ఒకసారి గాంధీజీ గతంలోకి ...
డాక్టర్ . చిలకమర్తి
దుర్గాప్రసాదరావు
అవి ఆంగ్లేయులు అరాచకంగా మన దేశాన్ని పరిపాలిస్తున్న రోజులు . అప్పుడే
గాంధీజీ లండన్ లో బారిష్టర్ డిగ్రీ పుచ్చుకుని స్వదేశం తిరిగొచ్చారు . గుజరాత్ కు
సంబంధించిన కొంతమంది వర్తకులు
దక్షిణాఫ్రికాలో ఉంటున్నారు . వారి లావాదేవీలు పరిష్క రించడానికి వారు గాంధీజీని
పిలిస్తే వారి పిలుపు మేరకు గాంధీజీ అక్కడకు వెళ్ళారు . వారి ఇంటికి ప్రతి రోజు
ఎన్నో పనులపై ఎంతో మంది వ్యక్తులు రావడం, వారికి గాంధీజీ ఆశ్రయం ఇవ్వడం ఆయన ఆహార, పానీయా
లిచ్చి సేవలు చెయ్యడం ఒక రివాజు . ఇది
భారతీయ సనాతన ధర్మం కూడ.
ఒక రోజు ఆయన ఇంటికి ఒక వ్యక్తి
విదేశాల నుండి వచ్చాడు. మరు నాడు వెళ్ళిపోయాడు . ఇక ఆ కాలంలో ఇప్పటిలా మెరుగైన మరుగుదొడ్లు ఉండేవి కావు . ఒక గొయ్యి తీసేవారు . ఆ గోతిలో ఒక డబ్బా ,
ఆ డబ్బాకి పై నుండి పట్టుకునే ఒక కొక్కెం అమర్చి ఉంటుంది . అందులో మల విసర్జన
చేసిన ప్రతివ్యక్తి దాన్ని తీసి బయట పాఱవెయ్యాలి.
అది నియమం . కానీ ఆ రోజు వచ్చిన వ్యక్తి ఆ విషయాన్ని మరచి పోవడమో మరేదో జరిగింది .
ఆయన వెళ్లి పోవడం కూడ జరిగిపోయింది . గాంధీజీ ఆ పని చెయ్యమని తన భార్య శ్రీమతి కస్తూరిబా గాంధీకి చెప్పారు .
ఆమె ససేమిరా ఒప్పుకోలేదు. అది మీకు సంబంధించిన పనైతే తప్పకుండా చేస్తాను. కాని అది ఎవరో తెలియని అతిధికి
సంబంధించినది. నేనాపని చెయ్యలేను, చెయ్యను గాక చెయ్యను అని ఖరాఖండిగా చెప్పేసింది.
దాంతో గాంధీజీ అహం దెబ్బ తింది.
ఆమెను గట్టిగా కొట్టి బయటకు గెంటేసి తలుపులు వేసేశారు . ఆమె గాంధీజీ తో ‘‘ మీకు
నన్ను కొట్టే హక్కు ఉంది, కానీ దేశం కాని ఈ
దేశంలో నన్ను ఇంట్లోంచి గెంటి వేసే హక్కు మాత్రం లేదు, మన దేశం ఐతే తెలిసిన
వారింటికి వెళ్ళి తలదాచుకుంటాను, ఇక్కడ ఆ అవకాశం లేదు, దయ జేసి మర్యాదగా తలుపు
తీయండని గట్టిగా అరిచింది.
హఠాత్తుగా గాంధీజీ తాను
చేసిన ఆవేశ పూరితమైన పనికి పశ్చాతాపం పొందారు . గాంధీజీ జీవితంలో భార్యపై చేయి
చేసుకోవడం అదే మొదటి సారి , అదే చివరి సారి కూడ.
ఆయన పశ్చాత్తాపం ఊరికే పోలేదు. అది కార్య రూపం ధరించింది.
తదనంతర కాలంలో Village sanitation అనే ఉద్యమానికి బాటలు వేసింది.
ఆ తరువాత ఆయన గ్రామీణ
పారిశుద్ధ్యానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు.
Instead of having graceful hamlets dotting the land, we have villages looking
like dung heaps. it is the duty of everyone to make the villages models of
cleanliness in every sense of the word అన్నారు. అక్కడితో ఆగలేదు The first and foremost service is latrine- cleaning (प्रथम सेवा पाखाना सफाई है) అని దాన్నొక జీవితాదర్శంగా
మలుచుకున్నారు .
ఇక స్వాతంత్ర్యం వచ్చి
అందరు డిల్లీ లో ఆనందంగా సంబరాలు జరుపుకుంటూ ఉంటే ఈయన నౌఖాలీ లో అంటే పూర్వం
నవద్వీపం అని చెప్పుకునే వాళ్ళం అక్కడ మరుగుదొడ్లు
శుభ్రం చేసే పనిలో నిమగ్నమయ్యారు.
ఇక మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ
గారు స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ మహాత్ముని చిత్రపటానికి వందనాలు
సమర్పించి ముందుకు సాగడం మనలో చాల మంది గమనించిన విషయమే . అంతే కాకుండా మరో అడుగు
ముందుకేసి What is true of outer cleanliness is true of the inner too అనే మహాత్ముని ఆశయానికి ఊపు
అందించడం కోసం కేవల బాహ్యమైన శుద్ధితో పాటుగా అంతర్గతంగా కూడ భారతదేశాన్ని శుద్ధి
చేయడానికి పూనుకోవడం మన భరత జాతి చేసుకున్న పురాకృత సుకృతం.
ఈ విధంగా తాను ఆవేశంతో , అనాలోచితంగా
చేసిన తప్పును దిద్దుకోవడమే కాక దాన్నొక ఆదర్శంగా ఉద్యమంగా మార్చి స్వయంగా ఆచరించి
అందరికి ఆదర్శంగా నిల్చిన మహాత్ముడు సమస్త మానవ జారికి ఆదర్శం అనడంలో ఎటువంటి సందేహం
లేదు .
“ స్వాతంత్ర్యంమునకై తెగించి తన
సర్వస్వమ్ము కోల్పోవు నే
పూతాత్ముoడతడొక్కడే త్రిభువనీ పుజ్యుండు అని శ్రీ యేటుకూరి
వేంకట నరసయ్య గారు వేరొక ఏదో సందర్భంలో చెప్పినా అది మహాత్మునకు వర్తిస్తుంది
అనడంలో ఎటువంటి సందేహం లేదు . ఏది ఏమైనా If
humanity is to progress, Gandhi is inescapable. … we may ignore him at our own
risk. అన్న Dr. martin Luther King, jr. మాటలు రతనాల మూటలు , అభ్యుదయం కోరుకునే వారికి బంగారు బాటలు .
<><><>
No comments:
Post a Comment