Sunday, December 10, 2017

సంభాషణ సంస్కృతం-12

సంభాషణ సంస్కృతం-12
Dr. Durga Prasada Rao Chilakamarthi
dr.cdprao@gmail.com

పాఠ౦ -- Lesson-12

Unit-1.   त:---पर्यन्तम् (నుండి ---వరకు )  From---to
మనం ఒక్కొక్కప్పుడు ఫలానా చోటినుంచి ఫలానా చోటు వరకు అనిగాని ; ఫలానా సమయం నుంచి ఫలానా సమయం వరకు అని గాని చెప్పవలసి వస్తుంది . అటువంటి సందర్భాల్లో త:---  పర్యంతం అనే ఈ రెండు పదాలు ఉపయోగిస్తే సరిపోతుంది

1.      काश्मीरत: कन्याकुमारीपर्यन्तं भारतदेश: अस्ति || 
కాశ్మీరు నుండి కన్యాకుమారి భారతదేశము కలదు  
(India is from Kashmir to Kanyakumari).
2.      दशवादनत: पञ्चवादनपर्यन्तं कार्यालय: प्रचलति ||
పది గంటలనుండి  ఐదు గంటల వరకు కార్యాలయము పనిచేయును
(The office works/runs from10 A.M to 5 P.M)  
3.      कृषीवल: प्रात:कालत: सायंकालपर्यन्तं क्षेत्रे कार्यं करोति ||
వ్యవసాయదారుడు ఉదయం నుంచి సాయంకాలం వరకు పొలములో పని చేయును .
( A farmer  works in the field from dawn to dusk)
4.     चेन्नैत: काकिनाडा पर्यन्तं सरकारयानं चलति|
చెన్నై నుండి కాకినాడ వరకు సర్కార్ ఎక్స్ప్రెస్  నడచును
(Sarkar Express runs from Chennai to Kakinada.
5.     प्रारंभत: परिसमाप्तिपर्यन्तं कार्यक्रम: आह्लाददायक: अभवत्
కార్యక్రమం ప్రారంభం నుంచి చివరి వరకు ఆహ్లాదకరంగా ఉండెను .
 (The programme was interesting from the beginning to the end)
6.     बालक: प्रात:काले  सार्धसप्तवादनत: सपादनववादनपर्यन्तं संस्कृतं पठति ||
బాలుడు ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది౦పావు వరకు సంస్కృత౦ చదువును.
 (The boy studies Sanskrit from 7. 30 A.M to 9.15 A.M).
7.  हिमालयत: बङ्गालाखातपर्यन्तं गङ्गानदी प्रवहति
గంగానది హిమాలయపర్వతము నుండి బంగాళాఖాతము వరకు ప్రవహించును .
 The river Ganges flows from the Himalayas to the Bay of Bengal.

Note:-- ఈ పైన గల వాక్యాలను చదివి అర్థం చేసుకొని స్థలం , సమయం , కాలం మొదలైన అంశాలను సూచిస్తూ మీ కార్యక్రమాలను వివరిస్తూ పది వాక్యాలను తయారు చెయ్యడానికి ప్రయత్నం చెయ్యండి .

Unit-2.            अद्य आरभ्य  (నేటి నుండి ) / श्व: आरभ्य (రేపటి నుండి )
                   अद्य आरभ्य  (from today on wards)
                  श्व: आरभ्य (from tomorrow on wards)

1.      अद्य आरभ्य कलाशालाया: विराम: ||
నేటి నుండి కళాశాలకు సెలవులు
 The college is closed from today on wards

2.      श्व: आरभ्य अहं संस्कृतशिबिरं चालयिष्यामि || 
రేపటి నుండి నేను సంస్కృతశిబిరము నడిపెదను.
  I will conduct Sanskrit camp from tomorrow on wards.
3.      अद्य आरभ्य पाठशालाया: विराम: ||
నేటినుండి పాఠశాలకు సెలవులు  
 Holidays to school are from today on wards

4.      श्व: आरभ्य परीक्षा: प्रचलिष्यन्ति  ||
రేపటి నుండి పరీక్షలు జరుగును
Examinations will be held from tomorrow on wards
Note:- మీరు మీ సంవత్సరప్రణాళికను తయారుచేసుకుని ఎప్పటినుండి ఎంతవరకు ఏఏ పనులు చేద్దామనుకు౦టున్నారో తెలియ జేస్తూ పది వాక్యాలు చెప్పండి .   

Unit -3 
మనం ఎవరికోసమో ఏవేవో తెస్తూ ఉంటాం  ఎంతోమందికి ఏవేవో ఇస్తూ ఉంటాం . ఎవరి కేదిచ్చినా ఎవరికోసం ఏం తెచ్చినా పుచ్చుకునేవారికి చతుర్థీవిభక్తి వస్తుంది . ఆ చతుర్థీ విభక్తి వాడే బదులు షష్ఠీవిభక్తి ఉపయోగించి దానికి కృతే అనే పదం తగిలిస్తే సరిపోతుంది .
         Unit -3                  कृते =  for, on behalf of, on the authority of/
                                  On account of /for the sake of
   कृते (Krite) is an indeclinable, which is used to express  the sense cited above. In spoken Sanskrit we can completely avoid chaturthivibhakti (Dative Case) by adding कृते to possessive forms.
Possessive case + krite = Dative case.
For बालकाय we can say बालकस्य +कृते.
Similarly for बालिकायै we can say बालिकाया:+ कृते

