అరువు సొమ్ము బరువు చేటు
డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాద రావు
ఈ కథ THE TRAGEDY OF VANITY అనే పేరు గల ఆంగ్ల కథకు స్వేచ్ఛాను వాదం.
దీనికి మూలం Maupassant (1850-1893) అనే French రచయిత రచించిన “ The Necklace” అనే కథ. ఈ రచయిత కలం నుండి వందలకొలది
కథలు , ఎన్నో నవలలు వెలువడ్డాయి
పూర్వకాలం ఫ్రాంసు దేశంలో ఒక అందమైన అమ్మాయి ఉండేది . ఆమె పేరు మెటిల్డా (Mathilde). ఆమె అందచందాలకు తగినట్లు ఆమె గొప్ప ధనవంతుల
కుటుంబంలో పుట్టి ఉంటే బాగుండేది, కాని ఆమె దురదృష్టం ఏంటో గాని నిరుపేద
గుమాస్తాకు కూతురయింది. గొప్ప వాళ్లెవరు ఆమెను గుర్తించలేదు, ప్రే మించలేదు, పెళ్లి చేసుకుంటానని ముందుకు రాలేదు
. అంత పేదరికం ఆమెది . చివరికి ఆమె ఒక వ్యక్తిని
పెళ్లి చేసుకుంది . అతని పేరు లోజేల్ (Loissel) . అతను ప్రభుత్వానికి సంబంధించిన మంత్రిత్వ శాఖలో గుమాస్తాగా పని చేస్తున్నాడు .
ఆమెకు పెళ్లైనా ఎప్పుడు విచారంతోనే కాలం గడిపేది . ఎ౦దుకంటే కట్టుకోడానికి సామాన్యమైన దుస్తులే గాని అందమైన దుస్తులు లేవు .
ఆమె తన అందం, ఠీవి తలచుకు౦టు దానికి తగిన విధంగా ఉన్నతమైన జీవితాన్ని పొందాలని ఎప్పుడు ఉబలాటపడుతూ
ఉండేది . ఆమె ఉండే ఇల్లు పాడు పడిన గోడలతో చాల సాదా సీదాగా ఉంటుంది. ఇంట్లో కనీస సౌకర్యాలేమీ లేవు . విరిగి పోయిన కుర్చీలు, చిరిగిపోయిన తెరలు ఇవే ఆమె ఇంట్లో ఉన్న సామాన్లు . ఇవేమీ ఆమెకు నచ్చలేదు . ఆమె బాధ వర్ణనాతీతం. ఎప్పుడూ
డబ్బున్న ఆడవారిని, వారి
విలాసజీవితాన్ని తలుచుకుంటూ అవి తనకు లేనందుకు ఎంతో బాధపడుతూ ఉంటుంది . ఆమె
ఎప్పుడు అటువంటి ఆలోచనలను౦చి తప్పించుకోలేక
పోయేది. అక్కడ తన లాంటివారెవరు లేకపోవడంవల్ల తన దురదృష్టానికి బాధపడుతూ ఉండేది .
అన్నం దగ్గర కూర్చున్నప్పుడు ఆమె ధనవంతులు వాడే అందమైన పాత్రలను , వారు తినే రుచికరమైన ఆహారాన్ని తలుచుకుని బాధపడేది . తనకు అందమైన బట్టలు
, ఆకర్షణీయమైన నగలు లేవని వాపోయేది. ఆమెకు అందరిలాగే అందమైన దుస్తులు ధరించి ఎన్నో కార్యక్రమాలలో పాల్గోవాలని సరదా. కాని ఎప్పుడూ
ఆ కోరిక తీరేది కాదు . ఇక ఆమె బాధ
వర్ణనాతీతం .
మెటిల్డా చిన్నప్పుడు కాన్వెంటులో చదువుకుంది . ఆమె చిన్ననాటి స్నేహితురాలు
చాల డబ్బు హోదా కలది. ఆమె ప్రస్తుతం ప్యారిస్
లోనే ఉ౦టో౦ది. మెటిల్డా అప్పుడపుడు ఆమె ఇంటికి వెడుతూ ఉండేది .
