Saturday, April 3, 2021

Try to find out the verb

      Try to find out the verb                              చెప్పుకో౦డి చూద్దాం

विराट नगरे रम्ये कीचकादुपकीचकम्

योsत्र क्रियापदं वक्ति दास्यामि हैमकङ्कणम् 

 ఒకసారి ఒక నగరంలో పండితసభ జరుగుతోంది . అధ్యక్షుడు  సభాసదుల్ని ఉద్దేశించి నేనొక వాక్యం చెబుతాను ఆ వాక్యంలో క్రియాపదం చెప్పండి, చెప్పిన వారికి హైమకంకణం ఇస్తానని ప్రకటన చేశాడు . అందరు వాక్యం చెప్పమని కోరారు.

విరాటనగరే రమ్యే కీచకాదుపకీచకం అన్నాడు.

అందరు విన్నారు . క్రియాపదం ఎవరికీ దొరకలేదు. రమ్యే = అందమైన , విరాట నగరే= విరాట నగరంలో , కీచకాత్= కీచకుని నుండి , ఉపకీచకం = ఉపకీచకుని వరకు అనే అర్థమే వస్తోంది . ఎంత ఆలో చించినా క్రియా పదం ఆ వాక్యంలో కనిపించడం లేదు. కాని అధ్యక్షుని మాటల్లో క్రియాపదం చెప్పిన వారికి హైమకంకణం ( హేమం అంటే బంగారం , హైమం అంటే బంగారంతో చేసిన ) కంకణం కడియం బహుమతిగా ఉంది . కాబట్టి ఆ వాక్యంలో తప్పకుండా క్రియాపదం ఉండి  తీరుతుంది  అనుకున్నాడొకాయన. బుర్రకు పదును పెట్టాడు.  కొంత సేపటికి తట్టింది . ఇలా వివరించాడు .

రమ్యే = అందమైన; నగరే నగర౦లో; కీచకాత్= కీచకం అంటే వెదురు ( bamboo) ఒక వెదురు పొదను౦డి ; ఉపకీచకం = సమీపంలోనున్న మరొక వెదురు పొదవరకు; వి: = పక్షి; ఆట = తిరిగెను .అందరు ఆనందంతో తప్పట్లు కొట్టారు. ఇక సభాధ్యక్షుడు బహుమతి ఇవ్వవలసిన సమయం ఆసన్నమై౦ది. ఆ  పండితుణ్ణి దగ్గరకు రమ్మన్నాడు . చల్లటి (మంచు) నీరు తెప్పించి నాలుగు చుక్కలు ఆ పండితునిపై చల్లేడు. ఆయన హతాశుడయ్యాడు . ఇదేంటి? అన్నాడు పండితుడు . అదే ఇదన్నాడు సభాధ్యక్షుడు. ఎలాగని ప్రశ్నించాడు పండితుడు . ఇలాగన్నాడు సభాధ్యక్షుడు. నేను హైమకంకణం ఇస్తానన్నాను. హిమం నుంచి వచ్చింది హైమం అంటే మంచు. క౦కణ౦ విషయానికొస్తే కం  అంటే నీరు. కణం అంటే బొట్టు లేక చుక్క. నేనన్నది ఒక్క చుక్కే కానీ నీపై చాల చిలకరి౦చానన్నాడు . సభాలోనున్న వారందరూ ఆయన తెలివికి ఆశ్చర్య చకితులై తప్పట్లు కొట్టారు . పండితుడికి లోపల కొంచెం బాధగానే ఉన్నా తప్పట్లు కొట్టక తప్పలేదు.   

               विराट नगरे रम्ये कीचकादुपकीचकम्

रम्ये= In  a beautiful  नगरे town  कीचकात् from a bamboo उपकीचकं to another bamboo वि: bird आट flew In a beautiful town a bird flew from one bamboo to another bamboo .


No comments: