అనుభవాలు
-జ్ఞాపకాలు -10
Dr. Chilakamarthi Durgaprasada Rao.
నేను ANR college
లో పనిచేస్తున్నప్పుడు ఒకసారి ప్రిన్సిపాల్ Dr.
Y. వేంకటేశ్వరరావు గారు పిలిచారు. వెళ్లి కూర్చున్నాను
. ఆయన ఏదో పుస్తకం చదువుకుంటున్నారు. ఏం లేదయ్యా! రాముల వారు వాళ్ళ అమ్మ కడుపులో
ప్రవేశించినప్పుడు కొంతమంది దేవతలు ఆమె గర్భంలో ప్రవేశించారని చదివాను. అలాగే బుద్ధుడు
వాళ్ళ అమ్మ కడుపులో ప్రవేశించి నప్పుడు కూడ కొంతమంది దేవీ దేవతలు అతని తల్లి
గర్భంలో ప్రవేశించారని చదివాను. ఈయనెవడయ్యా! బాబు? గట్టిగా గాలేస్తే పడిపోయే మనిషి.
Kettle అనే పదం స్పెల్లింగ్ కూడ
తెలియని మనిషి. హిమాలయ పర్వతం కూడ తలెత్తి చూస్తే గాని కనిపించనంత ఉన్నతమైన వ్యక్తిగా ఎదిగాడు. మానవ మాత్రుడు కాడయ్యా అన్నారు. ఆ మాటలు
విన్న నాకు Future
generations
scarcely believe
that a man
of this
calibre with flesh and blood
has ever
walked on the
earth. అన్న Einstein మాటలు; Gandhi was inevitable. If humanity is to progress, Gandhi is
inescapable. … we may ignore him at our own risk. అన్న Dr. martin Luther King, jr. మాటలు; గాంధీ
మరణానంతరం ఆంగ్లేయులు మన వాళ్ళతో “మేం
ఆయను అరవై సంవత్సరాల పాటు కాపాడేం. మీరు కనీసం ఆరు నెలలు కూడ కాపాడుకోలేక పోయారు”
అని మృదువుగా చీవాట్లు పెడుతూ పలికిన మాటలు స్ఫురణకు వచ్చాయి. ఆయనను మన కన్నా విదేశీయులే
బాగా అర్థం చేసుకున్నారని అనుకున్నాను . ఎప్పటికైనా ఆయన సంచరించిన ప్రదేశంలో ఒకసారి అడుగు పెట్టే అవకాశం కలుగుతుందా అనుకునేవాణ్ణి
. చాల సార్లు ‘వార్ధా’ నగరం మీదుగా రైలులో
ప్రయాణం చేసినా దిగే అవకాశం కలగలేదు .
ఒకనాడు వార్ధాలో
ఉన్న గాంధీ institute లో అన్ని మతాలకు సంబంధించిన ఒక సమావేశం జరుగుతోందని,
ఆసక్తి కలవారు పాల్గోవచ్చని ఒక circular వచ్చింది. గాంధీ గారు తనను ఎవరికైనా ఎప్పుడయినా పరిచయం
చేసుకోవలసి వచ్చినప్పుడు I am a
Sanatanee Hindu అని మాత్రమె పరిచయం చేసుకునే
వారు. అయినా ఆయనలో సర్వధర్మసమతా భావం
ఉండేది. అందుకే వారి పేర ఇటువంటి సభలు నిర్వహించడం పరిపాటి. నేనుTheology చెపుతున్నాను కాబట్టి అది నా దాక వచ్చింది. ఇదే అవకాశం అనుకున్నాను. నేను మరికొంతమంది బయలుదేరాం
. అక్కడకు చేరుకున్నాం. మాతో పాటు కొంతమంది విదేశాలనుండి కూడ వచ్చారు.
అది
మహాత్ముని ఆశ్రమం. సమావేశాలు ప్రారంభమయ్యాయి . ఒక్కొక్క session ఒక్కొక్క మతానికి కేటాయించారు. భారతదేశంలో ఆయా మతాలపై మాట్లాడ గల వారిలో ఉత్తమ వ్యక్తులను ఒక్కొక్కరి
చొప్పున వివిధ రాష్ట్రాల నుంచి ఎంపిక చేసి
పిలిచారు . రోజుకు రెండు session
లు చొప్పున జరిగాయి. అందరు వారి మతం గురించి చెప్పేరే గాని పర మత దూషణ చెయ్య లేదు.
ఖాళీ సమయాల్లో ఆ సమీపంలోనే ఉన్న(8K.M) సేవాగ్రాం లోని గాంధీ ఆశ్రమానికి కొంతమంది మిత్రులతో కలిసి వెళ్ళడం
ఒక అలవాటుగా మారింది .
గాంధీజీ ఆ ప్రదేశానికి
వచ్చినప్పుడు అక్కడ ఉండే గ్రామస్థుల
అనుమతితో అక్కడ ఒక వారం రోజులపాటు ఉండేవారని, సేవా కార్యక్రమాలు నిర్వహించేవారని అదే సేవాగ్రామంగా మారిందని చెప్పేరు.
అక్కడ మహాత్మునకు సంబంధించినవి ఎన్నో వస్తువులున్నాయి.
మహాత్మాగాంధి తనకు సంస్కృతం రాకపోవడం వల్ల
ఆచార్య వినోభాబావే గారి వద్ద భగవద్గీత చదువుకునే వారని అక్కడి వాళ్ళు చెప్పేరు.
పండిట్ జవహర్
లాల్ నెహ్రూ గార్ని ప్రధాన మంత్రి చెయ్యడంలో గాంధీ గారి ఉద్దేశ్యం ఏమిటని నాకు
తెలిసీ తెలియని హిందీలో అడిగాను .
దానికి
సమాధానంగా ఆ సమయంలో మహాత్ముడు ఎవరికో చెప్పిన మాటలనే వారు నాకు వినిపించారు . స్వాతంత్ర్యం వచ్చాక
గాంధీగారు congress పార్టీ ని dissolve
చెయ్యమని అడిగారు. ఆయన మాట ఎవరు పట్టించుకోలేదు . ఆయన కూడ తటస్థంగానే ఉండిపోయారు .
ఎందుకంటే ఆయన లక్ష్యం నెరవేరింది . అందరు డిల్లీలో దేశ స్వాతంత్ర్యపు సంబరాలు ఘనంగా
జరుపుకుంటు ఉంటే ఆయన నౌఖాలీలో మఱుగు దొడ్లు శుభ్రం చేసే కార్యక్రమంలో
నిమగ్నమయ్యారట.
ఇక సర్దార్
వల్లభ భాయ్ పటేల్ , పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఇద్దరు
చాల గొప్పవారే సమానులే. వారిద్దరూ నాకు రెండు కళ్ళు . నాకు (అంటే దేశానికి) ఇద్దరి సేవలు కావాలి. కాని వారి ఇద్దరిలో ఒక పెద్ద
తేడా ఉంది . నెహ్రూ తనకు తక్కువ స్థానం ఇస్తే సహించ లేడు. పార్టీ వదిలి వెళ్ళి పోతాడు
. కాని పటేల్ అలాంటి వాడు కాదు. ఆయనకు position
ముఖ్యం కాదు . సేవే ముఖ్యం . ఆయన ఏ స్థానం
లో ఉన్నా దేశానికి సేవ చేస్తాడు. ఒకవేళ పటేల్ కి ఉన్నత స్థానం కట్టబెడితే నెహ్రూని
కోల్పోవలసి వస్తుంది అన్నారట. అది విన్నాక
నాకనిపించింది. ప్రతి వాడు వాడి స్థాయిని బట్టి ఇతరుల్ని అంచనా వేస్తాడు, మహాత్ముడు
మహాత్ముడే మామూలోడు మామూలోడే అని. ఈ మధ్య ఎవరి దగ్గరో ఈ విషయాన్నే ప్రస్తావిస్తే ఇవే
విషయాలు చెప్పేరు . అవన్నీ నాకు గుర్తుకొచ్చాయి.
ఇక seminar విషయాని కొస్తే వాళ్ళ వారి అందరి మాటల్ని బట్టి ఒక
విషయం నాకు తెలిసింది. ప్రతి మతానుయాయి
వాళ్ళకు అనుకూలంగా మతాన్ని మార్చుకుంటున్నారని వారందరూ ఏకగ్రీవంగా సిద్ధాంతీకరించారు.
ఎవరూ తమ యొక్క మత సిద్ధాంతాల్ని తు.చ
తప్పకుండా అనుసరించడం లేదని అందరు అవకాశ వాదులే అని అన్నారు. ఒకాయన ఇస్లాం మతం
గురించి చాల చక్కగా వ్యాఖ్యానించారు. భగవంతుడు అల్లా అన్నారు. అది కేవలం మతావిష్కరణ
సదస్సు. అక్కడ వాద, వివాదాలకు చోటు లేదు . అయినా నేను సభలోనే అడిగాను ‘రాముడు ఎవరండీ’
అని దానికాయన “ రాముడు మర్యాదాపురుషోత్తముడండీ” అన్నారు .’కృష్ణుడు ఎవరండీ’
అన్నాను .”ఆయన కర్మయోగి, యోగీశ్వరుడు అన్నారు. ఎవరి మతం వారిదే కాబట్టి వాద, వివాదాలు
జరగలేదు .
<><><>