Monday, October 12, 2020

నా లండన్ పర్యటన-1 (My trip to London)

 

నా లండన్ పర్యటన-1

(My trip to London)

                                                             Dr. Ch. DurgaprasadaRao 

మా అబ్బాయి చి|| రత్నప్రభాకర్ ఉద్యోగ నిమిత్తం లండన్ చేరిన నాటి నుంచి మా ఇద్దర్ని రమ్మని ఎన్నో సార్లు అడిగాడు . నాకెందుకో వెళ్లాలని పి౦చలేదు. కొన్ని చరిత్ర పుటలు చదివిన నాకు ఆ౦గ్లేయులవల్ల మనం పడ్డ కష్టాలు  నా మనస్సులో ఎంతో బాధను రేకెత్తి౦చేవి. వాళ్ళ దేశం చూసేదేంటి అనే భావన మనస్సులో బాగా చోటు చేసుకుంది . అప్పటికే అమెరికా , దుబాయ్ లాంటి దేశాలు నేను పర్యటించడం వల్ల ప్రత్యేకంగా లండన్ చూడాలనే కోరిక లేదు . మృదువుగా నిరాకరిస్తూ వాయిదా వేస్తూ వచ్చాను . సంవత్సరాలు గడిచాయి.  అబ్బాయికి లండన్ నుంచి దుబాయ్ కి బదిలీ అయ్యింది . మళ్ళీ రెండో సారి లండన్ లో పని చేయవలసి వచ్చింది . ఇక మా వాడు పట్టు వదలని విక్రమార్కుడిలా పదే పదే రమ్మని  అడగడం జరిగింది. నేను కూడ మనసు మార్చుకున్నాను . ఒక సారి  వెళ్లి చూసొద్దాం అనిపించి సరే నీ ఇష్టం అన్నాను. అంతే అతి తక్కువ కాలంలోనే పాస్ పోర్టు , వీసాలు నాకు , మా ఆవిడకు సిద్ధం ఐపోయాయి. ఇక ప్రయాణం ఒక్కటే తరువాయి. క్రమంగా ప్రయాణపు రోజు రానే వచ్చింది .

 23-10-1919 నాడు Delhi నుండి London కి Air India non - stop flight లో బయలుదేరాం. అది భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం  2.౦౦ గం || లకు బయలు దేరింది . అదే రోజు రాత్రి  లండన్ కాలమానం ప్రకారం 7.30  Heathrow   airport లో దిగాం . బయట పడేటప్పటికి సుమారు రాత్రి 9. 45 అయ్యింది . ఇంటికి చేరే టప్పటికి సుమారు రాత్రి 10.45 అయ్యింది . కోడలు వండిన విందు భోజనం తిని వెంటనే నిద్రలోకి జారుకున్నాం .  Jet log కారణంగా ఒక రోజు ఎక్కడికీ కదల్లేదు.

Nippier garden

 25-10-2019న మేం ఉండే ప్రాంతానికి సమీపంలో ఉన్న Nippier garden కి వెళ్లాం . అది సెలయేర్లతోనూ జలపక్షులతోను చాల అందంగా ఉంది. ముఖ్యంగా కను విందు కలిగించే అనేక రంగుల బాతులు అక్కడున్నాయి. అడుగున భూమి కనిపి౦చేటంత స్వచ్ఛమైన నీరు చూడ ముచ్చటగా ఉంది.

Kimberley  

 మరునాడు 26-10-2019 నాడు ఆ సమీపంలో ఉన్న Kimberley వెళ్లాం . ఆ ప్రాంతం జనప్రవాహంతో చాల చూడ ముచ్చటగా ఉంది. ఎక్కడ చూసినా అందమైన కట్టడాలే . అక్కడున్న ఒక  restaurant లో  నా పుట్టిన రోజు  జరుపుకున్నాం .

Stratford -Upon-Avon

 నేను ముందుగా  William Shakespeare మహాకవి ఇల్లు చూస్తే గాని మరే ప్రదేశం చూడనని నిశ్చయించుకున్నాను , అదే విషయం స్పష్టంగా చెప్పేశాను . మావాళ్ళు కూడ అందుకు సరే ఆన్నారు . ఇక రెండు రోజుల తరువాత   29-10-2019 న అక్కడకు బయలుదేరాం . అది మేం ఉండే ప్రదేశానికి సుమారు వంద మైళ్ళ దూరంలో ఉంది . అందుకే ఉదయమే  కారులో బయలుదేరాం . కారులో ప్రయాణం చేస్తున్నంత సేపు నేను చిన్నప్పుడు చదువుకున్న పాఠ్యా౦శాల్లోని William Shakespeare రచనలు మనస్సులో కదలాడాయి . ఆ మహాకవి (1564)నివసించిన ప్రదేశం  ఇంగ్లండుకు నడిబోడ్డైన Avon నది ఒడ్డున గల Stratford  అనే ప్రాంతంలో ఉంది . దీన్నే  Stratford -Upon-Avon అంటారు.  ప్రతిరోజూ కొన్ని వం దలమంది ఆ ప్రదేశాన్ని సందర్శిస్తారు . అక్క్కడకు చేరగానే ముందుగా అందమైన హంసలు యాత్రికులకు స్వాగతం పలుకుతూ కను విందు చేస్తాయి . గొప్ప ఆశ్చర్య కరమైన విషయం ఏమిటంటే Shakespeare మహాకవి  ఇంటిని , ఆయన ఉపయోగించిన అన్ని వస్తువులను పదిలంగా భద్రపరిచారు. ఆయన చిన్ననాడు ఏ స్కూల్లో చదివారో అట్టెండెన్సు రిజిస్టర్తో సహా భద్రపరిచారు . ఒక జాతి తమ కవులపట్ల , వారు సృష్టి౦చిన సాహిత్యం పట్ల ఎటువంటి శ్రద్ధ కనపరచాలో వారిని చూసి అందరు నేర్చుకోవాలని నాకనిపి౦చింది . ఆయన ఇల్లు, దానికి చేరువలోనే ఉన్న వారి కుమార్తె ఇల్లు కూడ చూశా౦.  ఆయన తన చిన్న నాడు చదువుకున్న King Edward Grammar School  కూడ చూశా౦ .   సాధారణంగా అన్ని విశేషాలు చూడడానికి ఒక రోజుచాలడు . కాని చుసిన వాటితో సంతృప్తి పడి జ్ఞాపకాలు నెమరు వేసుకు౦టూ ఇంటికి బయలు దేరాం . కార్లో వస్తున్నంతసేపు  ‘As you like it’ నాటకంలోని  

“Which like the toad, ugly and venomous,

Wears yet a precious jewel in his head.

And this our life exempt from public haunt,

Finds tongues in trees, books in the running brooks,

Sermons in stones and good in everything.

I would not change it వంటి మాటలు, OTHELLO నాటకం లోని  Desdemona మరియు OTHELLO   హృదయ విదారకమైన సంభాషణలు గుర్తు తెచ్చు కుంటు ఇంటికి చేరాము.

                                                ----    

2 comments:

Bhãskar Rãmarãju said...

>>ఒక జాతి తమ కవులపట్ల , వారు సృష్టి౦చిన సాహిత్యం పట్ల ఎటువంటి శ్రద్ధ కనపరచాలో వారిని చూసి అందరు నేర్చుకోవాలని నాకనిపి౦చింది .<<
మంచి విషయం ప్రస్తావించారు. మనవాళ్ళు అన్నీ నేలపాలు చేస్తారు. అన్నీ కాలగర్భంలో కలిపేస్తారు. ముందు తరలకు ఒక్కటంటే ఒక్క ఆనవాలు కూడా వదలరు.

Durga Prasada Rao Chilakamarthi said...

Thank you Sir.