సంభాషణ
సంస్కృతం -9
(SPOKEN SANSKRIT)
Dr. Durga Prasada Rao
Chilakamarthi
Lesson-9
Unit-1
किमर्थम् ?( కిమర్థం ?= ఎందుకు ?) = Why ?/ What for
Question: भवान् किमर्थं पठति? = భవాన్ కిమర్థం పఠతి? Why do you
study?
Answer: अहं ज्ञानार्थं पठामि = అహం జ్ఞానార్థం
పఠామి. I study for knowledge
Question: भवती कमर्थं स्नानं
करोति? = మీరు ఎందుకు స్నానం చేయుదురు ? Why do you take bath?
Answer: अहं आरोग्यार्थं
स्नानं करोमि= నేను ఆరోగ్యం కోసం స్నానం చేయుదును I take bath for health
Question: ते किमर्थम् उद्योगं कुर्वन्ति? వారు ఎందుకు ఉద్యోగం చేస్తున్నారు Why
do they do job?
Answer: ते
कुटुम्बपोषणार्थम् उद्योगं कुर्वन्ति= వారు కుటుంబాన్ని పోషించడంకోసం ఉద్యోగం
చేస్తున్నారు .They do job to
feed the family.
Question: स: / सा किमर्थं
क्रीडति? అతడు /ఆమె ఎందుకు ఆడుచున్నాడు /న్నది? = Why does he/she play?
Answer: स:/सा विनोदार्थं
क्रीडति = అతడు వినోదం కోసం ఆడు చున్నాడు /న్నది
He/she plays for pleasure.
Unit-2
अपि (అపి) = మరియు also
n अपि అనే పదానికి చాల
అర్థాలున్నాయి. ముఖ్యమైనవి కొన్ని పరిశీలిద్దాం .
1. ఆపి అనే పదం ముందు
ఉపయోగిస్తే అది ప్రశ్న ఔతుంది . अपि क्रियार्थं सुलभं समित्कुशम् ?
(Kalidasa) అంటాడు కాళిదాసు . ఓ పార్వతి! ఇక్కడ హోమం మొదలగు
క్రియాకలాపములకు సమిధలు దర్భలు సులభంగా దొరుకుతున్నాయా ? అని ఆ మాటలకర్థం
अपि भवान् संस्कृते वक्तुं शक्नोति? = నీవు సంస్కృతంలో
మాట్లాడగలవా? Can
you speak in Sanskrit?
2. अपि= ఐనప్పటికి (Despite)
अपि स्वर्णमयी लङ्का न मे लक्ष्मण रोचते |
जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी ||
ఓ లక్ష్మణా! ఈ లంకా రాజ్యం బంగారం వంటిదే
ఐనప్పటికీ నేనిక్కడ ఉండడానికి ఇష్ట పదను ఎందుకంటే కన్నతల్లి , ఉన్నఊరు స్వర్గం
కన్నా గొప్పవి .
3. अपि =
also / too.
स: संस्कृतं जानाति प्राकृतम् अपि जानाति = స: సంస్కృతం
జానాతి ప్రాకృతం ఆపి జానాతి . He knows Sanskrit. He knows Prakrit too / also.
मोहन: न केवलं गृहकार्यं करोति स:
उद्योगम् अपि करोति|
మోహన: న కేవలం గృహకార్యం కరోతి ఉద్యోగం
ఆపి కరోతి =
Mohan not only does the house
hold duty, but also works in the
office.
राम: वनं गतवान् सीता अपि गतवती |=రామ: వనం గతవాన్
సీతా ఆపి గతవతీ Rama went
to forest. Sita also went.
स: न केवलं पठति लिखत्यपि | = అతడు చదవడమే కాదు
వ్రాయగలడు కూడ. He not only writes but
also speaks.
ఆపి అనే పదం ఉపయోగించి అన్ని అర్థాలలోను
కొన్ని వాక్యాలు తయారు చెయ్యండి .
Unit-3
अस्तु = అస్తు = సరే,
అలాగే Yes / So
be it /let it be so
n भवान् कृपया मम गृहम् आगच्छतु=.భవాన్ కృపయా మమ
గృహం ఆ గచ్ఛతు.దయచేసి మీరు మా ఇంటికి రండి. You please come to my
house
n अस्तु , आगच्छामि= సరే తప్పకుండా
వస్తా Yes, I do
n भवती कृपया संस्कृते वदतु = భవతీ కృపయా సంస్కృతే వదతు .you
please speak in Sanskrit
n अस्तु वदामि = అస్తు వదామి Yes, I do
n भवान् कृपया असत्यं मा वदतु= భవాన్ కృపయా అసత్యం మా వదతు . Kindly do
not speak lie.
n अस्तु न वदामि = సరే / అలాగే నేను
మాట్లాడను Yes, I do not speak.
Unit-4
భూతకాలం
Past Tense
(स:/सा ) ( तौ) (ते)
अपठत् अपठताम् अपठन्
(చదివెను) (వారిద్దరు చదివిరి) (వారందరు చదివిరి)
(त्वम् ) (युवाम्) (यूयम्)
अपठ: अपठतम् अपठत
(నీవు చదివితివి) (మీరిద్దరు చదివితిరి) (మీరందరు చదివితిరి)
(अहम् ) (आवाम् ) (वयम् )
अपठम् अपठाव अपठाम
(నేను చదివితిని) (మేమిద్దరం చదివితిమి) ( మేమందరం చదివితిమి)
(स:/सा ) अपठत् (He/She read)
(तौ) अपठताम् (They two read)
(ते) अपठन् ( They all read)
(त्वम् ) अपठ: (you read)
(युवाम्) अपठतम् (You
two read)
(यूयम्) अपठत (you
all read)
(अहम् ) अपठम् ( I read)
(आवाम् ) अपठाव ( We two read)
(वयम् ) अपठाम (We all
read)
‘పఠతి’అనే వర్తమాన
క్రియాపదానికి ముందు ‘అ’చేర్చి చివరనున్న ‘తి’లోని ఇ తొలగిస్తే past tense అయిపోతుంది .
ఇక సులభంగా past tense పదాలు తయారు చెయ్యడం ఎలాగో
తెలుసు కుందాం Past Tense made easy
పుంలింగ శబ్దాలతో కూడినప్పుడు ఏకవచనంలో వాన్ అని బహువచనంలో వంత: అని స్త్రీ లింగం
ఏకవచనంలో వతీ అని బహు వచనంలో వత్య: అని చేర్చి
భూతకాలప్రయోగాలు చెయ్యొచ్చు .
Masculine-Singular (पुंलिङ्गे) Masculine Plural
पठितवान्
पठितवन्त:
Feminine Singular
(स्त्रीलिङ्गे) Feminine Plural
पठितवती पठितवत्य:
This pattern is applicable for all
persons i.e. III, II and I . See
the table.
Singular number plural
number
(स:) (बालक:) पठितवान् (M) ( ते) ( बलाका: ) पठितवन्त:
(सा) (बालिका) पठितवती (F) ( ता: ) (बालिका: )पठितवत्य:
(भवान्) पठितवान् (M) (भवन्त:) पठितवन्त:
(भवती) पठितवती (F) ( भवत्य:) पठितवत्य:
(अहम् ) पठितवान् (male) (वयम् ) पठितवन्त: (male)
(अहम्)पठितवती(Female) ( वयम् ) पठितवत्य: (Female)
ఈ క్రింది క్రియాపదాలతో వాక్యాలు తయారు
చెయ్యండి .
2. लिखति < लिखितवान् -- लिखितवन्त:--लिखितवती –लिखितवत्य:
3. क्रीडति < क्रीडितवान् – क्रीडितवन्त:--
क्रीडितवती क्रीडितवत्य:
4. पश्यति
<
दृष्टवान् –दृष्टवन्त: --. दृष्टवती -- दृष्टवत्य:
5. दर्शयति< दर्शितवान् – दर्शितवन्त:--
दर्शितवती --दर्शितवत्य:
6. वक्ति (वदति) < उक्तवान् – उक्तवन्त: - उक्तवती-उक्तवत्य:
7. गच्छति< गतवान्-गतवन्त:
- गतवती- गतवत्य:
8. पिबति< पीतवान्-
पीतवन्त:-- पीतवती- पीतवत्य:
9. खादति<
खादितवान्-खादितवन्त:-- खादितवती– खादितवत्य:
10. पृच्छति < पृष्टवान्
-पृष्टवन्त: - पृष्टवती- पृष्टवत्य:
11. नयति < नीतवान् – नीतवन्त: --
नीतवती -- नीतवत्य:
12 . आनयति < आनीतवान्-
आनीतवन्त:-- आनीतवती –आनीतवत्य:
13. पोषयति < पोषितवान् --
पोषितवन्त: -- पोषितवती –पोषितवत्य:
14. करोति < कृतवान् – कृतवन्त:--
कृतवती कृतवत्य:
15. ददाति< दत्तवान् – दत्तवन्त: --
दत्तवती -- दत्तवत्य:
16. पूजयति< पूजितवान् –पूजितवन्त:
-पूजितवती –पूजितवत्य:
n Translate the following sentences in Sanskrit.
1. He read a letter. అతడు ఉత్తరం
చదివెను
2. I wrote an examination.నేను పరీక్ష
వ్రాసితిని
3. Girls went to school.బాలికలు పాతశాలకు
వెళ్ళిరి
4.Boys played foot ball. బాలురు ఫుట్ బాలు
ఆడిరి
5.
Teacher asked a question.ఉపాధ్యాయుడు
ప్రశ్న అడిగెను
6.
You came to my house
yesterday. నువ్వు నిన్న మా ఇంటికి వచ్చితివి
7.
Mother gave money.మా అమ్మ డబ్బు
ఇచ్చెను
8.
You all did your job well. మీరు మీ పని బాగా
చేసితిరి
9.
Father worshipped God. తండ్రి పూజ చేసెను
10.
The girls brought a book బాలికలు పుస్తకం
తెచ్చిరి
11.
I drank milk.నేను పాలు
త్రాగితిని
12.
Boys ate food. They went to
school.బాలురు అన్నం తినిరి . వారు బడికి వెళ్ళిరి .
13.
Girls took their books and
went home.బాలికలు పుస్తకాలు తీసుకొనిరి ఇంటికి వెళ్ళిరి
n మనకు కొన్ని క్రియా పదములు తెలియనప్పుడు ‘కరోతి’ అనే పదాన్ని
చేర్చి చెప్పవచ్చును ఉదా:-పూజయతి అనడానికి పూజాం కరోతి ( worshipping) అనొచ్చు.
n పఠతి అనడానికి బదులు పఠనం కరోతి అనొచ్చు
n అలాగే నిద్రాం కరోతి निद्रां करोति (sleeping)
भाषणं करोति (speaking)- (पठनं करोति)= reading
( दानं करोति) = giving/offering
(पाकं करोति)=cooking
(प्रश्नं करोति) = asking
(दर्शनं करोति) =seeing /visiting
(पानं करोति)=
drinking
पुस्तकं पठति అనడానికి पुस्तकस्य पठनं करोति. అలాగే क्षीरं पिबति అనడానికి क्षीरस्य पानं करोति అనొచ్చు . ఈ
విధంగా ఎన్నైనా క్రియాపదాలు ప్రయోగిం చొచ్చు . ఈ విధంగా కరోతి అనే క్రియా పదాన్ని ఉపయోగించి వీలైనన్ని
వాక్యాలు తయారు చెయ్యండి .
Sanskrit Sloka-9
दृष्ट्वा बर्हिणनृत्तं कुक्कुटपाशोsपि बर्हिणम्मन्य: |
नृत्यत्यचारु पुच्छं वितत्य मूर्खस्य रीतिरप्येवम् ||
On seeing the beautiful dance performed by peacock, a poor and dirty cock, thinking himself to be a peacock dances in a very
ugly manner by moving its small tail hither and thither. This is the way of a stupid person.
దృష్ట్వా బర్హిణనృత్తం కుక్కుట పాశోsపి బర్హిణ౦ మన్య:
నృత్యత్యచారు పుచ్ఛం వితత్య ముర్ఖస్య రీతిర్పప్యేవం
నీచమైన కోడి అందమైన నెమలి నాట్యాన్ని చూసి తనను నెమలిగా
ఊహి౦చుకుని తోక ఊపుకు౦టూ చాల అసహ్యంగా నాట్యం చేస్తుంది . లోకంలో మూర్ఖుని రీతి
కూడ ఇలాగే ఉంటుంది . మూర్ఖుడు కూడ ఉత్తములను చూసి తనను కూడా ఉత్తమునిగా భావి౦చుకు౦టూ
అసహ్యంగా ప్రవర్తించి నవ్వుల పాలౌతాడని భావం.
***
No comments:
Post a Comment