రామ నామ మహిమ
Dr. DurgaPrasada Rao Chilakamarti
ఒకనాడు రావణుడు సభలో ఉండగా సేవకుడొకడు లోపలికి ప్రవేశించి మహారాజా ! ఎవరో రాముడట వానరులతో మన లంకానగరంలో
ప్రవేశించాడు . ఆయన మిమ్మల్ని యుద్ధానికి ఆహ్వానిస్తూ వర్తమానం పంపించాడు . అది
మీకు విన్నవించడానికే వచ్చాను మహారాజా! అన్నాడు . రావణుడికి చాల ఆశ్చర్యం కలిగింది
. వాళ్ళంతా సముద్రాన్ని దాటి ఎలా రాగలిగారు ? అని ప్రశ్నించాడు . నాకు తెలీదు
మహారాజా! కాని అక్కడ వాళ్ళ మాటలుబట్టి నాకు అర్థమయిందేంటంటే ఆ వానరులందరు రామ రామ
అంటు శిలలు సముద్రంలో పడవేయగానే అవి నీటిపై తేలేయట . వాళ్ళు వారధి నిర్మించుకుని
వచ్చినట్లుగా నాకర్థమై౦ది స్వామీ ! అని చెప్పి వెళ్లి పోయాడు.
అదివిన్న రావణుని సభలో
ఉన్నవారికి రాముని గొప్పదనం అర్థమై౦ది. అటువంటి గొప్పవ్యక్తిని మనం ఎదిరించి గెలువగలమా!
అది అసాధ్యం అనుకున్నారు . వాళ్ళల్లో క్రమక్రమంగా నిరుత్సాహ౦ పెల్లుబికింది . అది
గమనిస్తున్నాడు రావణుడు. వాళ్ళల్లో ఉత్సాహాన్ని రేకెత్తించాలి. లేకపోతే
నిర్వీర్యులై పోతారు అనుకున్నాడు . కాని ఎలా ?
ఆలోచించాడు . వాళ్ళతో ఓ
సభాసదులారా! రాయిని నీళ్ళపై తేల్చడ౦ పెద్ద పనే౦ కాదు . ఎవరైనా చేయ గలరు . అన్నాడు
. వెంటనే సైనికులలో ఒకరు రాజా ! ఆపని మీరు
చేయగలరా ? అన్నాడు . ఎందుకు చెయ్యలేను అన్నాడు ధీమాగా . ఐతే చేసి చూపించండి
అన్నాడు ఆవ్యక్తి . వెంటనే నీరు రాయి తెప్పించారు . రావణుడు ఎదోమంత్రం చదివి
నీళ్ళల్లో రాయి విసిరాడు . ఆశ్చర్యం అది తేలింది . రావణుని పక్షంలో ధైర్యోత్సాహాలు
వెల్లి విరిశాయి. అందరు రావణునకు నమస్కరించి వెళ్ళిపోయారు .
ప్రధానమంత్రి యైన ప్రహస్తుడొక్కడే ఉన్నాడు
. ఆయనింకా ఆశ్చర్యం లోంచి తేరుకోలేదు .
కొంతసేపటికి రావణుని చేరి మహారాజా!
నేనింకా ఆశ్చర్యం నుంచి తేరుకోలేదు
.మహారాజా! మీరు ఏం చేశారో దయజేసి నాకు
చెప్పండి అని అడుగాడు .దానికి సమాధానంగా రావణుడు ఓ మహామంత్రి ! ఇది చాల రహస్యం
ఎవరికీ చెప్పకు . నేను మాత్రం ఏ౦ చేస్తాను . ఆ రామమంత్రాన్నే నేనూ జపించాను అని
చల్లగా చెప్పాడు . రామమంత్రం అంత గొప్పది .
మరో ఉదాహరణ
वने चराम: वसु चाहराम:
नदीस्तराम: न भयं स्मराम:
इतीरयन्तोsपि वने किराता:
मुक्तिं गता: रामपदानुषङ्गात्
Some tribal robbers in a jungle, boast of their adventures in the
following manner. “We roam in forests. We rob the wealth of others. We cross the
rivers. We don’t have fear of any body”. Despite the impolite talk and unlawful
behavior, they attained salvation as they repeatedly uttered
the holy name, ‘Rama’ unknowingly.
వనే చరామ:
వాసు చాహరామ:
నదీ స్తరామ: న భయం స్మరామ:
ఇతీరయంతోSపి
వనే కిరాతా:
ముక్తిం గతా: రామపదానుషంగాత్
అడవిలో కిరాతకులైన కొంతమంది బందిపోటు
దొంగలు ఇలా అనుకుంటున్నారు. “మేము అడవిలో స్వేచ్ఛగా సంచరిస్తాం. ధనం, సంపదలు కొల్లగొడతాం. నదులన్నీ
ఈదుకుoటూ దాటేస్తాం. మేమెవరినీ లెక్కచెయ్యం, ఎవరికీ భయపడం” ఈ విధంగా వారు చెడ్డబుద్ధితో అసభ్యంగా మాట్లాడినప్పటికి
తెలిసో తెలీకో ‘రామ’’రామ’అoటూ ఆ పరమపవిత్రమైన నామాన్ని
ఉచ్చరించడం వలన వారికి ముక్తి లభిoచిందట.
No comments:
Post a Comment