Monday, February 12, 2018

The Yoga Sutras of Patanjali-8,9,10 &11


The Yoga Sutras of Patanjali-8,9,10 &11
(పతంజలి యోగసూత్రములు)

Dr. Chilakamarthi Durgaprasada Rao

8. विपर्ययो  मिथ्याज्ञानमतद्रूपप्रतिष्टम्
 (విపర్యయో మిథ్యాజ్ఞాన మతద్రూపప్రతిష్ఠ౦)
విపర్యయం అంటే తప్పుడు జ్ఞానం . అది కాని దాని యందు అది అనే బుద్ధి . వస్తువైనా వస్తువును వస్తువుగా చూస్తే లేదా కనిపిస్తే  ఎటువంటి ఇబ్బంది ఉండదు .  ఉదాహరణకి ఒక పాము పాముగా, త్రాడు త్రాడుగ  మనకు కనిపిస్తే ఎటువంటి ప్రమాదం లేదు; అలాగే ఆవు, ఆవుగా ; పెద్దపులి, పెద్దపులిగా కనిపిస్తే ప్రమాదం లేదు . మనం జాగ్రత్త పడొచ్చు . కాని  పాము, త్రాడుగా; త్రాడు, పాముగా; అలాగే ఆవు, పులిగా పులి, ఆవుగా కనిపిస్తే మాత్రం  ప్రమాదం .  దీన్ని శాస్త్రీయంగా అవిద్య అంటారు . అనిత్య , అశుచి , దు:ఖ, అనాత్మసు నిత్య, శుచి, సుఖ , ఆత్మఖ్యాతి రవిద్యా  అని దాని నిర్వచనం . దీన్ని బట్టి అనిత్యమైన దానిని నిత్యం గాను , ఆశుచిని శుచిగాను , దు:ఖాన్ని సుఖంగాను , అనాత్మను ఆత్మగాను భావించడమే అవిద్య. ఇదే విపరీత జ్ఞానం. విపర్యయ జ్ఞానంలో మనస్సు ప్రవర్తించుట ఎలా ప్రమాదమో ప్రత్యక్ష , అనుమాన ములందు కూడ మనస్సు ప్రవర్తించుట ప్రమాదమే కాబట్టి అది  తగదని యోగశాస్త్రం చెబుతోంది . అందుకే
అనాత్మని దేహాదావాత్మ బుద్ధిస్తు దేహినా
మవిద్యా తత్కృతో బంధ: తన్నాశో మోక్ష ఉచ్యతే  అన్నారు శాస్త్ర కారులు. అనాత్మలైన శరీరాదులందు ఆత్మబుద్ధి కలిగియు౦డడం అవిద్యా . అది బంధానికి దారితీస్తుంది . అది తొలగడమే   మోక్ష౦  .
I.9. शब्दज्ञानानुपाती  वस्तुशून्यो विकल्प:
శబ్దజ్ఞానానుపాతీ వస్తుశూన్యో వికల్ప:
వికల్పమంటే ఒక  పదం/శబ్దం మనకు తెలుసుగాని దానికి సంబంధించిన వస్తువు ఉండదు. వంధ్యాపుత్రుడు (గొడ్రాలిబిడ్డ) అనే పదం వినడానికి బాగానే ఉంది గాని వ్యక్తి కనిపించడు . అలాగే ఆకాశకుసుమం అనే పదం వినడానికి బాగానే ఉంది గాని అది కనిపించదు .   మన మనస్సులో ఇటు వంటి జ్ఞానం కూడ కలుగుతో ఉంటుంది . ఇపుడు నిద్ర అంటే ఏంటో తెలుసు కుందాం.
 I.10. अभावप्रत्ययालम्बना वृत्त्ति: निद्रा
(అభావ ప్రత్యయాలంబనా నిద్రా)
అభావప్రత్యయ= శూన్య జ్ఞానం , ఆలంబనా = ఆలంబనముగాగల వృత్తి:= చిత్తవృత్తి ; నిద్రా = నిద్ర అనబడును . మనకు నిత్యజీవితంలో మెలకువ , కల , నిద్ర అనే మూడు దశలు ఉంటాయి . మెలకువ, స్వప్నం (కల) కాక చిత్తమునకు కలుగు వృత్తియే నిద్ర . నేను నిద్ర పోయాను నాకేమి తెలియదు అనే అనుభవానికి శూన్యజ్ఞానమే ఆలంబన . చిత్తము ఆ నిద్ర యందు ఎల్లప్పుడు లగ్నం ఔతుంది కాబట్టి నిద్రను కూడ జయించాలని యోగశాస్త్రం చెబుతోంది .    
1.     11. अनुभूतविषयासंप्रमोष:स्मृति:
(అనుభూతవిషయాసంప్రమోష: స్మృతి:)
अनुभूत= అనుభవించిన ; विषय= విషయములయొక్క ; असंप्रमोष:= తుడిచి వేయ బడకపోవుటయే ( మాటి మాటికి జ్ఞాపకమునకు వచ్చుటయే ; स्मृति:=స్మృతి . దీన్ని కూడ నివారించాలని యోగశాస్త్రం భావిస్తోంది . అంటే జ్ఞాపక శక్తిగల మన మనస్సు ఎప్పుడో జరిగిపోయిన విషయములను కూడ మాటిమాటికి స్మరిస్తూ ఉంటుంది . దీన్ని కూడఅదుపులో ఉంచుకోవాలని యోగశాస్త్రం భావిస్తోంది .



Thursday, February 8, 2018

సంభాషణ సంస్కృతం -14



సంభాషణ సంస్కృతం -14
Dr. Durga Prasada Rao Chilakamarthi
dr.cdprao@gmail.com
                  
Lesson—14

Unit-1
      
अद्यतन  (adyatana) (ఈనాటి) )श्वस्तन (shvastana ) (రేపటి) – ह्यस्तन (నిన్నటి)  (hyastana) —पूर्वतन (ప్రాచీనమైన)   (purvatana) —इदानीन्तन  (idaaneentana) (ఇప్పటి)

अद्यतन the period of a current day.(Of today)—श्वस्तन future (tomorrow’s) ह्यस्तन (of yesterday)—पूर्वतन 0lden—इदानीन्तन present, momentary, of the present moment.

SOME EXAMPLES:

1. एष: अद्यतन: पाठ: ఇది ఈనాటి పాఠము   (This is today’s lesson)
2. स: ह्यस्तन: पाठ: అది నిన్నటి పాఠము (That is yesterday’s lesson)  
3. एष: श्वस्तन: पाठ: ఇది రేపటి పాఠము (This is tomorrow’s lesson)
4. एषा अद्यतना पत्रिका  ఇది నేటి పత్రిక (This is today’s magazine)
1.      सा ह्यस्तना पत्रिका   అది నిన్నటి పత్రిక ( That is yesterday’s magazine)
2.      एषा श्वस्तना पत्रिका ఇది రేపటి పత్రిక ( This is tomorrow’s magazine)
3.      एतत्त् गृहं पूर्वतनम्   ఈ ఇల్లు పాతది ( This house is of ancient times)
4.      अयं व्यवहार:  इदानीन्तन:  ఈ వ్యవహారం ఇప్పటిది (This affair is of present times)

Unit-2
                                          गत आगामि

गत= any thing  past or done (జరిగిపోయిన )
आगामि=  coming , future (రాబోయే ).

SOME EXAMPLES:

1.      गतदिने अहं वैद्यस्य समीपं गतवान् || आगामिदिने शस्त्रचिकित्सा भविष्यति || నిన్న నేను వైద్యుని దగ్గరకు వెళ్ళితిని . రేపు ఆపరేషను జరుగును .
   I went to the doctor yesterday. Operation will be held tomorrow.
2.      अहं गतमासे ‘ चेन्नै ’ नगरे आसम् || आगामिमासे अहं मुम्बै नगरं गमिष्यामि|| గత నెల నేను చెన్నైలో ఉంటిని. రాబోయే నెలలో నేను ముంబైలో ఉందును.  I was there in Chennai last month. I will go to Mumbai next month.
3.      गतदिने वर्ष: अधिक: आसीत् || अत: आगामिदिनपर्यन्तं पाठशालाया: विराम: प्रकटित: || నిన్న వాన బాగా కురిసింది . అందువల్ల రేపటివరకు పాఠశాలకు సెలవు ప్రకటింప బడింది .  .
   There was heavy rain yesterday. Therefore it is announced to close the school till tomorrow.
4.      अहं गतदिने आगतवान् अत: आगामिदिनपर्यन्तं तत्र  स्थास्यामि || నేను నిన్న వచ్చాను అందువల్ల రేపతివరకు ఇక్కడే ఉంటాను .
      I came yesterday; therefore I shall stay there till tomorrow.


Unit-3
यदातदा
          यदा = whenever (ఎప్పుడో)
          तदा = then (అప్పుడు )

 SOME EXAMPLES:

1.              यदा अध्यापक: आगच्छति तदा परिक्षा भवति || 
ఎప్పుడు అద్యాపకుడు వచ్చునో అప్పుడు పరీక్ష జరుగుతుంది .
  The examination takes place when the teacher comes.
2.              यदा मम मित्रम् आगमिष्यति तदा अहं चलनचित्रं द्रक्ष्यामि||
     నా మిత్రుడు ఎప్పుడు వస్తే అప్పుడు నేను సినిమా చూస్తాను
   I shall see the movie when ever my friend comes.
3.              यदा अध्यक्ष: आगतवान् तदा सभाया: प्रारम्भ: अभवत्
ఎప్పుడు అధ్యక్షుడు వచ్చారో అప్పుడు సభ ప్రారంభమై౦ది.  
    The meeting had commenced on the arrival of the president.
4.              यदा विपत्ति: संभवति तदा अप्रमत्ततया वर्तितव्यम्
ఎప్పుడు కష్టం కలుగుతుందో అప్పుడు అప్రమత్తంగా ఉండాలి .
When ever there is adversity then one must behave cautiously.    

Unit – 4

            भूतकाल: (स्म) = used to

SOME EXAMPLES:

1. अहं बाल्ये पाठशालां पद्भ्यां गच्छामि स्म ||
(In my child-hood I used to go to school on foot).
2.  मम पिता मां पाठयति स्म ||
(My father used to teach me).
3.      मम माता मां प्रेम्णा लालयति स्म ||
(My mother used to treat me with love and affection).
4.      अहं मम मित्रै: सह क्रीडामि स्म
(I used to play with my friends).
5.      मम भगिनी मां निन्दति स्म
(My sister used to chide me).
6.      मम अध्यापका:  पाठनस्य अनन्तरं मां ग्रन्थालयं प्रति प्रेषयन्ति स्म ||
(My teachers used to send me to library after teaching).
   
संस्कृतश्लोक: (SANSKRIT SLOKA)

काव्यशास्त्रविनोदेन कालो गच्छति धीमताम्
व्यसनेन च मूर्खाणां निद्रया कलहेन वा

Kaavya shaastravinodena
kaalo gacchacti dheemataaM                              
vyasanena cha murkhaaNaaM
nidrayaa kalahena vaa  

Intellectuals spend their time by enjoying the taste of reading kavyas and studying Sastras. On the contrary foolish people spend their time by indulging themselves in bad habits, by sleeping and by quarreling with others.