-:మహాత్మాగాంధీ
పై దండకం:-
‘కన్నకూతురు’
నాటకము ఆముజాల నరసింహమూర్తి, తోలేరు, భీమవరం .
-:మహాత్మాగాంధీ
పై దండకం:-
శ్రీమత్కరంచందు గాంధీ! స్వకీయాద్భుతోద్యన్మహాశక్తి
సంతోషి తాత్మీయసంబంధి!   హిందూ, ముసల్మాన్, మహాంభోధిసంధానకార్యైకపానీయసంధీ
! జగత్ స్తుత్య గాంభీర్యకంధీ! సమస్తప్రపంచైకబంధూ! సుధీలోకపూర్ణేందు!
సర్వప్రజాదాస్యవిచ్ఛేదకృద్రాజకీయోత్తమజ్ఞానసింధూ! భవత్తుల్యుడౌ సత్యవాక్పాలనామోఘసత్యాద్యహింసా,
దయా,sస్పృశ్యతావారాణత్యాగశౌచామల
స్వాంతుడీ యైదు ఖండంబులన్  ముందు జన్మించలేదంచు,
ముందైన జన్మించ బోడంచు(జేయెత్తి వాకృచ్చెదన్, ధర్మ సంస్థాపనార్థంబు నారాయణామ్శంబునన్
, భారతాంబామణీ పుత్ర రత్నంబవై పుట్టి యన్యాధిపాక్రాంతిసంబాధితస్వీయదేశీయ దారిద్ర్య  ఘోరాంధకారంబు నిర్మూలనంబుంబొనర్పంగ సత్యాగ్రహాపూర్వ
దివ్యాస్త్ర సంధానముం జేసి వేయించి యెవ్వారికిన్ లేశమాత్రంబు కష్టంబు నష్టంబు లేకుండ
ప్రత్యర్థులన్ నౌకలెక్కించి సంద్రంబు దాటించి దేశైక సౌభాగ్య సంధాన ధౌరేయులౌ భవ్య
రాజేంద్ర , పట్టాభి, నెహ్రూ, పటేల్ , టంగుటూరి ప్రకాశాది విద్వజ్జనస్కంధ పీఠంబులన్శాసనోద్భారమున్మోపి
శాంత్యోప దేశంబులన్ జేయుచున్ సర్వదేశాల కాదర్శనీయుండవై యుండి దింగ్నాగ వేదాత్మ  భూచంద్రమోబ్దంబునన్ (1948) దేహలీ పత్తనంబందు సభ్యాళితో
గూడి శ్రీరామనామ స్మృతిం జేయుచున్ దుష్ట గోడ్సే మతోన్మాది దుర్మారణాస్త్రప్రహారంబునన్నేలపై
వ్రాలి ప్రాణంబులన్ బాసి సత్కీర్తికాయుండవైనావు కాలత్రయాదర్శమూర్తీ! సుధీచక్రవర్తీ
! జగత్పూర్ణకీర్తీ! నమస్తే !     నమస్తే
!  నమస్తే !  నమ:                 
           
 
           
ఈ శతకాన్ని నాకు అందించిన ప్రముఖ
సాహితీ వేత్త శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యం గారికి సహస్రాధికకృతజ్ఞతలు . 
<><><>
No comments:
Post a Comment