ప్రశ్నోత్తర రత్నమాలికా Part-4
రచన:- శ్రీ శంకరాచార్యులు
సంక్షిప్త వివరణ :- డాక్టర్.
చిలకమర్తి దుర్గాప్రసాదరావు.
ఇది సంభాషణాత్మకమైన చిన్న గ్రంథం .
ఇందులో కొంతమంది శిష్యుల ప్రశ్నలకు శ్రీ శంకరభగవత్పాదుల వారి
సమాధానాలు ఉన్నాయి .ఇవి ఒక దేశానికి , కాలానికి , సంస్కృతికీ పరిమితమైనవి
కావు. సమస్త మానవాళి అభ్యుదయానికి తోట్పడేవి. ఇవి మనం ఆకళింపు చేసుకుని పిల్లలకు అర్థమయ్యే విధంగా నేర్పిస్తే
వారు ఉత్తమ పౌరులుగా తయారౌతారు అనడంలో
ఎటువంటి సందేహం లేదు.ఇవి మీకు సాధ్యమైనంత మందికి పంచి సహకరించండి. ఇది నా సవినయ
ప్రార్థన.
1. ప్రశ్న :- కో అంధ: ? ఈ లోకంలో ఎవడు
గ్రుడ్డివాడు?
సమాధానం
:- యో అకార్యరత: ఎవడు చేయకూడని
పనులు చేయడంలో ఆ శక్తి చూపిస్తాడో అతడే నిజమైన గ్రుడ్డివాడు.
2. ప్రశ్న :- కో బధిర: ? ఎవడు చెవిటి
వాడు ?
సమాధానం :-యో హితాని న శృణోతి. ఎవడు ఇతరులు మంచి చెప్పినా వినిపించుకోడో
వాడే నిజమైన చెవిటి వాడు.
. ప్రశ్న :- కో మూక:?
ఎవడు మూగవాడు ?
సమాధానం :- య: కాలప్రియాని వక్తుం న జానాతి?
ఎవనికి సమయోచితంగా ఇతరులతో ప్రియంగా
మాట్లాడడం తెలియదో వాడు మూగవాడు.
4. ప్రశ్న :- కిం దానం ? ఏది దానము
సమాధానం :-అనాకాంక్షం
మనం ఇతరులనుండి ఎటువంటి ప్రతిఫలం ఆశించ కుండ
ఇతరులకిచ్చేది దానం అనిపించు కొంటుంది . ఏ చిన్న ప్రతి ఫలాన్ని ఆశించినా అది దానం
అనిపించుకోదు.
5. ప్రశ్న :- కిం మిత్రం ? ఎవరు నిజమైన
మిత్రుడు ?
సమాధానం :-యో నివారయతి పాపాత్ . ఎవడు
మనలను పాపపు పనులు చేయకుండా నివారిస్తాడో అతడే నిజమైన మిత్రుడు. భర్తృహరి
మంచిమిత్రుని లక్షణాలు వర్ణిస్తూ
“పాపాన్నివారయతి యోజయతే హితాయ
గుహ్యం నిగూహతి గుణాన్ ప్రకటీకరోతి
ఆపద్గతం చ న జహాతి దదాతి కాలే
సన్మిత్రలక్షణ మిదం ప్రవదంతి సంత:” అంటాడు. మంచి మిత్రుడు 1. మనల్ని తప్పు పనులు చెయ్య నివ్వడు . 2. మంచిపనులు
చేసేలా ప్రోత్సహిస్తాడు. 3. రహస్యాలను దాచి ఉంచుతాడు. 4. మనలోని మంచిని వెలికితీస్తాడు.
5. మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని విడిచిపెట్టడు. 6. సమయానుసారగా మనకు సహాయం
చేస్తాడు.
మనిషికి ఏది అమూల్యమైన అలంకారము
సమాధానం :-శీలమ్. శీలమే మనిషికి ఏది
అమూల్యమైన అలంకారము
7. ప్రశ్న :- కిం వాచాం మండనం ? వాక్కుకు
ఏది అలంకారము ?
సమాధానం
:- సత్యం . సత్యమే వాక్కుకు అలంకారము.
8. ప్రశ్న :- విద్యుద్విలసితం చపలం కిమ్
? మేఘం లోని మెరుపువలె ఏది చంచలమైనది.
సమాధానం :-దుర్జన సంగతి: యువతయశ్చ . .
9. ప్రశ్న :- కుశలిన: నిష్ప్రకంపా:
కే కలికాలేsపి? ఈ కలికాలంలో కూడ ఎటువంటి ఒడుదుడుకులు
లేకుండా క్షేమంగా ఎవరు ఉండ గలరు?
సమాధానం :-సజ్జనా: ఏవ. సజ్జనులు మాత్రమే ఉండగలరు
10. ప్రశ్న :- చింతామణిరివ దుర్లభమిహ కిం
? చింతామణి వలె పొంద శక్యముకానిది ఏది?
సమాధానం :-కథయామి తత్ చతుర్ భద్రమ్
అవి నాలుగు ఉన్నాయి
11. ప్రశ్న :- కిం తద్వదంతి భూయో విధూత
తమసో విశేషేణ.
అజ్ఞానాన్ని
పోగొట్టగల ఆ నాలుగు ఏవి?
సమాధానం
:- దానం ప్రియవాక్సహితం; జ్ఞానమగర్వం;
క్షమాన్వితం శౌర్యం; విత్తం త్యాగసమేతం; దుర్లభమేతచ్చతుర్ భద్రమ్.
ప్రియమైన
వాక్కులతో కూడిన దానం , గర్వం లేనట్టి జ్ఞానం , శక్తి గలిగి ఉన్నప్పటికి సహనం
చూపించడం , త్యాగంతో కూడిన ధనం ఈ నాలుగు పరస్పర విరుద్ధమైన గుణాలు . ఇవి ఒకచోట
ఉండడం చాల దుర్లభం .
12. ప్రశ్న :- కిం శోచ్యం – ఏది విచారింపదగినది?
సమాధానం
:- కార్పణ్యం. కుత్సితమైన, సంకుచితమైన స్వభావం.
13. ప్రశ్న :- సతి విభవే కిం
ప్రశస్తం? సంపదలు కలిగినప్పుడు ఏది ఉత్తమము ?
సమాధానం
:- ఔదార్యం. ఉదారమైన బుద్ధి.
14. ప్రశ్న :- క: పూజ్య: విద్వద్భి: విద్వాంసుల
చేత సైతం పూజింపదగిన వాడు ఎవడు ?
సమాధానం :- స్వభావత: సర్వదా వినీతో య: ఎవడు స్వభావంతో వినయం కలిగి ఉంటాడో అతడే
విద్వాంసుల చేత సైతం పూజింపదగిన వాడు. వినయం తెచ్చి పెట్టుకొని నటించడం కాదు ,
అది మన స్వభావం అయిపోవాలి.
15. ప్రశ్న :- క: కుల కమల దినేశ:? ఎవడు
వంశమనే కమలానికి సూర్యుని వంటి వాడు ? వంశాన్ని ప్రకాశింప చేసేవాడు
సమాధానం :-సతి గుణవిభవేsపి యో వినమ్ర: . ఎంత సంపద కలిగినా , ఎన్ని మంచి గుణములు
కలిగినా వినయంగా ఉండేవాడు వంశాన్ని ప్రకాశింప చేస్తాడు .
16. ప్రశ్న :- కస్య వశే జగదేతత్ ? ఈ సమస్త ప్రపంచం
ఎవరి అధీనంలో ఉంటుంది?
సమాధానం
:- ప్రియహితవచనస్య, ధర్మనిరతస్య ప్రియం
గాను, హితం గాను , మాట్లాడే వానికి, ధర్మనిరతునకు ఈ ప్రపంచం ఎప్పుడు లోబడే ఉంటుంది
.
సమాధానం
:- సత్కవితా, బోధవనితా చ. మంచి కవిత్వము
, జ్ఞానమనే వనిత ఈ రెండు పండితులకు మనోహరాలు.
18. ప్రశ్న :- కం న స్పృశతి విపత్తి:
?
ఎవరిని ఎటువంటి కష్టము దరిజేరదు?
సమాధానం :- ప్రబుద్ధ వచనాను వర్తినం దాంతం.
జ్ఞానులైన పెద్దల మాటలు అనుసరించి ప్రవర్తించే
వానిని, ఇంద్రియనిగ్రహం కలవానిని ఎటువంటి కష్టము దరిజేరదు.
19. ప్రశ్న :- కస్మై సహాయతి కమలా
? లక్ష్మి ఎవరిని అనుగ్రహిస్తుంది ? సమాధానం :-అనలసచిత్తాయ, నీతివృత్తాయ .
సోమరితనం లేని వానిని , నీతిమంతుని లక్ష్మి అనుగ్రహిస్తుంది.
20. ప్రశ్న :- త్యజతి కా కం సహసా ? ఆమె (లక్ష్మి) ఎవరిని వెంటనే విడిచి పెట్టేస్తుంది?
సమాధానం :- ద్విజ - గురు - సుర- నిందాకరం, చ సాలసం .
లక్ష్మి, బ్రాహ్మణులను - గురువులను – దేవతలను - నిందించేవానిని,
సోమరితనం గలవానిని వెంటనే విడిచి పెట్టేస్తుంది.
<><><>
No comments:
Post a Comment