Friday, February 27, 2015

Sanskrit Poem using the names of Sanskrit Compounds

సమాసాలతో సాహిత్యం
(Sanskrit Poem, using the names of Sanskrit Compounds)
Once, a group of friends approached a poet, gave some words and asked him to compose a poem out of them. The words given are nothing but the names of Sanskrit Compounds such as Dvigu, Dvandva , Avyayibhava, Tatpurusha  Karmadharaya , Bahuvrihi .  In fact, it is not very easy to compose a meaningful poem out of them. But, the poet successfully came out with a beautiful poem using his poetic talent.
  
अद्विगुरद्वन्द्वोऽहं
गेहे नास्ति चाव्ययीभाव:
तत्पुरुष कर्मधारय
येनाsहं स्यां बहुव्रीहि:

अहं   अद्विगु:  (द्वौ गावौ यस्य स: द्विगु: | न द्विगु: अद्विगु:)        = I dont have even two cows
अद्वन्द्व:  =        I am a single person ( I  have no wife )
गेहे- अव्ययीभावः - नास्ति इति- न = There is no less expenditure in my house (expenditure is very high)
पुरुष= Oh Gentle man !
तत् कर्म- धारय = You do that task  
येन = by which
अहं बहुव्रीहि: - स्याम् =  I may get food grains in abundance.
  
Oh! Gentle man! I don’t have even two cows.  I am not married. The expenditure in my house is very high. There fore, you do that by which I may get abundant food grains.

కొంతమంది మిత్రులు ఒక కవికి కొన్ని పదాలిచ్చి  అవి ఉపయోగించి ఒక శ్లోకం రచించమని కోరారు. ఆ పదాలేమిటంటే- ద్విగు , ద్వంద్వ , అవ్యయీభావ, తత్పురుష, కర్మధారయ మరియు బహువ్రీహి. అవన్నీ సమాసాల పేర్లు. వాస్తవానికి అవి ఉపయోగించి రసవంతమైన కవిత్వం చెప్పడం చాల కష్టమే . కాని ఆ కవి చాల ప్రతిభావంతుడు. ఆ పదాలనే  ఉపయోగించి ఒక అద్భుతమైన చమత్కార పద్యాన్ని ఇలా చెప్పాడు.
ద్విగుద్వంద్వోsహం
గేహే నాస్తిచావ్యయీభావ:
తత్పురుష కర్మధారయ
యేనాహం స్యాం బహువ్రీహి:
ఆహం = నేను
అద్విగు: = రెండు ఆవులు కూడ లేనివాడను (ద్వౌ గావౌ యస్య స: ద్విగు: ( రెండు ఆవులు కలవాడు ) ; న +ద్విగు: అద్విగు:)
అద్వంద్వ: = జంట ( భార్య ) లేని వాడను ( ఒంటరిని)
గేహే = ఇంటిలో
అవ్యయీ భావ: = ఖర్చులేకపోవుట
నాస్తి = లేదు (  కుటుంబం పెద్దది కావడం వల్ల ఖర్చు చాల ఎక్కువ )
పురుష! = ఓ మహాపురుషుడా!
యేన = దేనివలన
అహం = నేను
బహువ్రీహి := ఎక్కువ ధాన్యం కలవాడను
స్యాం = అగుదునో
తత్ = ఆ
కర్మ = పని
ధారయ = ధరింపుము ( చేయుము)

ఓ మహాపురుష ! నాకు రెండు ఆవులు కూడ లేవు . భార్యకూడ లేని ఒంటరిని. కుటుంబం పెద్దది కావడం వల్ల ఖర్చు లేక పోవడం లేదు . అంటే ఖర్చు చాల ఎక్కువ . అందువల్ల నువ్వు ఏపని చేస్తే నాకు ఎక్కువ ధాన్యం లభిస్తుందో ఆ పని చెయ్యి .  నా కుటుంబ పోషణకు కావలసినన్ని ధాన్యం దానం చెయ్యి. 

No comments: