Thursday, April 30, 2015

వాయువ్యాస్త్రం-3 Farting turned to be a farce

వాయువ్యాస్త్రం-3
Farting turned to be a farce


మన పురాణ పురుషులలో కుoభకర్ణుణ్ణి  గురించి తెలియని వారెవరు ఉండరు. ఆయన  రావణుని సోదరుడు. నిద్ర అనే మాట గుర్తుకొస్తే కుంభకర్ణుణ్ణి గుర్తు చేసుకోవచ్చు. ఒకసారి కుoభకర్ణుణ్ణి నిద్రనుంచి లేపడానికి కొంతమంది సేవకులు ఆయన మందిరంలో ప్రవేశించారు . ఆ సమయంలో  ఆయన నిద్రలోనే ఉన్నాడు . అప్రయత్నం గానే  ఒక బాంబు వదిలాడు. ఆయన వదిలిన అపానవాయువు వేగానికి  వాళ్ళందరూ ఎగిరి ఎక్కడో చాల దూరంలో పడిపోయారు. దుర్వాసనకు స్పృహ కోల్పోయారు.

గతా: కేచిత్ప్రబోధాయ
స్వయం తo కుంభకర్ణకం
తదధ: పవనోత్సర్గా
దుడ్డీయ పతితా: క్వచిత్ ( సుభాషితరత్నభాoడాగారం-page 368. శ్లోకo 11)

Kumbhakarna , the brother of Ravana is  a well known personality.  Once, the servants of Ravana went in to the chamber of Kumbhakarna to wake him up. By the time they approached Kumbhakarna, he farted effortlessly while sleeping. All of them were driven out and fell on the ground unconsciously by the sound as well as the foul smell produced out of it.

गताः केचित्प्रबोधाय
स्वयं तं कुम्भकर्णकम् |
तदध:पवनोत्सर्गा

दुड्डीय पतिता: क्वचित् || (सुभाषितरत्नभाण्डागारम्-page-368-sloka-11)

Wednesday, April 29, 2015

విశ్వగుణాదర్శచంపువు-సామాజికాధ్యయనం

విశ్వగుణాదర్శచంపువు-సామాజికాధ్యయనం
డా|| చిలకమర్తి దుర్గాప్రసాద రావు

                              16వ శతాబ్దానికి చెందిన సంస్కృతకవులలో వేంకటాధ్వరి సుప్రసిద్ధుడు. ఈయన పూర్తి పేరు శ్రీమదరశాణిపాల వేంకటాధ్వరి. తండ్రి రఘునాథుడు. తల్లి సీత. ఈయన కాంచీనగరవాసి. రామానుజ మతానుయాయి. వడగలై  సంప్రదాయానికి చెందినవాడు. ఈయన అప్పయ్యదీక్షితుని సోదరుని మనుమడగు నీలకంఠదీక్షితుని సహాధ్యాయి అగుటచే ఈయన కాలం క్రీ||శ||1637 ప్రాంతంగా నిర్ణయించారు. ఈయన రచించిన విశ్వగుణాదర్శచంపువులో ఆంగ్లేయుల ప్రస్తావన ఉండడం వల్ల కవి చాల ఆధునికుడని భావించవచ్చు. ఈయన సంస్కృతభాషలో ఎన్నోకావ్యాలు రచించారు. ప్రస్తుతo అతని గ్రంథాలలో విశిష్టస్థానాన్ని పొందిన విశ్వగుణాదర్శకావ్యంలో పొందుపరచిన సామాజికాంశాల గురించి తెలుసుకుందాం.
   
కావ్యం స్వభావాన్ని బట్టి శ్రవ్యకావ్యం, దృశ్యకావ్యమని రెండు విధాలు. శ్రవ్యకావ్యం మరల గద్యం, పద్యం, చంపువు  అని మూడు విధాలు. గద్యపద్యముల కలయికయే చంపువు .  దండి గద్యపద్యమయం కావ్యం చంపూరిత్యభిధీయతే అని చంపూప్రబంధలక్షణాన్ని నిర్వచించాడు. గద్యం అర్థప్రధానమైనది. పద్యం అర్థరాగోభయప్రథానమైనది. గద్యగతమైన అర్థగౌరవాన్ని, పద్యగతమైన రాగప్రాథాన్యాన్నీ మేళవిస్తే అది అధికచమత్కారయుక్తమౌతుoదని భావించడమే చoపూప్రబంధరచనకు కారణమని చెప్పుకోవచ్చు. అంతేగాక  ఈ కావ్యం వర్ణనానుగుణ్యం గల  అనేకగద్యపద్యాలతో నిండి భిన్నరుచులు గల గద్యపద్యపాఠకులిరువురకు ఆనందాన్ని కల్గిస్తుంది .                  

ఈ గ్రంథంలో 1113 గద్యపద్యాలున్నాయి. ఇందులో సూర్యవర్ణన మొదల్కొని రాజసేవకవర్ణన వరకు సుమారు ఏబది వర్ణనలున్నాయి. ఈ గ్రంథంలో విశ్వావసువు, కృశానుడు అనే ఇద్దరు గంధర్వులు చరచారాత్మకమైన ఈ ప్రపంచాన్ని చూడాలనే  కోరికతో విమానంలో బయలుదేరతారు. అనేక దృశ్యాలను చూస్తూ ఉంటారు. కృశానుడు దోషైకదృక్కు. అందువల్ల  అందరిలోనూ అన్నిటిలోనూ తప్పులు వెదుకుతూ ఉంటాడు. విశ్వావసువు గుణగ్రాహి. అతడు కృశానుడు చేసిన ఆక్షేపణలకు సరైన సమాధానాలిస్తూ అందరిలోనూ, అన్నిటిలోనూ గల సుగుణాలను ప్రశoసిస్తూ ఉంటాడు. ఈ విధంగా గ్రంథమంతా  వారిరువురి సంభాషణలతో నిండి ఉంటుంది. వారి సంవాదం ద్వారా కవి ఆ నాటి సామాజికపరిస్థితులను, సాంఘిక ఆచారాలను, భౌగోళిక అంశాలను, తీర్థక్షేత్ర మాహాత్మ్యాన్ని  కళ్ళకు కట్టినట్లుగా వర్ణించాడు. ఒకవిధంగా ఈ గ్రంథం ఆనాటి భారతదేశ సాంఘిక,సామాజిక,భౌగోళికపరిస్థితులకు దర్పణమని చెప్పవచ్చు. ఇంతటి సామాజికదృక్పథం గల కావ్యం ఆధునిక సంస్కృతకావ్యాల్లో మరొకటి లేదని చెప్పొచ్చు. ఈ కావ్యం చoపూసాహిత్యచరిత్రలోనే అపూర్వసృష్టి .  ఇందులో ఆసేతుహిమాచలo భారతదేశం వర్ణింపబడిoది

 కాశి, అయోధ్య, జగన్నాథం, కంచి, శ్రీరంగం మొ|| పుణ్యక్షేత్రాలు; గంగ, యమున, పినాకిని, కావేరి, తామ్రపర్ణి మొ|| పుణ్యనదులు; బదరిక మొ|| పుణ్యాశ్రమాలు; అంగ, వంగ, కళింగ, ఘూర్జర, ఆంధ్ర, మహారాష్ట్ర, చోళ, పాండ్య, కర్ణాటదేశాలు; తంజావూరు, కంచి, చెన్నపట్టణం మొ||నగరాలు; శ్రీ రామానుజ, వేదాంతదేశిక, శఠకోపయతీశ్వరుల పుణ్యకథలు వర్ణింపబడ్డాయి. అంతేగాక అనేక ప్రాoతాలు, ప్రజలు, ఆచారవ్యవహారాలు, వేషభాషలు, జీవనవిధానం కళ్ళకు కట్టినట్లుగా వర్ణించాడు కవి. మొత్తంమీద ఈ కావ్యం కవియొక్క అపూర్వలోకానుభవానికి ఒక దర్పణంగా కనిపిస్తుoది. కవి సమాజoలో అంతర్భాగమే కాబట్టి కావ్యాల్లో సమకాలీనసామాజికపరిస్థితులు ఎంతో కొంత ప్రతిఫలింపక తప్పదు. అందులోను ఈ కావ్యo యొక్క ధ్యేయo కేవలo సామాజిక పరిశీలనమే కాబట్టి కవి సమాజాన్ని దర్శించిన తీరు సహజరమణియoగా కన్పిస్తుంది. సమాజం గుణదోషాలమిశ్రమo. పండితుడైనవాడు గుణాలను స్వీకరించి దోషాలను పరిహరించాలి. ఈ గ్రంథoలో కవి కృశాను, విశ్వావసువుల సంభాషణద్వారా సమాజంలోని గుణదోషాలను రెంటిని పరిశీలించాడు. గుణదోషాలనేవి వ్యక్తి యొక్క దృష్టిభేదం వల్ల ఏర్పడినవే గాని వాస్తవాలు కావనియు, పండితుడైన వాడు గుణపక్షపాతియై దోషముల యెడ ఉదాసీనత వహి౦చాలనేది  కావ్యరచనోద్దేశoగా కన్పిస్తుంది.
                                                                                                                                                     
         ఈ కావ్యoలో కవి భూలోకాన్ని సకలపురుషార్థసాధనానుష్ఠానభూతoగా వర్ణించాడు. దీన్నిబట్టి ధర్మార్థకామమోక్షాలు మానవజీవితప్రధానలక్ష్యాలని కవి సూచించాడు. కవి కాశీనగరాన్ని వర్ణిస్తూ అందలి పురుషులు షడ్రసోపేతమైన ఆహారాన్ని భుజిస్తూ, కాముకలగు స్త్రీలతో స్వేచ్ఛగా విహరిస్తున్నారని,  వారట్టి దుష్కృత్యాలు చేస్తున్నప్పటికిని మరణించిన తరువాత శివసాయుజ్యాన్నే పొందుతున్నారని కాశీవాసఫలితాన్ని ప్రశంసించాడు. కర్ణాటదేశo గురించి చెబుతూ అందలి సన్యాసులు శిఖాయజ్ఞోపవీతాలను, గాయత్రిని త్యజించి, సుఖలాలసులై పల్లకీలలొ అన్నిదేశాలు  సంచరిస్తూ ధనాన్ని సంపాదిస్తున్నారని, అది యతి ధర్మానికి విరుద్ధమని కృశానుని మాటల్లో వ్యక్తం చేస్తాడు. విశ్వావసువు  దానికి సమాధానoగా ధర్మసంగ్రహార్ధo దేశాటన చేయడం  తప్పు కాదని, దేశాటనకై పల్లకీలనెక్కడం కూడ దోషo కాదని, భగవత్సమర్పణకై ద్రవ్యార్జన చేయడం కూడ తప్పు కాదని సమర్థిస్తాడు. అలాగే కవి అయోధ్యానగరాన్ని వర్ణిస్తూ కృశానుని మాటలద్వారా రాముని గుణముల యందు దోషారోపణచేయగా విశ్వావసువు రాముని పితృభక్తిని, సత్యపరాక్రమత్వాన్ని, ధర్మతత్పరతను ప్రశంసిస్తాడు. వేరొక సందర్భoలో కవి వైదికమతసంప్రదాయభేదాలను సునిశితoగా విమర్శించాడు. ఘూర్జరదేశాన్ని వర్ణిస్తూ అచ్చటి యువకులు వాణిజ్యoలో నిపుణులని ప్రశంసించాడు. మహారాష్ట్రదేశం స్వర్గతుల్యమని పేర్కొన్నాడు. ఆంధ్రదేశo సముద్రo వలె విస్తారమైoదని, సర్వసమృద్ధమైoదని కీర్తించాడు. .కర్ణాటకదేశాన్ని వర్ణిస్తూ ఆ దేశం అందమైన ఉద్యానవనాలతో నిండిన నగరములతో కన్నులపండువుగా ఉన్నదని వర్ణిస్తాడు. ఈ విధoగా కావ్యం సమాజంలోని గుణదోషాలను పేర్కొంటూ దూషణభూషణాత్మకoగా సాగుతుంది. 
కవి శేషశైలాన్ని వర్ణిస్తూ ఆ కొండపై నివసించు శ్రీ వేంకటేశ్వరస్వామి, భక్తులు తమ కోరికలు  నెరవేరుటకు మ్రొక్కగా వారి కోర్కెలను నెరవేర్చి, వారు కానుకలు సమర్పించనిచో భయపెట్టి వడ్డీతో సహా వసూలు చేస్తున్నాడని కృశానుని మాటలలో విమర్శిస్తాడు. విశ్వావసువు దానికి సమాధానంగా ఆ స్వామి లక్ష్మికి భర్తయని, సహస్రవసువునకు(సూర్యుడు)నివాసస్థానమని, కువలయపతి(రాజు/చంద్రుడు)కి మఱది యనియు, ఈవిధoగా స్వామి సర్వసమృద్ధుడైయుండియు భక్తుల ద్రవ్యములను గ్రహించుట వారి ననుగ్రహించుటకు మాత్రమే అని సమర్ధిస్తాడు. ఈ కావ్యoలో కవి స్థలమాహాత్మ్యాన్ని వర్ణిస్తూ అనేకస్థలపురాణవిశేషాలను ప్రదర్శించాడు.
               
      కవి సందర్భోచితoగా అనేక సామాజికధర్మాలను, నియమాలను పేర్కొన్నాడు. సోమరిని గూర్చిచెబుతూ అతడు ఎల్లప్పుడు ఏపని చేయక, స్త్రీలంపటుడై, ఇంటిలోనే నిద్రపోతూ ఉంటాడని, అట్టివాడు ధనాన్ని సంపాదించలేడని విమర్శిస్తాడు.
వ్యాపారంతర ముత్సృజ్య వీక్షమాణోవధూముఖo
 యో   గృహేష్వేవ నిద్రాతి దరిద్రాతి స దుర్మతి:
కవి ఈ శ్లోకం ద్వారా దారిద్ర్యానికి సోమరితనమే ప్రధానహేతువని స్పష్టం చేశాడు. ఇతరుల ధనంకోసం ఆశపడేవాడు నాశనమౌతాడని కవి ఈక్రింది శ్లోకం ద్వారా చమత్కరించాడు.
పరవిత్తజిహీర్షయాప్రవృత్త; పిశునస్తు స్వయమేవ నాశ మేతి
 సులభశ్శలభస్య కిం నదాహ: పృధుదీపగ్రసనాయ జ్రుoభితస్య
కవి అరణ్యాలను వర్ణిస్తూ అవి అనేకపుష్పఫలాదులకు నిలయాలని, ధనవ్యయంలేకుండానే ఆసంపదలను అనుభవిoచవచ్చని అరణ్యాల్లో నివసించువారి అదృష్టం వర్ణనాతీతమని ప్రశoసించాడు. దీనివల్ల అడవుల గొప్పదనo వెల్లడి అవుతోంది.
                    కవి ఆనాటి కొంతమంది వైద్యులను  వర్ణిస్తూ వారు రోగియొక్క అనారోగ్యానికి కారణం తెలుసుకోలేక సహిoపలేనట్టి కషాయాలతోను, లేహ్యాలతోను, రోగుల పొట్టలు నింపుతూ యమభటుల వలె ప్రాణాలను,  ప్రాణాలతో బాటుగా ధనాన్ని గూడ అపహరిస్తున్నారని విమర్శించాడు. అంతేగాక ఉపవాసములచే నయమైన రోగాల్ని  తమ మందులచే నయమైనట్లుగా చెప్పి నమ్మించి రోగులనుండి బలవంతoగా ధనం వసూలు చేస్తున్నారని విమర్శించాడు. ఇటువంటి కుహనా వైద్యులు ప్రస్తుతసమాజంలో కూడ చాల మంది లేకపోలేదు. 

 కవి ప్రాచీన, ఆధునిక విద్యావిధానాల్లో గల మౌలికమైన భేదాలను విశ్లేషిస్తూ పూర్వకాలంలో ఉపాధ్యాయులు శిష్యులను చాల కాలం పరీక్షించి, వారి సేవలనందుకొని, సంతోషంగా విద్య నేర్పేవారని, నేడు ఉపాధ్యాయులు విద్యార్దులనుండి    తమకు కావలసిన ద్రవ్యాన్ని రాబట్టుకునేఁదుకు అయోగ్యులను కూడ శిష్యులుగా స్వీకరిస్తున్నారని సునిశితంగా విమర్శించాడు.

సమ్యక్ శిష్యజనం పరీక్ష్య బహుభి: సంవత్సరైరుత్సుకం
శుశ్రూషాభిరుపాదిశన్ ప్రముదితా: పూర్వే భువీతి శ్రుతం
ఆరాధ్యేష్టసమర్పణైరావినతానాచార్య ఏవాదరా
దర్థై: భూరితమై: ప్రసహ్య లభతే శిష్యాన్ శ్రమేణాధునా

వేంకటాధ్వరి ఈ కావ్యంలో ప్రదర్శించిన గుణదోషాలు సార్వకాలికాలు, సార్వదేశికాలున్ను. సజ్జనుడైన వాడు గుణాలను స్వీకరిoచాలే గాని దోషాల్ని ఎత్తిచూపరాదని విశ్వావసువు కృశానునితో అంటాడు. అంతేగాక లోకం దోష కలుషితమైనప్పటికి గుణవంతులు కూడ ఉన్నారని వారే అందరికి ఆదరణీయులని స్పష్టం చేస్తాడు. కృశానుడు విశ్వావసువుతో తాను చేసిన దోషారోపణ కేవలం గుణ సమృద్ధికే గాని దోషాలనెంచడానికి కాదని, అది సిద్దాంతాన్ని బలపరచడం కోసం చేసిన పూర్వపక్షం మాత్రమేనని సమాధానం చెబుతాడు.
ఈవిధoగా గ్రంథమంతా మానవసమాజంలోని గుణదోషాల్ని విశ్లేషించి గుణాలకు ఆదర్శమై విశ్వగుణాదర్శము అనే సార్థకనామాన్ని పొoదింది.
అంతేగాక ఆదర్శం అంటే అద్దం. అద్దం ఏ విధంగా మనలో గల గుణదోషాలను చూపిoచి  దోషాలు సవరించుకోడానికి సహకరిస్తుoదో అదే విధంగా  ఈ కావ్యం  సమాజం లోని గుణదోషాలను ఎత్తి చూపడం ద్వారా దోషాల్ని తొలగించుకోడానికి సహకరిస్తుoదనడంలో ఎటువంటి సందేహం లేదు.

                                           ********

Saturday, April 25, 2015

స్వాతంత్ర్యోద్యమంలో చిలకమర్తి పాత్ర


స్వాతంత్ర్యోద్యమంలో చిలకమర్తి పాత్ర

మనందరం నివసిస్తున్న  ఈ భూమిపట్ల  మాతృభావన మనకు వేదకాలం నుంచి ఉంది.  ఆ నాటి మానవుడు మాతా భూమి: పుత్రోsహం పృథివ్యా:  అని  తనకు భూమిలో గల సంబంధాన్ని మాతృపుత్రసంబంధంగా చాటుకున్నాడు. ఇక ఇతిహాసకాలం నాటి మానవుడు  మరో అడుగు ముందుకెళ్ళి  కన్నతల్లి, ఉన్ననేల   స్వర్గంకన్న మిన్నగా భావించాడు.
రావణసంహారం పూర్తయింది. రాముడు సైన్యసమేతంగా  అయోధ్యకు తిరిగి రానున్నాడు. ఆసమయంలో లక్ష్మణుడు  రామునితో అన్నయ్యా ! మనం ఈ లంకారాజ్యంలోనే ఉoడిపోదాo. ఇది చాల బాగుంది అన్నప్పుడు రాముడు చెప్పిన మాటలు ఒక వ్యక్తికి తన మాతృభూమి పట్ల ఉండవలసిన ఆదర గౌరవాల్ని జ్ఞాపకం చేస్తున్నాయి.
ఓలక్ష్మణ ! ఈ లంకానగరం  సర్వాoగసుందరమైన  బంగారు భూమియే ఐనప్పటికీ నేను ఇష్టపడను . ఎoదుకంటే జనని, జన్మభూమి స్వర్గం కన్నా గొప్పవి.

ఆపి స్వర్ణమయీ లంకా న మే లక్ష్మణ రోచతే
జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ.
ఈ విధంగా మనకు భూమితోనూ అందులోనూ మాతృభూమితోను గల సంబంధం చాల గాఢమైనది. అందువల్ల తమ మాతృదేశం దాస్యశృoఖలాల్లో  చిక్కుకున్నప్పుడు ఆమె విముక్తి కోసం తను,మన,ధన,ప్రాణాలర్పించిన మహానుభావులెంతమoదో ఉన్నారు. వారు ముల్లోకాల్లోను పూజింపబడుతూనే ఉంటారు. ఎందుకంటే

స్వాతంత్ర్యమ్మునకై తెగించి తన సర్వస్వమ్ముగోల్పోవు నే
పూతాత్ముండతడొక్కడే త్రిభువనీపుజ్యుండు అంటారు  ప్రముఖ కవి కీ||శే|| శ్రీ యేటుకూరి వేoకట నరసయ్య గారు. దీన్నిబట్టి ఎవడు త్రికరణశుద్ధిగా మాతృదేశంకోసం తన సర్వస్వాన్ని సమర్పిస్తాడో అట్టివాడు ముల్లోకాల్లోను గౌరవిoపబడతాడు.
మనదేశం ఆంగ్లేయుల ఉక్కుపాదాలక్రిoద నలిగి ఎన్నో బాధలనుభవిoచింది. ఆమె దాస్యవిమోచనకు ఎంతోమంది ఎన్నెన్నో త్యాగాలు చేశారు.  మహాత్ముని నాయకత్వంలో ఆసేతు హిమాచలం కులమతజాతిప్రాoతీయభేదం లేకుండా ఆయన వెంట నడిచింది. అహింసాయుతపోరాటం జరిపి ఆంగ్లేయులను తరిమి తరిమి కొట్టింది. ఆ పోరాటoలో ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గం ఎంచుకున్నారు. కొంతమంది సత్యాగ్రహాన్ని ఎన్నుకుంటే మరికొంతమంది ప్రజల్లో జాతీయభావాలు రేకెత్తిస్తూ కర్తవ్యాన్ని ప్రబోధించే సాహిత్యాన్ని ఎన్నుకున్నారు.   మార్గాలు వేరైనా లక్ష్యం ఒక్కటే. అదే స్వాతంత్ర్యసాధన . అటువంటి సాహిత్యదళపతులలో బ్రిటీషు వారినెదిరిoఛిన మొట్టమొదటివ్యక్తిగా శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి పేరు భారతస్వాతoత్ర్యచరిత్రపుటలలో వ్రాయబడి ఉంది. ఆయన కేవలం స్వాతంత్ర్యసమరయోధునిగానే కాక కవిగా,  ప్రముఖపాత్రికేయునిగా, గ్రంథాలయోద్యమనాయకునిగా, సంఘసంస్కర్తగా  ఎన్నో సేవలందించారు.        
చిలకమర్తివారి పూర్వీకులు ప్రకాశంజిల్లా మద్దిపాడు గ్రామానికి  చెందినవారైనప్పటికీ కొన్ని కారణాలవల్ల వలసవచ్చి పశ్చిమ గోదావరిజిల్లా వీరవాసరంలో స్థిరపడ్డారు.  శ్రీచిలకమర్తి 1867 సెప్టెంబర్ 26 వ తేదీన తణుకు తాలూకాలోని ఖండవల్లి  గ్రామంలో జన్మించారు. ఈస్టిండియా కంపెనీవారు వీరవాసరంలో స్థాపించిన ఆంగ్లపాఠశాలలో చదువు ప్రారంభించారు. వీరవాసరంలో నాల్గవ తరగతివరకు మాత్రమే ఉండడంవల్ల నరసాపురం మిషన్ హై స్కూల్లో  పైచదువు కొనసాగించారు. 1887 లో మెట్రిక్ లో ఉత్తీర్ణులై కొంతకాలం  రాజమహేంద్రవరంలో  అధ్యాపకునిగా పని చేశారు. అప్పుడే అక్కడే శ్రీకoదుకూరి వీరేశలింగం గారికి శిష్యులయ్యారు. ఎన్నో కావ్యాలు , నాటకాలు , నవలలు , చారిత్రక నవలలు రచించారు. వీరు రచించిన గయోపాఖ్యానం నాటకం  ఎంతో ప్రజాదరణ పొంది  ఆనాడే ఒక లక్షపుస్తకాలు అమ్ముడు పోవడం ఒక విశేషం . 1909 లో నిమ్నజాతులకు పాఠశాలను స్థాపించారు. వందలకొలది నిమ్నజాతులవారికి, స్త్రీలకు ఉచితంగా విద్యనందిoచారు. బ్రహ్మసమాజం, హితకారిణి మొ||సంస్థల ద్వారా సమాజసేవలoదిoచారు. సరస్వతి, మనోరమ, దేశమాత మున్నగు పత్రికలను నడిపి జాతీయోద్యమాన్ని  బలోపేతం చేశారు. వారి   సర్వతోముఖమైన  సేవలకు గుర్తింపుగా   ఆంధ్రవిశ్వవిద్యాలయం 1943లో వారికి కళాప్రపూర్ణ బిరుదునిచ్చి సత్కరించింది.  వీరు అoధులైనప్పటికి ఇంతటి మహోన్నత స్థానాన్ని పొందగలగడం ఒక విశేషం    వీరు 1946 జూన్ 7 వ తేదిన మరణించారు.
ఈ వ్యాసంలో శ్రీచిలకమర్తి అందించిన స్వాతంత్ర్యోద్యమస్ఫూర్తికవితలను గురించి  సంగ్రహంగా తెలుసుకుందాం . అవి ఆంగ్లేయులు మన దేశాన్ని పరిపాలిస్తున్న రోజులు. 1907 లో శ్రీ బిపిన్ చంద్రపాల్  దక్షిణభారతదేశంలో  పర్యటిస్తూ తన మహోపన్యాసమహాప్రభంజనంతో ప్రజలలో అచంచలమైన జాతీయస్ఫూర్తిని రేకెత్తిస్తున్నారు. ఆయన బరంపురం మీదుగా రాజమహేంద్రవరం చేరుకొని 19-4-1907 నుండి 24-4-1907 వఱకు ఐదు రోజులపాటు తెలుగుప్రజల నుద్దేశించి గంభీరoగా ఉపన్యసించారు. వారి ఆంగ్లప్రసంగాలను తెలుగులో అనువదించడానికి నియమితులైన శ్రీ చిలకమర్తి చివరిరోజున ఆశువుగా చెప్పిన చైతన్యగీతానికి తెలుగుజాతి యావత్తు ఉత్తేజం పొందినదనడంలో ఎటువంటి సందేహం లేదు .

భరతఖండంబు చక్కని పాడియావు
హిందువులు లేగదూడలై యేడ్చు చుండ
తెల్లవారను గడుసరి గొల్లవారు
పితుకు చున్నారు మూతులు బిగియగట్టి
అనే  పద్యంలో ఆంగ్లేయులను దోపిడిదారులగాను, భారతీయులను దోపిడీకి గురౌతున్నవారిగాను వర్ణించిన తీరు ఎంతో స్ఫూర్తి దాయకం అయింది .  దేశభక్తుడు కష్టాలను లెక్కచెయ్యకూడదని ప్రబోధించే ఈ పద్యం మఱింత స్ఫూర్తి దాయకం .

చెఱసాలల్ పృథు చంద్రశాలలె యగున్ చేదోయి సంధించు న
య్యరదండల్ విరిదండలౌను కడు హేయంబైన చోడంబలే
పరమాన్నంబగు మోటు కంబళులు తాల్పన్ పట్టుసెల్లాలగున్
స్థిరుడై యేనరుడాత్మదేశమును భక్తిoగొల్చు నవ్వానికిన్

దేశభక్తునికి  చెఱసాలలు పాలరాతిమేడలౌతాయట. సంకెళ్ళు పూలదoడలౌతాయట. గంజే పరమాన్నమౌతుoదట. మోటైన కంబళ్లే పట్టువస్త్రాలౌతాయట. ఎంత రమణీయమైన భావన ఇది .  అలాగే దాస్యశృoఖలాల్లో చిక్కుకొని అలమటిస్తున్న సమస్తదేశాన్ని ఒక బదిఖానగా  అభివర్ణించిన తీరు పరమరమణీయo.

భరతఖండంబె ఒక పెద్ద బందిఖాన
అందులోనున్న ఖైదీలు హిందుజనులు
ఒక్క గదినుండి మార్చి వేఱొక్క గదికి
పెట్టుటే గాక చెఱ యంచు వేఱె గలదే

అంతేగాక స్వాతంత్ర్యమనేది యాచనవల్ల సాధించేది  కాదని అది త్యాగాలవల్ల మాత్రమే సాధ్యమౌతుందని నొక్కి చెప్పే ఈ క్రింది పద్యం ఉద్యమకారులందరికి స్ఫూర్తి దాయకం .

ఎందఱు కుoదకుండ మఱి యెoదఱు బoదెలకందకుoడ నిం
కెందఱు దేశముల్  విడిచి  యీడిగలంబడకుండ  నెవ్వరే
చందమునన్ శ్రమంబడక చప్పున చొప్పడునే స్వరాజ్యమో
హైందవులార ! చిoతిలకుడీ చెఱసాలలకేగుమన్నచో

                   ఈ విధంగా ఆనాడు ఉద్యమస్ఫూర్తిని రేకెత్తించిన ఎన్నెన్నో కవితలు వీరి కలం నుంచి జాలువారాయి. అలాగే ఆనాడు తమ కవితలతో ప్రజలలో జాతీయభావాలను రేకెత్తించిన వారిలో శ్రీయుతులు రాయప్రోలు, విశ్వనాథ, జాషువ, కరుణశ్రీ, యేటుకూరి, తుమ్మల, మధునాపంతుల , త్రిపురనేని , దాశరథి  మొదలగువారే గాక మరెందఱో ఉన్నారు . నేటి   యువత వారి కవితలను చదివి,
 స్పూర్తి పొంది, దేశాన్ని ప్రగతిపథం వైపు నడిపించి, దేశం యొక్క పూర్వవైభవాన్ని తిరిగి సాధించాలని ఆశిద్దాం .

   

Saturday, April 18, 2015

The Twenty Important Points for an Impressive Speaker

The Twenty Important Points for an Impressive Speaker

                               Dr. Ch. Durga PrasadaRao

Speaking is an art. To learn how to speak one must start speaking because we can not learn swimming by simply listening about the techniques of swimming or by seeing videos on swimming. Instead, one should dive in to water and start swimming.  Then only a person becomes expert in swimming. The same process is applicable to every art what ever it may be.
Our Rishis (Saints) of ancient times advised us to follow certain suggestions as precautionary steps to be recognized as an impressive speaker. All the precautions are codified and framed in a nut shell.  So, one should follow these suggestions scrupulously to enable himself to become a good speaker.
*. तथ्यं tathyam means that one should speak the facts without exaggerating them.
*. पथ्यं pathyam means that the talk should be proper and suitsble to the context. It should not be like beating around the bush.
3* सहेतु sahetu means that it should be of substantial evidence. . It should not be base less or without valid reason.

4*प्रियम priyam means that the speech should be as sweet as it could be.
5* तिमृदुलं atimrudulam means that it should be impressive and soft.
6*सारव saaravat, It should be meaningful.

7. द्दैन्यहीनं dainyahinam . The talk should be assertive.
8* saabhipraayam means that it should be purposeful.
9.* दुरापं duraapam means it should be thought provoking.
    It should not be understood very easily. At the same time understood only by peeping in to the subject.
10* सविनयsavinayam the speaker should speak with utmost humility.
11*  मशठं ashatham. It should never be dogmatic.
12* चित्र chitram the speech should be figurative. The way of presentation is more important than the content it self. It should not be dry. The presentation must have some aesthetic sense.
13* मल्पाक्षरं  alpaksharam. It should be as brief as it could be.
14. बह्वर्थं bahvartham. It should be pregnant with meaning.
15* कोपशून्यं  kopashunyam. The speaker should not exhibit any anger while presenting the matter.
16* स्मितयुत smitayutam . The should speak cheerfully
 17* घनदाक्षिण्य ghanadaakshinya . He is expected to be unbiased while presenting subject.
18* सन्देहहीनं
 sandehahina while speaking one should be very confident of what he speaks.
There is a famous proverb:
He who knows not and knows not that he knows not is a fool. Shun him.
He who knows not and knows that he knows not can be taught. Teach him.
He who knows and knows not that he knows not is asleep. Wake him. 
  He who knows and knows that he knows is a prophet. Follow him.
  So, one must be very confident of himself while speaking on a particular topic.

