అధ్యాపక చతుష్టయం
( The four types
of teachers )
డాక్టర్ .
చిలకమర్తి దుర్గాప్రసాద రావు
వేదానికి నిఘంటువు
రచించిన యాస్కమహర్షి అధ్యాపకుడు అనే అర్థంలో ‘ఆచార్య’ పదాన్ని మూడు విధాలుగా నిర్వచించారు.
1. ఆచరతి ఇతి
ఆచార్య: ( ఉన్నతమైన విలువలను ఆచరించేవాడు ).
2. ఆచారం గ్రాహయతి
ఇతి ఆచార్య: ( ఉన్నతమైన విలువలను శిష్యులకు బోధించేవాడు ).
3. ఆచినోతి
అర్ధాన్ ఇతి ఆచార్య: ( ఎల్లప్పుడు విద్యార్థులకు కావలసిన జ్ఞానాన్ని సంపాదించి
వారికి అందజేస్తూ ఉండేవాడు). ఈ మూడు ఆనాటికి ,
ఈ నాటికి ఏనాటికి కూడ తిరుగులేని
నిర్వచనాలు .
ఇక మనుషుల్లో సజ్జనులు
, మధ్యములు , అధములు , అధమాధములు అని నాలుగు రకాల మనుషులున్నట్లే అధ్యాపకులలో కూడ
నాలుగురకాలవాళ్ళు ఉంటారు .
కొంతమంది
విద్యార్థిదశలో చాల మేధావులుగా ఉంటారు. ఎంతో కృషిచేస్తారు . అపారమైన జ్ఞానాన్ని సంపాదిస్తారు . అలాగే అధ్యాపక
వృత్తిలో ప్రవేశించాక కూడ అదేవిధంగా నిరంతర౦
విద్యావ్యాసంగం చేస్తూ విద్యార్థులకు ఎంతో మేలు చేకూరుస్తారు. వీరు ఉత్తమోత్తమ అధ్యాపకులు.
మరికొంతమంది
ఉంటారు. వారు విద్యార్థిదశలో అంత చురుకుగా ఉండరు . కాని ఏదో విధంగా అధ్యాపకవృత్తిలో
ప్రవేశించాక నిరంతరం విద్యావ్యాసంగం చేస్తూ విద్యార్థులప్రగతి కోసం పాటుపడుతూనే ఉంటారు . వీరు ఉత్తమ అధ్యాపకులు .
ఇంకొంత మంది
ఉంటారు . వారు విద్యార్థిదశలో చాల చురుకుగా ఉంటారు. కాని అధ్యాపకవృత్తిలో
ప్రవేశించాక అసలు పుస్తకం తియ్యరు. తమకు గుర్తున్నదీ
తెలుసున్నదేదో చెప్పేస్తూ ఉంటారు. “బండ గురో: మొండి
శిష్యా:” అన్నట్లు విద్యార్థులు వాళ్ళు చెప్పింది వినేస్తూ ఉంటారు . వీరు ఉత్త
అధ్యాపకులు.
ఇంకా కొంతమంది
ఉంటారు. వారు విద్యార్థిదశలో చాల నిస్తేజం(dull)గా ఉంటారు, ఏదో విధంగా
అధ్యాపకవృత్తిలో ప్రవేశిస్తారు. వృత్తిలో ప్రవేశించిన తరువాత కూడ మందకొడి(dull)గానే
ఉంటారు. పుస్తకం ముట్టరు. క్లాసులోకి అడుగు పెట్టరు. ఏదో రకంగా సమయం గడిపేస్తారు .
వీరు చెత్త అధ్యాపకులు.
<><><><><>
No comments:
Post a Comment