11. ‘Charucharya’ of Kshemendra
(A treatise on moral education)
Dr. Chilakamarthi Durgaprasada Rao
dr.cdprao@gmail.com
न मद्यव्यसनी क्षीब: कुर्याद्वेतालचेष्टितम् |
वृष्णयो हि ययु: क्षीबास्तृणप्रहरणा : क्षयम् ||
मद्यव्यसनी =మద్యపానవ్యసనంతో
क्षीब:= బలహీనుడై
वेतालचेष्टितम्=చెడ్డ పనులను
न कुर्यात् = చేయరాదు
वृष्णय: = వృష్ణి కులజులు
क्षीबा:= బలహీనులై
तृणप्रहरणा := గడ్డిపరక చేత కొట్టబడిన వారై
क्षयं = నాశనమును
ययु: = పొందిరి
हि = కదా
మద్యమునకు బానిసలై మత్తెక్కి చెడ్డపనులు చేయరాదు . వృష్ణి కులజులైన యాదవులు మద్యము సేవించి, మదించి తుంగ కాడలతో కొట్టుకొని మరణి౦చిరి
కదా !
సప్త వ్యసనాల్లో మద్యపానం ఒకటి . ఇది చాల ప్రమాదకరమైనది
..
ఒకసారి కొందరు మహర్షులు కృష్ణుని చూడటానికి ద్వారకకు వచ్చారు. అప్పుడు
కొంతమంది తుంటరి యువకులు సా౦బుడనే వానికి గర్భిణీ
స్త్రీ వేషం ధరింపజేసి ఋషులకు నమస్కారం పెట్టించి స్వామీ ! ఈ మెకు కొడుకు
పుడతాడా కూతురు పుడుతుందా అని అడిగారు . అసలు విషయం గ్రహించిన ఆమునులు తమను ఆటపట్టిస్తున్నందుకు
వారిపై కోపించి యాదవకులాన్ని నాశనం చేసే
రోకలి పుడుతుందని చెప్పారు . అలాగే రోకలి పుట్టింది . వసుదేవుడు జరిగిందంతా
తెలుసుకుని దాన్ని అరగదీయి౦చి సముద్రంలో కలిపి౦చాడు . అక్కడనుంచి రోకళ్ల వంటి తుంగ
కాడలు మొలిచాయి . ఒకసారి శ్రీ కృష్ణుడు యాదవులనందరినీ సముద్ర తీరానికి
తీసుకుపోయాడు. అక్కడ సాత్యకి కృతవర్మలకు మధ్య అభిప్రాయ భేదం వచ్చింది. అసలే వారు
త్రాగి ఉండడంతో దెబ్బలాటకు దిగారు . వాళ్ళ కారణంగా యాదవులు రెండు వర్గాలుగా
విడిపోయారు . తు౦గ కాడలతో కొట్టుకుని అందరు మరణించారు .
One
should not do any heinous crime by being intoxicated with wine. The descendents
of Vrishni clan were killed by
fighting themselves with tunga straws.
No comments:
Post a Comment