మఱువబోకు చిలకమర్తి మాట
నాల్గవ భాగం
చిలకమర్తి వేంకట సూర్యనారాయణ
నరసాపురము
1. పేద
ధనిక వర్గ భేదంబు విడనాడి
చేరి యొక్కచో
భుజింపవలయు
వర్ణ భోజనాలు
వనభోజనాలౌనె
మఱువ
బోకు చిలకమర్తి మాట
2. సత్య భాషణంబు
సర్వదా పోషించి
నిండు జీవనంబు
నెరపు మదిని
పట్టుసడలకుండ
పరమాత్మ నర్చించు
మఱువ
బోకు చిలకమర్తి మాట
3. దురుసువర్తనంబు దూరంబుగానుంచు
దివ్య శాంతినెరపు
దీక్షతోడ
పట్టువీడకుండ
పాటించు నియమంబు
మఱువ బోకు చిలకమర్తి మాట
4.
వంశముద్ధరించు వరతనయుడు
చాలు
పాడుబుద్ధి
కలుగు పదుగురేల
ఒక్కడున్న
చాలు దక్కును సద్గతుల్
మఱువ బోకు చిలకమర్తి మాట
5. గతము చేసుకున్న కర్మంబు చేతను
ఇహము నందు ఫలము నిచ్చు శివుడు
తెలివితోడ నీవు
తెలుసుకు జీవించు
మఱువ బోకు చిలకమర్తి మాట
6. ఎదుటి వారితప్పులెంచుటే పని గాని
తాము సేయు తప్పు తలపరెవరు
దాచినట్టి దాని దైవంబెరు౦గడా
మఱువబోకు చిలకమర్తి మాట
7. పూర్వమందు చేయు పుణ్యపాపంబుల
వలన కలుగు వాని ఫలము నేడు
నీవు తప్పు చేసి ని౦దింపకితరుల
మఱువబోకు చిలకమర్తి మాట
8. ముజ్జగ౦బులందు
ముందు పూజలనందు
మోదకములదినుచు మురియు వేల్పు
ఏకదంతునెపుడునింపుగా కొల్వుము
మఱువబోకు చిలకమర్తి మాట
9 . ధాత ముదముతోడ తాలికట్టిన సాధ్వి
తానె విద్యలెల్ల
దాచు పడతి
కవులకల్పవల్లి కామితార్థములిడు
మఱువబోకు
చిలకమర్తి మాట
10. తిండికొఱకు తానె తిరిపెంబు నెత్తుచు
భక్తవరులకమిత భాగ్యమొసగి
ముక్తి నొసగి బ్రోచు ముక్కంటి మది నిల్పు
మఱువబోకు చిలకమర్తి మాట
11. కోటి యాస్తులిడిన కొడుకులు మురియరు
కొద్దిగుడమునొసగ కుక్కనిన్ను
మరణ మొందు వరకు మరువక రక్షించు
మఱువబోకు చిలకమర్తి మాట
12. ఎవరు చేయుకర్మ
వారికే ఫలమౌట
శివుడు శాసనంబు చేసే తొల్లి
నిజమునెరిగి నీవు నిష్ఠగా జీవించు
మఱువబోకు చిలకమర్తి మాట
13. ఎదుటివారితప్పు
నెంచకు ముందుగా
నీదు తప్పు మదిని నెరిగి వేగ
తప్పు నొప్పుకొన్న దైవంబు రక్షించు
మఱువబోకు చిలకమర్తి మాట
14 . భాగవతము వ్రాయు బమ్మెరపోతన
కలము కుంటువడగ కలత చెంద
విష్ణుదేవుడొచ్చి వేగమె పూరించె
మఱువబోకు చిలకమర్తి మాట
15 . భక్తిమార్గమొకటి ముక్తికి సులభమౌ
సాధనముగ తెలిపె శాస్త్ర చయము
ఇష్ట దైవ చింతయే నీకు శరణంబు
మఱువబోకు చిలకమర్తి మాట
16 . కంటిలోన నిప్పు కంఠాన
గరళంబు
శిరమునందు గంగ చందమామ
మెడలనాగమొప్పు జడదారి నర్చించు
మఱువబోకు చిలకమర్తి మాట
17. తల్లిగర్భమందు దాగిన మాసాలు
మూత్రమలములందు మునిగిపోయి
బాధలెన్నొపెట్టి
బయటికి వచ్చేవు
మఱువబోకు చిలకమర్తి మాట
18.
తల్లి దండ్రి సేవ తరువాత దైవంబు
భక్తి తోడ పూజబరపుమెపుడు
శివుడు మెచ్చి నీకు చేయూత నందించు
మఱువబోకు చిలకమర్తి మాట
19. తర్క కర్కశంపు దారుల
జొరకుము
తత్త్వ చింత నీకు తరుణమిపుడు
తర్కమాశ్రయింప
తత్త్వంబు చేజారు
మఱువ బోకు
చిలకమర్తి మాట
20. ఆశ తోడ నివు ఆర్జి౦చు
సంపదల్
వెళ్లి
పోవునాడు వెంట రావు
పాపపుణ్యచయమె పయనించు నీవెంట
మఱువ
బోకు చిలకమర్తి మాట
21. అమ్మ
కడుపులోన హాయిగా శయనించి
ఆమె తిన్నదంతనారగించి
బయట పడ్డ పిదప బాధింప సరిగాదు
మఱువబోకు చిలకమర్తి మాట
22.
కామ మనెడు కాంత ప్రేమతో దరిజేరి
చిత్తమందు
నిల్చి చెరచు నేమొ
జాగరూకుడగుచు
చక్కగా మసలుకో
మఱువబోకు
చిలకమర్తి మాట
23. నిన్ను పొగడుకొనుచు నితరుల ద్వేషించి
చులకనగా జేసి చూడకెపుడు
సత్పురుషుల బాధ శాపమై బాధించు
మఱువబోకు చిలకమర్తి మాట
24. ప్రతి దినంబు నీవు భక్తి శ్రద్ధలతోడ
గోవు పూజ సలిపి గావు మెపుడు
కోటి యజ్ఞఫలము కూర్చును తోడుత
మఱువబోకు చిలకమర్తి మాట
25. పనికి
రాని గడ్డి భక్షించి ముదమొంది
కమ్మనైన పాలు క్రుమ్మరించు
గోవు నీకు నొసగు కోరిన సంపదల్
మఱువబోకు చిలకమర్తి మాట
26. దేహమనెడు రథము దివ్యముగా నడ్పు
సారథియగు నీశు సన్నుతించు
సర్వదేశకాల సర్వగతుల యందు
మఱువబోకు చిలకమర్తి మాట
27. గతము
చేసుకొన్న కర్మంబు చేతనే
కలిగె
కష్టమనుచు కలత వీడు
దేవునెపుడు
నీవు తెగడ ధర్మము కాదు
మఱువ బోకు
చిలకమర్తి మాట
28. తల్లి కడుపునుండి ధరణికి దిగునాడె
మెచ్చి
తోడ వచ్చు మృత్యువెపుడు
కాలమరసి నిన్ను కమ్మగ భక్షించు
మఱువబోకు
చిలకమర్తి మాట
<><.><>