అనుభవాలు -జ్ఞాపకాలు -1
చిలకమర్తి దుర్గాప్రదాదరావు
ఒకరోజు మా గురువర్యులు శ్రీ మల్లంపల్లి వీరేశ్వరశర్మగారు మహాభారతం
పాఠం చెపుతున్నారు. అది నన్నయగారి పాఠ్యభాగం .
అందులో “సుందరి! నాకోడండ్రుర
యందభ్యర్హితవు నీవు” అనే పద్యం చెపుతున్నారు.
నేను లేచి గురువుగారూ ! కోడండ్రు అంటే
సరిపోతుంది కదండీ! కోడండ్రురు అని బహువచనంపై మరల బహువచనం ఎందుకు? అన్నాను .
వారు దానికి సమాధానంగా ఆయనకు కోడళ్ళు ఒకరా
ఇద్దరా. 108 మంది కదా! అందుకే వేసుంటాడులే
అన్నారు . ఆయన పాఠప్రవచనం అంత సరసంగా ఉండేది .
అలాగే ఒకచోట సంఖ్యము అనే పదం వచ్చింది. సంఖ్యం అంటే యుద్ధం . ఆ విషయం direct గా చెప్పకుండా , సఖ్యానికి సున్న పెడితే సంఖ్యమేగా
అన్నారు . వారి బోధన అంత సరసంగా ఉండేది.
అనుభవాలు -జ్ఞాపకాలు -1
చిలకమర్తి దుర్గాప్రదాదరావు
ఒకరోజు మా గురువర్యులు శ్రీ మల్లంపల్లి
వీరేశ్వరశర్మగారు మహాభారతం పాఠం చెపుతున్నారు. అది నన్నయగారి పాఠ్యభాగం .
అందులో “సుందరి! నాకోడండ్రుర
యందభ్యర్హితవు నీవు” అనే పద్యం చెపుతున్నారు.
నేను లేచి గురువుగారూ ! కోడండ్రు అంటే
సరిపోతుంది కదండీ! కోడండ్రురు అని బహువచనంపై మరల బహువచనం ఎందుకు? అన్నాను .
వారు దానికి సమాధానంగా ఆయనకు కోడళ్ళు ఒకరా
ఇద్దరా. 108 మంది కదా! అందుకే వేసుంటాడులే
అన్నారు . ఆయన పాఠప్రవచనం అంత సరసంగా ఉండేది .
అలాగే ఒకచోట సంఖ్యము అనే పదం వచ్చింది. సంఖ్యం అంటే యుద్ధం . ఆ విషయం direct గా చెప్పకుండా , సఖ్యానికి సున్న పెడితే సంఖ్యమేగా అన్నారు .
వారి బోధన అంత సరసంగా ఉండేది.
అనుభవాలు – జ్ఞాపకాలు -2
నేను
ఆంధ్రవిశ్వవిద్యాలయాలో M.A సంస్కృతం చదువుకుంటున్నరోజుల్లో
(1978-80) ఒకే బిల్డింగులో ఒక సంవత్సరం ఉదయం తెలుగుశాఖ మరో సంవత్సరం ఉదయం
సంస్కృతశాఖ చొప్పున పని చేసేవి. ఒకనాడు సాయంత్రపు
వేళ నేను మా డిపార్టుమెంటు ముందున్న చెట్టు క్రింద కూర్చుని ఏదో చదువుకుంటున్నాను.
అప్పుడు ఒకాయన అక్కడకు వచ్చారు. ఏమయ్యా! నన్ను జోగారావు దగ్గరకు తీసుకెళ్ళగలవా?
అని అడిగారు . ఆయన చాల పెద్దవారు. తప్పకుండా తెసికెళతానండీ, ఇంతకీ మీరెవరూ? తమరి
పేరేమిటి ? అని అడిగాను . నన్ను గంటి. జోగిసోమయాజి అంటారు అన్నారాయన . అది వినగానే నాకు కళ్ళు
తిరిగి క్రిందపడ్డంత పనైంది. అప్పటికే ఆయన గురించి నాకు బాగా తెలుసు , ఆయన మన తెలుగు
వారందరికీ భాషాశాస్త్ర పితామహులు. నేను భాషాప్రవీణ
చదువుతున్నప్పుడు ఆయన గ్రంథం గురించి కొంత
విన్నాను. కాని నాకు తెలియందల్లా ఒక్కటే, అయన అప్పటికి సజీవులై ఉన్నారనేది . నేను
వెంటనే ఆనందంతో ఆయన చెయ్యి పుచ్చుకున్నాను. మెల్లమెల్లగా నడుచుకుంటూ చేరువలో ఉన్న
ఆచార్య జోగారావుగారి ఇంటికి బయలుదేరాం. వారితో నడుస్తున్నంత సేపు తెలుగు భాషాశాస్త్రానికి
వారు చేసిన , చేస్తున్న సేవలకు సంబంధించిన ఎన్నో ఎన్నెన్నో విషయాలు తెలియజేశారు . కొంతసేపటికి వారి ఇంటికి
చేరాం. కాని ఆ సమయంలో ఆచార్య జోగారావుగారు పై అంతస్తులో ఉన్నారు. అది అక్కడున్న
ఇనుప నిచ్చెన సహాయంతో ఎక్కాలి .
ఆ విషయం వీరికి చెప్పేను. నన్ను అక్కడికే
తీసుకెళ్ళు అన్నారాయన. ఇద్దరు పైకి చేరాం . తీరా అక్కడకు వెళ్ళాక జోగారావుగారు
నాతో “ ఏమయ్యా ! ఎంతపని చేశావ్! ఆయనెవరో నీకు తెలుసా! అన్నారు. ఇప్పుడే
తెలిసిందండి వారు మీ గురువుగారని అన్నాను . నాకు చెపితే నేనే క్రిందకు వచ్చేవాణ్ణిగా,
ఎంతపొరబాటు జరిగింది అన్నారు . ఆయనే స్వయంగా తనను మీ దగ్గరకు
తీసికెళ్ళమన్నారండీ అన్నాను. ఆ తరువాత వారటు నేనిటు కదిలాం . ఈ విధంగా వారితో గడిపింది ఐదు నిముషాలే అయినా వారి
కలయిక జీవితానికి సరిపోయే ఆనందాన్నిచ్చింది. అది మీతో పంచుకోవాలనేదే ఈ చిన్న
ప్రయత్నం .
No comments:
Post a Comment