Friday, May 4, 2012

అదీ అసలు సంగతి


దేవతలు రాక్షసులు లిసి అమృతం కోసం పాలసముద్రాన్ని చిలకడం మొదలు పెట్టారని ముందుగా హాలాహలం వచ్చిందని అది ముల్లోకాల్ని నాశనం చేస్తోంటే అందరు భయపడి శివుణ్ణి వేడుకన్నారని ఆయన లోకకళ్యాణాన్ని కాంక్షించి అర్థాంగి యైన అమ్మవారి అనుమతితో కాలకూటవిషం త్రాగాడని పురాణాలు చెబుతున్నాయి. కానీ ఇనన్నీ అబద్ధాలు అసలు సంగతి వేరే ఉందంటాడు ఒక హాస్యకవి. అదేంటో మీకు తెలుసుకోవాయిలనిపిస్తే ఇది చదవండి.
ఇంటిలోని పోరు ఇంతింత గాదయా అన్న వేమన మాటలు అక్షరసత్యాలే.
వినాయకుడు శివుని కొడుకు. ఆయన గారి వాహనం మనలు తెలిసిందే ఒక చిన్న ఎలుక. శివుడు నాగాభరణుడు. ఆకల్తో అలమటిస్తూ శివుని మెళ్లో వేళ్లా డుతున్న పాము ఆ ఎలకని ఎప్పుడు తినెద్దామా అని అవకాశం కోసం కనిపెట్టు క్కూర్చుంది. అవకాశం మాత్రం దొరకడం లేదు. ఇక ఆ పాముని ఎలా స్వాహా చేద్దామా అని కుమారస్వామి వాహనం నెమలి ఎదురుచూస్తోంది. ఎందుకో గాని దగ్గరకు రాలేక పోతోంది. పార్వతి వాహనం సింహం అది ఏనుగు మొగం కలిగిన వినాయకుణ్ణి గుట్టుచప్పుడు కాకుండా నమిలెయ్యడానికి సిద్ధంగా ఉంది. ఇక సవతులమధ్య కయ్యం సర్వసాధారణం.చెట్టంత మనిషి తనుండగా ఎవర్నో నెత్తెక్కించుకున్నందుకు పార్వతి శివుణ్ణి ఏమీ అనలేక సవతియైన గంగని దుమ్మెత్తి పోస్తోంది. గంగ ఎలాగో సహిస్తోంది కాని ఎంతకాలం సహిస్తుంది. ఎప్పటి కైన తిరగబడ్డం ఖాయం. ఇక శివుని నొసట నున్న మూడవ కన్ను (అగ్ని) ఆ ప్రక్కనే ఉన్న చంద్రుణ్ణి మాడ్చేస్తున్నాడు. ఎంతటి వాడైన ఒక సమస్య ఐతే తట్టు కుంటాడు రెండు సమస్యలైతే తట్టుకుంటాడు . కానీ ఈయనకు అన్నీ సమస్యలే. అందులోను అన్నీ కుటుంబసమస్యలే. అందరు కావలసిన వాళ్లే . ఒకర్ని కాదంటే ఇంకొకరిక్కోపం. అందుకే ఆ పని చేశాడు. ఇదంతా కల్పన సుమండి . విని ఆనందించండి. నిజమని మాత్రం అనుకోకండి.
అత్తుం వాంఛతి వాహనం పశుపతే రాఖుం క్షుధార్త: ఫణీ
తం చ క్రౌంచపతే: శిఖీ చ గిరిజా సింహోపి నాగాననం
గౌరీ జహ్నుసుతామసూయతి కళానాథం కపాలానలో
నిర్విణ్ణ: స పపౌ కుటుంబకలహాదీశోపి హాలాహలమ్.***

No comments: