Thursday, March 9, 2017

సంభాషణ సంస్కృతం -1

            సంభాషణ సంస్కృతం -1
SPOKEN SANSKRIT
    ( Lesson-1 )
Unit - 1

           Dr. Chilakamarthi. Durga Prasada Rao   
          dr.cdprao@gmail.com


    సంస్కృతభాష ఒకప్పుడు మనదేశంలో  సామాన్య జన వ్యవహారంలో ఉండేదనడానికి ఎన్నో ఆధారాలున్నాయి . కాని అనేక సాంఘిక , ఆర్ధిక , సామాజిక కారణాలవల్ల ఆభాష  జనవ్యవహారం ను౦డి తొలగిపోయి కేవలం గ్రంథాలకే పరిమితమైపోయింది. ఒక భాష పదికాలాలపాటు జీవించాలంటే ఆభాష మనం మాట్లాడగలగాలి. కేవలం మాట్లాడితేనే  సరిపోదు, ఆ భాషలో మనం వ్రాయగలగాలి . కేవలం వ్రాసినంత మాత్రాన సరిపోదు, ఆ భాషలో సాహిత్యం రావాలి. కేవలం సాహిత్యం వచ్చినంత మాత్రాన సరిపోదు, ఆ సాహిత్యం జనసామాన్యానికి అందుబాటులో ఉండాలి. అపుడు మాత్రమే భాష నిలుస్తుంది .  కాబట్టి సంస్కృతభాషను జనవ్యవహారంలోకి తెచ్చి తద్ద్వారా జాతీయసమైక్య౦, సర్వమానవసౌభ్రాత్రం సాధించాలనే ఉద్దేశ్యంతో ఎంతో మంది కృషి చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా తెలుగు భాషామాధ్యమంలో సంస్కృతాన్ని పరిచయం చేసి ఆ భాష పట్ల ఆసక్తిని కలిగించే చిఱు ప్రయత్నమే ఇది. సంస్కృతబాష, సాహిత్యం సర్వసమగ్రమైనవి , సముద్రం కంటే లోతైనవి,  ఆకాశం కంటే ఉన్నతమైనవి.  అందువల్ల ఈ భాషను సులభంగా బోధించడానికి సంస్కృతభారతి, రాష్ట్రీయసంస్కృతసంస్థానం, యు.జి. సి వంటి సంస్థలకు సంబంధించిన ఋషితుల్యులైన కొంతమంది మహనీయులు ఒక ప్రణాళికను రూపొందించారు. వారి ప్రణాళిక ఎంత గొప్పదంటే ఒక్కొక్క పాఠం  ఆ తరువాత పాఠానికి సోపానం అవుతుంది . నేను వారి అడుగుజాడల్లో నడుస్తూ తెలుగుమాధ్యమంలో సంస్కృతాన్ని పరిచయం చేసి ఆ భాషపట్ల రుచిని కల్పించడానికి కొంత ప్రయత్నం చేస్తాను. ఈ ప్రణాళికను సమకూర్చిన ఆ మహనీయులందరకు ధన్యవాదాలు . మీరు నేను సమకూర్చిన పాఠాలు నేర్చుకుని సంస్కృతం పట్ల ఆసక్తిని పెంపొందించుకోవలసిందిగా  కోరుతున్నాను.  ఈ పాఠాలు కేవలం పరిచయాన్నే కల్గిస్తాయి . ప్రావీణ్యం మీరు తరువాత ఎన్నో పుస్తకాలు చదివి, అందరితో మాట్లాడుతూ పెంపొందించుకోవాలి.   ప్రతి పాఠం చివర ఒక సంస్కృత శ్లోకం ఉంటుంది . అది కంఠస్థo చేస్తే భాషతో పాటు సాహిత్యంతో కూడ పరిచయం కలుగుతుంది .  మీకేమైనా సందేహాలు కలిగితే పైన పేర్కొన్న  నంబరుకు ఫోన్ చేసిగాని mail ద్వారా గాని నివృత్తి చేసుకోవచ్చు . సలహాలు  కూడ ఇవ్వవచ్చు .   

