Thursday, March 9, 2017

సంభాషణ సంస్కృతం -2

               సంభాషణ సంస్కృతం -2
SPOKEN SANSKRIT   
           Dr. Chilakamarthi. Durga Prasada Rao   
          dr.cdprao@gmail.com

+91 9897959425
  ముఖ్య గమనిక :-- ఈ పాఠాలు కుటుంబసభ్యులందరూ కలిసి చదివితే సులభంగా నేర్చుకోవచ్చు .
      Lesson-2 / Unit-1
अस्ति అస్తి x नास्ति నాస్తి
  अस्ति(ఉన్నది) is/yes x नास्ति  (na+asti = naasti లేదు ) no /is not

  पुस्तकम् अस्ति (పుస్తకం అస్తి)  x  लेखनी नास्ति (లేఖనీ నాస్తి) 
     
         दीप: अस्ति =  (  దీప: అస్తి ) x      तैलं  नास्ति(తైలం నాస్తి )    
      घट: अस्ति (ఘట: అస్తి  )  x     जलं  नास्ति (జలం నాస్తి )       
       कोश: अस्ति ( కోశ: అస్తి  )  x      धनं नास्ति (ధనం నాస్తి )   
Construct at least 10 sentences by using these two words asti /naasti
Note:-  మీ ఇంటిలో ఏ ఏ వస్తువులు ఉన్నాయో ఏ ఏ వస్తువులు లేవో ఉన్నవి ఉన్నట్లుగా లేనివి లేనట్లుగా ఆలోచించి కనీసం పది వాక్యాలు తయారు చెయ్యండి. వేగంగా మాట్లాడండి. 
ఇంతవరకు ఒక వస్తువు ఉంటే ఉందని , లేకపోతే లేదని ఎలా చెప్పాలో కొంత నేర్చుకున్నాం . ఇప్పుడు వాటి స్థానాలు (locations)  గురించి తెలుసుకుందాం.

Lesson--2/ Unit--2
               अत्र- అత్ర ( ఇక్కడ  ) here ---      तत्र- తత్ర (అక్కడ  ) there --     
       कुत्र ?-కుత్ర (ఎక్కడ ) where ?     एकत्र- ఏకత్ర (ఒకచోట ) At one place  
        अन्यत्र-అన్యత్ర  (మరొకచోట ) elsewhere ; सर्वत्र సర్వత్ర (అంతట) every where 
Examples:
            अत्र पुस्तकम्  अस्ति (అత్ర పుస్తకం అస్తి )     
   तत्र वृक्ष: अस्ति (తత్ర వృక్ష: అస్తి)
देवालय: कुत्र अस्ति ?(దేవాలయ: కుత్ర అస్తి?)
ग्रन्थालय: एकत्र अस्ति ( గ్రంథాలయ: ఏకత్ర  అస్తి) व्यायामशाला  अन्यत्र अस्ति (వ్యాయామశాలా అన్యత్ర  అస్తి)
    पुत्र: एकत्र अस्ति (పుత్ర: ఏకత్ర అస్తి)| पुत्रिका अन्यत्र अस्ति (పుత్రికా అన్యత్ర అస్తి )   
        वायु: सर्वत्र अस्ति   (వాయు: సర్వత్ర అస్తి )  
        देव: सर्वत्र अस्ति (దేవ: సర్వత్ర అస్తి ) 

 మీరు ఇంటిలో గాని బయట గాని ఒక ప్రదేశంలో నిలబడి ఒక్కొక్క వస్తువును సూచిస్తూ       अत्र,   तत्र,      कुत्र ? एकत्र,  अन्यत्र , सर्वत्र  అనే  ఈ ఆరు పదాలు ఉపయోగించి మీ ఇంటిలో ఏ వస్తువు ఎక్కడుందో వివరిస్తూ కనిపించని వస్తువు గురించి ప్రశ్నిస్తూ ఒక్కొక్క పదానికి 10 వాక్యాలు తయారు చేసుకుని మాట్లాడండి . 
  ప్రారంభదశలో అన్ని వస్తువులకు సంస్కృతంలో మాటలు తెలియకపోవచ్చు  .  ఆంగ్లపదాలు వాడి సంస్కృతవాక్యాలు తయారు చెయ్యండి , తప్పులేదు. ఉదాహరణకు :- మమ bag కుత్ర అస్తి  ?  మొ|| 

Unit -3

वा (వా)आम् (ఆం) అవును   (న) కాదు  किम् (ఏది / ఏమి?)
वा అనేది ప్రశ్నలో గాని సందేహంలో  గాని ఉపయోగిస్తాం
 स: वैद्य: वा ? (స: వైద్య: వా)   
आम् (ఆం) ,  स: वैद्य: (స: వైద్య:)
सा नर्तकी वा ? (సా నర్తకీ వా? )  
न , सा गायनी (న, సా గాయనీ)
तत् किम् ? (తత్ కిం?)
तत् पुस्तकम् (తత్ పుస్తకం)
                      *** वा आम् किम्
ఈ  పదాలు ఉపయోగించి ఒక్కొక్క దానికి 10 వాక్యాలు తయారు చెయ్యండి . 
Unit -4
अहम् (అహం ) भवान्- భవాన్ भवती (భవతీ )
अहम् (అహం ) నేను 
                                      अहं दुर्गाप्रसाद: (అహం దుర్గాప్రసాద:)
अहं अध्यापक: (అహం అధ్యాపక:)
भवान्- భవాన్ (మీరు)  
भवान् क: ? భవాన్ క:? (మీరెవరు ?) (పురుషుని ప్రశ్నిస్తే)
अहं गायक: అహం గాయక: 
भवती (భవతీ ) మీరు
भवती का ? (భవతీ కా ?) (స్త్రీని ప్రశ్నిస్తే)
अहं अध्यापिका (అహం అధ్యాపికా)   


చదవండి-                       కంఠస్థం చెయ్యండి -                            ఆచరించండి

                      దానం భొగో నాశ: తిస్రో గతయో భవంతి విత్తస్య
యో న దదాతి న భు౦క్తే తస్య గతి: తృతీయా భవతి
( భర్తృహరి-నీతిశతకం  )
మానవుడు సంపాదించిన ధనానికి దానం , భోగం , నాశనం అనే మూడే మూడు
మార్గాలు౦టాయి . మొదటిది (దానం చేసేది) ఉత్తమోత్తమధనం, రెండోది ( అనుభవించేది)  ఉత్తమధనం, మూడోది ( వ్యర్థంగా దాచిపెట్టేది ) అధమధనం . ఎవడు ఇతరులకు దానం చెయ్యడో  ,తానూ అనుభవించడో అట్టి ధనానికి మూడో గతి పడుతుంది.
                                             ßßß




No comments: