Friday, May 1, 2020

డాక్టర్ కాళ్ళకూరి అన్నపూర్ణ గారి ‘అమ్మ ఒడి’


డాక్టర్ కాళ్ళకూరి అన్నపూర్ణ గారి
‘అమ్మ ఒడి’
డాక్టర్చిలకమర్తి దుర్గాప్రసాద రావు

వ్యక్తిత్వవికాసం మూడు విధాలు మొదటిది శారీరకవికాసం . రెండోది మానసికవికాసం.  మూడోది ఆధ్యాత్మిక వికాసంఈ మూడు ఉంటేనే మనిషి వ్యక్తిత్వం పరిపూర్ణమైనట్లు. అంతేగాని ఏ ఒక్కటీ పరిపూర్ణ వ్యక్తిత్వమనిపించుకోదుపరిపూర్ణవికాసానికి త్రి 'డిలకు ఎంతో విడదీయరాని సంబంధం ఉందిదీన్నే “ త్రిడి ఎఫెక్ట్ ” అంటారు. ఆ త్రి 'డిలలో మొదటి 'డి'  అమ్మ ఒడి .  రెండో " డివీధిబడిమూడో ''' డి ''' దేవుని గుడిఅమ్మ ఒడి శారీరకవికాసానికి . వీధిబడి మానసికవికాసానికిదేవునిగుడి ఆధ్యాత్మిక వికాసానికి దోహదం చేస్తున్నాయి. అమ్మ ఒడి  వీథి బడి , దేవుని గుడి ఈ మూడిటి ప్రభావం  ప్రతిమనిషి జీవితంలోను ఎంతో కొంత ఉంటుంది . కొంతమంది చదువుకోని వారు , గుడికి వెళ్ళని నాస్తికులకు చివరి రెండు ‘డీ’ల ప్రభావం లేక పోయినా అమ్మఒడి ప్రభావం మాత్రం అందరిలోనూ ఉంటుంది . అమ్మ అందరికీ ఆరాధ్య దైవం . నోరు తెరిస్తే ‘అ’, నోరు మూ సుకు౦టే ‘మ’ . అందువల్ల సమస్తభాషలకు , సర్వ సాహిత్యాలకు అమ్మే ఆధారం .   అప్పుడే పుట్టిన పాపాయికి అమ్మఒడి ఒకస్వర్గం . విగళితవేద్యాంతరమైన ఆనందాన్ని కల్గించే ఒక పూలపాన్పుతల్లి లాలన దివ్యానుభూతిని చేకూర్చే సమ్మోహన మంత్రంఇక అమ్మఒడి శారీరకవికాసం చేకూర్చడంతో బాటుగా మానసిక, ఆధ్యాత్మిక వికాసాలకు కావలసిన పునాదులు వేస్తుందిఅందుకే మన సంస్కృతి  తల్లిని తొలిగురువుగ పేర్కొందిఅందుకే మనం 'మాతృదేవో భవ'అని తల్లిని తొలి గురువుగా గౌరవిస్తున్నాంపిల్లవాడు స్కూల్లో చెప్పే విషయాలు అర్థం  చేసుకోడానికి కావలసిన ప్రాథమికజ్ఞానాన్ని తల్లి ముందుగానే సమకూరుస్తుంది. ఉపనిషత్తులు కూడ 'మాతృమాన్ పితృమాన్ ఆచార్యవాన్ పురుషో వేదఅని గురువులందరిలో తల్లికే పెద్దపీట వేశాయిశివాజీవి వేకానందుడుగాంధి మొదలైన మహాత్ములు తమ ప్రగతికి తమ తల్లులే కారణమని సగర్వంగా పేర్కొన్నారు .

డాక్టర్ కాళ్ళ కూరి అన్న పూర్ణగారు  రచించిన ‘అమ్మ ఒడి’
ఒక అద్భుతమైన రచన . నేటి సమాజానికి ఎంతో అవసరమైన ఉపదేశాత్మక రచన. ఈ కళాఖండాన్ని యథాతథంగా చదివి అందులోని కవితా సౌందర్యాన్ని ఆస్వాదిద్దాం . నేను వ్యాఖ్యానిస్తే ఆ కవిత యొక్క అందం చెదిరిపోవచ్చు . అందుకని ఆ సాహసం  నేను చెయ్యడం లేదు . మన్నించ ప్రార్థన .

చిన్న తనంలో అమ్మ ఎంతో ఆనందాన్నిచ్చేది
ఆమె ఒడిలో భోగి మంటల వెచ్చదనం ఉండేది
అమ్మఒడిలో సెలయేళ్ల చల్లదనం ఉండేది
ఆమె మాటల్లో పక్షుల కలకూజితాలు విన్పి౦చేవి
ఆమె నవ్వుల్లో ఆరబోసిన పండు వెన్నెలలు కన్పి౦చేవి
ఆమె తాకితే పిల్ల తెమ్మెరలు   సోకినట్లు౦డేది
ఆమె జోకొడితే నిశ్చింతగా నిద్ర పట్టేది
                       **
చిన్నతనంలో అమ్మ ఎంతో అందంగా ఉండేది
పైరు పచ్చ చీర కట్టుకొని కన్నుల పండువ చేసేది
సూరీడు లాంటి బొట్టుతో చూపులనాకట్టేది
కడలి నురుగు    నవ్వుతో మనసును దోచేసేది
నిండైన పయోధరాలతో ఆకలి తీర్చేది
బడిలో చెప్పని విషయాలెన్నో తన ఒడి లోనే ఉన్నాయంది
ఒడిలో చేర్చుకుని ఎన్నో ఊసులు చెపుతుండేది
తన అనురాగంతో  అందరికీ ఆనందం పంచింది
తన మనుగడతో అందరికీ అవసరాలు తీర్చింది
కాని .............................నేడు ...............
అమ్మ రూపమే మారిపోయింది
ఆమె జీవితమే వెలిసిపోయింది
మిల్లుపొగల మసితో నల్లబారినట్లు౦ది ముఖం
బీటలు వారిన నేలలా పొడలు విచ్చింది శరీరం
వానలు లేక వెలవెల పోయిన ఆకాశంలా జీవం లేదా నవ్వులో
వాద్యాల హోరులో వినిపించని పాటలా –
స్పష్టత లేదా మాటలో
అంతరంగంలో అగుపించని ఆరాటంతో
శరీరం సలసల మని మరుగు తోంది
శుష్కించిన జలాశ యాల్లా ఎండిపోయిన రొమ్ములతో
ఆకలి తీర్చలేని అసహాయస్థితి ఆమెది
అమ్మను చూస్తే భయం వేస్తోంది – బాధ కలుగుతూ ఉంది
ఎందుకిలా మారింది ? ఎందుకింత క్షోభిస్తో౦ది
కన్న బిడ్డల కసాయి తనానికి
మౌనంగా రోదిస్తోంది
చల్లగా పెంచిన తల్లిని సుఖంగా బ్రతక నివ్వాలి
కడుపు నింపిన తల్లికెప్పుడు కృతజ్ఞతలు చూపెట్టాలి
అమ్మను పూర్వంలా అందంగా ఆరోగ్యంగా ఉండేలా చేద్దాం
అమ్మ ఒడిలోని వెచ్చదనాన్ని , తీయదనాన్ని                         
తిరిగి మళ్ళీ పొందుదాం

డాక్టర్ అన్నపూర్ణ గారు మాతృత్వాన్ని నిర్వచిస్తూ...  మాతృత్వం అనేది స్త్రీకి ఒక వరమే. కాని మాతృత్వం అంటే కేవలం పిల్లల్ని కనడమే కాదు .అంతవరకే అయితే జంతువులకీ మనుష్యులకీ భేదం లేదు . ఆ సంతానాన్ని సత్సంతానంగా  తీర్చిదిద్దగలిగినప్పుడే వారు మాతృస్థానాన్ని  పొంది దానిని సార్థకం చేసుకొన్నట్లు కాగలదు  అని అంటారు .

డాక్టర్  మాదిరాజు (కాళ్ళకూరి)  అన్నపూర్ణ గారు సి .బి.ఆర్ . ఓరియంటల్ కాలేజి , ఏలూరులో  తెలుగు లెక్చరర్ గాను , అక్కినేని నాగేశ్వరరావు కళాశాలలో తెలుగు శాఖలో రీడర్  గాను పని చేసి పదవీ విరమణ చేశారు . పుస్తకపఠనం, రచన వారి అభిరుచులు .



No comments: