Dr.
Chilakamarti Durgaprasada Rao
3/106,
Premnagar, Dayalbagh,AGRA 282005
9897959425
అవి
ఒక మహారాజు రాజ్యాన్ని
సమర్థవంతంగా పరిపాలిస్తున్న
రోజులు.
దేశం
సుభిక్షంగానే ఉంది.
అయినా
ఒక వ్యక్తి తనకుల వృత్తియైన
దొంగతనాన్ని వదిలిపెట్ట
కుండా చేస్తూనే ఉన్నాడు.
అతని
పేరు భుక్కుండుడు.
యథాప్రకారం
దొంగతనం చేస్తూ ఒకరోజు
మారువేషంతో నగరంలో తిరుగుతున్న
రాజుకు పట్టుబడ్డాడు.
ఆనాడు
దొంగతనానికి మరణదండన ఒకటే
శిక్ష.
అన్ని
ఏర్పాట్లు సజావుగా జరుగుతున్నాయి.
మరణ
సమయం దగ్గరయ్యే కొద్ది అతనిలో
భయం పెరుగుతోంది.
ఎలా
బయట పడాలా అని ఆలోచిస్తున్నాడు.
ఆ
రోజుల్లో ఎవరు ఏ వృత్తిలో
ఉన్నా ప్రతి వాడికి చదువు
కొద్దో గొప్పో సాహిత్య జ్ఞానం
ఉండేవి.
కొంతమందికి
కవిత్వంకూడ అబ్బేది.
అతనిలో
ఈ రెండూ తగుమాత్రం గా ఉన్నాయి.
రాజును
మెప్పించడానికి కావలసిన
ప్రతిభాపాటవాలు లేకపోయినా
బ్రతికి బయట పడడానికి కావలసిన
తెలివితేటలున్నాయి.
మరునాడు
శిక్ష పడుతుందనగా ఆ రాత్రంతా
ఆలోచించాడు.
ఎలాగో
ఒకపద్యం అల్లగలిగాడు.
రాత్రి
గడిచింది.
శిక్ష
అమలు కాబోతోంది.
'చివరి
కోరికేమైనా ఉంటే కోరుకో'
అన్నారు
శిక్షనమలు పరిచే రాజభటులు.
'రాజుగార్ని
చూడాలి ఇదే నాచివరి కోరిక'
అన్నాడు.
వెంటనే
రాజు దగ్గరికి తీసికెళ్లారు
వాణ్ణి.
వాడు
రాజుతో 'రాజా!
మీరు
కవితాప్రియులు.
అంతేగాక
స్వయంగా కూడ కవులు.
అందువల్ల
నేను వ్రాసిన ఒక చిన్న కవిత
వినండి.
మీకు
వినిపించాక నేను హాయిగా
మరణిస్తాను'
అన్నాడు.
రాజు
'సరే
వినిపించు'
అన్నాడు.
వాడు
తాను రాత్రంతా ఆలోచించి అల్లిన
కవితను ఇలా వినిపించాడు.
దానిసారాంశం
ఇది.
“ ఓ
మహారాజా!
భట్టి
అనే మహాకవి మరణించాడు.
భారవి
అనే మహాకవి కూడ మరణించాడు.
భిక్షువు
అనే మరో కవి చనిపోయి చాలకాలమయింది.
ఆ
తరువాత భీమసేనుడు అనే
మరో కవి కూడ చచ్చిపోయాడు.
నా
పేరు భుక్కుండుడు.
ఇది
మీకు తెలిసిందే.
నాతరువాత
ఈదేశాన్ని పాలించే భూపతి
మీరే ఉన్నారు.
మహారాజా!
ఈ
సారి ఎందుకో యమధర్మరాజు "భ"
గుణింతంలో
తిరుగుతున్నాడు సుమండీ!(
నేడు
నేను మరణిస్తే నాతరువాత
టిక్కట్టు మీదే సుమా అని
అంతరార్థం)
రసికుడైన
రాజుకి అంతా అర్థమయింది.
వాడి
తార్కికమైన ఆలోచనకి భయపడ
లేదుగాని చమత్కారానికి ఎంతో
ఆనందించాడు.
తత్ఫలితంగా
శిక్షను రద్దుచేశాడు.
వాడు
కూడ రాజు ప్రోత్సాహంతో
దొంగతనానికి స్వస్తి చెప్పి
కావ్య రచనకు శ్రీకారం చుట్టాడు.
ఇంతకీ
వాణ్ణి
కాపాడిన ఆ మనోహరమైన శ్లోకాన్ని
తిలకించండి.
భట్టిర్నష్ట:
భారవిశ్చాపి
నష్ట:
భిక్షుర్నష్ట:
భీమసేనశ్చ
నష్ట:
భుక్కుండోహం
భూపతిస్త్వం హి రాజన్!
భబ్భావళ్యామంతకస్సన్నివిష్ట:
No comments:
Post a Comment