Wednesday, July 1, 2015

బెజవాడ-బందరు railway route

బెజవాడ-బందరు railway  route

సంస్కృతభాష  చాల విస్తృతమై౦ది. ఎటువంటి భావాన్నైనా సంక్షిప్తం(brief)గా చెప్పగల శక్తి ఆ భాషకుంది.  అన్ని పురాణాల పేర్లను ఒక చిన్న అనుష్టుప్ శ్లోకంలో బంధించడ౦ మనందరికీ తెలిసిందే. 
మద్వయం భద్వయం చైవ
బ్రత్రయం వచతుష్టయం
అనాపలింగ కూస్కాని
పురాణాని పృథక్ పృథక్

కారంతో మొదలయ్యేవి రెండు. మత్స్య పురాణం, మార్కండేయపురాణం. కారంతో మొదలయ్యేవి రెండు. భవిష్యపురాణం, భాగవతపురాణం. బ్రత్రయం అ౦టే బ్ర అనే అక్షరంతో మొదలయ్యేవి మూడు. అవి బ్రహ్మపురాణం, బ్రహ్మాండపురాణం, బ్రహ్మవైవర్తపురాణ౦. కారంతో మొదలయ్యేవి నాలుగు. వాయుపురాణ౦, విష్ణుపురాణం, వామనపురాణం,  వరాహపురాణ౦. అ - అగ్నిపురాణం, నా -నారదపురాణ౦, ప - పద్మపురాణం, లిం-  లి౦గపురాణ౦, గ - గరుడపురాణం, కూ - కూర్మపురాణ౦, స్కా- స్కాందపురాణం అని 18 పురాణాల పేర్లను ఇమడ్చగలగడం గొప్ప విషయమే.

అలాగే ఒక సంస్కృతపండితుడు బందరు వెళ్ళడానికి బెజవాడలో రైలెక్కారు. అదే బండిలో మరో వ్యక్తి ఆయన ప్రక్కన కూర్చొని ప్రయాణ౦ చేస్తున్నాడు. ఆయన బెజవాడ-బందరుకు మధ్యన గల ఎదో ఒక ఉరిలో దిగాలి. అదెప్పుడొస్తుందో అతనికి తెలియదు.  అందుకని  నా స్టేషన్ ఎప్పు డొస్తు౦ది? నా స్టేషన్ ఎప్పుడొస్తు౦ది? అని ఆతురతతో  పదే పదే అడుగుతూ ఆయన్ని విసిగిస్తున్నాడు. అందువల్ల అది తట్టుకోలేక ఆయన మొత్తం రూటు ఒక చిన్నపద్యంలో  అతనికంది౦ఛారు. ఆ పండితుని పేరు తెలియజేయలేకపోతున్నందుకు చింతిస్తున్నాను. ఆ పద్యం చూద్దా౦.

బెరాని ఉత ఇందోగు
నూకవప్పెచిమా: క్రమాత్
స్టేషన్సు బెబం శాఖాయాం
నూ క్రాస్యా దితి నిశ్చయ:
బెబం శాఖాయాం= బెజవాడ బందరు శాఖలో; స్టేషన్సు= స్టేషన్లు బె=బెజవాడ; రా=రామవరప్పాడు; ని=నిడమానూరు;  ఉ=ఉప్పలూరు; త=తరిగొప్పుల;  ఇం=ఇందుపల్లి ; దో= దోసపాడు ; గు= గుడివాడ ;
నూ= నూజెళ్ళ ; క=కవుతరం ; వ=వడ్లమన్నాడు; పె=పెడన;  చి=చిలకలపూడి;          మ= మచిలీపట్టణం
నూ= నూజెళ్ళలో ;  క్రాస్యాత్= క్రాసింగ్ కలదు ; ఇతి=అని ;  నిశ్చయ: = నిర్ణయము.
సంస్కృత౦ నేర్చుకో౦డి- సంక్షిప్తత(brevity) అలవరచుకో౦డి.
     

      

No comments: