Let us know-6
కతికితే అతకదు
మన సమాజంలో ఎవరైనా పెళ్లిచూపులకు వెళ్లేవారు అమ్మాయిని చూసుకొని ఇంటికి తిరిగి వచ్చేస్తారు. కానీ ఆ ఇంట్లో భోజనం లాంటివి చేయరు. ఇక మరీ తప్పనిసరిపరిస్థితుల్లోనో , బలవంతం మీదనో కాఫీ గాని టీ గాని తీసుకుంటారు . అవి తప్ప ఎట్టి పరిస్థితుల్లోను భోజనం చెయ్యరు. కతికితే అతకదు అనే సాకుతో తప్పించుకుంటారు . అన్నం తింటే సంబంధం కలవదని ఆ సామెతకర్థం . అసలెందుకు భోజనం చెయ్యరో, ఒకవేళ వాళ్ళింట్లో అన్నం తింటే వచ్చే నష్టం ఏమిటో, అసలీ ఆచారమెందుకొచ్చిందో మనం ఆలోచిద్దాం .
ఉదాహరణకి మనం ఏదైనా వస్తువులు (ముఖ్యంగా బట్టలు, మరేవైనా ) కొనుక్కోడానికి ఏదైనా షాపులోకి వెళ్ళేమనుకోండి. ఆ
వస్తువు నచ్చితే కొంటాం, లేకపోతె బయటికొచ్చేస్తాం. ఎటువంటి ఇబ్బందీ లేదు. కాని ఆషాపు
ఆసామి మనకి కూల్ డ్రింకు గాని, మరేదైనా గాని ఇచ్చినా మనం తీసుకున్నా మనకు మొహమాటం
ఏర్పడుతుంది . ఆ షాపులో ఏదో ఒకటి కొనకుండా
బయటకు రాలేం . ఎందుకంటే ఎప్పుడు అతనిచ్చిన వస్తువు తీసుకుంటామో కొంత మొహమాటం అడ్డు వస్తుంది . అందుకని అక్కడ ఎదో ఒక వస్తువు కొనకుండా మనం బయటికి రాలేo. ఇక మొహమాటం
కొద్దీ ఏదో ఒకటి కొన్నా అది బాగుంటే
ఉపయోగించుకుంటాం లేదా ఎవరికైనాఇస్తాం ఎవరు
తీసుకోకపోతే బయట పడేస్తాం. ఇక మన ఇంటికి వచ్చే కోడలు అటువంటి వస్తువు కాదు. ఆ వ్యక్తి శాశ్వతంగా మనతో ఉండవలసిన వ్యక్తి.
అంతేకాకుండా ఇటు పుట్టినింటికి అటు మెట్టినింటికి
గౌరవం తేవలసియన వ్యక్తి. మన ఇంటికొచ్చి మనతో కలిసిపోయి మన వంశ గౌరవాన్ని నిలిపేదిగా ఉండవలసిన వ్యక్తి . అటువంటి వ్యక్తిని ఎన్నుకునే ఈ విషయంలో
ఎటువంటి మొహమాటాలకు చోటివ్వకూడదు . అందుకే కతికితే అతకదనే నియమం పెట్టి ఏదీ తీసుకోకూడదని
కట్టడి చేశారు. తప్పనిసరి పరిస్థితిలో కాఫీ,
టీలు త్రాగినా భోజనాలు మాత్రం చెయ్యరు.
ఒకవేళ భోజనం చేస్తే ఆ తరువాత ఆ అమ్మాయి నచ్చకపోతే నచ్చలేదని చప్పడానికి కొన్ని ఇబ్బందులొస్తాయి.
ఒకవేళ భోజనం చేస్తే “ అన్నీ తినిపోయారు. అమ్మాయి నచ్చ లేదట! ఎంత విడ్డూరం” అని దెప్పి పొడిచే
అవకాశం డుస్తారు. అవన్నీ రాకుండా మన వారు
కతికితే అతకదని కట్టడి చేశారు.
<><><><><>
No comments:
Post a Comment