సంభాషణ సంస్కృతం –22
(Spoken Sanskrit)
Lesson-22
Dr.
Ch. Durgaprasada Rao,
Reader in Sanskrit (Retd),
3/106, Premnagar, Dayalbagh, AGRA.
Unit -! प्रथमाविभक्ति: (Prathamaa
vibhakti)
సాధారణంగా
ప్రతి వాక్యంలోనూ కర్త , కర్మ ,క్రియ అనే మూడు అంశాలుంటాయి . మిగిలినపదాలన్ని కర్తకు
గాని , కర్మకు గాని , క్రియకు గాని విశేషణాలుగా
అన్వయిస్తూ ఉంటాయి . ఇక క్రియా పదంతో అన్వయాన్ని పొందే వాటిని కారకములు
అంటారు . ప్రథమా , ద్వితీయా , తృతీయా ,
చతుర్థీ , పంచమీ సప్తమీవిభక్తులు
క్రియతో అనేక రకాలుగా అన్వయిస్తాయి .
క్రియాన్వయత్వం కారకత్వం అనే నియమం
ప్రకారం క్రియా పదంతో అన్వయిస్తేనే అది
కారకం అవుతుంది. షష్ఠీవిభక్తి సంబంధాన్ని మాత్రమె
సూచిస్తుంది . దానికి కారకత్వం లేదు
కర్తృకారకంలో ప్రథమా, కర్మకారకంలో
ద్వితీయా , కరణ కారకంలో తృతీయ ,
సంప్రదాన కారకంలో చతుర్థీ , అపాదాన కారకంలో పంచమీ , అధికరణకారకంలో సప్తమీ
విభక్తులు వస్తాయి . ఏడూ విభక్తులు ఏడూ విధాలైన సంబంధాల్ని వ్యక్తం చేస్తాయి .
అవన్నీ క్రమంగా తెలుసుకుందాం .
ముందుగా ప్రథమా విభక్తి గురించి తెలుసుకుందాం .
Normally every sentence has
three main components Subject, Object and Verb. All the
words get connected with the verb in different ways. The relation of them with the verb can be
classified as kartru karaka , karma karaka karaNa karaka , sampradaana karaka ,
apaadaana karaka and adhikarana karaka .
Seven cases: and their corresponding karakas :
1. प्रथमा विभक्ति: --Nominative case is used
in kartru karaka
2. द्वितीया विभक्ति: Accusatives case is used
in karma karaka
3 तुतीया विभक्ति: Instrumental case is used in
Karanakaraka
4. चतुर्थीं विभक्ति: Dative case is used in sampradaana
karaka
5.
पञ्चमी विभक्ति: Ablative
case is used in Apaadaana karaka
6.
षष्ठी विभक्ति: Genitive
case is used to express any kind of Sambandha
7 सप्तमी विभक्ति: Locative case is used in Adhikaranakaraka.
There are
seven cases and they are used to express different relations with the verb.
प्रथमाविभक्ति:
1.The subject (karta) is indicated by प्रथमा (Nominative case)
प्रातिपदिकार्थ- लिङ्ग- परिमाण -वचनमात्रे प्रथमा
కేవలం
ప్రతిపదికార్థము నందు , లింగ మాత్రమునందు , పరిమాణ మాత్రమునందు , వచన మాత్రమునందు
ప్రథమా విభక్తి వచ్చును .
Prathanma
Vibhakti should be employed only in the sense of the base word, or when only
gender, or measure or number is to be conveyed in addition to pratipadika.
1.
प्रातिपदिकार्थ
–नियतोपस्थितिक:
प्रातिपदिकार्थ:
ఒక
పదం ఉచ్చరి౦చిన వెంటనే ఏ అర్థము స్ఫురణకు వచ్చునో అది ప్రాతిపదికార్థము .
2.
लिङ्ग---उच्चै:-निचै:-कृष्ण:
-श्री: --ज्ञानम्
3.
परिमाणमात्रेप्रथमा
–द्रोणो
व्रीहि: (కుంచెడు ధాన్యం )
4. वचन—मात्रे प्रथमा – वचनं संख्या –एक:-द्वौ-बहव:
II. संबोधने च-हे राम!
Prathama
should be employed when one is addressed or called.
II.
द्वितीया विभक्ति:
2 The object (karma ) is expressed by द्वितीया Accusative case etc
कर्मणि द्वितीया
ద్వితీయా
విభక్తి కర్మను సూచించును . ధాత్వర్థ ఫలాశ్రయము కర్మ . కర్త ఒక పని ద్వారా దేన్ని
పొందదలచుకున్నాడో అది కర్మ అనబడుతుంది . కర్త ఒక పనిచేస్తాడు. ఆపని ద్వారా ఎదో ఒక
ఫలాన్ని పొందాలనుకు౦టాడు. ఆ ఫలం దేన్ని ఆశ్రయించుకుని ఉంటుందో అది కర్మ అవుతుంది.
వంటవాడు అన్నం వండుచున్నాడు .