ముఖ్య గమనిక :-- ఈ పాఠాలు కుటుంబసభ్యులందరూ కలిసి చదివితే సులభంగా నేర్చుకోవచ్చు . సంస్కృత భాష నేర్చుకోవాలనుకునే వారు ముఖ్యంగా 3 విషయాలను గమనించాలి.
1.     భాష మాట్లాడితేనే వస్తుంది .
2.     ప్రతి అభిప్రాయాన్ని సంస్కృతంలో వ్యక్తం చెయ్యడానికి ప్రయత్నించాలి.
తప్పులొస్తాయని భయపడకూడదు.   తప్పులు మాట్లాడినంతలో ప్రమాదమేమి లేదు . తరువాత సరిదిద్దుకోవచ్చు .
ముందుగా చదువులతల్లి ప్రార్థన చేద్దాం

                                   శరదిందువికాసమందహాసాం
స్ఫురది౦దీవరలోచనాభిరామాం
అరవిందసమానసుందరాస్యాం
అరవిందాసనసు౦దరీముపాసే
(పున్నమినాటి చంద్రుని పోలిన మందహాసము కలది, వికసించిన నల్లకలువలను బోలిన అందమైన కనులుగలది, పద్మముతో సమానమైన కా౦తితోకుడిన ముఖముగలది మరియు  పద్మమునందు కూర్చొని యున్న ఆ సరస్వతిని ఉపాసించుచున్నాను ) 
                                                                      ***
             సాధారణంగ సంభాషణ ఇద్దరు గాని అంతకంటే ఎక్కువమంది ఉన్నప్పుడే ప్రారంభమౌతు౦ది. ముందుగా వాళ్ళు ఒకరికొకరు పరిచయం చేసుకోవాలి  అదెలాఉంటుందో పరిశీలిద్దాం.
        1. मम नाम (మమ నామ)
        भवत: नाम  (భవత: నామ)
        भवत्या: नाम ( భవత్యా: నామ)
         
        2. : (:) सा (సా ) --- तत् (తత్ )
        : (:) --- का (కా ) ---किम् (కిం) ?
         
        3. एष: (ఏష: ) --- एषा (ఏషా ) ---एतत् (ఏతత్ )
  1. मम नाम (మమ నామ) = నా పేరు  
    भवत: नाम  (భవత: నామ) మీ పేరు (ఎదుటి వ్యక్తి పురుషుడైతే)
    भवत्या: नाम ( భవత్యా: నామ) = మీ పేరు (ఎదుటి వ్యక్తి  స్త్రీ ఐతే )
                       किम्  ? (కిం?)  ఏది? / ఏమిటి?
                                      *****
1    .मम नाम दुर्गाप्रसाद: మమ నామ దుర్గాప్రసాద:  My name is DurgaPrasad.        
                                              Question
      भवत: नाम किम्?  భవత: నామ కిం ?  What is your name?   (In case the other  member is  a male person)

              Answer given by the other person:

      मम नाम भरत: ( mamanaama Bharat ) నా పేరు భరత్.  My name is Bharat
 2.  मम नाम दुर्गाप्रसाद:( మమ నామ దుర్గాప్రసాద:))  My name is DurgaPrasad.
      Question
      भवत्या: नाम किम् ? భవత్యా: నామ కిం ? What is your name (in case you are asking a female person, her name?) 

     Answer given by the other person:
      मम नाम शारदा  మమ నామ శారదా  My name is Sarada  
  मम नाम (mama naama ) My name ----
      भवत: नाम ( bhavatah naama ) your name    
   भवत्या: नाम (bhavatyaah naama ) your name  