 19* सप्रमेयम् saprameyam It should be logical and it should not be vague.
 20*
अप्रमत्तम् apramattam One should be of very cautious of what he speaks. Because once it is uttered or comes out from one’s mouth it can not be repented or taken back.

तथ्यं पथ्यं सहेतु प्रियमतिमृदुलं सारवद्दैन्यहीनं
साभिप्रायं दुरापं सविनयमशठं चित्रमल्पाक्षरं च |
बह्वर्थं कोपशून्यं स्मितयुतघनदाक्षिण्यसन्देहहीनं
वाक्यं ब्रूयाद्रसज्ञ: परिषदि समये सप्रमेयाप्रमत्तम् ||    


Sunday, April 12, 2015

కొంటెకృష్ణుని తుంటరిచేష్టలు

కొంటెకృష్ణుని  తుంటరిచేష్టలు

మొదటి చేష్ట:
కృష్ణుడు అందరి ఇళ్ళల్లో దూరి వెన్న దొoగిలిస్తున్నాడు. ఒకసారి అందరికి  దొరికిపోయాడు. యశోదను పిలిచారు . పoచాయితీ పెట్టారు. జనం చాల మంది  పోగయ్యారు. అక్కడ పెద్దవాళ్ళు కూడ ఉన్నారు. కృష్ణుని ప్రియురాలు రాధ కూడ అనుకోకుండా అక్కడకు వచ్చింది .  యశోద కృష్ణునితో ఎరా!  ఎంత వెన్న దొంగిలింఛి తెచ్చావో చెప్పరా! అని నిలదీసి అడగ్గానే అందరి ఎదుట ఏమి తడుముకోకుoడ ఇoతేనమ్మా! అంటూ రాధ దగ్గరికి పరిగెత్తి ఆమె  స్తనాన్ని పట్టుకుని చూపిoచాడట. అందరు ఆశ్చర్య చకితులయ్యారు.  ఈ విధoగా పెద్దలందరి సమక్షంలో రాధ స్తనాన్ని పట్టుకున్న ఆ కొంటెకృష్ణుని  చెయ్యి అందరిని రక్షించుగాక .
 శ్లోకం చూడండి.
నీతం నవనీతం కియదితి
 పృష్టో యశోదయా కృష్ణ:
ఇయదితి  గురుజనసంసది
 కరధృతరాధాపయోధర: పాతు
 ( సుభాషిత రత్నభాoడాగారం,page-22,stanza-104).
రెండవ చేష్ట :
కృష్ణుడు  ఒకసారి  మిత్రులందరితో కలిసి బంతి ఆట ఆడుతున్నాడు. ఎవడో బంతిని చాల గట్టిగా విసిరాడు. అది కనబడనంత దూరంగా వెళ్ళిపోయింది . బంతికోసం అందరు వెదుకుతున్నారు . ఎక్కడ కనిపించడం లేదు. ఆట చూడ్డానికి రాధ కూడ అక్కడకు వచ్చింది . బహుశ ఆమెయే బంతి దాచేసి ఉoటుoదనుకున్నాడు కృష్ణుడు. ఆమె పైటకొంగు వెనుకనున్న స్తనాలు అతని అనుమానాన్ని బలపరుస్తున్నాయి. అందువల్ల  ఓ రాధా! నాబంతి నాకిచ్చెయ్ అని  ఆమె పైటకొంగుముడిని లాగుతున్న కొంటెకృష్ణుని చెయ్యి మనకు ఆనందం చేకూర్చుగాక అని కవి ఒక అందమైన శ్లోకాన్ని రచించాడు.   
దేహి మత్కందుకం  రాధే!
పరిధాననిగూహితం
ఇతి విస్రoసయన్నీవీo
తస్యా: కృష్ణో ముదేs స్తు న: 
( సుభాషిత రత్నభాoడాగారం , page-22,stanza-111)
గమనిక :

రాధాకృష్ణుల ప్రేమ దివ్యమైoది . అది పైకి శృంగారoగా కనిపిoచినా అది చవకబారుది కాదు సందేశాత్మకమైoది . రాధ జీవాత్మకు, కృష్ణుడు పరమాత్మకు ప్రతీక కావడం చేత అది భగవద్భక్తులకు విగళితవేద్యాoతరమైన దివ్యానుభూతినే చేకూరుస్తుoది గాని కామోద్రేకాలను కలిగించదు.   

Saturday, April 4, 2015

Vedic Thoughts on Purity of Water

                Vedic Thoughts on Purity of Water

                                     Dr. Chilakamarthi Durga Prasada Rao,
                     Honorary Faculty of Theology,
                                            Department of Sanskrit,
Dayalbagh Educational Institute,
(Deemed University)
                                                    Dayalbagh ,
AGRA-282005, U.P (India).
         dr.cdprao@gmail.com
    
 Paper presented at National Conference organised by Sri Venkateswara Vedic University, TIRUPATI  held from 17-03-2015 to 20-03-2015.  
                                                                   
1.     INTRODUCTION

Environmental pollution is one of the serious problems that confront the present day world.  Vedic Literature contributed immensely towards the protection of environment.

The world constitutes five elements, Earth, Water, Air, Fire and sky.  Of these, the three elements, Earth, Water and Air are prone to pollution, while the rest remain unaffected. The pollution of any one or more of these elements results in what we know as environmental pollution.

In olden days, man, as part and parcel of nature, used to live harmoniously with the environment.  He even treated the forces of nature as divine beings—Agni Deva, Varuna Deva, Vayu Deva and so on and glorified their existence and prayed for their intervention in nature’s fury (1).
    
But in the modern age man partly out of necessity but mostly selfishly started industrial and such other activities, but soon his greed degenerated into avarice and drove him to excesses.  He indulged in the over exploitation of nature’s bounties which led to polluting natural elements in the name of development and modernization.

The evils, viz., exploitation of natural resources, industrial pollution, deforestation and excessive use of chemicals have contributed to the environmental pollution.   As the present generation is a nexus between the past and future generations, it has a bounden duty to leave a good legacy to Posterity.   

If the attitude of the modern man continues to be the same, the survival of humanity itself will be at risk. In fact, no country wishes to remain undeveloped.  But the development should be healthy and at an affordable cost.  It should not create obstacles in the healthy and prosperous development of future generations. So, in order to achieve sustainable development, one should give up one’s greed and learn to live in peace with nature.  This is how our ancestors, even in the Vedic times, learned to live.              

Veda’, the very first book of mankind, which is also considered to be the greatest treatise on environment, ensured a healthy relationship between man and nature.  This relationship should be as sacrosanct as between mother and child.  The Earth was looked upon as universal mother and all living beings, her children (2).

2.     MULTI DIMENSIONAL ASPECTS OF WATER

Of all the natural resources water is next to air in importance. Water has many words in Sanskrit and most of them are significantly meaningful. (3)
 ‘Aapas’ ( aapnuvanti iti aapas) speaks of its all pervading nature.  The word ‘Vaari’ ( apavaarayati nimnonnatam ) means which balances up and downs. ‘Salilam’ ( sarati iti salilam ) means that  which flows .  ‘Kamalam’ ( kaamyate trishaartaih )  speaks that it is desired by thirsty people. ‘Jalam’ ( jadati jadibhavati ) speaks of  its solid nature.  ‘Payas (piyate iti payas) means that it is drunk by every body. ‘Keelaalam’ (keelaan jwaalaan alati vaarayati ) explains its nature of controlling  and  preventiing fire. ‘Amritam’ ( na mriyante anena ) means that it makes people  who drinks it immortal. It is called ‘jivanam’ ( Jivantyanena)  as it brings life to every one who drinks. It is coined as ‘ Bhuvanam (bhavati sarvam anena ) because  it achieves every thing.   It is called ‘Vanam' ( vanyate yaachyate) as it is desired by every body.  It is known as ’Kabandham ( kam shariram badhnaati iti ) as it keeps body united.  It is Udakam ( unakti iti udakam) as it is in liquid state. It is also called paathas ( paati bhutaani iti )  as it protects every living beings . It is also called ‘Pushkaram’ (poshayati iti) as it sustains living organism. The word ‘Sarvato mukham’ (sarvatah mukhaani asya ) signifies  its appearance in three states i.e.,  solid, liquid and gas.  ‘Ambhas’ (amati gachchati iti) signifies that it flows. ‘Toyam’ (tayate paalayati iti ) signifies that which nourishes the body. ‘Paaniyam’ (paatum yogyam) says that it is fit to be drunk. ‘Neeram ( nayati sukham ) brings happiness to all . ‘Ksheeram’ ( kshiyate iti ) which undergoes evaporation.   Ambu (ambate iti) means which makes sound while flowing. ‘Shamvaram’ (sham vrinoti iti samvaram) that which is covered by happiness. All these words, which are attributed to water, are therefore meaningful and explain the different characteristics of water.

3.     CAUSES OF WATER POLLUTION

The indiscriminate usage of chemicals, scientific experiments for preparing medicinal potions, indiscriminately discharging untreated waste water, dumping of unwanted and hazardous materials in rivers and unlawful water management practices contribute to water pollution.   In order to maintain its purity for the sustenance of the world, we should realize the importance of water by understanding the views of our ancestors of Vedic times.

4.     THE SIGNIFICANCE OF WATER

According to the Nasadiyasukta of the Rigveda (10/129) there was only water before creation. The sukta runs like this: There was not non – existent nor existent; there was no realm of air, no sky beyond it. What covered in, and where? And what gave shelter? Was water there, unfathomed depth of water? (4).

Hindu mythology opines that water is the abode of Lord Vishnu, the Ultimate Reality. The epithet, Narayana, means the Being whose abode is water is worth mentioning (5).  Water plays a very significant role in human life. There is no life without water. No Vedic ritual could be conducted without using water. There are hundreds of Vedic mantras which reveal the importance of water. Water is called Jivanam in Sanskrit which means life.  It is a drink for immortality. We depend upon food for our living, and for production of food agriculture is necessary, and agriculture depends upon water. Water is considered as a divine element and it is treated as medicine (6/1) as well as mother (6/2). Our tradition treats the waters of Ganga as medicine (6/3) and it is also evident that the water obtained from Manasa Gangotri is used as antiseptic water by Sushruta.   Our ancients, having realized the importance of water, treated it with reverence, and used it judiciously for human sustenance (7).

 Our culture went to the extent of developing familial relations with water.  Many great personalities of our ancient mythology married rivers which are personified as human beings. For example:- Santanu married Ganga, Purukutsa married Narmada and Kusa married Kumudvati. A great deal of literature is contributed on the lives of rivers. While coming to the religious aspect, bathing in rivers is considered as a sacred activity.
Even the mere view of the river Ganges is considered as most sacred (8). By all these it is evident that water is not simply a physical commodity which is formed by the combination of two molecules of Hydrogen and one molecule of oxygen (H2O), but it is also some thing very much beyond.

5.     WATER POLLUTION AS SIN

Veda warns us not to pollute water. Under any circumstances water is not allowed to be polluted. Keeping water very pure is highly encouraged, and polluting water is severely viewed and regretted (9). Polluting water is also treated as punishable crime. The punishment given by Lord Krishna to the venomous serpent Kaliya is worth mentioning in this context. Krishna, having subdued Kaliya on his heinous act of poisoning drinking water, said: Oh! Kaliya, you are now forgiven. But you should not stay here any more. Go back to the ocean and live with your kinsfolk. A river is meant for the use of human beings and their lives depend on the river and her water. It is not right on your part to poison it.

Also, polluting drinking water is considered as a great sin. The words of Bharata, spoken before Kausalya the mother of Rama, are worth quoting.  “Oh mother!  If  I really have any mal-intention of sending Rama to exile, I will definitely go to that hell a man goes on polluting drinking water (10). Because of water pollution, we are suffering from many diseases and we are also in a miserable condition of purchasing drinking water by spending huge amount of money.
                   
From times immemorial the bond between man and nature has been extremely strong.  Now it is our bounden duty and sublime obligation to maintain the equilibrium and see that the natural resources are not disturbed or interfered with, lest it should lead to chaos and confusion as aptly pointed out by Earnest Hemingway, the famous American novelist, who said “Mending nature is ending nature”.
     
6.     STEPS TO BE TAKEN

It is important for us to treat water as a divine element, as mentioned in our scriptures, and with all due reverence see to it that is not abused in daily life. Since a lot of river water has already been polluted today, sound water quality management practices should be followed in order that the damage already done is at least controlled and alleviated as much as possible. As remedial measures are expensive and time consuming, it is imperative to see that we stick to the vedic spirit of water conservation and management in its most revered form. We have no moral right to pollute water which itself is meant to purify various things in our daily life, as enunciated in the Vedic scriptures. We should comply with this vedic concept whole heartedly in letter, spirit and action.

It would be a great service to nature if litterateurs, besides environmentalists, contribute their share in preventing further environmental pollution.

In this connection, I urge everyone to treat water with due reverence, as a gift of nature, and not pollute it by using excessive amount of chemicals, dumping unnecessary material and letting waste water into rivers, lest it would lead to the total destruction of environment.

Let the following American Saying bring some change in the minds of the people.

“Only after the last tree has been cut down,
Only after the last fish has been caught,
Only after the last river has been poisoned,
Only then will you realize that money cannot be eaten’’
                                                     --- Native American Saying----

Let me conclude my talk with chanting a hymn from the Yajurveda.

ॐ द्यौ: शान्ति: | अरन्तरिक्षं शान्ति: | पृथिवी शान्ति: आप: शान्ति: | ओषधय: शान्ति: | वनस्पतय: शान्ति: | विश्वे देवा: शान्ति: | ब्रह्म शान्ति: | सर्वं शान्ति: |शान्तिरेव  शान्ति: | सा मा शान्तिरेधि ||

Let all the lokas be happy
Save water --- Save the world


References:

(1)     अग्निर्देवता वातो देवता सूर्यो देवता चन्द्रमा देवता वसवो देवता रुद्रा देवता ss दित्या देवता मरुतो देवता विश्वेदेवा देवता बृहस्पतिर्देवतेन्द्रो देवता वरुणो देवता (यजुर्वेद -14/20)

(2)     माता भूमि: पुत्रोऽहं पर्थिव्या: (अथर्ववेद- 12-1-12)
          
(3)  आप: स्त्री र्भुम्नि वार्वारि सलिलं कमलं जलम्
      पय: कीलालममृतं जीवनं भुवनं वनम्
                कबन्धमुदकं पाथ: पुष्करं सर्वतो मुखं
       अम्भोणस्तोयपानीयं निरक्षीराम्बुशं वरम् (अमरकोशे- वारिवर्ग: -   - श्लो-3&4)

(4) नासदासीन्नो सदासीत्तदानीं नासीद्रजो नो व्योमा परो यत्|
      किमावरीव: कुहु कस्य शर्मन्नम्भ: किमासीद्गहनं गभीरम् ||
    (ऋग्वेद: -10-129)

(5) नारा आप: अयनं स्थानं यस्य स: नारायण: (अमरकोश:/  स्वर्वर्ग: /18). 

(6/1) भिषग्भ्यो s पि भिषक्तर: (अथर्वणवेद-- 19-2-3)

(6/2)  यूयं हि ष्ठा भिषजो मातृतमा
विश्वस्य स्थातुर्जगतो जनिय्री: (ऋग्वेद: 6-50-7)
 (6/3) शरीरे जर्जरीभूते व्याधिग्रस्ते कलेबरे |
औषधं जाह्नवीतोयं वैद्यो नारायणो हरि: ||
 (7)   मधुवाता ऋतायते
          मधु क्षरन्ति सिन्धव:
          माध्वीर्नः सन्त्वोषधी (ऋग्वेद-1-90-6)

 (8)   अम्ब तवद्दर्शनान्मुक्ति: न जाने स्नानजं फलम् |   

 (9)  मा ss पो हिंसी:, मा ओषधीन्हिंसी:
    धाम्नो: धाम्नो राजंस्ततो वरुण नो मुञ्च
    सुमित्रिया न sआप sओषधय:  सन्तु
    दुर्मित्रियास्तस्मै सन्तु  योसमान् द्वेष्टि
    यं च वयं द्विष्म:      ( यजुर्वेद: - 6-22)

 (10) पानीयदूषके पापं तथैव विषदायके |
        यत्तदेकस्स लभतां यस्यार्योs नुमते गत: ||
    (श्रीमद्रामायणम्अयोध्याकाण्ड:)| Canto 75/ Stanza56

Bibliography:

1. Amarakosa
2.  Atharva Veda.
3.  Bhagavata puranam
4.  Rig-Veda.
5. The Ramayana of Valmiki
6. Yajurveda.
7. Journals & News Papers.

1. आप्नुवन्तीति आप:
2.  अपवारयति निम्नोन्नतंम् इति वारि 
3. सरतीतु सलिलम्
4. कामयते त्रुशात्र्तै: इति कमलम् 
5. जलति जदीभवति इति जलम् 
6. पयते इति पय: / पय गतौ 
7. पीयते इति पय: 
8. कीलान् ज्वालान् अलति वारयतीति कीलालम् 
9. कील्यते बध्यते इति वा कीलालम् 
10. जीवन्ति अनेन इति जीवनम् /जीव प्राण धारणे 
11. न म्रियन्ते इति अमृतम् 12/ जीव प्राणधारण 
12. वन्यते याच्यते इति वनम् /वनु याचने 
13. वनतीति वनम् / वन संभक्तौ 
14. भवति सर्वम्  अनेन इति भुवनम् 
15. कं शरीरं बध्नाति ति कबन्धम् 
16. काम्यते इति कम् 
17. अनन्ति अनेन इति अन्धम् 
18. उनक्ति इति उदकम् / उन्दी क्लेदने 
19. पीयते इति पाथ:  अथवा पाति भुवनानि इति पाथ: 
20. पुष्यतीति पुष्करम् 
21. सर्वत: मुखानि अत्र इति सर्वतो मुखम् 
22. अमति गच्छति इति अम्भ : ? अम गत्यादिषु
23. ऋनातीति अर्ण: /ऋ गतौ 
24. तायते पालयति इति तोयम् / / तायृ  पालने 
25. पीयते इति पानीयम् / पा पाने  अथवा  पातुं योग्यं पानीयम् 
26. निम्नंम् ईर्ते इति नीरम् 
खननाय नितरां म्नायते अभ्यस्यते इति निम्नम् / मना अभ्यासे 
27. नयतीति नीरम् / णीञ प्रापणे 
28. क्षयतीति  क्षीरम् 
29. क्षीयतीति क्षीरम् 
30. क्षिनोतीति क्षीरम् 
31. अम्बते इति अम्बु / आबि शब्दे 
32. शंबयति इति शम्बरम् / शंब =संवरणे 
33. सं वृनोतीति शम्बरम्  
<><><>