Monday, August 6, 2018

SPOKEN SANSKRIT-20


                 SPOKEN SANSKRIT-20
 సంభాషణ   సంస్కృతం   20
Lesson-20

Dr.  Ch.  Durgaprasada Rao,
Reader in Sanskrit (Retd),
3/106, Premnagar, Dayalbagh, AGRA.

 Unit-1.
वारम् = A multitude, A quantity .

एकवारम् = ఒకసారి ( once or  one time)  / द्विवारम्= రెండు సార్లు ( twice or two times) /  त्रिवारम्=మూడుసార్లు (thrice or three times)  / बहुवारम्= చాల సార్లు  (number of times/many times) / वारं वारम् =  ఎన్నోసార్లు (many a time / repeatedly).

 మనం ఒక్కొక్కప్పుడు ఈ పని ఇన్ని సార్లు చేశాను . ఆ పని అన్ని సార్లు చేశాను అని చెప్పవలసి వస్తుంది అటు వంటి సందర్భాల్లో  वारम्   అనే పదాన్ని ఉపయోగించాలి
उदाहरणानि  :-

1. दिने अहम् एकवारं स्नानं करोमि |
నేను ఒక పర్యాయము స్నానం చేయుదును
I take bath once in a day

2. दिने द्विवारं भोजनं करोमि |
నేను రెండు పర్యాయములు అన్నం తిందును
I take meal twice in a day

3. दिने त्रिवारं पुस्तकं पठामि | 
నేను మూడు పర్యాయములు పుస్తకం చదువుదును 
I read book thrice in a day.


4. य:  दिने एकवारं   भोजनं खादति स: योगी भवति
ఎవడు రోజుకు ఒకసారి భోజనం చేయునో అతడు యోగి
A person, who takes food once in a day, is yogi.

5. य:  दिने द्विवारं भोजनं खादति स: भोगी भवति
ఎవడు రెండుసార్లు భోజనం చేస్తాడో వాడు భోగి   
A person, who takes food twice in a day, becomes bhogi.

6. य:  दिने त्रिवारं भोजनं खादति स: रोगी भवति
A person, who takes food thrice in a day, becomes rogi

ఎవడు ముప్పొద్దులా అన్నం తింటాడో వాడు రోగి .
( द्विरन्नं  मनुष्याणाम्  इति नियम: )

Unit-2 .   यत:;-  because/as/ since/ whence.

మనం కొన్ని కొన్ని విషయాలకు కొన్ని కొన్ని కారణాలు చెప్పవలసి వస్తుంది . అలాగే ఒక పని జరగడానికి గాని , లేదా జరుగకపోవడానికి గాని కారణాలు చెప్పవలసి వస్తుంది . అటువంటప్పుడు यत:  అనే పదం ఉపయోగించాలి . అది ఎలాగో తెలుసుకుందాం .

     उदाहरणानि  :--
1. अद्य चलनचित्रमन्दिरे महान् जनसंमर्द: यत: तत्र नूतनं चित्रम् आगतम् ||
ఈరోజు సినిమా హాలులో జనం ఎక్కువమంది ఉన్నారు ఎందుకంటే క్రొత్త  చిత్రం .
There was heavy rush at the theatre because it was a new film.

2. मोहन: अद्य देवालयं गतवान् यत: अद्य परीक्षा अस्ति तस्य ||
రోజు మోహన్ గుడికి వెళ్ళాడు ఎందుకంటే ఇవ్వాళ పరీక్ష  ఉంది 
Mohan went to temple today because there is an examination.

3. गोपाल: स्नानं विना अन्नं खादति यत: स: ज्वरेण पीडित: अभवत् ||
గోపాల్ స్నానం చెయ్యకుండానే అన్నం తింటున్నాడు ఎ౦దుకంటే అతనికి జ్వరం  వచ్చి తగ్గింది .
     Gopal is taking food without taking bath because he has just suffered and relieved from    fever.

Unit -3 . यद्यपि तथापि Although /even if / neverthless

1. यद्यपि स: धनवान् तथापि दानं न करोति ||
అతడు ధనవంతుడైనప్పటికి దానం చెయ్యడు
Even though he is wealthy, he never donates money

2. यद्यपि बुभुक्षा अस्ति तथापि न खादति
        అతనికి ఆకలీ వేసినా అన్నం తినడు
   Even though he is hungry he never eats.

౩. यद्यपि वस्त्राणि बहूनि सन्ति तथापि न धरति
ఎన్నో బట్టలున్నా ఎప్పుడు ధరించడు
Even though there are many clothes ne never puts on them

4. यद्यपि स: अधिकं धनं संपादितवान् तथापि तस्य तृप्ति: नास्ति ||
అతనికి ఎంత డబ్బు సంపాదించినా  తృప్తి లేదు
Even though he earns a lot of money he has no satisfaction or contentment

5. यद्यपि अद्य भानुवासर: तथापि कलाशालाया: विराम: नास्ति.
ఈ రోజు ఆదివారమైనా కళాశాలకు సెలవు లేదు.
Even though it is Sunday today there is no holiday for college.