                                                  *****

అక్కడ ఇద్దరికంటే ఎక్కువమంది ఉన్నప్పుడు మరొక వ్యక్తిని లేదా వస్తువును  తనకు తెలిసిన వ్యక్తికీ పరిచయం చెయ్యవలసి వస్తే ---
2. : (:) అతడు/అది  सा (సా ) ( ఆమె/అది  )--- तत् (తత్ ) అది
    : (:) ఎవడు/ఏమిటి  --- का (కా ) ఎవతె ?/ఏమిటి  --- किम् (కిం)  ఏది ?
: क: ? स: बालक: (: బాలక:)/స: వృక్ష:
सा का ? सा बालिका  (సా బాలికా) /సా లతా (అది ఒక తీగ )
तत् किम् ?  तत् पुस्तकम् ( తత్ పుస్తకం)
ఒక వేళ వారు /అవి దగ్గరలో ఉంటే --
2.     एष: (ఏష: ) ఇతడు/వీడు /ఇది  --- एषा (ఏషా ) ఈమె/ఇది  ---एतत् (ఏతత్ ) ఇది     
  1. एष: क: ?    एष: बालक: ఏష: బాలక:   
  2.  एषा का ? एषा बालिका ఏషా  బాలికా     
  3.  एतत् किम् ?
     एतत् पुस्तकम् ఏతత్ పుస్తకం
ఒక్కొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని మీరు మీ సమీపంలో ఉన్న  వ్యక్తులను , వస్తువులను ఆధారం చేసుకుని కనీసం పదివాక్యాలు తయారు చెయ్యండి . మాట్లాడండి .

స:/ఏష:----à రామ:/ అధ్యాపక:/ విద్యాలయ:/ హస్త:/వృక్ష:
సా /ఏషా ---à సీతా/ అధ్యాపికా/ పాఠశాలా /నాసికా /లతా
తత్/ఏతత్--à పుస్తకం / ముఖం /నేత్రం /కమలం/నక్షత్ర౦  स: बालक:    --     तस्य नाम रमेश:                                   
    एष:      अध्यापक:                              
    सा   बालिका   
                                    
      एषा      अध्यापिका-   
      तत्      पुष्पम्   ---        
   एतत्      पुस्तकम् (book)  
    क:?           का?             किम्?                                        
   ఈ విధంగా మీ ఇంటిలో ఉన్న వస్తువులు పరిశీలిస్తూ ప్రశ్నిస్తూ మీరు తయారు చేయగలిగినన్ని వాక్యాలు తయారుచెయ్యండి
1.  ఏష: గోళదీప (Bulb) 2. స: దండ దీప: (tube light) 
3 . ఏషా కపాటికా (cupboard) 4. సా దూరవాణీ (phone)
5. ఏతత్ దంతఫేనకమ్ (tooth paste)6.  తత్ వస్త్రఫేనకమ్  (detergent)          
 ౧. द्वारम्=door ౨  ताल:= lock ౩.  कुञ्चिका =key --- 
౪. वातायानम् = window ౫.  शौचालय= lavatory ౬. स्नानालय:= bathroom
౭. वस्त्रक्षालकम् = washing machine  कपाटिका= cupboard ౯ -वस्तुधानी= alma rah ౧౦. आसन्द:= chair ౧౧- उत्पीठिका= table ౧౨- संगणकयन्त्रम् = computer ; ౧౩. दूरवाणी =phone ౧౪. दूरदर्शिनी= Television ౧౫- पिञ्ज:= switch-౧౬.-व्यजनम् =fan                          

               
 చదువువిలువ తెలుసుకోండి చదువుకో౦డి
3.  स्वगृहे पूज्यते मूर्ख: स्वग्रामे पूज्यते धनी
   स्वदेशे पूज्यते राजा  विद्वान् सर्वत्र पूज्यते

A foolish man is honored in his house. A wealthy man is honored in his home town. A king is honored in his kingdom. But a scholar is honored everywhere.   

స్వగృహే పూజ్యతే మూర్ఖ:  స్వగ్రామే పూజ్యతే ధనీ
స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే

మూర్ఖుడు తన ఇంటిలోనే గౌరవ౦ పొందుతాడు . గడపదాటితే ఎవరు గౌరవించరు  ధనవంతుడు తన గ్రామము నందు మాత్రమే గౌరవమును పొందును . ఎప్పుడైనా అప్పు అడిగితె ఇస్తాడని వాణ్ణి అందరు గౌరవిస్తారు, ప్రేమతో కాదు.  రాజు తన దేశ౦లో  మాత్రమే గౌరవ౦  పొందుతాడు . దేశం దాటితే సామాన్య పౌరుడే ఔతాడు. ఇక  విద్యావంతుడు అంతట అంటే ఇంటిలోనూ , గ్రామంలోను , దేశంలోనూ విదేశాల్లో కూడ  గౌరవం పొందుతాడు
*****
                                                                  

No comments: