Thursday, April 10, 2014

ప్రమాదో ధీమతామపి

ప్రమాదో ధీమతామపి
డా|| చిలకమర్తి దుర్గాప్రసాదరావు.
సోక్రటీసు (469 B.C) శిష్యుడు ప్లేటో. ప్లేటో(427 B.C) శిష్యుడు అరిష్టాటిల్. అరిష్టాటిల్ ( 384 B.C) శిష్యుడు అలగ్జాండర్ ది గ్రేట్. అరిష్టాటిల్ మహా మేధావి. తర్క (Logic), అలంకార( Rhetoric) , భౌతిక ( physics) , వృక్షBotany), జంతు( Zoology) , మనోవిజ్ఞాన ( Psychology), నైతిక( Ethics) , ఆర్ధిక ( Economics), రాజనీతి( Politics), తత్త్వ( Philosophy) శాస్త్రాల్లో ఆయన స్పృశించని అoశమేమీ లేదంటే అతిశయోక్తి కాదు. ఆయన అనేక గ్రంథాలు రచిoచారు.  ఆయన తండ్రి              నికోమచుస్( (Nicomachus) మేసిడన్ రాజు ఫిలిప్ యొక్క  ఆస్థాన వైద్యుడు. అరిష్టాటిల్   తన పదునేడవ ఏట ప్లేటో అకాడమీ లో శిష్యుడుగా చేరాడు. సుమారు 20 సo|| పాటు విద్యార్ధి గాను, అధ్యాపకుని గాను పని చేశాడు ప్లేటో (క్రి.పూ .347) లో మరణించగా ఎథెన్స్ విడిచి ఎక్కడెక్కడో సoచరించి తిరిగి కొంతకాలానికి ఏథెన్స్ చేరుకొని విద్యాసంస్థను స్థాపించాడు. ఫిలిప్ రాజు తనకుమారుడైన అలగ్జాండరును అరిష్టాటిల్ దగ్గర చేర్పిoచి    చదివించాడు. ఈయన నడుస్తూనే విద్యార్థులoదరికి పాఠాలు చెబుతూ ఉండేవాడు. అలగ్జాండర్ 323 లో ఆకస్మికంగా మరణిoచడంతో  అతని విరోధులైన కొంతమంది అరిష్టాటిల్ పై దైవదూషణగా నేరం మోపి ఎథెన్స్ నుంచి బహిష్కరించారు. ఆయన యుబోయియ  నగరo  చేరుకుని అక్కడే క్రి. పూ. 322లో తుది శ్వాస విడిచారు.
           ఈయన జీవశాస్త్రంలో కూడ గొప్ప పండితుడే ఐనప్పటికీ ఆనాటి మతాచారాలకు కట్టుబడియుoడవలసిన కారణంగా శరీర భాగాలను కోసి, సమగ్రంగా చూసి నిర్ధారణ చేయకుండానే కొన్ని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అవి నేడు వాస్తవానికి విరుద్ధంగా కన్పిస్తున్నాయి. అవేమిటో చూద్డాం.  
.               1.  ఆయన జ్ఞానానికి  స్థానం గుండె అని అభిప్రాయ పడ్డారు
   2. మెదడు (మస్తిష్కం) కేవలం గుండెను చల్లబరచడానికి సాధనంగ ఉపయోగ          పడుతుoదని భావించారు.
3 . మనిషికి రెండుప్రక్కల ఎనిమిదేసి ఎముకలుoటాయని    అబిప్రాయపడ్డారు.
4. ఆడవాళ్ళకు  మగవారికoటే తక్కువ దంతాలు  ఉంటాయని వాదించారు.
5. వృక్షాల్లో పునరుత్పత్తి లైంగికసంపర్కం ద్వారా సాధ్యపడదని దానికి వేరొక మార్గం ఉంటుoదని అనుకున్నారు .
6. గ్రుడ్డులో జివపదార్థం ముందుగానే ఏర్పడదని  అభిప్రాయపడ్డారు.
7. స్త్రీ సమగ్రమైనది కాదని, అసమగ్రమైన పురుషరూపమే స్త్రీ అని వాదించారు.
8. గుండెకు ధమనులు మంచిరక్తం , సిరలు చెడురక్తం అందింస్తాయి.
కాని ఈ వాస్తవవాన్ని గ్రహించని అరిష్టాటిల్ ధమనులకు    సిరలకు పెద్ద తేడ ఏమిలేదన్నారు. ఇంకా కొన్ని ఉన్నాయి. ఇవి ముఖ్యమైనవి. అందుకే ప్రమాదో ధీమతామపి అన్నారు మన పెద్దలు.
( ఆధారం హిస్టరీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ- డాక్టర్ . ఆర్ . వెంకట్రామన్ )
.


No comments: