సంభాషణ సంస్కృతం –26
(Spoken Sanskrit)
Lesson-26
Dr. Ch.
Durgaprasada Rao,
Reader in Sanskrit (Retd),
3/106, Premnagar, Dayalbagh,
AGRA.
Unit 1. षष्ठी विभक्ति: (संबन्ध सामान्ये)
This षष्ठी विभक्ति is called
possessive case in English. It is used to express one’s relationship with
others. Relations are of many kinds. There are around 108 relations. They are
between father and son, mother and son, teacher and taught, brother and sister,
wife and husband and so on. Every relation ship is expressed in possessive
case.
షష్ఠీ విభక్తికి కారకత్వము లేదు . ఇది ఒక నామవాచకమునకు వేరొక నామవాచకముతో గల సంబంధం తెలియజేయడానికి ఉపయోగపడుతుంది .
ఈ సంబంధం ఎన్నో రకాలుగా ఉంటుంది . తండ్రి- కొడుకుల సంబంధ०, తల్లి - కొడుకుల సంబంధం , భార్యా-భర్తల సంబంధం , యాజమాన -సేవకసంబంధ౦ , గురు-శిష్య సంబంధం , స్వ-స్వామి సంబంధం అంటే నేను –నాది అనే
సంబంధం మొదలైనవి . ఇవి సుమారు
108 వరకు ఉన్నాయని పెద్దలు చెబుతారు . ఏ సంబంధమైనా ఈ షష్ఠీ విభక్తి తెలియ జేస్తుంది .
1.
पितृपुत्रसंबन्ध : (తండ్రి కొడుకుల సంబంధం)
शिवस्य पुत्र: गणेश: (శివస్య పుత్ర: గణేశ: )
Ganesha is the son of Siva.
रामस्य पिता दशरथ: ( రామస్య పితా దశరథ: )
Dasaratha is the father of Rama.
2.
मातृपुत्रसंबन्ध: తల్లి కొడుకుల సంబంధం
रामस्य माता कौसल्या( రామస్య మాతా కౌసల్యా)
Kausalya is the mother of Rama
सुमित्राया: पुत्र: लक्ष्मण: ( సుమిత్రాయా: పుత్ర:
లక్ష్మణ: )
Lakshmana is the son of Sumitra
3. भार्याभर्तृसंबन्ध: (భార్యా భర్తల
సంబంధం )
सीताया: पति: राम: ( సీతాయా: పతి: రామ: )
शिवस्य पत्नी पार्वती ( శివస్య పత్నీ పార్వతీ )
4. सोदरसोदरी संबन्ध: (సోదరసోదరీ సంబంధ: )
रामस्य सोदरी शान्ता
द्रौपद्या: सोदर: दृष्टदयुम्न:
कृष्णस्य सोदर: बलराम:
सुभद्राया: सोदर: कृष्ण:
5. गुरुशिष्यसंबन्ध : (గురుశిష్య సంబంధం
)
विश्वामित्रस्य शिष्य: राम:
अर्जुनस्य गुरु: द्रोणाचार्य:
6. देवर: ( पत्यु: सहोदर: ) husband’s brother (మరది)
సీతాయా: దేవర: లక్ష్మణ:
7. भ्रातृजाया ( सहोदरस्य पत्नी ) brother’s wife వదిన
లక్ష్మణస్య భ్రాతృజాయా సీతా
8. याता ( देवरस्य पत्नी ) co daughter-in - law తోడికోడలు
सीताया: याता उर्मिला
సీతాయా: యాతా ఊర్మిళా
9. आवुत्त: (सोदर्या : पति: ) sister’s husband బావగారు
कृष्णस्य आवुत्त: अर्जुन:
కృష్ణస్య ఆవుత్త: అర్జున:
10. भागिनेय: ( भगिन्या: अपत्यं पुमान् ) nephew మేనల్లుడు
कृष्णस्य भागिनेय: अभिमन्यु:
కృష్ణస్య భాగినేయ: అభిమన్యు:
11. भागिनेयी ( भगिन्या: अपत्यं स्त्री ) niece మేనకోడలు
12. पितृव्य: (पितु: भ्राता ) father’s brother పినతండ్రి లేదా పెదతండ్రి
लवस्य पितृव्य: लक्ष्मण:
లవస్య పితృవ్య: లక్ష్మణ:
13. मातुल: ( मातु: भ्राता ) maternal uncle మేనమామ
अभिमन्यो: मातुल: कृष्ण:
అబిమన్యో: మాతుల: కృష్ణ:
दुर्योधनस्य मातुल: शकुनि:
14. विमाता ( मातु: सपत्नी ) co – wife (సవతి)
ద్రౌ పద్యా: సపత్నీ సుభద్రా .
