ప్రశ్నోత్తర రత్నమాలికా-Part-2
రచన:- శ్రీ శంకరాచార్యులు
సంక్షిప్త వివరణ :- డాక్టర్.
చిలకమర్తి దుర్గాప్రసాదరావు.
ఇది సంభాషణాత్మకమైన చిన్న గ్రంథం .
ఇందులో కొంతమంది శిష్యుల ప్రశ్నలకు శ్రీ శంకరభగవత్పాదుల వారి
సమాధానాలు ఉన్నాయి .
ఇవి ఒక దేశానికి , కాలానికి ,
సంస్కృతికీ పరిమితమైనవి కావు. సమస్త మానవాళి అభ్యుదయానికి తోట్పడేవి. ఇవి మనం
ఆకళింపు చేసుకుని పిల్లలకు అర్థమయ్యే
విధంగా నేర్పిస్తే వారు ఉత్తమ పౌరులుగా
తయారౌతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.ఇవి మీకు సాధ్యమైనంత మందికి పంచి
సహకరించండి. ఇది నా సవినయ ప్రార్థన.
1. ప్రశ్న :- కో నరక: ? నరకం అంటే ఏమిటి? ఏది నరకంతో సమానం?
సమాధానం : పరవశతా ఇతరుల అధీనంలో ఉండడమే. “సర్వం
పరవశం దు:ఖం సర్వమాత్మవశం సుఖం” అంటుంది సనాతనధర్మం.
2. కిం సౌఖ్యం ? ఏది సౌఖ్యం ?
సమాధానం: సర్వ సంగవిరతి: యా? సర్వ సంగ పరిత్యాగమే
సుఖ హేతువు . లోకంలో ఉంటున్నా మానసికంగా
దేని తోను సంబంధం లేకుండా ఉండటమే సుఖానికి హేతువు . పచ్చి కొబ్బరి చూడండి!
అది పెంకుకి అంటిపెట్టుకుని ఉంటుంది . కాని అది కురిడీ అయ్యాక కాయలోనే ఉన్నా పెంకుకి అంటిపెట్టుకుని ఉండదు . స్వతంత్రంగానే
ఉంటుంది . అదే పరిపక్వత.
3. ప్రశ్న :- కిం సాధ్యం ? మనం సాధించవలసినది ఏది?
. మానవుడు దేన్ని కోరుకొనవలసియున్నది.
సమాధానం : భూతహితం. మానవుడు సమస్త ప్రాణుల యొక్క హితాన్ని
కోరుకోవాలి . అందరిలో తాను కూడ ఒక్కడుగా ఉంటాడు కాబట్టి తనకీ సుఖమే
లభిస్తుంది.
4. ప్రశ్న : - ప్రియం చ కిం ప్రాణినాం ?
ప్రాణులకు ప్రియమైనది ఏది?
సమాధానం :
అసవ: (ప్రాణములు) . ప్రతి జీవికి ప్రాణములు చాల ముఖ్యమైనవి. అలాగే మన
ప్రాణాలు మనకెంత ముఖ్యమో ప్రతి జీవికి వాటి ప్రాణాలు వాటికంత ముఖ్యం . అందువల్ల నిష్కారణంగా
ఒకరి ప్రాణం తీసే హక్కు మరొకరికి లేదు . మహాత్మాగాంధీ అంటారు . God alone
can take life because,
He gives life. ఒకరి ప్రాణం తీసే హక్కు భగవంతునికే
ఉంది ఎందుకంటే ఆయనే ప్రాణదాత కాబట్టి.
5. ప్రశ్న :- కో అనర్థ ఫల: ? ఏది చెడ్డ
ఫలములను ప్రసాదిస్తుం ది ?
సమాధానం : మాన: గర్వం
6. ప్రశ్న : కా సుఖదా? ఏది సుఖం
కలిగించును.
సమాధానం :- సాధుజనమైత్రీ మంచివారితో
స్నేహం
ప్రశ్నోత్తర రత్నమాలికా-7
రచన:- శ్రీ శంకరాచార్యులు
సంక్షిప్త వివరణ :- డాక్టర్. చిలకమర్తి
దుర్గాప్రసాదరావు.
ఇది సంభాషణాత్మకమైన చిన్న గ్రంథం . ఇందులో కొంతమంది శిష్యుల ప్రశ్నలకు శ్రీ శంకరభగవత్పాదుల వారి
సమాధానాలు ఉన్నాయి . ఇవి ఒక దేశానికి , కాలానికి , సంస్కృతికీ పరిమితమైనవి
కావు. సమస్త మానవాళి అభ్యుదయానికి తోట్పడేవి. ఇవి మనం ఆకళింపు చేసుకుని పిల్లలకు అర్థమయ్యే విధంగా నేర్పిస్తే
వారు ఉత్తమ పౌరులుగా తయారౌతారు అనడంలో
ఎటువంటి సందేహం లేదు.ఇవి మీకు సాధ్యమైనంత మందికి పంచి సహకరించండి. ఇది నా సవినయ
ప్రార్థన.
ప్రశ్న:- సర్వవ్యసన వినాశే కో దక్ష:?
అన్ని
కష్టాలను పోగొట్టుకొనుటలో ఎవడు సమర్థుడు ?
సమాధానం
: సర్వదా త్యాగీ నిరంతరం త్యాగ బుద్ధికలవాడు.
“న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకేనాsమృతత్త్వమానశు:” అంటుంది ఉపనిషత్తు .
7. ప్రశ్న:- కిం మరణం ? మరణం అంటే ఏమిటి ?
సమాధానం
: మూర్ఖత్వం. మానవుని మూర్ఖత్వం చాల బలమైనది.
Two things are infinite, the universe and human stupidity.
I still doubt the former అంటారు Albert Einstene మహాశయుడు . ఈ సృష్టిలో రెండు చాల విస్తృతమైనవి, (అనంతమైనవి) . ఒకటి విశ్వం, రెండు మానవుని మూర్ఖత్వం . నాకెందుకో ఇంకా
మొదటిది ఔనా! కాదా! అనే సందేహం ఉంది.
8. ప్రశ్న:- కిం చ అనర్ఘం ? ఏది చాల విలువైనది
యదవసరే దత్తం . అవసరసమయంలో ఇవ్వబడిన ధనం గాని వస్తువు గాని చాల విలువైనవి.
9. ప్రశ్న:- ఆమరణాత్ కిం శల్యం ? బ్రతికి ఉన్నంత వరకు
మనల్ని శల్యంలా ఏది బాధిస్తుంది ?
సమాధానం :- ప్రచ్చన్నం కృతం పాపం రహస్యం గా చేసిన పాపపు పని మనల్ని జీవితాంతం
బాధిస్తుంది.
10. ప్రశ్న:- కుత్ర విధేయో యత్న: ? ఏ విషయంలో మనం చాల శ్రద్ధ
ప్రదర్శించాలి / వహించాలి.
విద్యాభ్యాసే, సదౌషధే, దానే విద్య నేర్చుకొనేటప్పుడు , మందు (medicine) వేసుకొనేటప్పుడు, దానం చేసేటప్పుడు
చాల శ్రద్ధ ప్రదర్శించాలి / వహించాలి.
11. ప్రశ్న: అవధీరణా క్వ కార్యా ఖలు? ఏ
విషయంలో మనం ఆసక్తి చూపకూడదు
పరయోషితి, పరధనేషు : పరస్త్రీల యెడ , పరుల సంపదలపట్ల మనం ఆసక్తి చూపకూడదు.
<><><> .
No comments:
Post a Comment