Thursday, December 17, 2015

ఉద్రిక్త నటులు

ఉద్రిక్త నటులు
(హాస్య వ్యంగ్య రచన)

శ్రీమాన్ పెద్దింటి సూర్యనారాయణ దీక్షితదాసు గారు
నరసాపురం
1.     ను తానైనది గుర్తుతో నితరపాత్రన్ బూని తాదాత్మ్య సి
         ద్ధి నటింపంగల యాతడే నటకుడుద్రిక్త స్థితిన్ విస్మృతిన్
        గొను పైత్యాధిక తత్త్వమూర్తులు పరాకొప్పన్ రసాభాసపుం
        బనిముట్లై పరువెత్తి నాట్యకళకుత్పాతంబు గల్పింపరే !  

2.    హా! నను బాసిపోతె తనయా! యని పుత్రవియోగ దు:ఖభా
       రాన దపించి మూర్ఛిలి బిరాన సుషుప్తి మునింగి లేచు య
       త్నానికి స్వస్తి జెప్పి మరునాడుదయంబున కాఫి వేళకున్
       గాని నటుండొకండు తన కన్నుల విప్పడదేమి చోద్యమో!

3.   ఱుగుదునోరి మీరలెవరెక్కడ కూర్చొనినారొ మంచిదా
      ఖరవరకట్లె కిక్కురనకన్ పడి యుండుడు, లేచినారొ మీ
      శిరములు తాటిముంజెలటు చెండెదనంచు సదస్సులెల్ల న
      బ్బురవడ నార్చె హేమకశిపుండట యా నటుడెంత దిట్టయో!

4.   గవారిర్వురు పూర్వకక్షలు గయోపాఖ్యానమందెంచుకో
      దగి, కృష్ణార్జునపాత్రధారులగుచున్ దర్పించి వాగ్వాద మొ
     ప్పుగ కోట్లాటకు దారితీయ తెగువన్ బోరాడి రక్తంబు చిం
     దగ గాయంబుల నుండి స్ట్రెచ్చరుల మీదన్ చేరిరాస్ప్రత్రికిన్

5.     నభూమిన్ విడనాడు భార్య కొరకున్వాపోవుచున్ హా సతీ!
        కనరావా దమయంతి!   యంచు నొక మార్గన్పట్టి రంగస్థలిన్
       దన సాధ్విన్ వెదుకంగ బోవు నలపాత్రన్ గ్రమ్మరంజూడలే
       దని వాక్రుత్తురు నాటి ద్రష్టలతడేమై పోయెనో యింతకున్          

6.        ప్రణయంబున్నటియి౦చు పట్ల వివశత్వంబంది తన్నాయకుం
   డెనయం గౌగిట జిక్కు నాయికకు దానే యాసలంగొల్పి మం
   తనముం జేసెనొ వారలిర్వురును బె౦డాల్ దాటి రంగూను జే
   రిన వార్తల్ వినవచ్చెనయ్యెడ బ్రదర్శి౦పంగ పై రంగమున్

7.        శ్రేయంబాత్మ దలంచి పాండవయశ: శ్రీలాభమర్థించి దౌ
   త్యాయత్తప్రభ జేరి హస్తిపురి బావా! గుత్తివంకాయ కూ
   రోయీ యంచభిమాన గేయమొకడేదో హావభావాలతో
   జేయింగల్పుచు బాడె గౌరవసభన్ శ్రీకృష్ణుడుత్సాహియై

8.       కుతుకం బొప్పగ ద్రాగుబోతొకడు రంగూన్ రౌడి పాత్రన్ ధరిం
       చి తదేకస్థిరదీక్ష మత్తుగొన విస్కీ త్రావుచున్ , బూతుల
      ద్భుత సాహిత్య నవీన సృష్టికి పసందుల్ దిద్ద సాగించె నై
       జ తిరస్కారము నోర్తురే కృతక భాషా ప్రౌఢిమన్ దాదృశుల్

9.     తాను శివాజి భూమికను దాల్చిన సంగతి విస్మరించి, న
        శ్యానికి వశ్యుడైన యొక సన్నటకుం డవురంగజీబు సం
        స్థానము జేరనేగి, యపసవ్యకరంబును నశ్యభిక్షకై
       దీనత సాచె ముక్కున పదేపదె విప్లవముప్పతిల్లగన్