15. ननान्दा ( पत्यु: सोदरी ) husband’s sister
16. श्वशुर: ( पत्यु: पिता 0r पत्न्या: पिता } Father-
in law మామగారు
अर्जुनस्य श्वशुर: द्रुपद
द्रुपद:
रामस्य श्वशुर: जनक:
17. श्वश्रू: (
पत्न्या: माता or पत्यु: माता ) Mother-in-law అత్తగారు
सीताया: श्वश्रू: कौसल्या
द्रौपद्या: श्वश्रू: कुन्ती
18. पितामह:తాత ( पितु: पिता ) Father’s father తండ్రి యొక్క తండ్రి
19. पितामही నాయనమ్మ ( पितु: माता ) Father’s mother తండ్రి యొక్క తల్లీ
20 . मातामह: (मातु: पिता ) Mother’s father తాతయ్య తల్లీ యొక్క తండ్రి
21. मातामही అమ్మమ్మ (मातु: माता ) Mother’s mother తల్లి యొక్క తల్లి
22. पौत्र: మనుమడు (पुत्रस्य पुत्र: ) son’s son కొడుకు యొక్క
కొడుకు
23. पौत्री మనుమరాలు ( पुत्रस्य पुत्री ) son’s daughter కొడుకు యొక్క కూతురు
24. दौहित्र: మనుమడు ( पुत्रिकाया: पुत्र: ) daughter’s
son కూతురు యొక్క కొడుకు
25. दौहित्री మనుమరాలు ( पुत्रिकाया: पुत्री) daughter’s daughter కూతురి యొక్క
కొడుకు
26. देवर: మరది (पत्यु: सोदर: ) husband’s brother భర్తయొక్క సోదరుడు
27. भ्रातृजाया వదిన (सोदरस्य पत्नी ) Brother’s wife సోదరుని భార్య
28. जामाता అల్లుడు ( पुत्र्या: पति: ) Son-in law daughter’s husband
जनकस्य जामाता राम:
29. स्नुषा కోడలు (पुत्रस्य पत्नी )
Daughter – law Son’s wife दशरथस्य स्नुषा सीता
30. स्वस्वामिभावसंबन्ध: (నేను నాది అనే
సంబంధం)
ఈ ఇల్లు నాది.
నేను ఈ ఇ౦టి యజమానిని
इदं मम गृहम्
| अहम् एतद्गृहस्य यजमानी
अस्माकं देश: भारतदेश: || वयं भारतदेशस्य
पौरा:
Unit :- 2. अध्ययनम्
इत्यस्य कर्मण:
ఒక వాక్యంలో హేతు
శబ్దం ఉపయోగించినప్పుడు ప్రయోజనం , హేతుశబ్దం ఈ రెండు షష్ఠీ విభక్తి పొందును .
स: बालक: अन्नस्य
हेतो: ग्रामे निवसति ||
That boy is
living in a village for food.
एष : बालक: अध्ययनस्य
हेतो: काश्यां निवसति
This boy is living in Kasi for studies.
షష్ఠీ విభక్తి మరికొన్ని సందర్భాలలో కూడా వస్తుంది .
అవన్నీ ముందు ముందు తెలుసుకోవచ్చు . ఇప్పుడు షష్ఠీ విభక్తి రూపాలు ఎలా ఉంటాయో ఉదాహరణ కోసం కొన్ని చూడండి .
षष्ठी-- एकवचन -
द्वि – बहु
राम: --रामस्य – रामयो: -
रामाणाम्
हरि:-- हरे: -
हर्यो: हरीणाम्
गुरु: - गुरो: -
गुरवो: गुरुणाम्
रमा :- रमाया: -
रामयो: - रमाणाम्
गौरी:- गौर्या: - रौर्यो: - गौरीणाम्
Unit : - 3. SANSKRIT SLOKA
ఒకసారి కాళిదాసమహాకవి కాశీనగరం సందర్శించాడు.
అన్ని దేవాలయాల్లో ఉండే దేవీదేవతలకు నమస్కరిస్తూ పోతున్నాడు. ఒక ప్రదేశంలో
వ్యాసభగవానుని విగ్రహం కనిపించింది. ఎందుకో ఆయనకు నమస్కరిo చాలనిపిoచ లేదు, సరిగదా
ఆక్షేపించాలనిపిoచింది. ఆయన
బొడ్డులో వ్రేలు పెట్టి ‘చకారకుక్షి’ ‘చకారకుక్షి’ అని ఆక్షేపణ
చేశాడు . అంతే వ్రేలు ఆ విగ్రహం బొడ్డులో ఉండిపోయింది. ఎంత లాగినా బయటకు రావడం
లేదు. వ్రేలు బయటకు తీసుకోవడానికి చేసిన ప్రయత్నాలన్నీ
విఫలమయ్యాయి. ఇంక చేసేదేమీ లేక తన తప్పు క్షమించమని మనసులోనే ప్రార్థించాడు.
వ్రేలు బయటకు వచ్చేసింది. ఆ విగ్రహం లోంచి సాక్షాత్తు వ్యాసభగవానుడు ప్రత్యక్షం
అయ్యాడు. వెంటనే కాళిదాసు ఆయన పాదాలను తాకి
నమస్కరించాడు.
వ్యాసుడు సంతోషించి ‘నాయనా! ఎందుకు
నన్ను అలా ఆక్షేపి౦చావు?’ అనడిగాడు. స్వామీ! మీరు వ్రాసిన మహాభారతం
చదివాను. “ధర్మజ: చ భీమ: చ
అర్జున: చ నకుల: చ సహదేవ: చ” అని గ్రంథమంతా ‘చ’ అనే అక్షరాలే.
అవన్నీ వ్యర్థపదాలే. అన్నీ ప్రోగుచేసి మరో చోట వ్రాస్తే అదో పెద్ద గ్రంథమౌతుoది. ఏమిటి స్వామీ ఇదంతా ! మీ పొట్ట కోస్తే
అన్నీ చకారాలే అనిపిస్తోంది. అందుకే ఆక్షేపిoచానన్నాడు.
అపుడు వ్యాసుడు ‘నాయనా! నువ్వు
అనుకుoటున్నట్లు అవన్నీ
వ్యర్థపదాలు కావు, వాటికి సార్థకత
ఉంది . సరే! నా సంగతలా ఉంచు.
నేనొక అంశం నీకిస్తాను. చకారం లేకుండా అది పూర్త చెయ్యి’ అన్నాడు. సరే
అన్నాడు కాళిదాసు. వ్యాసుడు కాళిదాసుతో ‘ ద్రౌపదికి ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అని
ఐదుగురు భర్తలు కదా! వారిమధ్యగల
పరస్పరసంబంధాన్ని వివరిస్తూ, ‘చ’ అనే అక్షరం ఉపయోగిoచకుండ శ్లోకం చెప్పమని
అడిగాడు. కాళిదాసు ఏమి
తడుముకోకుండా:
द्रौपद्या: पाण्डुतनया: पति देवर
भावुका:
न देवरो
धर्मराज: सहदेवो न भावुक:
{ ద్రౌపద్యా: పాండుతనయా: పతిదేవరభావుకా:
న దేవరో ధర్మరాజ: సహదేవో న భావుక: } అనే శ్లోకం
చెప్పాడు
(ద్రౌపదికి ధర్మరాజు, భీముడు , అర్జునుడు , నకులుడు , సహదేవుడు;
భర్తలు , బావలు మరదులు
ఔతారు . ధర్మరాజు ఎప్పుడు మరిది కాడు. సహదేవుడు ఎన్నడు బావ కాడు).
ద్రౌపదికి ఐదుగురు భర్తలున్నా ఒక
సంవత్సరం అంతా ఒకరితోనే ఉంటుంది. ఇది నియమం. ఆమె ధర్మరాజుతో ఉన్నప్పుడు ఆయన
భర్త. మిగిలిన నలుగురు మరదులౌతారు. భీమునితో ఉన్నప్పుడు ధర్మరాజు బావ
ఔతాడు , అర్జున,నకుల,సహదేవులు
మరదులౌతారు. ఇక సహదేవునితో
ఉంటున్నప్పుడు పై నలుగురు బావలౌతారు. కాని ధర్మరాజు ఎన్నడూ మరది కాదు , సహదేవుడు ఎన్నడూ బావ కాడు. ఇక వ్యాసుడు
కాళిదాసు ప్రతిభకు
సంతోషించి, ఆశీర్వదించి, అదృశ్యమయ్యాడు.
No comments:
Post a Comment