తరువాత తరువాత ఆమె ఉచ్చస్థితిని తన దు:స్థితిని తలుచుకుంటూ వెళ్లడమే మానేసింది .
ఒక రోజు మెటిల్డా భర్త ఆఫీసు నుంచి ఒక ఆహ్వానపత్రం తెచ్చాడు .
చిరునవ్వుతో తన భార్యకు అందించాడు . ఆమె ఆనందాశ్చర్యాలతో కవరు తెరిచి చూసింది . అది
విద్యామంత్రిత్వశాఖ నిర్వహించే
ఫంక్షనుకు వీరిద్దరిని రమ్మని
పంపిన ఆహ్వానం . సాధారణంగా అందులో చాల
గొప్పవారు, ఉన్నతాధికారులు మాత్రమే
పాల్గు౦టారు. ఈ ఆహ్వాన౦ చూడగానే తన భార్య సంతోషిస్తు౦దని ఎగిరి గంతేస్తు౦దని లోజేల్ అనుకున్నాడు . కాని అతని ఊహ తలక్రి౦దులై౦ది.
ఆమె ముఖం చిట్లిస్తూ ఆ ఆహ్వానాన్ని విసిరి కొట్టింది .
లోజేల్ తన భార్యతో అటువంటి ఆహ్వానం అందరికి రాదనీ దాన్ని సంపాదించడ౦
కోసం తాను ఎంతో కష్టపడ్డానని వివరించాడు . ఈ అవకాశం వదులు కోకూడదని బ్రతిమాలాడు . ఆమె కన్నీళ్ళు
పెట్టుకుంటూ అతని వైపు చూసింది . మంచి బట్టలు కూడ లేవుకాబట్టి తాను రాలేనని ఆహ్వానాన్ని
వేరెవరికైనా ఇచ్చేయ్యమని సలహా చెప్పింది . లోజేల్ ఆమె కన్నీళ్ళు తుడుస్తూ మంచి
డ్రస్సు కొనుక్కోడానికి ఎంత డబ్బు ఖర్చౌతుందని అడిగాడు . ఆమె కొంతసేపు ఆలోచించి
నాలుగు వందల ఫ్రా౦కులు ఖర్చౌతుందని చెప్పింది . లోజేల్ మొహం మాడిపోయింది. అతను ఒక గన్ను కొనుక్కోడానికి కొంత డబ్బు ఎప్పట్నుంచో దాచుకు౦టున్నాడు . కాని
ఇప్పుడు తన భార్య సంతోష౦ కోసం ఆమెకివ్వడానికి
సిద్ధమయ్యాడు . సరే ! వాళ్ళు హాజరు కావలసిన రోజు దగ్గరపడుతో౦ ది . చక్కటి గౌను కొనుక్కుంది
. కాని ఇంకా ఆమెకు అసంతృప్తి గానే ఉంది . లోజేల్
ఆమె వాలకం గమనించి ఇంకా ఎందుకు విచారం? అన్నాడు . మెళ్ళో వేసుకోడానికి
ఒక్క నగ కూడ లేద౦ది . మంచి పూలదండ కొని వేసుకొమ్మని సలహా ఇచ్చాడు . అది ఆమెకు
నచ్చలేదు . ఇక చేసేది లేక ఆమెతో చదువుకున్న స్నేహితురాలు మేడం Forestier (ఫోర్స్టీర్
) దగ్గరకెళ్ళి ఒక నెక్లెస్ ఎరువు తెచ్చు కొమ్మని
సలహా ఇచ్చాడు . అంతె ! ఆమె ముఖం సంతోషంతో
విచ్చుకుంది .
మెటిల్డా మర్నాడే తన స్నేహితురాలింటికి బయల్దేరి౦ది . చాలకాలం తరువాత కలుసుకున్నందుకు
ఇద్దరు చాల ఆనందించారు. మాటల మధ్యలో మెటిల్డా తన రాకకు కారణం చెప్పింది . ఫోర్స్టీర్
వెంటనే తన నగల పెట్టి తెచ్చి ఆమెకు
నచ్చింది తీసుకోమంది . అవన్నీ చూడగానే మెటిల్డాకు ఏది ఎంచు కోవాలో తేల్చుకోలేక మతిపోయినంత
పనైంది . అద్దం ముందు నించుని అన్ని
వేసుకు చూసుకుంది . చివరికి ఒక అందమైన వజ్రాల నెక్లెస్ ఎంచుకుంది . అది వేసుకుని అద్దంలో చూసుకోగానే
ఆనందంతో ఉబ్బితబ్బిబ్బై౦ది. మెటిల్డా అంత విలువైన నెక్లెస్ అడగ డానికి
సందేహించింది గాని స్నేహితురాలే ఆమె ఇష్టాన్ని పసిగట్టి అది తీసికెళ్లమని
ప్రోత్సహించింది . మెటిల్డా ఆనందానికి అవధులు లేవు . ఆమెకో ముద్దిచ్చి వేగంగా
ఇంటికి చేరుకుంది
ఆమె సమావేశానికి హాజరు కావలసిన రోజు
రానే వచ్చింది . ఆ సమావేశంలో ఆమె అతిథులందరి అందరి మధ్య చుక్కల్లో చ౦ద్రుడిలా చక్కగా వెలిగిపోయింది .
అందరి కళ్ళు ఆమెమీదే . అక్కడకు వచ్చినవారంతా పోటీపడి తమను తాము ఆమెకు పరిచయం చేసుకున్నారు . ఉన్నతాధికారులందరు ఆమె అందానికి, హావభావాలకు
మంత్రముగ్ధులయ్యారు . అందరి మగవారి మన్ననలు పొందడం కంటే స్త్రీకి ఆనందకరమైన విషయం
మరేముంటుంది ?
విందులు వినోదాలు డాన్సులు ముగిసేటప్పటికి
తెల్లవారు జాము నాలుగై౦ది. డాన్సు చేసి
చేసి మెటిల్డా చాల అలిసిపోయినా ఆమె మనస్సు చాల ఆనందంగా , ప్రశాంతంగా ఉంది . ఆమె
భర్త రాత్రి పన్నిండింటికే తన ముగ్గురు స్నేహితులతో కలిసి నిద్రలోకి జారుకున్నాడు.
వారి భార్యలు కూడ ఆ వెనకనున్న ఒక చిన్న గదిలో పడుక్కున్నారు . లోజేల్ మెటిల్డా మెడకు తాను తెచ్చిన చిన్న గుడ్డ చుట్టబెట్టాడు .
మిగిలినవారు వాళ్ళు తాము తెచ్చుకున్న ఖరీదైన శాలువలు కప్పుకుని పడుకున్నారు . లోజేల్
తెల్లవారు జామున లేచి ఇంటికెళ్ళడానికి cab కోసం ప్రయత్నించాడు . దొరకలేదు . ఆ
చలిలో కొంతదూరం నడిచి అక్కడొక డొక్కు
రిక్షా మాట్లాడుకుని ఇంటికి చేరుకున్నారు .
ఇంటికెళ్లాక ఆమె తన అందాన్ని మరోసారి చూసుకోవాలనే ఉబలాటంతో అద్దం ముందు నిలబడి మెడకు చుట్టిన గుడ్డ తొలగించింది . ఒక్క సారి కెవ్వుమని అరిచింది .
నక్లెస్ లేదు . భర్త భయపడుతూ ఏమై౦దని ఆమె
దగ్గరకెళ్లాడు. విషయం తెలిసింది . లోజేల్ వారు తిరిగిన ప్రదేశాలు గుర్తు
తెచ్చుకుని వచ్చిన త్రోవలో అన్ని ప్రదేశాలు తిరిగాడు , అంతా గాలించాడు .
