటికవిత్వాలు అల్లలేదు. నిర్హేతుకంగా ఒక వ్యక్తిని గాని , వ్యవస్థను గాని, మతాన్ని గాని పొగడ లేదు, తెగడను లేదు. సమాజంలోని క్రూరత్వానికి భయపడి పిఱికిపందవలె పాఱిపోలేదు. అలాగని సమాజంలోని వింతవింత పోకడలపట్ల ఉదాసీనత వహించలేదు.
        ఆయన సమాజంలో చాలలోతుగా  పాతుకుపోయిన సాంఘిక ఆర్ధిక అసమానతలనే కుళ్ళును తొలగించి చైతన్యవంతం చేసి ముందుకు నడిపించే కళ్యాణప్రదమైన కవిత్వాన్ని అందించారు. సాంప్రదాయబద్ధమైన ఛందస్సులో, జనసామాన్యభాషలో కావ్యాలు వెలయించారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న అన్ని సమస్యలను కవితావస్తువుగా స్వీకరించి, విశ్లేషించి  ఆ సమస్యలకు పరిష్కారముద్రను కూడ చేకూర్చారు. కవిగా తనకు సంఘం పట్ల గల బాధ్యతను నూటికి నూరుపాళ్ళు నిర్వర్తించి కృతకృత్యులయ్యారు. ప్రజలహృదయాల్లోను, నాల్కలపైన శాశ్వతంగా నిల్చిపోయారు. ఆయన కేవలం కవియే కాదు. సంఘసంస్కర్త . కవి, సంఘసంస్కర్త మాత్రమే కాదు. తత్త్వవేత్త కూడ.        
        శ్రీ జాషువ తమ కావ్యాల్లో సందర్భానుసారంగా ఎన్నో తాత్త్వికవిషయాలను ప్రస్తావించారు. అలాంటి విషయాల్లో మృత్యువు ఒకటి. నాకు మృత్యువంటే భయం లేదు . ఎందుకంటే నేనున్నంతసేపు అది రాదు . అది వస్తే నేనుండను అని ఒక
సుప్రసిద్ధ ఆధునిక కవి ఎంత చమత్కరింఛినా ,     పుట్టిన వానికి చావు  తప్పదు  అని  శాస్త్రాలన్ని మృత్యువు యొక్క  అనివార్యతను  నొక్కి చెబుతున్నా మానవజాతి ఆవిర్భవించిననాటి నుండి నేటి వరకు ప్రతినిమిషం  అందరిని వెంటాడేది మరణభయం.
               సాధారణంగా  ఒక విషయానికి సంబంధించిన  భయం తొలగిపోవాలనుకుంటే ఆ విషయం సమగ్రంగా తెలుసుకోవడమే ఉత్తమమైన మార్గమని తత్త్వశాస్త్రం చెబుతుంది. అందువల్ల మృత్యుభయం తొలగిపోవాలంటే దానికి సంబంధించిన యథార్థస్వరూపం  తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మృత్యువు గురించి  జాషువ గారు వ్యక్తీకరింఛిన అభిప్రాయాలు  తెలుసుకునే ముందు కొంతమంది ప్రాచీనుల అభిప్రాయాలు ముందుగా పరిశీలించడం సబబు.  మృత్యువంటే మరణం . దీన్ని ఆంగ్ల భాషలో death అంటారు . ఈ పదానికి  The Total  cessation of life  process that eventually occurs in all living organism  అని నిర్వచనం . అనగా జీవి తన జీవత్వాన్ని సంపూర్ణంగా కోల్పోవడమే మరణంగా చెప్పవచ్చు .  ఈ స్థితి చాల సహజమైనదని శాస్త్రకారులు భావించారు.              

            ఈ శరీరమనేది ఒక పంజరం . ఆ పంజరానికి తొమ్మిది ద్వారాలున్నాయి. అవన్నీ తెరిచే ఉన్నాయి. పంజరంలో గాలి అనే చిలుక ఉంది. అది ఉంటే ఎలా ఉందని ఆశ్చర్య పోవాలేగాని పోతే ఆశ్చర్యం దేనికి?  అంటారు మన పెద్దలు.     

  ఉద్ఘాటితనవద్వారే
పంజరే విహగోs నిల: 
యత్తిష్థతి తదాశ్చర్యం
 ప్రయాతే విస్మయ: కుత:?
మరణం చాల సహజమైనదని  కాళిదాసు కూడ తన రఘువంశంలో వ్యక్తం చేశాడు.
రఘుమహారాజు కుమారుడు అజుడు . ఆయన భార్య ఇందుమతి. ఆమె మరణించినప్పుడు అజుడు హృదయవిదారకంగా ఏడుస్తున్నాడు.  అపుడు నారదమహర్షి ఆయన్ని ఓదారుస్తూ ఓ మహారాజా! జీవులకు మరణం సహజమైనది. జీవించడమే అసహజం అంటాడు.
మరణం ప్రకృతి: శరీరిణామ్
వికృతి: జీవితముచ్యతే బుధై:
క్షణమప్యవతిష్థతే శ్వస
న్యది జంతుర్నను లాభావానసౌ            ( రఘువంశం -8 వ సర్గ . శ్లో -౮౭ )  
మహాభారతంలో అర్జునుడు, తనకుమారుడైన  అభిమన్యుని అకాలమరణానికి విలపిస్తుండగా శ్రీకృష్ణుడు ఓదారుస్తు అర్జునా! నువ్వు నీ కుమారునిగా భావిస్తున్న వ్యక్తి ఒక అదృశ్యశక్తి నుంచి ఉద్భవించాడు. మరల అక్కడికే చేరుకున్నాడు. అతడు నీకు సంబంధించినవాడు కాదు. కాబట్టి  నువ్వు విచారించడం అంత మంచిది కాదు అంటాడు. జర్మన్ తత్త్వవేత్త Johann Gottieb  Fichte (1762-1814 A.D)    ఇంచుమించు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం  చెయ్యడం మనం గమనించవచ్చు. “What we call life is perhaps death and what we call death takes us back to the realm from which we are brought down to this life”. మొత్తం మీద  తత్త్వవేత్త లందరు మరణం సహజమైనదని , అనివార్యమని దాని గురించి భయపడవద్దని హెచ్చరించారు.
భారతీయతత్త్వశాస్తం ఇంకొంచెం ముందుకెళ్ళి  అసలు మృత్యువు రాకుండా  ఉండా లంటే ఏఏ జాగ్రత్తలు తీసుకోవాలో సూచించింది.
ఓ మూర్ఖుడా! మృత్యువుకెందుకురా అనవసరంగా భయపడతావు. ఒకవేళ నువ్వు భయపడినా నిన్ను యముడు వదులుతాడనుకుంటున్నావా! వదిలే ప్రసక్తి లేదు.  నువ్వొక పని చెయ్యి . పుట్టనివాణ్ణి  ఆయనేమీ చెయ్యలేడు. అందువల్ల పుట్టకుండ ఉండడానికి ప్రయత్నం చెయ్యి . అందువల్ల పునరావృత్తిరహితమైన ఆత్మజ్ఞానం సంపాదించుకో అని హితం చెబుతుంది.
మృత్యో: బిభేషి కిం మూర్ఖ!
భీతం ముంచతి వై యమ:
ఆజాతం నైవ గృహ్ణాతి  
కురు యత్నమజన్మని
ఉపనిషత్తుల సారాంశమైన భగవద్గీత కూడ మృత్యువును వర్ణిస్తూ - మనిషికి  బాల్యం , యౌవనం , వార్థక్యం అనే మూడు దశలున్నట్లే ఈ శరీరాన్ని విడిచి వేరొక  శరీరాన్ని  పొందడమనే దశ కూడ ఉంది . అందువల్ల ధీరుడైన వాడు దాన్ని తలుచుకుని దు:ఖించడు - అంటుంది .    
దేహినోSస్మిన్యథా దేహే
కౌమారం యౌవనం జరా
తథా దేహాంతరప్రాప్తి:
ధీరస్తత్ర  న ముహ్యతి    ( భగవద్గీత సాంఖ్యయోగం-శ్లో. 13)
 పైన చెప్పిన శాస్త్రకారుల మాటలసారాంశం గ్రహిస్తే మరణం చాల సహజమైనదని , అనివార్యమని , దు:ఖించడం చాల అవివేకమని తెలుస్తుంది.  
ఇక ఆధునిక కవిచక్రవర్తి శ్రీ జాషువ  మృత్యుతత్త్వాన్ని ఎలా విశ్లేషించారో చూద్దాం.
వారి కృతుల్లో ముంతాజమహల్ ఒకటి . అందులో  ముంతాజ్ షాజహానుల ఆదర్శ ప్రణయం చిత్రీకరించారు కవి.
   ఆ సతీపతుల గాఢాశ్లేషముననుండి
జారిపోయిన నిమేషంబులేదు  అంటారు కవి. వారి ప్రణయం అంత చక్కనిది, చిక్కనిది, చెక్కుచెదరనిది. కాని దైవం చిన్నచూపు చూశాడు. ప్రకృతి కన్నెర్ర జేసింది . ముంతాజ్ అస్వస్థురాలయింది. మృత్యుముఖానికి క్రమక్రమంగా చేరువౌతో ఉంది. ఆమెను దక్కిం చుకోడానికి షాజహాను చేయని ప్రయత్నం లేదు. చివరికి భగవంతునిపై భారం వేశాడు. కవి మాటల్లో చెప్పాలంటే :

భక్తి దైవారమానెడు వజ్రమణులు
భూతలేశ్వరుడల్లాకు  మ్రోక్కుకొనియె  
కాని ఇల్లాలు స్వస్థత గాంచదయ్యె  
చండతరుడైన విధి లంచగొండి కాదు
ఆమె జీవితం క్షణాల్లో ముగియనుంది. అతని కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి.
ఎంతమంది ఓదారుస్తున్నా ఆయనకు ఊరట కలగడం లేదు. చివరకు ఆ ఉత్తమ ఇల్లాలే ఆయన్ని ఓదార్చడానికి సిద్ధమయింది. సాధారణంగా అటువంటి స్థితిలో మరో ఇల్లాలైతే భర్తతో మీరు మరో వివాహం చేసుకోకండి . పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి . నన్ను మరచి పోకండి  నేనులేని లోటు వాళ్లకు రానీయకండి అని ఏవేవో చెప్పేది. కాని ఆమె మహాపతివ్రత . అతనికి ధైర్యస్థైర్యాలు చేకూర్చడానికి తత్త్వోపదేశం ఎలా చేసిందో చూడండి.
ఈ సుఖదు:ఖమిశ్రమమహీవలయంబను సత్రశాలలో
నీ సతినై ముగింఛితిని నేటికి నాదు ప్రవాసదీక్ష ఓ
ధీసముపేత! ఇట్టి పరదేశుల చెల్మి తిరంబు కాదు, క్ష్మా
వాసకథావిశేషములు స్వాప్నికముల్ చపలావిలాసముల్

ఓ నాథా! ఈ లోకం ఒక సత్రశాల. ఇందు  సుఖాలు, దు:ఖాలు రెండు ఉన్నాయి. నేను  ఎక్కడ నుండో ఇక్కడకు వచ్చి నీకు అండగా ఉంటూ నేటితో నా దీక్ష ముగిస్తున్నాను. ఇక ఎక్క డ నుంచో  వచ్చినవారు ఇక్కడ శాశ్వతంగా ఉండిపోరుగదా! పరాయి దేశం నుండి వచ్చినవారితో స్నేహం శాశ్వతంగా ఉండదు కదా ! ఈ మానవ జీవితం స్వప్న తుల్యం అశాశ్వతం అని గ్రహించండి.
ఈ తనువుండు నంతవరకెంతయు నెమ్మది లేదు ప్రాణికీ
భూతలమందు కష్ట సుఖముల్ చెలికత్తియలై భజించు నా         
శాతరలాక్షి తాండవము సల్పుచునుండును మృత్యుదేవతా
ద్యూతవినోదరంగమిది తోరపు సంపదలెల్ల పాచికల్  
ఓ రాజా! మనిషికి బ్రతికున్నంతకాలం శాంతి ఉండదు . కష్టసుఖాలు వెంటాడుతూనే ఉంటాయి. మరణించిన తరువాతనే నిజమైన శాంతి లభిస్తుంది. ఆశ అనే స్త్రీ తాండవం చేస్తూ ఉంటుంది. ఈ శరీరం మృత్యుదేవత వినోదించే క్రీడారంగం. సంపదలు పాచికలు.  ఈ భావాలు ప్రముఖ గ్రీకు కవి నాటక కారుడు అయిన Aeschylus ( 525-456B.C) మహూదయుడు ప్రకటించిన call no man happy till he is dead అనే  అభిప్రాయాన్ని పోలి ఉంది. 

ఆవిరి యోడలో జలధియాన మొనర్చెడు బాటసారులో
 భూవర! రేవులందు దిగిపోవుదురించుక వెన్కముందుగా
ఈ వసుధాపణంబు పని యెల్ల ముగించి స్వదేశగాములై
పోవుచు వచ్చుచుంద్రు సతముం బ్రజలీ నరజన్మవర్తకుల్

ఓ రాజా!  మనమంతా ఆవిరి అనే ఓడనెక్కి సముద్రంలో ప్రయాణం చేస్తున్న బాట సారులం.  కొంచెం వెనుక ముందుగా ఎవరి రేవుల్లో వాళ్ళు దిగిపోతాం . అందరం వ్యాపారం కోసం ఇక్కడకు వచ్చిన  వర్తకులం. ఇక్కడ మన వ్యాపారం పూర్తికాగానే ఎవరిదారిన వారు వెళ్లి పోయే మాదిరిగా మనం ఈ జీవనవ్యాపారం పూర్తికాగానే ఎవరిత్రోవ వారు వెళ్లిపోవలసిందేకదా!
 సమతాచిహ్నితమైన యీ మరణమీసర్వంసహా వేదనా
సమరశ్రాంతుల కౌగిలించుకొని విశ్రాం తిం బ్రసాదిం చెడున్
హుమయూనాదులు మీపితామహుల బోలుర్వీధరుల్పెక్కురీ
సుమశయ్యంబవళింఛి మేల్కొనరహస్సుల్ పెక్కులిట్లేగినన్       

ఓ మహారాజా! సమత్వాన్ని తెలియజేసే ఈ మరణానికి తారతమ్య వివక్ష లేదు.
దానికందరూ ఒక్కటే . అది ఈ లోకంలోని బాధలతో అలమటింఛి అలసిపోయిన  వారిని ప్రేమతో కౌగిలించుకుని శాశ్వతమైన విశ్రాంతిని ప్రసాదిస్తుంది. అందుకే కాబోలు మీ తాత హుమయూను, మీ  తండ్రి జహంగీరు వంటి ఎందరో సర్వసర్వం సహా చక్రవర్తులు ఈ మృత్యువనే పూలపానుపుపై పరుండి ఎన్ని రోజులు గడిచినా లేవడం లేదు.
ఏ పుష్పంబును జేసి వాడుకొనునో ఈ దేహమున్ దైవమో
భూపశ్రేష్ట! విచారమందకుము మామూలే కదా ఈ మృతి
వ్యాపారంబు సమస్తజీవులకు విశ్వవ్యాఘ్రి గర్భంబునన్
మాపున్రేపును ఎందఱో యిముడుచున్నారందు నే నొక్కతెన్

                 ఓ రాజా ! భగవంతుడు నా ఈ శరీరాన్ని ఏ పువ్వుగా మార్చి వాడుకోదలచాడో! నా గురించి విచారించకు. పుట్టిన ప్రతి జీవికీ  మరణం సాధారణమైన విషయమే కదా! ఈ ప్రపంచమనే పెద్దపులి గర్భంలో నిన్న, నేడు, రేపు ఎంతోమంది ఇమిడిపోతున్నారు. వారిలో నేనొకదాన్ని. మీరు  నా గురించి ఎటువంటి చింత పెట్టుకోకండి.
                              శ్రీ జాషువ గారి విశ్లేషణ రాసాత్మకంగాను, అలంకారయుక్తంగాను కన్పించినా ఎంతో తాత్త్వికచింతన , తపన అందులో దాగి ఉంది. నీరసమైన తత్త్వశాస్త్రాన్ని కూడ రసాత్మకంగా చెప్పడంలో ఆయన  చేయి తిరిగిన చతురుడు. స్మశానాన్ని సైతం అవని పాలించు భస్మ సింహాసనంబు అని  వర్ణించడం ఆయనకే చెల్లింది. మానవజీవితపు క్షణికత్వాన్ని, మృత్యువు యొక్క సహజతను , సమత్వాన్ని , అనివార్యతను , దాన్ని ఎదుర్కోడానికి కావలసిన ధైర్యస్థైర్యాల ఆవశ్యకతను రసాత్మకంగా వర్ణించిన జాషువ గారి అభిప్రాయాలు ఉపనిషత్తులు తదితర తత్త్వవేత్తల అభిప్రాయాలకు సరితూగగలవనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన వెలువరించిన భావాలు మనలో దాగి ఉన్నమరణభయాన్ని కొద్దో గొప్పో పోగొ ట్ట గలవనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన తెలుగువాడు కావడం  మన పురాకృతసుకృతం.                        
                                                  ***















Thursday, January 23, 2014

संस्कृतसाहित्यॆ पर्यावरणपरिरक्षणसन्दॆश:

संस्कृतसाहित्यॆ पर्यावरणपरिरक्षणसन्दॆश:

डाक्टर्. चिलकमर्ति दुर्गाप्रसादरावु

                                         प्रपंचेSस्मिन् परिदृश्यमानासु बह्वीषु समस्यासु पर्यावरणकालुष्यसमस्या तीव्रतरा भीतावहा च परिगण्यते परित: आवरणं पर्यावरणमिति व्युत्पत्त्या पंचतत्त्वनिर्मितं प्राणिजीवनं पंचतत्वारणैराच्छादितमस्ति

                                 प्रपंचोSयं पृथिव्यप्तॆजॊवाय्वाकाशरुपपंचभूतात्मक:|  यद्यपि पंचसु भूतॆषु तेजस: आकाशस्य च कालुष्यं न आपद्यतॆ तथाप्यन्यानि त्रीणि कालुष्यास्पदान्यॆव भवन्ति | कालुष्यं बहुविधं यॆन पृथ्वीजलवाय्वादीनि स्वप्रकृतिं विहाय विकृतिं लभन्तॆ | तथा च यच्च कालुष्यं प्रकृते: समतौल्यं भंजयति विनाशयति च तत्कालुष्यं पर्यावरणकालुष्यमिति शास्त्रज्ञैर्निर्णीयते |
                     प्राचीनकाले मानव:    प्रकृत्या सह जीवनं करोति स्म प्रकृतिं दॆवतारूपेण संभाव्य आराधयति स्म | माता  पृथिवी पुत्रॊSहं पृथिव्या: ( अथर्ववॆद:/१२//१२)   इत्यादि  वाक्यानि विषयममुं ध्रुवी कुर्वन्ति |     अपि च न कॆवला प्रकृति: किं च सर्वाअपि प्राकृतिकशक्तयदॆवतारूपॆण परिगणिता: आराधिताश्च |

                                                किन्त्वस्मिन् आधुनिकॆ युगे‌ मानव: स्वार्थपूरित: लॊभाकृष्टविषयश्च भूत्वा स्वसुखाय सर्वामपि प्राकृतिकीं सम्पदं विनाशयति | पारिश्रामिकीकरणव्याजॆन प्राणिविघातकारकाणि रसायनद्रव्यान्युत्पादयति यै: प्रकृत्या: महती विनष्टि: संजायते | स्वॊदरपूरणार्थं वैज्ञानिकप्रयोगार्थं च प्राणिनां हननं, वैज्ञानिकविकासव्याजेन वसुधातलात् खनिजानां दोहनं, वनानामनवरतमुच्छॆदनं, विनॊदार्थं  वन्यप्राणिनां हननमधिकोत्पत्तिसाधनाय रसायनिकद्रव्यानामुपयॊजनं बाहुल्यॆन क्रियन्ते यैसमग्रं पर्यावरणमस्थिरं विलुप्तं च संजातम् |

                                       यदि मानव: एवमेव कर्तुं प्रवृत्तचेत्तर्हि सर्वस्या: अपि प्रकृते: विनाश: अचिरादेव भविष्यतीत्यत्र नास्ति सन्देहलॆशॊSपि | अत: पर्यावरणपरिरक्षणाय परिवर्धनाय  चॆदानीं किं कर्तव्यमित्याशंकायामस्माकं प्राचीनानां जीवनपद्धतिरॆवानुसरणीयॆति समाधानं भवति |

                                            वेदकालादारभ्यैव  भारतदेशॆ सर्वॆ मानवा: पर्यावरणसंरक्षणॆन जीवनं सुखमयं कृतवन्त: दृश्यन्ते | सर्वॆ प्रकृत्यनुरागिणप्रकृतिपरिरक्षकाश्चासन् | पर्यावरणपरिरक्षणस्याद्यं सधनं वृक्षाणां संरक्षणमॆव भवति | वेद: वृक्षॆभ्यॊ हरिकेशॆभ्यश्च नमो नम:” इति हरितपर्णवृक्षं दॆवतारूपॆन संभावयति नमस्करॊति च |     संस्कृतसाहित्यॆ विशिष्य कालिदासॆन स्वग्रन्थॆषु प्राचीनानां प्रकृतिप्रियत्वं पर्यावरणस्य च वैशिष्ट्यं  प्रदर्शितमस्ति|
                                      रघुवंशॆ द्वितीयसर्गॆ सिंहदिलीपयॊ: सम्भाषणावसरे सिंह: एकं वृक्षं दर्शयन् दिलीपं वदति " हॆ राजन् ! भवानस्माकं पुरस्ताद्यं वृक्षं पश्यति स  देवदारुवृक्ष: |  अयं च वृक्ष : पार्वतीपरमॆश्वराभ्यां पुत्रवत्पालित: पॊषितश्च|

अमुं पुर: पश्यसि देवदारुं 
पुत्रीकृतोSसौ वृषभध्वजॆन |
यो हॆमकुम्भस्तननिसृतानां 
स्कन्दस्य मातु: पयसां रसज्ञ:||

 स एव सिंह: राजानं पुनरेवं वदति | हे राजन्! एकदा तं वृक्षं विरुध्य  कश्चन वन्यो गज: स्वकन्डूतिमपनेतुं आत्मन: गण्डभागं वृक्षं प्रति कर्षति स्म तदा वृक्षस्य चर्म अपगतम् |ताद्दृशं चर्मरहितं वृक्षं  दृष्ट्वा सा पार्वती तथा विलापं कृतवती यथा सा राक्षसानामस्त्रै: क्षतं स्वकुमारं कुमारस्वामिनं दृष्ट्वा पुरा विललाप तथा हि:-

कण्डूयमानेन कटं कदाचि
द्वनद्विपॆनॊन्मथिता त्वगस्य|
अथैनमद्रॆ:स्तनया शुशॊच 
सेनान्यमालीढमिवासुरास्त्रै:||  इति||

 कालिदासपुनरेवमभिप्रैति यत्स्वयं संवर्धित: विषवृक्षोSपि न कर्तनीय: |
तथा हि:- " विषवृक्षोSपि संवर्ध्य स्वयं छॆत्तुमसांप्रतम्  ''||

                                         अभिज्ञानशाकुन्तले शकुन्तलां प्रति तस्या: सखी अनसूया वदति यत् "सखि! शकुन्तले ! त्वत्तोSपि तातकाश्यपस्य आश्रमवृक्षप्रियतर इति तर्कयामि यन्नवमालिकाकुसुमपेशला त्वमप्येतेषामालवालसेचने नियुक्ता"  इति तदा शकुन्तला अनसूयां प्रत्येवं समाददाति यत् ''अत्र न केवलं तातनियोग: ममाप्यस्ति खलु सोदरस्नॆह: एतॆषु "  इति ||
                                 शकुन्तलाया: पतिगृहगमनसमये मंगळालंकृतायै तस्यै शकुन्तलायै सर्वे वृक्षा आभरणानि समर्पयन्ति  प्रेम्णा एतॆनॆदं ज्ञायतॆ यद्वृक्षमनुष्ययोर्मध्ये विद्यमान: सम्बन्ध: कियान्विशिष्ट इति |

अत एव  फलहीन: वृक्षोSपि रक्षितव्य एवेति वदत्यस्माकं  संस्कृति:| तथाहि

सेवितव्यो महावृक्ष:  
फलच्छायासमन्वित:
यदिदैवात्फलं न स्या
च्छाया केन निवार्यते

वृक्षा: परार्थैकचिन्तनरता: सत्पुरुषतुल्याइति प्रशंसयति भारतीया संस्कृति: | तथाहि

छायामन्यस्य कुर्वन्ति
 तिष्ठन्ति स्वयमातपे
फलान्यपि परार्थाय 
वृक्षा: सत्पुरुषा इव|
                                                 पर्यावरणपरिरक्षणस्य द्वितीयं साधनं प्राणिसंरक्षणं तत्रापि विशिष्य वन्यप्राणिसंरक्षणम् |  मानव:  प्रति दिनं नैकान् प्राणिन:संहरति |   तेषु केचन आहारार्थंअन्ये कॆचन आरॊग्यार्थं, अपरॆ केचन विनोदार्थं,   पुन: केचन विना कारणं हन्यन्ते | जीवने हिंसा यद्यप्यनिवार्या  भवति तथापि तस्या: अवधि: वर्तते |   विधानमपि वर्तते जगत्यस्मिन्  एकं प्राणिनमाधारीकृत्य अन्ये केचन जीवन्तिउदाहरणार्थं पश्यामचेत्  ज्ञायते यद्   एकं पक्षिणमाधारीकृत्य बहव: पक्षिशाबका: जीवन्ति यदि वयं निर्दाक्षिण्यं तं पक्षिणं हन्म: चॆत् पक्षिशाबका: सर्वे  निराधारा: अनाथा: च  भविष्यन्तिअत: यावत् शक्यं  मानवैप्राणिहिंसा त्याज्या एव भवति यदि कस्यापि जन्तो: हिंसा अनिवार्या भवति   चेत् तदा यथा बाधा न्यूना भवति तथा  स हन्तव्य:|    हन्यमानस्य मूकप्राणिन: मानसिकी वॆदना कथं भवति इति केनचन कविना एवं सुनिपुणं वर्णितम् |  

                                          एकम् अरण्यम् अरण्ये च  तस्मिम् कश्चन व्याध: संचरति एका  मृगी तस्य दृष्टिपथम् आगता : तां  मृगीं लक्षीकृत्य एकं निशितं बाणम् अमुंचत् स च बाण: तस्यामृग्यागळे  व्यायतपातमक्षिणॊत्असह्यवॆदनया सा नितरां खिन्ना अभवत् तस्या: मरणम् आसन्नम् अभवत् |   एतस्मिन्नन्तरे तस्या: शाबका:स्मृतिपथमागता: |  तस्या:   मातृत्वं प्रबुद्धमभवत् |    सा व्याधम् अतिदीनमेवं प्रार्थयति|

"   हॆ व्याधभवान् मम  सर्वानंगान् छित्वा नयतु |    परन्तु स्तन्यम् एकं त्यजतु |    कुत इति चॆत् मम शिशवहरिततृणकबलमपि  स्वयं खादितुं न समर्था: सन्ति अतस्ते मदागमनाय प्रतीक्षां कुर्वन्ततामेव दिशं वीक्षमाणा: तिष्ठन्ति ते  मया पाययितव्या: |  तानहं क्षीरं पाययामि | यद्यहं न  पाययामि चेत्  ते अवश्यं मरिष्यन्ति | अतकृपया  तमेकं मुक्त्वा अन्यत्सर्वं  स्वीकुरु” |   कारुण्यपूरितं तस्य जन्तॊ: आक्रन्दनं स्वयं पश्यन्तु |   यथाशक्ति प्राणिहिंसां त्यजन्तु|

आदाय मांसमखिलं स्तनवर्जमंगान्
मां मुंच वागुरिक यामि कुरुप्रसादं
सीदन्ति शष्प कबल ग्रहणानभिज्ञा:
मन्मार्ग वीक्षणरता: शिशवो  मदीया:” (वल्लभदॆवस्य सुभाषितावलि:९८१)
 



"अहिंसा परमो धर्म: “ “ मा हिंस्यात्सर्वा भूतानिइत्याद्याश्रुतयप्राणिहिंसां  सर्वात्मना निकाकुर्वत्य: दृश्यन्ते |   सर्वे जानन्ति यद्विषसर्पोSप्यस्माभिर्दॆवतारूपेण परिगण्यते आराध्यते च संस्कृतसाहित्ये वर्णितामुनीनामाश्रमास्सर्वे मानवानां जन्तूनां च मध्ये विद्यमानं परस्परसौहार्दं द्योतयन्ति|

आकीर्णमृषिपत्नीना
मुटजद्वाररोधिभि: |
अपत्यैरिव नीवार
भागधेयॊचितैमृगै: ( रघुवंश: /.५०)

इदानीं कालुष्यनिवारणोपाया: विचार्यन्ते|

भूकालुष्यम्

-इयं भूसर्वॆषामस्माकं जननी यथा माता स्वकीयं सर्वस्वं पुत्रॆभ्य: समर्प्य पालयति पॊषयति, तथैवॆयं पृथिवी स्वकीयं सर्वस्वं समर्प्य पालयति पोषयति च माता किंचित्कालमेव पुत्राणां भारं वहति | परन्त्वियं पृथ्वी जीवनपर्यन्तं वहति मरणानन्तरमपि अस्मानात्मनि विलीनं कुरुतॆ मातुरपि श्रॆष्ठतरा चेयं भूमि: अस्माभि: यथाकथंचित्  परिरक्षणीया| मातृभावनया अनावश्यकरसायनद्रव्य विनियोगनिवारणॆन च  भूम्या: स्वच्छता परिरक्षणीया|

वायुकालुष्यम्

वायुं विना  मानवक्षणमपि जीवितुं न प्रभवति अत: अस्माकं सनातनधर्म" नमस्ते वायो! त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि " इति वायुं दॆवतारूपेन संभावयति |
 तादृशस्य प्राणाधारकस्य वायॊ: स्वच्छता न कॆवलमारॊग्याय  अपि तु चिरजीवनाय चोपकरॊति| वायुकालुष्यकारणॆनैव पंचविंशतिवर्षेभ्यपूर्वं भॊपाल् नगरे प्रवृत्तस्य दुर्घटनस्य परिणामं वयं
दृष्टवन्तयत्र सहस्रसंख्याका: मृता: मृतप्रायाश्चान्ये यथाकथंचिदद्यापि जीवनं यापयन्ति | अत: अनावश्यकरसायनद्रव्यविनियॊगेन वृक्षाणां वर्धनेन च वायो: कालुष्यं निवारणीयम्
|
जलकालुष्यम्

यथा वायुं विना मानव: जीवितुं न प्रभवति तथैव जलॆन विनापि जीवितुं न प्रभवति जलं तु जीवनमॆव भवति  | अत एव जलस्यापरपर्याय: जीवनमपि | जलकालुष्यं महापातकत्वॆन परिगणितमस्मत्पूर्वजै: |   रामायणे वाल्मीकिमहर्षिणा भरतमुखादयं विषय: प्रस्तावित:| तथा हि
पानीय दूषके पापं
तथैव विषदायके|
यत्तदेकस्य लभतां
यस्यार्योनुमते गत: || ( अयॊध्याकाण्ड:)

 जले अनावश्यकरसायनद्रव्यपातननिवारणॆनैव  जलकालुष्यं निर्मूलयितुं शक्नुम:    |
अत: वयं सर्वलोकहिताय  पर्यावरणपरिरक्षणाय च बद्धकंकणाभवाम:|    यथाशक्ति वृक्षान् वर्धयाम: वन्यप्राणिन: पालयाम: |  अनावश्यकानि रसयनद्रव्याणि त्यजाम: |
लोकास्समस्ता: सुखिनो भवन्तु "इति वैदिकं निनादं सार्थकं कुर्म:|  
                                                
                                                      *******************