1.
భగవత్పాద సిద్దాంతంలో శివ విష్ణువుల అభేదం
మూలం :- శ్రీ శంకరకింకరులు
అనువాదం :- చిలకమర్తి .దుర్గాప్రదసాదరావు
శివనామని భావితేoతరంగే
మహతి జ్యోతిషి మానినీమయార్ధే
దురితాన్యపయాంతి దూరదూరే
ముహురాయాంతి మహంతి మంగళాని
స్మృతే సకలకళ్యాణభాజనం యత్ర జాయతే
పురుషస్తమజం నిత్యం వ్రజామి శరణం హరిం
శ్రీ శంకరభగవత్పాదులు శివుని, విష్ణువును ఒకే పరమ సర్వేశ్వరునిగా భావించారు . వారిద్దరి మధ్య ఎటువంటి భేదాన్ని ఆయన చూపించ లేదు. ఆయన రచించిన సూత్రభాష్యం అలాగే మిగిలిన లఘుగ్రంథాలు పరిశీలిస్తే ఈ విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది. బ్రహ్మసూత్ర భాష్యంలోని ప్రకృత్యధికరణంలో “ప్రకృతిశ్చప్రతిష్ఠా దృష్టాంతానుపరోధాత్” (1-4-23) అని శివుని ప్రపంచానికి సమవాయకారణంగాను, నిమిత్త కారణంగాను వర్ణించడం గమనిస్తాం. అలాగే పాంచరాత్ర అధికరణలో నారాయణుని పరమాత్మునిగా అభివర్ణించారు .
<><><>
No comments:
Post a Comment