Monday, September 5, 2016

కొంటె గణపతి

కొంటె గణపతి
డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాద రావు

ణపతి శివపార్వతుల ముద్దుబిడ్డ . ఒకసారి శివపార్వతులు తమ బిడ్డను తమ ఇద్దరి మధ్యలోనూ  కూర్చోబెట్టుకుని లాలిస్తున్నారు. ఎందుకో ఇద్దరూ ఒకేసారి  గణపతిని ముద్దుపెట్టు కోవాలనుకున్నారు . అలా జరగాలంటే ఆయన ఒక  బుగ్గ మీద ఈవిడ మరొక బుగ్గమీద ముద్దు పెట్టుకోవాలి,  లేకపోతె అది సాధ్యం కాదని  నిశ్చయించుకున్నారు .  వినాయకుడు ఈ విషయం  పసిగట్టాడు . అమ్మా నాన్నలు నాకు చాల సార్లు ముద్దు పెట్టారు కాని వాళ్ళు ఒకరికొకరు ముద్దుపెట్టుకుంటే ఎలా ఉంటుందో చూడాలనుకున్నాడు. వారిద్దరిని ఎలాగైనా కలపాలని ఆరాటపడుతున్నాడు . కాని ఎలా? ఆలోచించాడు . అంతే అతనికి ఒక ఆలోచన మెరుపులా తళుక్కున మెరిసింది. వాళ్ళిద్దరూ తనను ముద్దుపెట్టుకునే అదను చూసి వెంటనే తన ముఖాన్ని ప్రక్కకు తిప్పేశాడు . అంతే శివుని ముద్దు పార్వతికి, పార్వతి ముద్దు శివునికి దక్కేయి. వాళ్ళ ఇద్దరినీ చూసి ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నాడు మన బాలగణపతి . ఈ విధంగా తన తల్లిదండ్రుల ఆనందానికి కారకుడైన ఆ బాలగణపతి ముసిముసినవ్వులు ఆబాలగోపాలాన్ని రక్షించుగాక అని ఒక కవి చమత్కారంగా ఈ శ్లోకాన్ని రచించాడు.
युगपत्स्वगण्डचुम्बनलोलौ  पितरौ निरीक्ष्य हेरंभ: |
तन्मुखमेलनकुतुकी स्वाननमपनीय परिहरन् पायात् ||
yugapatsvagaNda chumbanalolau pitarou nireekshya herambhah
tanmukhamelanakutukee svaananamapaneeya parihasan paayaat

యుగపత్స్వగండచుంబనలోలౌ పితరౌ నిరీక్ష్య హేరంభ:
తన్ముఖమేలనకుతుకీ స్వాననమపనీయ పరిహసన్ పాయాత్


No comments: