2.
అద్వైతసిద్ధాంతం అనగా ఏమి?
మూలం :- శ్రీ శంకరకింకరులు
అనువాదం :-చిలకమర్తి దుర్గాప్రసాదరావు
ఈ వ్యాసం ఉపనిషత్తులు
, మహాభారతం , స్మృతులు పురాణాల యొక్క సారం కేవలం అద్వైతమే అని వివరిస్తుంది. శ్రీ శంకరభగవత్పాదులు ఒకచోట “ఇష్యతే(దృశ్యతే)
హి సర్వోపనిషదాం సర్వాత్మైక్య ప్రతిపాదకత్వం” అని స్పష్టంగా చెపుతూ అద్వైతమే అన్ని ఉపనిషత్తుల యొక్క సారాంశంగా భావించారు
. ఆయా గ్రంథాల్లో అక్కడక్కడ కొన్ని ద్వైతసంబంధమైన వాక్యాలు అనివార్యంగా
కనిపిస్తున్నప్పటికీ గ్రంథతాత్పర్యం మాత్రం
అద్వైతప్రతిపాదనమే అని భావించాలి . శ్రీ శంకరులు , మిగిలిన ఆచార్యులు
ప్రతిపాదించిన ద్వైతవాక్యాలు అద్వైతబ్రహ్మతత్త్వాన్ని తెలుసుకోడానికి
సాధనాలైన కర్మానుష్ఠానానికి, ఉపాసనకూ,
చతుర్విధసాధనలకు సహాయకారులుగా భావించాలని పేర్కొన్నారు .
అలా కాని పక్షంలో అద్వైత
బోధకవాక్యాలు ద్వైత సిద్దాంతంలో పొసగవని, అవి సమంజసం కావని భావించాలి.
అద్వైత సిద్ధాంటానికి
ప్రధానలక్షణాలు ఈ విధంగా ఉన్నాయి.
1. బ్రహ్మమే ఆత్మ.
అదే సమస్తము , సర్వవ్యాపి . ఆత్మభిన్నమైనదేదీ లేదు.
2. ప్రపంచమంతా మిథ్య.
ఇక్కడ మిధ్య అనగా యథార్థ జ్ఞానం కలిగేవరకు మాత్రమె ఉండేది, యథార్థజ్ఞానం కలుగగానే తొలగిపోయేదని
అర్థం.
3. మోక్షం జ్ఞానం
వల్లనే సిద్ధిస్తుంది.
4. జీవుడు మరియు
బ్రహ్మ ఇరువురు ఒక్కటే . ఒకరికంటే మరొకరు వేఱు కాదు.
5. బ్రహ్మ నిర్గుణం .
6. జీవన్ముక్తి అనగా
జీవించి యుండగానే ముక్తి పొందగలడం సాధ్యం .
7. అద్వైతసిద్ధాంతం ప్రాతిభాసిక
సత్యం, వ్యావహారిక సత్యం , పారమార్థిక
సత్యం అనే మూడు విధాలైన సత్యాన్ని అంగీకరిస్తుంది. పాము త్రాడుగా కనిపించడం ప్రాతిభాసికసత్యం . పాము పాముగా
కనిపించడం వ్యావహారిక సత్యం . పాము చైతన్యంగా దర్శనమివ్వడం పారమార్థిక సత్యం .
8. హరిహరులకు మధ్య
ఎటువంటి భేదం లేదు. ఈ సిదాంతాలు ఏ గ్రంథంలో సంపూర్ణంగా కనిపించినా అది అద్వైతగ్రంథమే.
<><><><>