ఇక్కడ వండుట అనే పని జరిగింది . ఆ పని వంటవాణ్ణి
ఆశ్రయి౦చుకుని ఉంది. కాబట్టి ఆతను కర్త అవుతాడు. ఇక ఉడుకుట అనే పని జరిగింది దానికి ఆశ్రయం
బియ్యం . అది కర్మ . ధాతువు యొక్క అర్థం ,
దానికి సంబంధించిన వ్యాపారం (కార్యకలాపం ) ఎవర్ని ఆధారం చేసుకుని ఉంటుందో అతడు
కర్త . ధాత్వర్థఫలాశ్రయం కర్మ . అన్నం ఉడకడం అనే పని జరిగింది అది అన్నాన్ని
ఆశ్రయించుకుని ఉంది కాబట్టి అది కర్మ .
- कर्तुरीप्सिततमं कर्म
కర్తకు
ఏది చాల ఇష్టమైనదో అది కర్మ .
ఉదాహరణకు
‘పాచకుడు
అన్నం వండు చున్నాడు’
అన్నప్పుడు అన్నంతో పాటు అందులో ఉండే ధాన్యం గింజలు , వేరే గింజలు అవన్నీ
కూడా ఉడుకుతాయి . కాని పాచకునకు కావలసింది , వండాలనుకున్నది అన్నమేకాబట్టి అది
ద్వితీయా విభక్తిని పొందుతుంది .
అలాగే
రైతు గడ్డి కోస్తున్నాడు అనే వాక్యంలో గడ్డితోపాటు ఎన్నో మనకవసరం
లేని మొక్కలు కుడా తెగిపోతూ ఉంటాయి . కాని రైతు కు కావలసింది గడ్డి కాబట్టి అది
కర్మ ఔతుంది ,దానికే ద్వితీయా విభక్తి వస్తుంది
కృషీవల: సస్యం
ఛినత్తి
II. परित: योगे II. పరిత: అంటే అంతట అనిగాని
చుట్టూ అని గాని అర్థం .
పరిత: యోగే ద్వితీయా
పరిత: అనే పదం ఉన్నప్పుడు కూడద్వితీయా
విభక్తి వచ్చును
विद्यालयं परित: छात्रा: क्रीडन्ति
గుడం పరిత: పిపీలికా: సంతి .
గ్రామం పరిత: వృక్షా: సంతి.
सर्वनाम
शब्दानां द्वितीयाविभक्ति:
प्रथमा --- द्वितीया
प्रथमा ---
स:(he)- అతడు तौ(they) వారిద్దరు – ते (they) --- వారందరు ---
द्वितीया
तम्(him)- అతనిని तौ(them)-వారిద్దరిని तान् (them)
వారందరిని
प्रथमा
एष:- ఇతడు एतौ— వీరిద్దరు एते ---
వీరందరు ---
द्वितीया
एतं ఇతనిని एतौ— వీరిద్దరిని एतान् వీరందరిని
प्रथमा ---
सा
(she) ఆమె –ते (they two)- వారిద్దరు ता:(they all) ---వారందరు
द्वितीया
ताम्
(her) – ఆమెను ते(them)—వారిద్దరిని ता(them)
వారందరిని
प्रथमा
एषा
– ఈమె एते –
వీరిద్దరు एता: వీరందరు -
द्वितीया
एतां ఈమెను –एते వీరిద్దరిని –एता: వీరందరిని
प्रथमा ---
तत्
(that)-అది ते (those two)ఆ రెండు - तानि (all
those) --అవి అన్ని
द्वितीया
तत्---- దానిని ते ఆరెంటిని -----तानि ఆ అన్నిటిని
प्रथमा
एतत्
(this)
–एते (these two)
एतानि (all those)
द्वितीया
एतत्-దీనిని एते ఈ రె౦టినీ – एतानि ఈ అన్నిటిని
A sloka for recitation:
1. అంగం గలితం పలితం ముండం
దశన విహీనం
జాతం తుండం
వృద్దో
యాతి గృహీత్వా దండం
తదపి
న ముంచత్యాశాపి౦డం
(శ్రీ శంకరాచార్యుల
భజగోవింద స్తోత్రం )
అతడు ఒక ముసలివాడు శరీరం
ముడతలు పడింది , తల నెరిసి పోయింది , దంతాలు ఊడిపోయాయి , కర్ర చేత్తో పుచ్చుకుని
నడుస్తున్నాడు. ఐనప్పటికీ అతనిలో ఆశ మాత్రం చావలేదు .
2. आदाय मांसमखिलं
स्तनवर्जमङ्गान्
मां मुञ्च
वागुरिक! यामि कुरु प्रसादम्
सीदन्ति
शष्पकबलग्रहणानभिज्ञा :
मन्मार्गवीक्षणरता:
शिशवो मदीया:
Once, a cruel hunter shot an
arrow against a deer and the arrow struck in to the throat of the deer. The
hunter was approaching the deer to take away home. Mean while the deer
recollected the condition of its poor kids. Here, please find the mental agony of the poor animal which
made a pitiable request to the hunter to spare him.
Oh!
My dear hunter! You cut and take away every part of my body. But spare my
udder, because my newly born babies being unable to eat even tender grass must
be waiting anxiously for me staring at the direction of which I have come. If I
don’t feed them they will die. Please be kind enough to leave me or at least to
spare my udder.
Be kind towards all living beings.
Let not all animals be killed