Tuesday, May 10, 2022

సభా నిర్వహణ – కొన్ని పొరబాట్లు

 

సభా నిర్వహణ – కొన్ని పొరబాట్లు

                                      Dr. Chilakamarthi DurgaprasadaRao

సభానిర్వహణ ఎంత సులభమో అంత కష్టం ఎంత కష్టమో అంత సులభం. సభల్లో రాగద్వేషాలకు చోటివ్వకుండా తన పాత్ర పోషిస్తే అంతకంటే సులభం మరొక్కటి లేదు. అలా కాకుండా తన గొప్పదనాన్ని ఎదుటి వాడి లోపాన్ని ప్రదర్శిద్దామని ప్రయత్నిస్తే అంత కంటే క్లిష్టమైoది  మరోటి లేదు.

1.                 సభ అనుకున్న సమయానికి ప్రారంభం కావాలి , అనుకున్న సమయానికి ఇంచు మించుగా ముగిసి పోవాలి. అంతే గాని గంటలు రోజులు తినెయ్య కూడదు. ఒకాయన అనుకున్న దానికంటే కొంత ఎక్కువ మాట్లాడాడు. నన్ను మీరందరు క్షమించాలి. నా దగ్గ ర వాచ్ లేకపోవడం వల్ల గమనించలేక పోయాను క్షమించండి అన్నాడు. సభలో కూర్చున్న ఒకాయన అయ్యా! మీ దగర వాచ్ లేక పోవచ్చు కాని   ఎదురుగా క్యాలెండర్ కనిపిస్తోంది కదండీ అది గమనించ లేదా మీరు అన్నాడు. అంటే dateకూడామారిపోయింది. ఇక  సభలో ప్రసంగించే వ్యక్తులు సమయం పాటించకపోతే అధ్యక్షుడు control చేస్తాడు. ఇక అధ్యక్షుడే సమయ పాలన చెయ్యక పొతే అది సభ కాదు మయసభ ఔతుంది. స్టేజ్ పై నున్న వాళ్ళు సభలో ఉన్న వాళ్ళ మనో భావాలు కష్ట సుఖాలు గమనిస్తూ ఉండాలి. మనకు సమయం ఎంత విలివై౦దో ఎదుటివారి సమయంకూడా అంత విలువైoదనే ఇంగితజ్ఞానం ఉండాలి. లేకపోతె రసాభాసే.    

 సభలో గంట మాట్లాదదలచిన వాడు 50ని || లు లోనే ముగిస్తే బాగుంటుంది . సభలో ఉన్న వారు ఇంకా కాసేపు మాట్లాడితే బాగుo డేదను కోవాలిగాని ఎప్పుడాపెస్తాడురా బాబు అనేలా ఉండ కూడదు.    

2.                 మనం ఎవరినైనా సంబోధించే టప్పుడు గాని ఎవరి గురించైనా మాట్లాడేటప్పుడు గాని సభల్లో పరిచయం చేసేటప్పుడు గాని ‘గౌరవనీయులు’ లేదా ‘గౌరవనీయులైన’ అనే పదాలు   వాడుతూ ఉంటాం . కాని ఈ పదాలు సరైనవి  కావు . ధాతువులకు ( క్రియాపద మూల రూపాలకు) తవ్యత్, తవ్య, అనీయర్ ,  అనే మూడు ప్రత్యయాలు వస్తాయి. తవ్య ప్రత్యయం వస్తే   కర్తవ్యo అని,  అనీయర్ ప్రత్యయం చేరితే   కరణీయం ; అని అలాగే   పూజ దాతువునకు పూజితవ్యులు, పూజనీయులు అని రూపాలు 3. తయారవుతాయి . ఇవి క్రియాపదమూల ధాతువులకే వస్తాయి . ఇక గౌరవ అనేది క్రియాపదమూలరూపం కాదు . అoదువల్ల గౌరవనీయులు అనే పదం సరైంది కాదు. దానికి బదులు పూజనీయులు , మాననీయులు , మన కంటే  వయసులో చిన్నవారైతే  అభినందనీయులు , పెద్దవారైతే  అభివందనీయులు అని చెప్పవచ్చు.

3.                  అలాగే మనం ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు ఫలానా వారి ఆధ్వర్యంలో అనే పదం వాడుతూ ఉంటాం . ఇదికూడా సరైంది కాదు . ఆధ్వర్యవం అనాలి . ఈ పదం అధ్వర్యు అనే శబ్దం నుంచి వస్తుంది కాబట్టి ఆధ్వర్యవం ఔతుంది .

     కాబట్టి ఇది గమనించి మాట్లాడాలి. అలాగే కొన్ని పదాలు పైకి మంచిగా కనిపిస్తాయి కాని అవి సరిగా ఉపయోగించక పొతే ప్రమాదం తెచ్చి పెడతాయి. ఉదాహరణకి :- ఒకాయన సభకు విచ్చేసిన ముఖ్యఅతిథిని పరిచయం చేస్తూ ఆయన గురించి గొప్పగా చెపుదామని “ఈయన సామాన్యులు కారు వటవృక్షం లాంటివారు”   అన్నాడు. అది విన్న ముఖ్యఅతిథికి చాల కోపం వచ్చింది . ఈయన నన్ను పోగుడుతున్నాడా లేక తిడుతున్నాడా అనుకున్నాడు. ఎందుకంటే వటవృక్షం  అనే పదం ఆ సందర్భంలో వాడ కూడదు . వటవృక్షం నీడలో ఏ చెట్టు ఎదగదు. ఆయన ఎవరినీ ఎదగనివ్వడు అనే అర్థం శ్రోతల్లో   కొంతమందికి స్ఫురిస్తుంది. కాబట్టి ఆ  పదo  ఆ సందర్భంలో  వాడకూడదు. ఆయన మహావృక్షం లాంటి వారు ఎంతో మందికి నీడనిచ్చి ఆశ్రయం కల్పిస్తారoటే చాల గొప్పగా ఉంటుంది.   

ఇక వృషభం , రాక్షసుడు అనే పదాలు కొంచెం తక్కువస్థాయి పదాసాహిత్య సభల్లో జరిగే మరొక క్షమించరాని తప్పేమిటంటే సభ చివర జాతీయగీతం ఆలపిస్తారు. ఆ సమయంలో కొంతమంది కుర్చీల్లోoచి లేవనే లేవరు.  ఫోటోగ్రాఫరు ఇటు అటు తిరుగుతూ ఫోటోలు తీస్తూ ఉంటాడు. అందరు కేమేరా వైపు తిరిగి ఫోజులిస్తూ ఉంటారు. ఆ సమయంలో కుంటివాడు కూడ ఎదో విధంగా లేచి నిలబడాలి, ఎవడు కదలకూడదనేది నియమం . కాని జరిగేది మాత్రంమరోవిధంగా కనిపిస్తోంది  .  ఇదొక విధంగా జాతీయ పతాకాన్ని అవమానించడమే అవుతుంది. అందువల్ల జాతీయ గీతాన్ని ఆలపిమ్చేతప్పుడు తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి.   

 లుగా కనిపించినా అవి సభల్లో గొప్పదనాన్నే కలిగిస్తాయి. ‘కవివృషభుడు’ అనేది గౌరవ వాచకం . అలాగే ‘పనిరాక్షసు’డు అని మనం ఎవరినైనా స్తుతిస్తే అది చాల గౌరవప్రదమే అవుతుంది.

అలాగే ఒకాయన సభలో  అధ్యక్షునిపరిచయం చేస్తూ  ఇపుడు ముఖ్య అతిథి  తొలి పలుకులు పలుకుతారు అన్నాడు అది బాగానే ఉంది కాని సభ చివరలో ఇప్పుడు అధ్యక్షులవారు ‘తుది పలుకులు’  పలుకుతారు అన్నాడు. అధ్యక్షులు ఆ ప్రకటనకు చాల బాధపడ్డారు. తుదిపలుకులంటే మరణించే సమయంలో పలికే మాటలు. అoదు వల్ల  ‘మలి పలుకులు’ అనాలి . తుది పలుకులు  అని పొరబాటుగా కూడ అనకూడదు.     ఇటువతి తప్పిదాలు మనం తొలగించుకోవాలి.

సాహిత్య సభల్లోను , సాధారణ సభల్లోను జరిగే మరొక క్షమించరాని తప్పేమిటంటే సభ చివర జాతీయగీతం ఆలపిస్తారు. ఆ సమయంలో కొంతమంది కుర్చీల్లోoచి లేవనే లేవరు.  ఫోటోగ్రాఫరు ఇటు అటు తిరుగుతూ ఫోటోలు తీస్తూ ఉంటాడు. అందరు కేమేరా వైపు తిరిగి ఫోజులిస్తూ ఉంటారు. ఆ సమయంలో కుంటివాడు కూడ ఎదో విధంగా లేచి నిలబడాలి, ఎవడు కదలకూడదనేది నియమం . కాని జరిగేది మాత్రంమరోవిధంగా కనిపిస్తోంది  .  ఇదొక విధంగా జాతీయ పతాకాన్ని అవమానించడమే అవుతుంది. అందువల్ల జాతీయ గీతాన్ని ఆలపిమ్చేతప్పుడు తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి.    

ఇక సభల్లో గొప్ప వక్తగా పేరుతెచ్చు కావాలనుకునే వాళ్ళు కొన్ని నియమాలు పాటించాలి . అవి సుమారు ఇరవై  ఉంటాయి. అవన్నీ ఒక వీడియోలో పొoదు పరచడం జరిగింది.   

https://youtu.be/FxZmN26VlI4

 

  

No comments: