Wednesday, September 28, 2016

ఎవరి తహతహ వారిది

ఎవరి తహతహ వారిది
డాక్టర్ .చిలకమర్తి దుర్గాప్రసాద రావు
బాలకృష్ణుని  తల్లి  యశోద.  ప్రతిరోజూ ఆమె పాలు, పెరుగులు చిలకలేక ఎన్నో అవస్థలు పడుతోంది. అది గమనించాడు బాలకృష్ణుడు. ఒకరోజు వాళ్ళ అమ్మతో ఇలా అంటున్నాడు  అమ్మా ! నువ్వెందుకు శ్రమ పడుతున్నావు. ఆగు  నేను చిలుకుతాను  అని ఒక పెద్ద కవ్వం తీసుకుని నిలబడ్డాడు . ఆయన కవ్వం చేత్తో పుచ్చుకుని నిలబడే సరికి చాల మంది భయపడ్డారు , కొంతమంది సంతోషించారు. ఎవరు ఎందుకు భయపడ్డారో ఎవరు ఎందుకు సంతోషించారో తెలుసుకుందాం .  
ముందుగా వాసుకి సంగతి చూద్దాం . ఆయన ముఖం వ్రేళాడేసుకుని విచారంతో ఉన్నాడు . ఎ౦దుకంటే లోగడ ఒకసారి అమృతం కోసం పాలసముద్రం చిలికినప్పుడు ఆయన కవ్వపుత్రాడుగా ఉండవలసి వచ్చింది. పని పూర్తయ్యేటప్పటికి  వీపు చిట్లి పోయింది . మరల తనను పిలుస్తారేమోనని ఆయన భయం .  ఇక లక్ష్మి చాల అసూయతో ఉంది . ఎ౦దుకంటే లోగడ పాలసముద్రం మథించినప్పుడు తాను పుట్టింది . తనను విష్ణువు పెళ్లి చేసుకున్నాడు . ఈ సారి పాలను మథిస్తే మరలా ఎవరో పుడతారు, ఆమె తనకు  సవతి ఔతుందేమో అని  ఆమె భయం. ఇక దేవతలందరు మాత్రం  చాల ఆనందంగా ఉన్నారు . ఎ౦దుకంటే ఈ సారి క్షీరమథనం జరిగితే మరల అమృతం పుడుతుందని  అది కూడ త్రాగెయ్యవచ్చని వాళ్ళ ఆశ. ఇక రాహువు భయం భయంగా చూస్తున్నాడు . ఎ౦దుకంటే  లోగడ పాలసముద్రంనుంచి అమృతం పుట్టి నప్పుడు దానికోసం దేవతలు రాక్షసులు ఇద్దరు నిలబడ్డారు . విష్ణువు జగన్మోహిని రూపంలో వచ్చి దేవతలకు మంచి అమృతం , రాక్షసులకు కల్తీ అమృతం పంచుతున్నాడు. ఇది గ్రహించిన రాహుకేతువులు దేవతలపంక్తిలో దూరేరు. విష్ణువు అమృతం పంచుకుంటూ పోతున్నాడు. తమ పంక్తిలో రాహుకేతువుల ఉనికిని గమనించిన సూర్యచంద్రులు ఆ విషయాన్ని విష్ణువుకి చెప్పారు. అప్పటికే విష్ణువు పోసిన అమృతం అందుకుని త్రాగేశాడు  రాహువు. ఆ  తలను విష్ణువు ఖండించినప్పటికీ  అమృతం సేవించడంవల్ల తలభాగం  సజీవంగానే ఉ౦డి పోయింది . మళ్ళా అటువ౦టిదేదైనా జరిగితే ఉన్న ఒక్క తల పోతుందేమోనని ఆయన భయపడుతున్నాడట. ఒక్క నిర్ణయం ఎంతమందిని ఎన్ని విధాలుగా ఆలోచించేలా చేసిందో చూడండి . అటువంటి   గోపాలబాలుడైన హరి మీకు శుభములను ప్రసాదించు గాక అని కవి అందరిని ఆశీర్వదిస్తూ ఈ శ్లోకం  రచించాడు  
అంబ! శ్రామ్యసి తిష్ఠ గోరసమహం మథ్నామి మంథానకం
ప్రాలంబ్య స్థితమీశ్వరం సరభసం దీనాననో వాసుకి:
సాసూయం కమలాలయా సురగణ: సానంద ముద్యద్భయం
రాహు: ప్రైక్షత యం స వోs స్తు శివదో గోపాలబాలో హరి:
अम्ब ! श्राम्यसि तिष्ठ गोरसमहं मथ्नामि मन्थानकं
प्रालंब्य स्थितमीश्वरं सरभसं दीनाननो वासुकि:
साsसूयं कमलालया सुरगण: सानन्दमुद्यद्भयं
राहु: प्रैक्षत यं स वोsस्तु शिवदो गोपालबालो हरि:   
                                  *****


  

              

Tuesday, September 27, 2016

రాధ ఎత్తు – కృష్ణుడు చిత్తు

రాధ ఎత్తు – కృష్ణుడు చిత్తు
డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాద రావు

రాధాకృష్ణుల అనురాగం లోకానికే ఆదర్శం. రాధ జీవాత్మకు కృష్ణుడు పరమాత్మకు ప్రతీకలు . కృష్ణుని పొందు కావాలనే రాధ కోరిక పరమాత్మలో లీనం కావాలనే జీవాత్మ ఆవేదనను సూచిస్తుంది. అందుకే భక్తులకు వారిద్దరి  కలయిక కేవల శృగారం కాక  విగళిత వేద్యా౦తరమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగిస్తుంది . ఆమె ఒక్క క్షణమైనా కృష్ణుని విడిచి ఉండలేదు . రాధ ఒకసారి  అతనికోసం ఎదురు చూసి చూసి విసిగి వేసారి పోయింది .  ఇక ఆయన  రాడని నిశ్చయించుకుని తలుపులు వేసేసుకుంది. ఆయన చాల ఆలస్యంగా  ఇంటికి చేరాడు . లోపలకు వెళ్ళకుండా గుమ్మం దగ్గరే నిలబడ్డాడు . రాధ  కిటికీ లోంచి అతన్ని చూసింది . అసలే ప్రణయకోపంతో ఉందేమో ఆమెకు తలుపు తియ్యాలనిపి౦చ లేదు. అతన్ని ఒక ఆట పట్టించాలనుకుంది. కోయం ద్వారి? అని ఒక ప్రశ్న వేసింది గుమ్మం దగ్గర ఉన్నదెవరు? అని ఆ మాటలకర్థం. వెంటనే కృష్ణుడు హరి: అన్నాడు . నేను కృష్ణుణ్ణి అని ఆయన  సమాధానం. కానీ హరి అనే పదానికి చాల అర్థాలున్నాయి . వాటిలో కోతి అనే అర్థం కూడ ఉంది. అది తీసుకుంది రాధ. వెంటనే  ప్రయాహ్యుపవనం శాఖామృగస్యాత్ర కిం ? అంది . నువ్వు కోతివైతే అడవుల్లోకి పో. ఇక్కడేం పని ? అంది.   కృష్ణుడు గతుక్కుమన్నాడు . వెంటనే   కృష్ణోsహం దయితే అన్నాడు అమాయకంగా.   ఓ ప్రియురాల! నేను కృష్ణుణ్ణి గుర్తుపట్టలేదా అన్నాడు. కృష్ణపదం నామవాచకంగా తీసుకుంటే కృష్ణుడు అనే అర్థం వస్తుంది . విశేషణ౦గా తీసుకుంటే నలుపు అని అర్థం . రాధ విశేషణంగా తీసుకుని  బిభేమి సుతరాం కృష్ణాదహం వానరాత్ అంది . నల్లకోతివా! అదంటే నాకు చాల భయం అని ఆ మాటలకర్థం. వెంటనే కృష్ణుడు రాధేsహం మధుసూదన: అన్నాడు. ఓ రాధా ! నన్ను పోల్చుకోలేదా నేను మధు అనే పేరుగల రాక్షసుణ్ణి చంపినవాణ్ణి (కృష్ణుణ్ణి) అన్నాడు. ఈ సారి తప్పక గుర్తుపట్టి తలుపు తీస్తు౦దనుకున్నాడు. కాని మరల ఎదురుదెబ్బే తగిలింది . మధుసూదన అనే పదానికి రెండర్థాలున్నాయి . ఒకటి కృష్ణుడు రెండో అర్థం తుమ్మెద . మధు అంటే తేనే సూదన అంటే హరించేది (తుమ్మెద) .   ఈవిడ రెండో అర్థం తీసుకుంది . అటైతే  వ్రజ లతాం తామేవ పుష్పాన్వితా౦ అంది . ఎక్కడైనా పువులున్న లత చూసుకుని అక్కడికి పో . ఇక్కడి కెందుకొచ్చావ్? అంది . ఈ విధంగా రాధ ఎత్తుగడలతో కూడిన వాక్కులకు చిత్తుగా ఓడిపోయి అవాక్కై నిలిచిన  ఆ కృష్ణుడు మిమ్ము రక్షించుగాక అని ఆశీర్వదిస్తూ కవి ఈ శ్లోకం రచించాడు . రాధ ప్రణయకోపంతో  చిత్తుగా ఓడి౦చినా చివరకు తన ప్రాణనాథుని లోపలకు ఆహ్వానించి హృదయానికి హత్తుకునే ఉంటు౦దని భావిద్దాం .     

కోsయం ద్వారి? హరి: ప్రయాహ్యుపవనం శాఖామృగస్యాత్ర కిం ?
కృష్ణోSహం దయితే బిభేమి సుతరాం కృష్ణాదహం వానరాత్
రాధేsహం మధుసూదనో వ్రజ లతాం తామేవ పుష్పాన్వితా
మిత్థం నిర్వచనీకృతో దయితయా హ్రీణో హరి: పాతు వ:   
(కాశ్మీర వల్లభదేవుని సుభాషితావళి ---104)

<><><> 














Monday, September 26, 2016

అధ్యాపక చతుష్టయం ( The four types of teachers )

అధ్యాపక చతుష్టయం
( The four types of teachers )
డాక్టర్ . చిలకమర్తి దుర్గాప్రసాద రావు
వేదానికి నిఘంటువు రచించిన యాస్కమహర్షి అధ్యాపకుడు అనే అర్థంలో ఆచార్య పదాన్ని  మూడు విధాలుగా నిర్వచించారు.
1. ఆచరతి ఇతి ఆచార్య: ( ఉన్నతమైన విలువలను ఆచరించేవాడు ).
2. ఆచారం గ్రాహయతి ఇతి ఆచార్య: ( ఉన్నతమైన విలువలను శిష్యులకు బోధించేవాడు ).
3. ఆచినోతి అర్ధాన్ ఇతి ఆచార్య: ( ఎల్లప్పుడు విద్యార్థులకు కావలసిన జ్ఞానాన్ని సంపాదించి వారికి అందజేస్తూ ఉండేవాడు). ఈ మూడు ఆనాటికి ,  ఈ నాటికి ఏనాటికి కూడ తిరుగులేని  నిర్వచనాలు .

ఇక మనుషుల్లో సజ్జనులు , మధ్యములు , అధములు , అధమాధములు  అని  నాలుగు రకాల మనుషులున్నట్లే అధ్యాపకులలో కూడ నాలుగురకాలవాళ్ళు ఉంటారు .
కొంతమంది విద్యార్థిదశలో చాల మేధావులుగా ఉంటారు. ఎంతో కృషిచేస్తారు . అపారమైన  జ్ఞానాన్ని సంపాదిస్తారు . అలాగే అధ్యాపక వృత్తిలో ప్రవేశించాక కూడ అదేవిధంగా నిరంతర౦  విద్యావ్యాసంగం చేస్తూ విద్యార్థులకు ఎంతో మేలు చేకూరుస్తారు. వీరు ఉత్తమోత్తమ అధ్యాపకులు.
మరికొంతమంది ఉంటారు. వారు విద్యార్థిదశలో అంత చురుకుగా ఉండరు . కాని ఏదో విధంగా అధ్యాపకవృత్తిలో ప్రవేశించాక నిరంతరం విద్యావ్యాసంగం చేస్తూ విద్యార్థులప్రగతి కోసం పాటుపడుతూనే  ఉంటారు . వీరు ఉత్తమ అధ్యాపకులు .
ఇంకొంత మంది ఉంటారు . వారు విద్యార్థిదశలో చాల చురుకుగా ఉంటారు. కాని అధ్యాపకవృత్తిలో ప్రవేశించాక  అసలు పుస్తకం తియ్యరు. తమకు గుర్తున్నదీ తెలుసున్నదేదో చెప్పేస్తూ ఉంటారు. బండ గురో: మొండి శిష్యా: అన్నట్లు విద్యార్థులు  వాళ్ళు చెప్పింది వినేస్తూ ఉంటారు .   వీరు ఉత్త అధ్యాపకులు.
ఇంకా కొంతమంది ఉంటారు. వారు విద్యార్థిదశలో చాల నిస్తేజం(dull)గా ఉంటారు, ఏదో విధంగా అధ్యాపకవృత్తిలో ప్రవేశిస్తారు. వృత్తిలో ప్రవేశించిన తరువాత కూడ మందకొడి(dull)గానే ఉంటారు. పుస్తకం ముట్టరు. క్లాసులోకి అడుగు పెట్టరు. ఏదో రకంగా సమయం గడిపేస్తారు . వీరు చెత్త అధ్యాపకులు.  

<><><><><> 

Friday, September 16, 2016

గడుసరి కొడుకు

గడుసరి కొడుకు
(ఈ కథ A wise son అనే ఆంగ్లకథకు స్వేచ్ఛానువాదం)
పూర్వం ఫ్రాంసుదేశంలోని  Abbeville అనే నగరంలో ఒక వ్యాపారి ఉండేవాడు. ఆయనకొక భార్య, ఒక కొడుకు ఉన్నారు.  ఆ వ్యాపారి పట్టణంలో తనకంటే అంగబలం, అర్థబలం ఉన్న  సాటివ్యాపారస్థుల ధాటికి తట్టుకోలేక ఆ ఊరు విడిచిపెట్టి రాజధాని నగరం ప్యారిస్ లో స్థిరపడ్డాడు.  ఒక దుకాణం తెరిచి వ్యాపారం ప్రారంభించి  స్వల్పకాలంలోనే అభివృద్ధి  పొందాడు. ఆయన నీతిమంతుడు, భార్య అనుకులవతి, కొడుకు వినయవిధేయతలు కలవాడు అవడంతో అందరు ఇరుగుపొరుగువారి ఆదరాభిమానాలు, ప్రశంసలు పొందారు. జీవిత౦  ఆనందమయంగా గడుస్తోంది.
ఈ విధంగా సుమారు ఏడు సంవత్సరాలు గడిచాయి. ముప్పై ఏళ్ల నుండి తనకు చేదోడువాదోడుగా ఉండి జీవితం సుఖమయం చేసిన భార్య కన్నుమూసింది. తన ఏకైక పుత్రుడు తల్లి మరణానికి  ఎంతో విలపించాడు. వ్యాపారి దీనంగా విలపిస్తున్న కుమారుణ్ణి ఓదారుస్తూ నాయనా! మీ అమ్మ దేవుని దగ్గరకెళ్ళిపోయింది. నువ్వు ఏడవకు.  కళ్ళు తుడుచుకో. నువ్వు ఎంత ఏడ్చినా ఆమె తిరిగి రాదు. మనం కూడ ఎప్పటికైనా  వెళ్లి పోవలసిన వాళ్ళమే. నీకు పెళ్లి వయసు వచ్చి౦ది.  నేనెంతో కొంత సంపాదించాను. మన తాహతుకు సరిపోయే మంచికుటు౦బం నుంచి  పిల్లను తెచ్చి నీకు  పెళ్ళిచేస్తా. నా ఆస్త౦తా నీకు రాసిచ్చేస్తా. నువ్వు జీవితాంతం సుఖంగా ఉండొచ్చు అన్నాడు .
ఆ ప్రాంతంలో ఉన్నతకుటుంబానికి చెందిన ముగ్గురన్నదమ్ములు ఉంటున్నారు. వాళ్ళు ఒకప్పుడు బాగా బ్రతికినవాళ్ళే గాని మితిమీరిన విలాసాలవల్ల  ప్రస్తుతం ఆర్థికంగా చితికిపొయారు. ఆ ముగ్గురిలో పెద్దవాడికో కూతురుంది. ఆమెకు తల్లి లేదు. ఈ వ్యాపారి నివసిస్తున్న ప్రా౦త౦లోనే ఆమెకు తనతల్లి వలన సంక్రమి౦చిన ఇల్లొకటు౦ది. దాని వల్ల ఆమెకు కొంత ఆదాయం కూడ వస్తూ ఉంటుంది. ఆమె అందానికి, ఆర్ధికస్థితికి ఆకర్షితుడైన వ్యాపారి ఆమెను తన కోడలిగా చేసుకోవాలనుకున్నాడు. ఆమె త౦డ్రి దగ్గర కెళ్ళి నేను సహజంగా ధనవంతుణ్ణి . అంతేగాక నేను న్యాయమార్గంలో వ్యాపారం కూడ చేసి  చాల డబ్బు కూడ బెట్టాను. నా ఆస్తిలో సగం మా అబ్బాయికి రాసిస్తాను . పెళ్లి చేసుకున్నాక ఆ డబ్బుతో సుఖంగా విలాసాలతో  బ్రతకచ్చు. మీ అమ్మాయిని మా అబ్బాయికివ్వండి అనడిగాడు. ఈ ఒప్పందం పిల్లతండికి  నచ్చలేదు. ఏమయ్యా ! నీవొక వేళ సన్యాసివైతే ఏం చేసేవాడివి ? నీఆస్తంతా ఏ చర్చికో రాసేసి ఉండేవాడివి కాదా! నీ కొడుకు విషయంలో ఇంత స్వార్థంగా ప్రవర్తించడం ఏ౦ న్యాయం? అన్నాడు అసహనంగా . అతని మాటలకు చాల బాధపడ్డాడు వ్యాపారి. ఐతే ఏ౦ చెయ్యమంటావో చెప్పు  అన్నాడు. నీ ఆస్తంతా నీ కొడుకు  పేర వ్రాయాలి . అంతేకాదు. నీ తరువాత కూడ అందులో ఎవరికీ వాటా ఉండకూడదు. ఈ నియమం నువ్వంగీకరిస్తేనే నా పిల్లనిస్తాను . ఇందులో ఎటువంటి బేరాలు లేవు. నువ్వాలోచించుకుని నీ నిర్ణయం తెలియ జెయ్యి అని ఖచ్చితంగా నొక్కి చెప్పేశాడు. వ్యాపారి విధిలేక ఆ షరతులన్ని అంగీకరించి తన యావదాస్తి తన కొడుకు పేర వ్రాసి ఇచ్చేశాడు. ఎప్పుడైనా కాఫీ తాగాలంటే తన కొడుకునడిగి తీసుకోవలసి౦దే గాని తనవద్ద చిల్లిగవ్వకూడ లేదు . పిల్ల తండ్రి ఆనందించాడు . పెళ్లి ఘనంగా జరిగి పోయింది .              
రెండు సంవత్సరాలు కొత్త దంపతులకు సుఖంగా దొర్లి పోయాయి. వారికొక కొడుకు పుట్టాడు . వ్యాపారి వాళ్ళతోనే ఉంటున్నాడు. కాని యావదాస్తి కొడుక్కి రాసి ఎంతో తప్పు చేశాననే విషయం  రానురాను అతనికి తెలుస్తూ వచ్చింది. ఇంట్లో తననెంత ఈసడించుకు౦టున్నా అన్ని మౌనంగా భరిస్తూ పన్నెండేళ్ళు గడిపాడు. మనవడు తాను పెద్దవాడౌతున్నకొద్ది ఆ ఇంట్లో  తన తాత పడుతున్న  దు:స్థితి అర్థమవ్వడం మొదలైంది.
కొంతకాలానికి వ్యాపారి చాల ముసలివాడైపోయాడు. శరీరం శుష్కించి పోయింది నడుం వంగిపోయింది. కొడుకు, తనతండ్రి ఇంట్లో ఉండడం భరించలేకపోతున్నాడు.
వాడు తండ్రి మరణం తర్వాత జరగవలసిన కార్యక్రమానికి డబ్బు కూడ చెల్లించేశాడు .  అతని భార్య చాల కటువుగా ప్రవర్తించడం మొదలెట్టింది.  ఒకరోజు తన భర్తతో నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నట్లయితే మీ
నాన్నను ఎక్కడికైనా బయటకు పంపి౦చెయ్యి.  ఆతన్ని చూస్తుంటే  నాకు అన్నం కూడ సయించడం లేదు.  నీకు నా  ఆరోగ్య౦  మీద శ్రద్ద ఉంటే, నేను ప్రాణాలతో ఉండాలని ఉంటే మీ నాన్నని వెంటనే ఇంటినుండి పంపించెయ్ అంది. వాడు తనభార్య నిర్బ౦ధించడంతో వేరే దారిలేక తన తండ్రిని ఇంట్లోంచి పంపించెయ్యాలని నిశ్చయించుకున్నాడు . ఒక రోజు తండ్రితో నాన్నా ! నిన్ను నేను పన్నెండు సంవత్సరాలపాటు నా దగ్గరు౦చుకుని పోషించాను . ఇక నేటి నుంచి ఎక్కడికైనా పోయి బ్రతుకు . నువ్వు ఇక్కడు౦డడం మాకెవరికి ఇష్టం లేదు . వెంటనే ఈ ఇల్లు విడిచి పెట్టి ఎక్కడికైనా వెళ్లి పో. నీ తిప్పలు నువ్వు పడు అన్నాడు.   తండ్రి ఈ మాటలకు హతాశుడై పొయాడు.  గత కొన్నాళ్ళుగా ఇంట్లో తనను చిన్న చూపు చూస్తున్నా తన కొడుకు నోటి వెంట ఇటువంటి దారుణమైన మాటలు వినవలసి వస్తుందని అతనెపుడు అనుకోలేదు. తనవద్ద చిల్లిగవ్వకూడ ఉంచుకోకుండా మొత్తం ఉన్నదంతా కొడుక్కి ధారాదత్తం చేసేసినందుకు పరిపరివిధాల బాధపడ్డాడు. కొడుకుతో నాయనా! నువ్విలా అంటే నేనేం మాట్లాడతాను ? నేనింతవరకు నీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు. విలాసవంతమైన జీవితం నాకు చేకూర్చమని కూడా ఎన్నడు అడగలేదు. నాకిచ్చిన చిన్న చాపతోనే కాలం గడిపాను. నేనింక ఎంతో కాలం బ్రతకను .నేను బ్రతికినంతకాలం నాకు కాస్త అన్నం పెట్టు . దేవుడు నిన్ను రక్షిస్తాడు . నీ పాపాలన్నీ క్షమిస్తాడు . ఆ భగవంతుని ఆశీస్సులతో నువ్వు కలకాలం సుఖంగా బ్రతకాలని నా ఆశ అన్నాడు . కాని కొడుకు ఆతని ప్రార్థన వినిపించుకునే స్థితిలో లేడు. కోపంతో రెచ్చిపొతూ నాన్నా! నువ్వేం నాకు నీతులు చెప్పకు. ఒక వేళ నువ్వు బయటకు పోకపోతే మా ఆవిడ నిన్ను గెంటివెయ్యడం ఖాయం అన్నాడు నేనెక్కడికి పోతాను నన్నెవరు ఆదుకుంటారు అనడిగాడు తండ్రి . నగరానికి పో! అక్కడ పది వేలమందున్నారు. నీకెవడో ఒకడు కాస్త ముద్ద పెట్టకపోడు. ధైర్యంగా నీ త్రోవ నువ్వు చూసుకో. నీ మిత్రులు, తెలుసున్నవాళ్ళల్లో ఎవరో ఒకరు నిన్నాదరిస్తారు అన్నాడు .
తనవల్ల అంతులేని సిరిసంపదలతో తులతూగుచున్న తన కొడుకు ఇలా మాట్లాడేసరికి హతాశుడై పోయాడు తండ్రి.  కొడుకుతో దీనంగా నాయనా ! నేను నీకెంతో ధనం, సంపదలు, సమస్తం ధారపోశాను.  నువ్వే నన్ను బయటకు గెంటేస్తోంటే నా వల్ల ఎప్పుడు ఏ సహాయం పొందని, ముక్కు మొహం తెలియని బయటి వాళ్ళు నన్నేం చూస్తార్రా అనడిగాడు. నేను చేసేది తప్పో, ఒప్పో అదంతా నాకు తెలీదు. నా నిర్ణయానికి తిరుగు లేదు . నన్నెవ్వరేమనుకున్నా పరవాలేదు. నేనన్నీ భరిస్తా . నువ్వేమీ మారు మాట మాట్లాడకుండా ఇంట్లోంచి వెళ్ళిపో, అదే నాక్కావాలి అన్నాడు . కొడుకు అలా అనేసరికి తండ్రికి చాల దు:ఖం కలిగింది . గుండె చెరువయ్యేలా ఏడ్చాడు . ముసలివాడు కావడ౦తో నడవలేక ఎలాగో కాళ్లీ డ్చుకుంటూ ఇంట్లోంచి బయటకొచ్చాడు . గుమ్మం దగ్గర ఆగాడు. కొడుకు వంక దీనంగా చూస్తూ నాయనా! నిన్ను ఆ భగవంతునికి వదిలేసి నేను వెళ్లి పోతున్నాను . నువ్వు నన్ను వెళ్లి పొమ్మని బలవంతం చేస్తున్నావు కాబట్టి నేను వెళ్లి పోతున్నాను . కాని వెళ్ళే ముందు ఒక చిన్న కోరిక. ఇదే నా ఆఖరి కోరిక.  నేను ముసలితనంతో కృశించి పోయాను . ఇక చలిలో బిగుసుకు పోకుండా ఉండేందుకు ఒక దుప్పటి ఇవ్వు చాలు అని దీనంగా అడిగాడు.   నీ కివ్వడాని ప్రస్తుతం నావద్ద ఎటువంటి వస్త్రం లేదని కొడుకు ఖచ్చితంగా చెప్పేశాడు . కనీసం నువ్వు గుర్రం మీద కప్పే గుడ్డైనా ఇవ్వు అంతకంటే ఇంకేదీ నిన్ను కోరను అన్నాడు .  ఏదో ఒకటి ఇస్తే గాని తండ్రిని వదలి౦చుకోవడం సాధ్యం కాదనుకున్నాడు కొడుకు. ఇక చేసేది లేక తన పిల్లవాణ్ణి పిలిచి ఒరేయ్ అబ్బాయ్ ! గుర్రపుశాలకెళ్ళి గుర్రానికి కప్పిన గుడ్డ తీసుకొచ్చి మీ తాతకివ్వు , చలికాలంలో కప్పుకుంటాడు అన్నాడు.  వాడి కొడుకు చాల తెలివైన వాడు, వయసుకు మించిన వివేకం కలవాడు. తన తాతను గుర్రపుశాలదగ్గరకు తీసుకెళ్లి ఒక అందమైన గుడ్డను ఎంపిక చేశాడు. దాన్ని చాకుతో రెందుముక్కలుగా కోసి ఒకముక్క తాతకు ఇచ్చాడు . ఆముక్క అందుకున్నతాత చాల విస్తుపోయాడు.  ఒరేయ్ ! ఈ చిన్న ముక్క నేనే౦ చేసుకోను, నాకెలా సరిపోతుంది ? నువ్వు క్రూరత్వంలో  మీ నాన్నను మించి పోయావు . నువ్వసలు ఇది ఎందుకు సగం చేశావు ? ఎందుకు ఒకటి దిగతొక్కేసుకున్నావు ? మీ నాన్న పూర్తిగా ఇమ్మన్నాడుగాని సగం ముక్క ఇమ్మని అనలేదు. ఈ సంగతి మా అబ్బాయితో చెబుతాను  అన్నాడు . ఫో  నీ దిక్కున్నచోట చెప్పుకో ఇంతకంటే ఒక్క అంగుళం ముక్క అదనంగా ఇచ్చేది లేదు అన్నాడు మనవడు నిర్దాక్షిణ్య౦గా.  
ఆయన వెంటనే తనకొడుకు దగ్గరకెళ్ళి జరిగిందంతా వివరించాడు . అదివిన్న కొడుకు తన కొడుకుపై విరుచుకు పడ్డాడు . వస్త్రం పూర్తిగా ఇమ్మని ఆజ్ఞాపించాడు. పిల్లవాడు ఇవ్వనుగాక ఇవ్వనని ఖచ్చితంగా చెప్పేశాడు . నేను ఇప్పుడదిస్తే నువ్వు మీ నాన్నకు చేసిందానికి నేను నీకు ఎలా చెయ్య గలుగుతాను ?నువ్వు మీ నాన్నకు చెల్లించిన మూల్యం రేపు నేను నీకు చేల్లి౦చొద్దా. నేను ఈ సగం అందుకే దాస్తున్నాను . నువ్వు మీనాన్నను పంపించిన విధంగా రేపు నిన్ను ఇంటినుంచి బయటకు గెంటేస్తాను. మీ నాన్న నీకు తన సమస్తసంపదలు ఇచ్చినా నువ్వు అతన్ని బయటకు గెంటేస్తున్నావు . నేను కూడ నీ దగ్గర అన్నీ లాక్కుని నిన్ను బయటకు గెంటేస్తాను. నువ్వు మీ నాన్నాను నిస్సహాయంగా వదిలేస్తే నేను నిన్ను అలాగే చేస్తాను . నువ్వు చేసిన పాపానికి ఫలితం నువ్వే అనుభవించాలి కదా అన్నాడు .
కొడుకు మాటలకు తండ్రి చాల సిగ్గు పడ్డాడు. తన కొడుకు మాట్లాడిన ప్రతి మాట ఈటెలా హృదయానికి గ్రుచ్చుకుంది. తాను చేసిన పనికి చాల పశ్చాత్తాప పడ్డాడు. కొడుకు మాటలు కళ్ళు తెరిపి౦చాయి. జ్ఞానోదయమై౦ది. వెంటనే తన తండ్రి వైపు తిరిగి పూజ్యులైన నాన్నగారూ! మీరు లోపలకురండి. నేటి నుంచి మీరే ఈ ఇంటికి యజమాని . మీరు నాకిచ్చి౦దంతా మీకు సమర్పి౦చేస్తున్నా. మీరు మీ ఇంటిలో సర్వసౌఖ్యాలు అనుభవించవచ్చు . మాతో పాటే రుచికరమైన పదార్థాలు , పానీయాలు అన్నీ ఆస్వాదించండి. వెచ్చని గదిలో సుఖంగా నిద్రపోండి.  ఒక వేళ మీరు ఇక్కడ ఉండడం నా భార్యకు ఇష్టం లేకపోతే నేను మీకు మరో చోట అన్ని సౌకర్యాలు చేకూరుస్తాను. ఈ సమస్తసంపదలు మీవే సమస్తహక్కులు మీవే. నేను మీకు   దయతో ఇచ్చేది  ఏమి లేదు. నేను మీకిచ్చేవన్నీ ఒకప్పుడు మీరు నాకిచ్చినవే .
ఈ విధంగా ఒక గడుసరి బాలుని తీక్ష్ణమైన నిరసన తండ్రికి కళ్ళు తెరిపించి మంచివాణ్ణిగా తీర్చి దిద్దింది. ఆ తరువాత వృద్ధవ్యాపారి శేషజీవితాన్ని తన కొడుకుతోనూ కుటుంబసభ్యులతోను సుఖ౦గా  గడిపాడు .                     

<><><><><><><><><><><> 

Thursday, September 8, 2016

These eleven are absolutely worthless

    These eleven are absolutely worthless

Dr. Chilakamarthi Durgaprasada Rao

राजा धर्मविना द्विजो शुचिविना ज्ञानं विना योगिन:
कान्ता सत्यविना हयो गतिविना ज्योतिर्विना भूषणम्
योद्धा शूरविना तपो व्रतविना छन्दोविना गायनम्
भ्राता स्नेहविना नरो हरिविना मुञ्चन्ति  शीघ्रं बुधा:
                                           ( Kavyasangraha of Jivananda)

A king without righteousness, Brahmin without purity (both internal as well as external) Saints without transcendental knowledge, wife without trustworthiness, horse without speed , ornament without shining , soldier without velour, penance without discipline , singing without rhythm, brother without love and affection , man without devotion for God are absolutely worthless. People of high profile never entertain them. They discard them immediately. 

రాజా ధర్మవినా , ద్విజో శుచివినా, జ్ఞానం వినా యోగిన:
కాంతా సత్యవినా, హయో గతివినా,  జ్యోతిర్వినా భూషణం
యోద్ధా  శూరవినా తపో వ్రతవినా ఛందో వినా గాయన౦
భ్రాతా స్నేహవినా నరో హరివినా ముంచంతి శీఘ్రం బుధా:
(ఇది జీవనందుని కావ్యసంగ్రహం లోనిది)  
ధర్మప్రవర్తనలేని రాజు ,  పరిశుద్ధత లేని బ్రాహ్మణుడు , ఆత్మజ్ఞానం లేని యోగులు , సత్యము పలుకని భార్య , వేగ౦ లేని గుఱ్ఱ౦ , మెరుపులేని ఆభరణం, శౌర్యం లేని సైనికుడు, నిష్ఠ లేని తపస్సు, గణబద్ధత  లేని గానం , ప్రేమాదరములు లేని సోదరుడు,  దైవభక్తి లేని మనిషి నిరుపయోగములు. పండితులైన వారు వారిని వాటిని  వెంటనే విడిచిపెట్టెదరు, దరికి చేరనివ్వరు.

***********

Monday, September 5, 2016

కొంటె గణపతి

కొంటె గణపతి
డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాద రావు

ణపతి శివపార్వతుల ముద్దుబిడ్డ . ఒకసారి శివపార్వతులు తమ బిడ్డను తమ ఇద్దరి మధ్యలోనూ  కూర్చోబెట్టుకుని లాలిస్తున్నారు. ఎందుకో ఇద్దరూ ఒకేసారి  గణపతిని ముద్దుపెట్టు కోవాలనుకున్నారు . అలా జరగాలంటే ఆయన ఒక  బుగ్గ మీద ఈవిడ మరొక బుగ్గమీద ముద్దు పెట్టుకోవాలి,  లేకపోతె అది సాధ్యం కాదని  నిశ్చయించుకున్నారు .  వినాయకుడు ఈ విషయం  పసిగట్టాడు . అమ్మా నాన్నలు నాకు చాల సార్లు ముద్దు పెట్టారు కాని వాళ్ళు ఒకరికొకరు ముద్దుపెట్టుకుంటే ఎలా ఉంటుందో చూడాలనుకున్నాడు. వారిద్దరిని ఎలాగైనా కలపాలని ఆరాటపడుతున్నాడు . కాని ఎలా? ఆలోచించాడు . అంతే అతనికి ఒక ఆలోచన మెరుపులా తళుక్కున మెరిసింది. వాళ్ళిద్దరూ తనను ముద్దుపెట్టుకునే అదను చూసి వెంటనే తన ముఖాన్ని ప్రక్కకు తిప్పేశాడు . అంతే శివుని ముద్దు పార్వతికి, పార్వతి ముద్దు శివునికి దక్కేయి. వాళ్ళ ఇద్దరినీ చూసి ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నాడు మన బాలగణపతి . ఈ విధంగా తన తల్లిదండ్రుల ఆనందానికి కారకుడైన ఆ బాలగణపతి ముసిముసినవ్వులు ఆబాలగోపాలాన్ని రక్షించుగాక అని ఒక కవి చమత్కారంగా ఈ శ్లోకాన్ని రచించాడు.
युगपत्स्वगण्डचुम्बनलोलौ  पितरौ निरीक्ष्य हेरंभ: |
तन्मुखमेलनकुतुकी स्वाननमपनीय परिहरन् पायात् ||
yugapatsvagaNda chumbanalolau pitarou nireekshya herambhah
tanmukhamelanakutukee svaananamapaneeya parihasan paayaat

యుగపత్స్వగండచుంబనలోలౌ పితరౌ నిరీక్ష్య హేరంభ:
తన్ముఖమేలనకుతుకీ స్వాననమపనీయ పరిహసన్ పాయాత్


Vinayaka - His father's son

                                                     Vinayaka - His father's son

                                                                                              Dr. Chilakamarthi DurgaPrasada Rao

It is traditionally  believed  that a son is the replica of his father. Vinayaka the son of Lord Siva is also like his father. A devotee praises  Vinayaka  in a very awasome manner comparing him with Lord Siva. Let us relish the beauty of the poem and enjoy.

Lord Siva is known as Astamurthi. He is an assemblage of eight elements. The five elements Earth, Water, Fire, Air, Sky, and the  Sun,
the Moon and Yajnapurusha constitute His body. Vinayaka, like His father can also be called Astamurthi by virtue of having eight characteristics.

1. एकरद : He is called 'ekarada' for having possesed with one (ivory) tooth.  Normally elephant has two teeth (tusks). Vinayaka, the elephant headed God  has only one tooth as the other tooth of him is used  as a weapon to kill his enemy who was a demon .

2. द्वैमातुर: He is called 'dvaimaatura'  for having two mothers one is Parvati while the other is Ganga.

3. निस्त्रिगुण: He is known as 'nistriguna'  becuse he is beyond three gunas viz., Sattva, Rajas and Tamas.

4. चतुर्भुज: (अपि) : He is called ' chaturbhuja '  for having four shoulders.

5. पञ्चकर:  He is popularly known as 'panchakara'.   Even though he is having  four shoulders ,  his  hands are  five  as the  trunk is also used some times as fifth hand .

6. षण्मुखनुत:    He is described as ' Shatnmukhanuta' for being    praised by Shanmukha , (Kumaraswami) his younger brother who has six faces.

7. 'सप्तच्छदगन्धिमद:  He is also popular as 'saptachhcdagandhimada'       ' who has the odour of saptacchada, seven leaved tree (Alstonia scholaris ). Normally elephents ooze some sort of liquid (rut) which is compared to be the liquid comes out of saptachhada tree (one kind of banana plant which has seven leaves). Since Lord Vinayaka is  elephant headed, some sort of fragrance comes out  of him.

8. He is "asthtatanutanaya" (अष्टतनुतनय) which  means that he the son of Lord Siva who has eight types of bodies. In this way Vinayaka is just like his father. He possesses eight characteristics while Lord Siva possesses eitht elements.  Let us chant the glory of Vinayaka:

एकरद! द्वैमातुर! निस्त्रिगुण! चतुर्भुजोsपि पञ्चकर !
जय षण्मुखनुत ! सप्तच्छदिगन्धाष्टतनुतनय !

ekarada !dvaimaatura !nistriguNa ! chaturbhujopi panchakara !
jaya shaNmukhanuta ! saptachhadagandhaashta tanu tanaya !

ఏకరద! ద్వైమాతుర! నిస్త్రిగుణ! చతుర్భుజోపి పంచకర!
జయ షణ్ముఖ నుత! సప్తచ్ఛదగన్ధిమదాష్టతనుతనయ!....