ప్రయోజనం శూన్యం . మెటిల్డా డ్రస్స్ మార్చుకోడానికి కూడ ఓపికలేక కుర్చీలోనే కూలబడి పోయి౦ది. వాళ్ళాయన తిరిగి
తిరిగి ఏడింటికి నిరాశతో ఇల్లు చేరాడు . మళ్లి బయటికెళ్ళాడు. పోలిసు కంప్లైంట్
ఇచ్చాడు . ఎవరైనా నెక్లెస్ తెచ్చిస్తే వారి కి బహుమతి ఇస్తానని పేపర్లో ప్రకటన
వేయించాడు . అన్ని చోట్ల ఎంక్వైరీ చేసి చేసి అలసి సొలసి రాత్రి ఆలస్యంగా ఇంటికి
చేరుకున్నాడు .మెటిల్డా పరిస్థితి అలాగే ఉంది . ఆమె ఆశ నిరాశల మధ్య
కొట్టుమిట్టాడుతో౦ది. ఆమె స్నేహితురాలికి ఏ౦ చెప్పాలి ? నెక్లెస్ ఎలా తిరిగివ్వాలి
అనే ఆలోచనలో సతమతమౌతో౦ది.
లోజేల్ ఆమెతో సరేలే జరిగిందేదో జరిగింది .కొక్కెం ఊడిపోవడ౦ వల్ల
నెక్లెస్ జారి విరిగిపోయిందని సరి చేయించి ఇస్తామని మీ స్నేహితురాలికి చెప్పు .
తరువాత ఎం చెయ్యాలో తీరిగ్గా ఆలోచిద్దాం
ఆన్నా డు ఆమె సరే! అనిస్నేహితురాలికి ఒక ఉత్తరం వ్రాసి పంపింది .
నెక్లెస్ దొరుకుతుందేమో అని వాళ్ళు ఒక వారం రోజులు చూశారు . దొరకలేదు . ఆ తరువాత
ఆ నగల పెట్టి పైనున్న అడ్రస్సు బట్టి ఆ
నగల వర్తకుడి దగ్గరకెళ్లారు . ఆయన వాళ్ళతో
ఈ నెక్లెస్ ఇక్కడ కొన్నది కాదు , పెట్టె
మాత్రమే నాదగ్గర వాళ్ళు తీసుకుని ఉండొచ్చు
అన్నాడు. వాళ్ళు అలాంటి నెక్లెస్
కోసం ఎన్నో దుకాణాలు తిరిగారు . చివరకు ఒక చోట దొరికింది . దాని ఖరీదు ఏభై వేల
ఫ్రా౦కులు. కాని ముప్పై ఆరు వేలకే అది ఇస్తానని చెప్పాడు . మూడు రోజుల్లో
డబ్బిచ్చి పుచ్చుకుంటామని ఈ లోపుగా ఎవరికీ ఇవ్వొద్దని అతన్ని బ్రతిమాలారు
. ఈ లోపులో అది దొరకొచ్చు అన్న చిన్న ఆశ
కూడ వాళ్ల కు లేకపోలేదు . లోజేల్ దగ్గర వాళ్ళ నాన్న గారు బ్యాంకులో దాచిన పద్దెనిమిది వేలున్నాయి . మిగిలిన డబ్బు అప్పు తీసుకుందామనుకున్నాడు
.
ఎక్కువ వడ్డిగుంజే వారి దగ్గరకెళ్ళి అప్పుతీసుకున్నాడు . ఎందుకంటే ఈ మానసికి
బాధకన్నా శారీరకంగా ఏదో విధంగా కాయకష్టం చెయ్యడమే నయమను కున్నాడు . నెక్లెస్
కొనడం ఆమె స్నేహితురాలికి పంపిం చడం రెండు
జరిగిపోయాయి. మెటిల్డా నెక్లెస్ ఆలస్యంగ తెచ్చినందుకు ఆమెకు కోపంవచ్చింది. ముఖం చిట్లిస్తూ తీసుకుంది
. పెట్టి తెరిచి చూడకుండానే లోపల దాచేసుకుంది . నెక్లెస్ తీసుకున్నాక తననేమీ
అననందుకు మెటిల్డా ఎంతో ఊపిరి పీల్చుకు౦ది.
అప్పు ఎలా తీర్చగలం ? అసలు తీర్చగలమా
! కాని తీర్చాలి . పని మనుషుల్ని మాని పి౦చేశారు
. ఇప్పుడున్న ఇంటికంటే తక్కువ ఇంటికి మకాం మార్చారు . అంట గిన్నెలన్ని ఆమే తోముకుంటో౦ది
. అందమైన ఆమె చేతులు బాగ కందిపోయాయి
. తన భర్త బట్టలు కూడ ఆమే ఉతుకుతోంది. ప్రతి పైసా కూడ బెట్టడానికి ఆమె ఏమేం చెయ్యాలో అన్ని చేస్తోంది . ఆమె భర్త
ఆఫీసు పనయ్యాక కొన్ని షాపుల్లో అకౌ౦ట్లు వ్రాయడం
ప్రారంభించాడు . ప్రతి నెల కొంత సొమ్ము అప్పు తీరుస్తున్నారు . తీర్చవలసిన డబ్బు
రెట్టిపుకావడంతో మొత్తం అప్పు తీరడానికి
పదేళ్ళు పట్టింది . . మెటిల్డా ముఖంలో
అంతకు ముందున్న కళా కాంతులు ఇప్పుడు కనిపించడం లేదు . పదేళ్ళలోనే ఆమె చాల
ముసలిదైపోయినట్లు కనిపిస్తోంది . బంగారు వన్నెగల ఆమె జుట్టు ఇప్పుడు తెల్లబడిపోయి౦ది
. ఆమె ఎప్పుడు ఆ పార్టి గురించి ఆపార్టిలో తాను పొందిన మన్ననలు , ప్రశంసలు గురించి
గుర్తుకు తెచ్చుకునేది . ఆ నెక్లెస్
పోకుండా ఉంటే తన జీవితం ఎంతో గొప్పగా ఉండేదని భావి౦చేది.
ఒక రోజు మెటిల్డా
తాను వారం రోజులపాటు పడిన శ్రమను మరిచిపోడానికి ఒక ఆదివారం సాయంకాలం
నాలుగడుగులు వేయడానికి బయటకు
వెళ్ళింది. అక్కడ ఒక పిల్లవాణ్ణి చెయ్యపుచ్చుకుని
నడిపించుకు౦టూ పోతున్న ఒక యువతిని చూసింది . ఆమె ఎవరో కాదు తన స్నేహితురాలే. పదేళ్ళు కావడ౦ వల్ల ఆమె ముఖకవళీకలలో కొంత
మార్పు వచ్చింది . మెటిల్డా ఆమెను కలసి జరిగిందంతా చెప్పాలనుకుని ఆమె గ్గరికెళ్ళి౦ది కాని ఆమె ఈమెను గుర్తు
పట్టలేదు. నువ్వెవరో నాకు తెలియదంది .
అపుడు మెటిల్డా అంతా వివరంగా చెప్పగా ఆమె ఈమెను చూసి బిత్తరపోయింది . మెటిల్డా
ఆమెకు తాను నెక్లెస్ ఎలా పోగొట్టుకున్నది
, దానికోసం చేసిన అప్పు, అది తీర్చడానికి
తాను తన భర్త పది సంవత్సరాలు
రాత్రి పగలు ఏవిధంగా కష్టపడింది అంతా వివరించింది . Forestier (ఫోర్స్టీర్ ) అదంతా
విని దాని కోసం తన స్నేహితురాలు
అనవసరంగా శ్రమపడినందుకు బాధపడింది .
ఆమెతో అది నకిలీ
రాళ్ళతో చేసిన చాల చవకబారు నెక్లెస్ దాని ఖరీదు ఐదు వందల ఫ్రా౦కులు కూడ ఉండదని చెప్పింది .
No comments:
Post a Comment