10.    తడు గానమల్ల బిరుదాంకితుడామహితుండు సభ్యులు
    త్పాతముతోడ నౌర!  యన  దల్లడమంద   ద్రికాల పల్లవిన్
  జాతులు మార్చి పాడి రభసన్ యమపాత్ర నటింప హాలులో
   భూతములార్చె సొమ్మసిలి పోయిరి స్త్రీలును బిడ్డలెల్లరున్ 

11.   లదాలస్యము తాను నోర్మెదప ముక్కాల్గంట , ఆలోన క
       న్నులపై నిద్దుర దాడిసేయ కృతకాంధుండాంబికేయుండు త                   
          ద్బలమాగ్నేయ శరాన భస్మమొనరింపంజుట్ట ముట్టించె ,ధూ
మలతల్ ప్రాకగ తక్కుపాత్రల తను క్ష్మాజంబులం బెల్లుగన్

12.   తా నక్షత్రకపాత్ర దాల్చిన యుదంతంబేష్యమౌటన్ స్మృతి
       స్థానంబందు, ఋణ౦బు తీర్పగహరి శ్చంద్రున్ సతాయించుచున్
       నే నే గొర్తి శివావధాని నగుచో నిన్ గోర్టు కీడ్పింతు దా
        వా నడ్పి౦తు నటంచు నార్చె లిటిగెంట్పట్టా నటుం డొక్కడున్

13.  రిదాసుండొకడేక్టరై వెలసి పూర్వారాధ్యమౌ తత్త్వమూ
        పిరి దీయం దనలో రమా రమణ గోవిందో హరీ యంచు మి
       న్నొరయం గేకిడె సభ్యులా వికృత భావోన్మాదు వ న్స్మోరులున్
       కరతాళధ్వనులీలలున్ మొరయచీత్కారించిరొక్కుమ్మడిన్

14.     తనికిచ్చు పోర్షను రవంతయు ధారణచిక్క, దాపయిన్
         రాతికరాతిగాని బధిరంబిది యేని యభూతకల్పనన్
        జేతుమటన్న తన్నటుని జిహ్వ సజీవ సమాధి వాణికా
        పాతకి చావగొట్టె నగుబాటొనరింతువె యంచు ప్రాంప్టరున్

15.   పొరుపుల్ వుట్టుట గేస్తొకండు సతితో పోట్లాడి యింటన్సరా
       సరి  రంగ స్థలమందు దూకి యట విశ్వామిత్రు డై నిల్చి పా
       మరుడా! నా వెనువెంట రాఘవుని బంపం జాలవా? యంచు పం
       క్తిరథున్ రక్తము గార ముక్కుపయి గ్రుద్దెన్వేల్పులగ్గింపగన్

16.      ప్రతినలతో సుయోధనునిపైగల స్పర్థ నటించు పట్టునన్
           మతిజెడి వాయుజుండు పలుమార్మెలిపెట్ట పునాది లేని యా
          యతుకుడు మీసమూడిపడె యత్యధిక శ్రమ దాని నెట్టులో
          వెతికి రిపేరు జేసె యదు వీరుడుపాండవపక్షపాతియై 

17.      ఫోజున్ మోజును దన్ను నాట్యకళ కాప్తుం జేయ నేవ్వేళలన్
           సాజంబౌ నటనోన్మదిష్ణువుటపస్మారాన వెచ్చాలకై
          బాజారేగిన యాక్ట రొక్క డిక సైపంజాల , జాగేల వా
          లాజీ తైలము తోడి తెమ్మ నుచు పల్కన్ సావుకార్ మ్రాన్పడెన్


18.      పొఱి వోనట్టి జిగీష రౌద్రరసమున్ భూపాల రాగంబులో
           బిరికీల్ దిప్పి , విరోధిపై నుమియుచున్ , బీరంబులొప్ప౦
           దొడం జరువంగా నది యెక్కడో తగిలి చచ్చానోరి గచ్చాకు తెం
         డిర యంచున్నటకావతంసుడొకడట్లే కూలె రంగస్థలిన్                             

                                   

No comments: