Tuesday, May 29, 2018

అలకపానుపు


అలకపానుపు

డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాద రావు

సుశీలమ్మ సగటు మనిషి . ఆమె జీవితం పది స౦వత్సరాలు పసుపుతోనే సాగినా ఆ తరువాత  చాల సంవత్సరాలుగా ముసుగుతోనే సాగుతోంది. పది సంవత్సరాల దాంపత్య ఫలంగా అమ్మాయి,  అబ్బాయి కలిగారు .  అమ్మాయి వనజ పెద్దది అబ్బాయి వరుణ్ చిన్నవాడు . ఇక  భార్యా భర్తలలో ఏ ఒక్కరు లేకపోయినా మిగిలిన వారి జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో అందరికి తెలిసిన విషయమే .  అందులోనూ స్త్రీ జీవితం మరీ దుర్భరం . కాని భర్త గతి౦చినా  సుశీలమ్మ తన గౌరవానికి ఎటువంటి లోటు, తలవంపు రాకుండా  అక్కడ ఇక్కడ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని ఎలాగో నెట్టు కొచ్చింది. పిల్లల్ని ప్రభుత్వ పాఠాశాలల్లోనే  చేర్పి౦చి  చదివి౦చింది . పిల్లలిద్దరు  ఎంతో శ్రద్ధగా చదువుకుంటున్నారు. ఇపుడు సుశీలమ్మకు మూడు సమస్యలు . ఒకటి ఆడపిల్ల పెళ్లికెదిగింది, ఆమెను ఒక అయ్య చేతుల్లో పెట్టాలి . రెండు ఎంత ఖర్చైనా చదువుకున్నవాడికే పిల్లనివ్వాలి. ఇక పిల్లను పంపించాక కొడుకును చదివి౦చుకుంటూనే తన ముప్పు గడుపుకోవాలి ఇది మూడో సమస్య . ఇదంతా సుశీలమ్మకొక దిగులుగా తయారైంది. పెళ్ళంటే మాటలా ! ఎంతో ధనబలం, జనబలం  కావాలి . తల్లి ఇబ్బందులు   గమనించిన వనజ  కట్నం అడిగేవాణ్ణి చేసుకునే ప్రసక్తి లేదని తన నిర్ణయం ఖరాఖండిగా చెప్పేసింది . కట్నం లేకుండా చేసుకోడానికి ఎవరు ముందుకొస్తారు? కాని లోకం ఇంకా గొడ్డు పోలేదని చెప్పడానికా అన్నట్లు  చిట్టచివరికి  ఒక సంబంధం వచ్చింది. అబ్బాయికి అమ్మాయి,  అమ్మాయికి అబ్బాయి బాగా నచ్చారు . వరుడు చాల అందగాడు . ధనవంతుడు, చదువుకున్నవాడు. పెళ్లి చూపులయ్యాక   మీ అమ్మాయి నాకు నచ్చింది . నాకు   కట్నంతో పనిలేదు ఏవో  లాంఛనాలు జరిపిస్తే చాలు అని చిన్న మెలతపెట్టి  సుశీలమ్మకు మధ్యవర్తితో కబురెట్టాడు. సుశీలమ్మ ఒక ప్రక్క భయపడుతూనే వచ్చిన సంబంధం వదులుకోవడం ఇష్టం లేక సరే! అంది. కూతురికి చెప్పకుండానే  అల్లుడు పెట్టిన షరతు అంగీకరి౦చింది . కాని అబ్బాయి  ఏ౦ అడుగుతాడో! ఏం కొంప ముంచుతాడో!  అనే భయం సుశీలమ్మను ఒక ప్రక్క  పీడిస్తోనే ఉంది.  
  కాలం ఆగదుగా పెళ్లిరోజు రానే వచ్చింది . తన మంచితనం, ఇరుగుపొరుగు వారి సహాయసహకారాలతో పెళ్లి సజావుగా జరిగిపోయింది . పెళ్లి అయిన తరువాత  అలకపానుపు అనే తతంగం ఒకటుంది . వరుడు అందరి సమక్షంలో ఏదో ఒకటి  కోరుకోడం అత్తి౦టి  వారు అది  తీర్చడం రివాజు. ఒకవేళ తీర్చలేకపోతే అందరి సమక్షంలో అల్లుణ్ణి అవమాన పరచడమే అవుతుంది. వరకట్న సమస్య వేరు ఇది వేరు . కట్నం కాదనగలం కాని దీన్ని కాదనలేం .  ఎ౦దుకంటే ఇది వేడుక . తన తాహతుకి మించి ఏ౦ అడుగుతాడో తీర్చలేకపోతే అందరిలో ఎన్నెన్ని అవమానాలు ఎదుర్కోవాలో తలుచుకు౦టే సుశీలమ్మ గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి . సరే సాయంకాల వేళ నులకమంచం వేసి , దుప్పట్లు పరిచి చెరో ప్రక్క రెండు దిండ్లు అమర్చారు . వధూ వరులను కూర్చోబెట్టారు .  మ౦చం చుట్టు పెళ్లి జనం , పిల్లల కోలాహలంతో  చాల సందడిగా ఉంది .  సుశీలమ్మ భయంతో బిక్కుబిక్కు మంటూ ఒక మూల కూర్చుని ఉంది .  ఇదంతా గమనిస్తున్న వరుడు లోలోపలే ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నాడు . అడిగేవాడికి చెప్పేవాడు లోకువ అన్నట్లుగా పిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణ సంకటం అనట్లు౦ది సుశీలమ్మ పరిస్థితి . అందరి మనస్సులు ఉల్లాసభరిత౦గా  ఉంటే ఈమె మనసు ఉత్కంఠ భరితంగా ఉ౦ది.  అందరు ఆవ్యక్తి  ఏమడుగుతాడా అని ఎదురు చూస్తున్నారు . వరుడు నోరు విప్ప బోతున్నాడు . సుశీలమ్మ గుండె దడదడ లాడుతోంది . వరుడు నోరు విప్పాడు
నా కోరిక తప్పక తీరుస్తానని మా అత్తగారు ముందు గానే మాట ఇచ్చారు . ఆ ఒప్పందం మీదే ఈ పెళ్ళికి అంగీకరి౦చాను. నేను మీ అందరి సమక్షంలో ఒకటి కోరుకుంటున్నాను . మా అత్తగారు జీవితాంతం మా తోనే ఉండాలి . నాకు అన్నీ ఉన్నా అమ్మ నాన్న లేకపోవడంతో జీవితం ఇంతవరకు అసంతృప్తిగానే గడిచింది . ఆమె మా ఇంటికి వచ్చి నాకు తల్లి లేని లోటును కూడ తీరిస్తే అంతకంటే నాకు వేరే కావలసిందేదీ  లేదు .  ఆమె మాన మర్యాదలకు ఎటువంటి ఇబ్బంది రానివ్వనని మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నాను . ఇక ఆమె  తన కుమారుణ్ణి వదలి ఎలా రావాలా అని ఆలోచి౦చవలసిన పనికూడ లేదు. తల్లి ప్రేమకు మొహం వాచిన  నేను అతనికి తల్లి లేని లోటు రానిస్తానా ! అందువల్ల   అతనికి చదువు చెప్పించి ప్రయోజకుణ్ణి చేసే  బాధ్యత కూడ నాదే మీ అందరి ఎదుట ప్రమాణం చేస్తున్నాను అని ముగించాడు.
 అందరి కళ్ళు ఆశ్చర్యంతోనూ సుశీలమ్మ ,  వరుణ్, వనజల కళ్ళు ఆనంద-ఆశ్చర్యాలతోను   చెమ్మగిల్లాయి .  సుశీలమ్మ కళ్ళు మాత్రం అంతటితో ఆగలేదు కృతజ్ఞతా సూచకంగా  ఇంకా వర్షిస్తూనే ఉన్నాయి .        












Saturday, May 5, 2018

సంభాషణ సంస్కృతం-17


సంభాషణ సంస్కృతం-17

                                          పాఠం   -- 17
Dr. DurgaprasadaRao Chilakamarthi
3/106 PremNagar, Dayalbagh, Agra

Unit I. अपेक्षया అపేక్షయా (comparatively) పోల్చిచూస్తే

ఒక వస్తువును  మరొక వస్తువుతోనో  లేక ఒకవ్యక్తిని మరొక
వ్యక్తీ తోనో పోల్చవలసి వచ్చి నప్పుడు మనం అపేక్షయా అనే పదం ఉపయోగించాలి  .

 1. विन्ध्यपर्वतस्य अपेक्षया हिमालयपर्वत: उन्नत:
The Himalaya Mountain is comparatively taller than Vindhya Mountain.
వింధ్యపర్వతంతో పోలిస్తే హిమాలయపర్వతం  ఎత్తైనది .

2. रामायणस्य अपेक्षया महाभारतं बृहत्
The Mahabharata is comparatively larger than the Ramayana.
రామాయణంతో పోలిస్తే మహాభారతం పెద్దది .

3. यमुना नद्या: अपेक्षया गङ्गानदी दीर्घा
The river Ganges is comparatively longer than the river Yamuna
యమునానదితో పోలిస్తే గంగానది పొడవైనది

4. श्रव्यकाव्यस्य अपेक्षया दृश्यकाव्यं रमणीयतरम्
Drama is comparatively more aesthetic than kavya (treatise).
శ్రవ్య కావ్యంతో పోలిస్తే నాటకం చాల రసవంతమైనది

5. कार्यकरणस्य अपेक्षया कार्यकारणं कठिनम्
Getting things done by others is comparatively more difficult, than doing things on their own.
పని చేయడం కన్న పని చేయించడం చాల కష్టం
6. मम अपेक्षया मम मित्रं बुद्धिशाली
నాకంటే నా  స్నేహితుడు తెలివైన వాడు  
 .

Unit- II . तुमुन् ఇది హేతువును సూచించే ప్రత్యయం . ఇందులో తుంఅనునది మిగులును
మనం ప్రతిరోజూ ఎన్నెన్నో పనులు చేస్తూ ఉంటాము . ఏ పని ఎందుకు చేస్తున్నామో మనం చెప్పవలసి వచ్చి నప్పుడు మనం ఈ ప్రత్యయాన్ని ఉపయోగిస్తాము . .ఉదాహరణకు కొన్ని పరిశీలిద్దాం

1. पठति- पठितुम् పఠతి-పఠితుం ( to read) చదువుటకు
मीनाक्षी पुस्तकं पठितुं ग्रन्थालयं गमिष्यति ||

2.  लिखति लेखितुम् (లిఖతి లేఖితుం) ( to write) వ్రాయుటకు
महिला परीक्षां लेखितुं कलाशालां गमिष्यति

3. पिबति पातुम् పిబతి పాతుం  (to drink) త్రాగుటకు
लता क्षीरं पातुं गृहं गतवती ||
4.  खादति खादितुम्   ఖాదతి ఖాదితుం (to eat) తినుటకు
   बालिका अन्नं खादितुं गृहं गमिष्यति
   A girl is going home to eat food.
5.  मिलति मेलितुम्  మిలతి- మేలితుం (to  meet) కలుసుకొనుటకు
   अहं मम मित्रं मेलितुं कार्यालयं गच्छामि  
I am going to the office to meet my friend.
6. भवितुम्  అగుటకు ( to  become)
     : वैद्य: भवितुं वैद्यशास्त्रं पठति || 
    He is studying medicine to become a doctor.   
7. क्रीडति-क्रीडितुम्  (to play)ఆడుటకు
बालक: क्रिकेट क्रीडितुं क्रीडाङ्गणं गतवान् ||
8.  त्यजति त्यक्तुम्   త్యజతి త్యక్తుం (to leave /to  give up) విడుచుటకు
 देशभक्त: राष्ट्रहिताय स्वप्राणानपि त्यक्तुं संसिद्धो भवति ||
A patriot is ready to give up his life for the welfare of his country

5. जानाति ज्ञातुम्   జానాతి జ్ఞాతుం ( to know ) తెలుసుకొనుటకు  
बालक: शब्दस्य अर्थं ज्ञातुं निघण्टुं पठति
A boy is reading dictionary to know the meaning of a word.
6. करोति कर्तुम्   కరోతి కర్తుం  ( to do ) చేయుటకు
माता पाकं कर्तुं पाकशालां गतवती
Mother went to kitchen to cook food.
7. प्रक्षालयति प्रक्षालयितुम्   ప్రక్షాలయతి ప్రక్షాలయితుం (to clean) శుభ్రము చేయుటకు  
   पिता पादौं प्रक्षालयितुं  स्नान गृहं गत्तवान् |
Father went to bathroom to wash his feet.
8. प्रेषयति प्रेषयितुम्   (to send) పంపుటకు
सेवक: पत्रं  प्रेषयितुं पत्रालयं  गच्छति
Servant went to the post office to send a letter.
9. ददाति दातुम्   దదాతి దాతుం (to give) ఇచ్చుటకు  
पिता पुत्राय धनं दातुं गृहम् आगच्छति
Father is coming to the house to give money to his son.
10. शृणोति- श्रोतुम्  శృణోతి-శ్రోతుం     (to hear / to listen to ) వినుటకు
माता उपन्यासं श्रोतुं देवालयं गतवती ||
Mother went to temple to listen to a discourse.

11. करोति---कर्तुम् కరోతి కర్తుం (to do) చేయుటకు
ललिता  कार्यं कर्तुं गृहं गच्छति |
Lalitha is coming to the house to do work.
12. ददाति--- दातुम् దదాతి దాతుం  (to give) ఇచ్చుటకు
माता धनं दातुं भिक्षुकम् आह्वयति |
Mother invites a beggar to give money.
13. नयति---नेतुम् నయతి నేతుం  ( to take)  తీసుకొనిపోవుటకు 
बालिका पुस्तकं नेतुं ग्रन्थालयं गतवती ||
A girl went to library to take a book.
14. नृत्यति---नर्तितुम् నృత్యతి నర్తితుం (to dance) నాట్యం చేయుటకు
नर्तकी नर्तितुं देवालयं गमिष्यति ||
A dancer will go to temple to perform a dance programme.
15. गायति---गातुम् గాయతి గాతుం  (to sing)పాడుటకు
मम मित्रं देशभक्तिगीतं गातुं जनानां पुरत: तिष्ठति |
My friend is standing in front of audience to sing a patriotic song
16. पृच्छति--- प्रष्टुम् పృచ్ఛతి ప్రష్టుం   (to ask) అడుగుటకు
चात्र: प्रश्नं प्रष्टुम् अध्यापकस्य समीपं गतवान् ||
A student approached teacher to ask a question.
17. प्रेषयति --- प्रेषयितुम् ప్రేషయతి - ప్రేషయితుం   (to send) పంపుటకు
18 . मापयति--- मापयितुम् మాపయతి మాపయితుం ( to measure)
मालाकार: मालां मापयितुं मापिकां स्वीकरोति||
A garlander is taking a scale to measure the garland
 
19 . तोलयति--- तोलयितुम्  తోలయతి తోలయితుం (to weigh)
वर्तक: वस्तूनि तोलयितुं तुलाम् आनयति||  
The business man is taking balance to weigh the commodities.
20 . ज्ञापयति--- ज्ञापयितुम् జ్ఞాపయతి జ్ఞాపయితుం ( to remind)
प्रधानाध्यापक: परीक्षायां तिथिं ज्ञापयितुं छात्रान् आह्वयति
The principal is inviting students to remind/announce the date of the examinations.
21. प्रक्षालयतिप्रक्षालयितुम् ప్రక్షాలయతి ప్రక్షాలయితుం ( to clean/wash)
माता गृहं प्रक्षालयितुं जलं नयति || Mother is taking water to clean the house.
22. पूजयतिपूजयितुम् పూజయతి-పుజయితుం  (to worship)
भक्त: देवं पूजयितुं पुष्पाणि क्रीणाति ||
The devotee is purchasing flowers to worship God.

महिला शिशुन् पोषयितुम् उद्योगं करोति||
A lady is doing job to feed children.
13 . आनयति--- आनेतुम् (to bring)
माता जलम्  आनेतुं नदीतीरं  गतवती
Mother went to riverbank to bring water. 

Unit III . A. किन्तु (but) nevertheless

अहं चलनचित्रं  द्रष्टुम् इच्छामि किन्तु मम समपे धनं नास्ति ||
मम बुभुक्षा अस्ति किन्तु खादामि ||
पुस्तकम् अस्ति किन्तु पठितुं समय: नास्ति ||

B.  किल verily, 2. Likely hood  (probably, possibly) 3. Conciliatory, 4.  Assertion, certainly (indeed, verily, assuredly
5. False hood. 
या पाणिनिसूत्राणि संपूर्णतया रटनम् अकरोत् सा पञ्चवर्षीया बालिका स्यात् किल | పాణిని సూత్రములను  ల్లె వేసిన  ఆమ ఐదు సంవత్సరముల పిల్ల కదా !
य: भगवद्गीतास्पर्धायां  विश्वविजेता अभतत् स:  दशवर्षीय: बालक: किल| గీతాస్పర్ధలో విశ్వ విజేత యైన  యా వ్యక్తీ పది ౦డ్ల పిల్లవాడట కదా !

C. निश्चयेन = undoubtedly , decisively, certainly
: निश्चयेन विजयं प्राप्नोति
(He will definitely win)

D. बहुश: probably, many times, in many ways.
मम पुत्र: गृहं आगच्छति बहुश: तस्य विराम: दत्त: भवेत् || My son came to see me; probably holidays might have been given to him.

Unit IV-गृहे केषाञ्चन  वस्तूनां नामानि

द्वारम्=door ताल:= lock कुञ्चिका =key वातायनम्=window
कवाटम्=door शौचालय:= lavatory स्नानालय:= bathroom
वस्त्र क्षालकम् = washing machine सोपानानि=steps कपाटिका= cupboard वस्तुधानी= alma rah आसन्द:= chair उत्पीठिका= table
संगणकयन्त्रम् = computer
दूरवाणी =phone दूरदर्शिनी= Television पिञ्ज:= switch
व्यजनम् =fan दण्डदीप:= tube light

UnitV-वाहनानां नामानि

कार यानम् मम पिता कारयानेन कार्यालयं अगच्छत् | మా నాన్న గారు కారులో ఆఫీసుకు వెళ్ళిరి .  
स्कूटरयानम् अहं स्कूटर् यानेन कळाशालां गच्छामि |
నేను స్కూరు పై కాలేజికి వేళ్ళుచున్నాను
विमान यानम्- मुख्यमन्त्री विमान यानेन विदेशं गमिष्यति ముఖ్య మంత్రి విమాన౦లో విదేశాలకు వెళ్ళెదరు इत्यादि
subhaashitam:
घर्म धत्ते भरं कुसुमपत्र फलावालीनां
व्यथां वहति शीतभवां रुजं च
यो देहमर्पयति चान्यसुखस्य हेतो:
तस्मै वदान्य गुरवे तरवे नमोsतु || 
   A tree always bears the load of flowers, leaves and fruits , it suffers from the diseases  caused by heat and cold and  sacrifices the entire body for giving comforts to all. It  is indeed the best among donors . I salute the tree .

చెట్టు పువ్వులు , ఆకులు ,పండ్ల యొక్క భారాన్ని తనే మోస్తుంది . ఎండ బాదను తట్టుకుంటుంది. చలి ,చలివలన కలిగీ రోగాలను స్వంయంగా అనుభవిస్తు౦ ది . . తన శరీరాన్ని ఇతరులప్రయోజనానికే అంకితం చేస్తుంది . దాతలలో కెల్ల దాతయైన చెట్టుకు నమస్కారం.