Unit - 4:- केषाञ्चन प्राणिनां नामानि | Names of some animals and creatures.  

మనం కొన్ని జంతువుల, కీటకాల పేర్లు తెలుసుకుందాం .

गौ:=cow/ఆవు ; वृषभ:= ox ఎద్దు ; महिष:= buffalo దున్నపోతు; अवि:= sheep గొర్రె;  मेष: = goat మేక ; शुनक:= dog కుక్క ;  अश्व:= horse
 గుర్రం गर्दभ:= donkey గాడేద;  चिक्रोड:= squirrel ఉడుత;  कूर्म:= tortoise తాబేలు;  शश: = rabbit కుందేలు; शृगाल:= jackal నక్క /గుంటనక్క ; उष्ट्र: / क्रमेलक: = camel ఒంటే ; सर्प:= serpent పాము ; मकर: = crocodile మొసలి; मूषिक: = rat ఎలుక; सिंह:= lion సింహము; भल्लुक:= bear ఎలుగుబంటి;  वृक:=wolf తోడేలు; हरिण:=deer లేడి; नकुल:= mongoose ముంగిస;  वराह:= pig పంది; व्याघ्र:= tiger పెద్దపులి; वत्स:= calf దూడ ;  मार्जार:= cat పిల్లి ; गज:= elephant ఏనుగు;  वानर:= monkey కోతి; भेक:= frog కప్ప;  मत्स्य:= fish చేప; जलूक:= leech జలగ ; शतपदी = centipede జెర్రీ ; वृश्चिक:= scorpion తేలు; कुलीर:= crab పపిత;

Unit -5 :-  य:--स:/ या सा /यत् तत्

1.य: गानं करोति स: गायक:
ఎవరు పాటపాడునో అతడు గాయకుడు 
A person who sings is called a singer.

2.वेदिकायां य: उपन्यासं ददाति स: प्रधानाध्यापक:
వేదికపై ఎవరు ప్రసంగించుచున్నారో ఆయన ప్రిన్సిపాల్ .
A person who is addressing the audience is the principal.

3. या नृत्यं करोति सा नर्तकी
ఎవరు నాట్య ము చేయునో ఆమె నర్తకి
A person who dances is called a dancer.

4. चलनचित्रे या भरतनाट्याभिनयं कृतवती सा सुप्रसिद्धा अभिनेत्री
సినిమాలో  ఎవరు నాట్యం చేశారో ఆమె సుప్రసిద్ధ నటి
A woman, who danced in the movie, is a famous actress.

5. मम हस्ते यत्पुस्तकम् अस्ति तत् रामायणम्
నా చేతిలో ఏ పుస్తకమైతే ఉందో అది రామాయణం
The book which is in my hand, is the Ramayana.

6. ग्रन्थालये यत् बृहत् पुस्तकम् अस्ति तत् महाभारतम्
గ్రంథాలయం లో ఏదైతే పెద్ద పుస్తకమో అది మహాభారతం .
The biggest book in the library is the Mahabharata.

The importance of the study of  Grammar.

यद्यपि बहु नाsधीषे तथाsपि पठ पुत्र! व्याकरणम् |
स्वजन: श्वजनो माभुत्सकलं शकलं सकृच्छकृत् ||

My dear Boy! Even if you do not study much, study at least Grammar, so that you do not pronounce/ misspell श्वजन: (dog ) for स्वजन: (one’s own kith and kin)  शकलं  (piece)for कलं (all) and  शकृत्  (excreta ) for सकृत् (at a time).

యద్యపి బహు నాsధీషే తథాపి పఠ పుత్ర! వ్యాకరణం
స్వజన: శ్వజనో మాsభూత్ సకలం శకలం సకృత్ శకృత్ 

నాయనా నువ్వు ఎక్కువగా చదువుకోక పోయినా వ్యాకరణం మాత్రం చదువుకో . ఎ౦దుకంటే స్వజన: ( తనవాడు ) అనవలసిన చోట శ్వజన: ( కుక్క) అనవు . సకలం (సమస్తం ) అనవలసిన చోట శకలం (ముక్క )  అనవు . సకృత్ (ఒకే పర్యాయము) అనవలసిన చోట శకృత్ (మలం ) అని అనవు . 

2 comments:

Unknown said...

సంస్కృతము నేర్చుకోవడానికి చాలా సరళమైన పదాలతో రాశారు. ధన్యవాదములు
పరమేశ్వరుడు

Unknown said...

अति सुंदरम्