        1 . माता भिक्षुकस्य कृते अन्नं दत्तवती      
          తల్లి బిచ్చగానికి అన్నము పెట్టెను 
         (Mother gave food for a beggar)

3.      पिता पुत्रस्य कृते पुस्तकम्  आनीतवान्
తండ్రి కుమారుని కోసం పుస్తకం తెచ్చెను
      (Father brought a book for his son)

4.माता पुत्रिकाया: कृते शाटिकां क्रीतवती
తల్లి కుమార్తె కోసం  ఒక చీర కొన్నది
(Mother purchased sari for her daughter)
5. मम मित्रं मम कृते घटीयन्त्रं प्रेषितवान्
నా మిత్రుడు నా కోసం ఒక గడియారం పంపిం చాడు .
   (My friend sent a watch for me)
6. देशभक्ता: देशस्य कृते प्राणान् त्यजन्ति
దేశభక్తులు దేశం కోసం ప్రాణములను త్యజి౦తురు.
(Patriots sacrifice their lives for the sake of the country)

Note: -- మీ ఇంటిలో జరిగిన ఒక వివాహసందర్భంగా  మీరు ఎవరికేమి ఇచ్చారో , మీకు ఎవరేమి ఇచ్చారో / తెలుపుతూ ఒక పది వాక్యాలు తయారు చెయ్యండి .

Unit-4         आसीत्   आसन्
आसम् --  आस्म

आसीत् (ఉండెను ) (was) आसन् (ఉండిరి) (were)
आसम् (ఉంటిని ) (was) आस्म (ఉంటిమి) (were)
                              (स: ( అతడు)/सा (ఆమె)/तत्(అది)-आसीत् (ఉండెను)
                             (ते (వారు) /ता: (వారు)/तानि( అవి)-आसन् (ఉండిరి)
                                   (अहम्)     आसम्----    (वयम्)    आस्म

!. पूर्वकाले रामो नाम राजा आसीत्
పూర్వ కాలంలో రాముడనే పేరుగల రాజు ఉండెను
(In days of yore there was a king named Rama)
2.    मम मित्रं गतमासे मुम्बै नगरे आसीत्
నా మిత్రుడు గతనెల ముంబై నగరంలో ఉండెను
(My friend was there in Mumbai last month)
 3. पाण्डुराजस्य पञ्च पुत्रा: आसन्
పా౦డురాజూనకు ఐదుగురు పుత్రులు ఉ౦డిరి.
(The sons of Panduraja were five)
4.      मम कुटुम्बसभ्या: गतसंवत्सरे विदेशेषु आसन्
నా కుటుంబ సభ్యులు క్రిందటి సంవత్సరం విదేశాల్లో ఉ౦డిరి
(The members of my family were in abroad last year)
5.      अहं गतदिने दिल्लीनगरे आसम्
నేను నిన్న ఢిల్లి నగరంలో ఉంటిని  
   (I was in Delhi yesterday)
6.      वयं  गतमासे चेन्नै नगरे आस्म
మేము క్రిందటి నెలలో చెన్నై లో ఉంటిమి
(We were in Chennai during last month)
7.      स: पूर्वं बालक: आसीत् इदानीं युवक: अस्ति कालान्तरे वृद्ध : भविष्यति ||
అతడు ఇంతకు ముందు బాలుడుగా ఉండెను ,ఇప్పుడు యువకుడుగా ఉన్నాడు , కొంత కాలానికి వృద్ధుడు కాగలదు .
(He was a child;  he is now young and he will become old in course of time).

A mantra (hymn) from the Rigveda: -- 12

The democratic views in the Vedas

   संगच्छध्वं (1) संवदध्वं (2) सं नो मनांसि जानताम् (3)|
   देवाभागं यथा पूर्वे संजानाना (4) उपासते
   समानीव आकूति: (5) समाना हृदयानि व: (6)
   समानमस्तु वो मनो (7) यथा व: सुसहासति (8)
 (R.V- सं -10सू १६१-मन्त्र-2)
అందరు ఒక చోట సమావేశం కండి. స్వేచ్చగా ఒకరి అభిప్రాయాలు మరొకరు పంచుకో౦డి. ఒకరి మనస్సు మరొకరు తెలుసుకోండి. మీ పూర్వీకులు , జ్ఞానులు అయిన పెద్దలనుండి జ్ఞానం పొంది కర్తవ్యాన్ని తెలుసుకోండి . మీ వాక్కులు ఒకేలాగా ఉండాలి . మీ హృ దయాలు ఒకే విధంగా ఉండాలి . మీ మనస్సు ఒకేవిధంగా ఉండాలి . ఎవరి మనస్సును గాయపరచకండి. పరస్పరం ఒకరికొకరు సహాయసహకారాలు అందించుకోండి.  

1.      Associate you all in public meetings.
2.      Have you all free discussions.
3.      Acquire you all through wisdom.
4.      Follow the foot steps of your learned elders who have shown by their exemplary devotion to duty or dharma.
5.      Let all your actions are according to the dictates of duty.
6.      Don’t injure the feelings of others.
7.      Consider thoroughly before taking any step.
8.      Help and give aid to each other.
**************************************



No comments: