The Yoga Sutras of Patanjali -12, 13&14
(పతంజలి యోగసూత్రములు)
Dr. Chilakamarthi
Durgaprasada Rao
యోగమంటే చిత్తవృత్తులను అరికట్టడం అని ఇంతకు ముందు చెప్పుకున్నాం . అరికట్టే విధానాన్ని ఇప్పుడు చెబుతున్నాడు .
अभ्यासवैराग्याभ्यां तन्निरोध:1.12. (అభ్యాసవైరాగ్యాభ్యాం తన్నిరోధ: )
तन्निरोध: = (చిత్తవృత్తి నిరోధ:) = చిత్త వృత్తులను నిరోధించడం
अभ्यासवैराग्याभ्यां = అభ్యాస వైరాగ్యముల చేత {సాధ్యపడును}
భగవద్గీతలో
అర్జునుడు కృష్ణునితో ఓ కృష్ణా ! మనస్సు
చాల చంచలమైనది . ప్రమాదకరమైనది , చాల దృఢమైనది , వాయువును నిరోధించడం ఎంత కష్టమో
మనస్సును నిరోధించడం కూడఅంతే కష్టం అని
నాకనిపిస్తో౦ది అంటాడు
చంచలం హి మన: కృష్ణ
ప్రమాధి బలవద్దృఢ౦
తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం VI-33
కృష్ణుడుఅర్జునుని
అభిప్రాయాన్ని కాదనలేదు పైగా అతని
అభిప్రాయాన్ని సమర్థించాడు . నాయనా! నువ్వు చెప్పింది నిజమే . మనస్సు చంచలమై౦ది,
దాన్ని అరికట్టడం చాల కష్టం . కాని అభ్యాస వైరాగ్యాలవల్ల అది సిద్ధిస్తుంది అంటాడు
.
అసంశయం మహాబాహో! మనో దుర్నిగ్రహం చలం
అభ్యాసేన తు కౌ౦తేయ వైరాగ్యేణ చ గృహ్యతే
VI-341
ఇప్పుడు అభ్యాసమంటే ఏంటో తెలుసుకుందాం
.
13. तत्र स्थितौ यत्नो sभ्यास:
तत्र= అభ్యాస
వైరాగ్యాలలో
अभ्यास: =అభ్యాసమనగా
स्थितौ= మనస్సును స్థిరంగా ఉ౦ చుటలో
यत्न: = ప్రయత్నమే
ఇక్కడ మనస్సును స్థిరంగా
ఉంచడం అంటే ఏ ఆలోచనా లేకుండా భావ శూన్యంగా ఉంచడం అని అర్థం . ఇక అది ఎలా ఉండాలో వివరంగా
చెబుతున్నాడు .
1.14. स तु दीर्घकालनैरन्तर्यसत्कारासेवितो दृढभूमि:
( స తు దీర్ఘకాలనైరంతర్య సత్కారాసేవితో దృఢభూమి: )
स तु = అది
दीर्घकालनैरन्तर्यसत्कारासेवित:
दृढभूमि: = స్థిరంగా ఉండును
చాల కాలం , నిరంతరం , తపస్సు మరియు బ్రహ్మచర్యం మొదలగు దీక్షలతో సేవి౦చబడినచో
అది దృఢమగును .
No comments:
Post a Comment