బ్రాహ్మణుల ఇంట లక్ష్మి ఎందుకు నిలువదు?
(Why the Goddess Lakshmi does
not favor Brahmins?)
డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాదరావు
సాధారణంగా సరస్వతి ఉన్న చోట లక్ష్మి ఉండదని అ౦టూ ఉంటారు. కారణం ఏదైనా వాస్తవం
ఇదే. ఇక్కడ లక్ష్మియే తాను విద్యాధికులైన బ్రాహ్మణుల ఇంట ఉండకపోవడానికి గల కొన్ని
కారణాలు తన భర్తవిష్ణుమూర్తికి స్వయంగా వివరించి
చెప్పింది. ఆసక్తిని రేకెత్తించే
ఆకారణాలేంటో తెలుసుకుందాం.
లక్ష్మి సాగరతనయ. ఆమె పుట్టిల్లు
సముద్రం. ఆ సముద్రాన్ని అగస్త్యుడు త్రాగేయడం వల్ల ఆమెకు పుట్టింటి సౌఖ్యం కరువైంది.
ఇక భర్త దగ్గరే ఉ౦టోoది. కాని ఆమె భర్తను
ఒక మహర్షి ( Bhruguvu) కోపంతో తన్ని నిత్యం పాదసేవలు చేయించుకోవడం వలన ఆమె
అక్కడ ఉ౦డలేక పోయి౦ది. భర్తృసన్నిధికి దూరమైంది. కొంతకాలం ఎవరి౦ ట్లోనైనా గౌరవంగా
తలదాల్చుకు౦దామనుకుoటే, బ్రాహ్మణులందరు
చిన్ననాటి నుంచే వేదసరస్వతిని తమ నోళ్లల్లో బంధించడం వల్ల, సరస్వతి ఆమెకు స్వతహాగా
శత్రువు కావడ౦ వల్ల వాళ్ళ దగ్గరకూ చేరలేక పోయింది. ఇక వార౦దరు ప్రతిరోజూ తన
నిలయమైన కమలపుష్పాలను కోసి శివునకు సమర్పించడం వల్ల స్వంత ఇంటికి కూడ దూరమైంది. ఈ
విధంగా అన్నివిధాల తనకు అసౌకర్యం కల్గించిన బ్రాహ్మణుల ఇండ్ల ఎప్పుడు ఉ౦డకూడదని
నిశ్చయించుకుంది. విడిచిపెట్టేసి౦ది. మరి ఆమె మాటల్లోనే వినండి.
పీతోsగస్త్యేన తాత: చరణతలగతో వల్లభోs న్యేన రోషా
దాబాల్యాద్విప్రవర్యై: స్వవదనవివరే ధారితా వైరిణీ మే
గేహం మే ఛేదయంతి ప్రతిదివసముమాకాంతపూజానిమిత్తం
తస్మాత్ ఖిన్నా సదాsహం ద్విజకులసదనం నాథ! నిత్యం త్యజామి
(Subhashitaratnabhandagaram
Page - 64, Verse- 43)
Goddess Lakshmi, explained her firm conviction to her husband Lord Vishnu for having kept herself away from the houses of
Brahmins in the following manner:
Oh my
lord! My
father is the ocean who was drunk by sage Agastya and I had no
shelter in my father’s abode since then. My second resting place is you. Since the
sage Bhrigu kicked you and made you his slave, I was deprived of the privilege of staying with you.
As Goddess Saraswati is my enemy and she
always lives in the mouths of Brahmins in the form of Veda, I avoided staying in
their houses. My own abode is lotus
flower and all the flowers are also plucked by Brahmin priests for offering them
to Lord Siva. I even lost that facility also. I got vexed with their misdeeds,
and finally decided not to stay in their houses.
पीतोsगस्त्येन तात: चरणतलगतो वल्लभोsन्येन रोषा
दाबाल्याद्विप्रवर्यै: स्ववदनविवरे धारिता वैरिणी मे
गेहं मे छेदयन्ति प्रतिदिवसमुमाकान्तपूजानिमित्तं
तस्मात्खिन्ना सदाsहं द्विजकुलसदनं नाथ ! नित्यं त्यजामि
(Subhashitaratnabhandagaram Page - 64, Verse- 43)
No comments:
Post a Comment