ప్రశ్నోత్తర రత్నమాలికా-Part-3
రచన:- శ్రీ శంకరాచార్యులు
సంక్షిప్త వివరణ :- డాక్టర్.
చిలకమర్తి దుర్గాప్రసాదరావు.
ఇది సంభాషణాత్మకమైన చిన్న గ్రంథం .
ఇందులో కొంతమంది శిష్యుల ప్రశ్నలకు శ్రీ శంకరభగవత్పాదుల వారి
సమాధానాలు ఉన్నాయి .
ఇవి ఒక దేశానికి , కాలానికి ,
సంస్కృతికీ పరిమితమైనవి కావు. సమస్త మానవాళి అభ్యుదయానికి తోట్పడేవి. ఇవి మనం
ఆకళింపు చేసుకుని పిల్లలకు అర్థమయ్యే
విధంగా నేర్పిస్తే వారు ఉత్తమ పౌరులుగా
తయారౌతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.ఇవి మీకు సాధ్యమైనంత మందికి పంచి
సహకరించండి. ఇది నా సవినయ ప్రార్థన.
సమాధానం : సంసార – అసారతా, న తు ప్రమోదా:
సంసారం అసారమైనది అని ఆలో చించాలి, అంతేగాని మన ఇంద్రియాలు
, మనస్సు తాత్కాలికంగా పొందే ఆనందం మాత్రం కాదు .
1. ప్రశ్న:- కా ప్రేయసీ విధేయా ? మనం దేన్ని చాల ప్రేమతో
అభివృద్ధి చేసుకోవాలి?
కరుణా దీనేషు, సజ్జనే మైత్రీ దీనుల పట్ల కారుణ్యాన్ని, మంచి వారి
పట్ల స్నేహాన్ని అభివృద్ధి చేసుకోవాలి.
2. ప్రశ్న :- కంఠగతైరప్యసుభి: కస్య హి ఆత్మా న శక్యతే జేతుం. ప్రాణం పోయేవరకు ప్రయత్నించినా మనం ఎవరిని మార్చలేము .
3. మూర్ఖస్య , శంకితస్య, విషాదిన:, వా కృతఘ్నస్య
.
సమాధానం : మూర్ఖుని , అనుమానస్వభావం గలవానిని(నిత్యశంకితుని
) , ఎల్లప్పుడూ చెడ్డ ఆలోచనలు చేసేవానిని, చేసిన మేలు మరచిపోయే కృతఘ్నుని.
4. ప్రశ్న: క: సాధు: ? ఎవడు మంచివాడు .
సమాధానం : సద్వృత్త:
మంచి నడవడిక కలవాడు.
5. కం అధమం ఆచక్షతే ?
అసద్వృత్తం
మంచి నడవడిక లేనివాడు
6. కేన జితం జగదేతత్?
ప్రశ్న : కేన జితం జగదేతత్? ఈ లోకం ఎవనిచే జయింపబడుతోంది ?
సమాధానం : సత్య తితిక్షావతా పుంసా సత్యం, సహనం గలవాడే ఈ ప్రపంచాన్ని జయిస్తున్నాడు.
ప్రశ్న :- కస్మై నమాంసి దేవా: కుర్వంతి ? ఎవరికి దేవతలు సైతం నమస్కరిస్తారు?
సమాధానం :- దయాప్రదానాయ దయగల మనిషికి.
8. ప్రశ్న :- కస్మాత్ ఉద్వేగ: స్యాత్
సుధియ:? బుద్ధిమంతుడైన మనిషికి దేని వలన ఉద్వేగం కలుగుతోంది ?
సమాధానం
:- సంసారారణ్యత: బుద్ధిమంతునకు భౌతిక
మైన ఈ సంసారమనే అరణ్యం వల్ల ఉద్వేగం కలుగుతోంది .
9. ప్రశ్న :- కస్య వశే ప్రాణి గణ: ? ప్రాణికోటి
ఎవరి వశంలో ఉంటుంది ? సమస్త ప్రాణులు ఎవరికి వశమైపోతాయి ?
సమాధానం :- సత్యప్రియభాషిణో, వినీతస్య . ఈ
సమస్త ప్రపంచం సత్యం మాట్లాడేవానికి, ప్రియంగా మాట్లాడేవానికి, వినయంతో ప్రవర్తించేవానికి
దాసోహం చేస్తుంది. సత్యానికి, ప్రేమకు, వినయానికి అంత గొప్పదనం ఉంది .
10. ప్రశ్న :- క్వ స్థాతవ్యమ్ ? మనం దేనికి కట్టుబడి ఉండాలి ?
No comments:
Post a Comment