Monday, April 1, 2013

18 /02 /13


Thought of the day (18 / 2 / 13)
(The gems of our tradition)
Dr. Durgaprasada Rao Chilakamarti
పితా రక్షతి కౌమారే భర్తా రక్షతి యౌవనే
తనయ: స్థవిరే భావే న స్త్రీ స్వాతంత్ర్యమర్హతి ( మనుస్మృ తి)
"స్త్రీని చిన్నతనంలో తండ్రి రక్షిస్తాడు . యౌవనంలో భర్త రక్షిస్తాడు. వార్ధక్యంలో పుత్రుడు రక్షిస్తాడు. స్త్రీ స్వతంత్రించుటకు అర్హురాలు కాదు" అని మనువు వాక్యాన్ని అపార్థం చేసుకుంటోంది నేటి సమాజం. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా: అన్న మనువు ఈ విధంగా చెప్పడం పరస్పరవిరుద్ధం అనిపించక మానదు. కాబట్టి ఆ మాటల్లోని తాత్పర్యాన్ని అర్థం చేసుకోవాలి. సూక్ష్మంగా ఆలోచిస్తే తాత్పర్యం అర్థమౌతుంది. పై మూడు పాదాల్లోనున్న రక్షతి అనే పదాన్ని బట్టి నాల్గవ పాదం ద్వార స్త్రీ ఏ దశలోను రక్షణ లేకుండ ఉండకూడదనే విషయం స్పష్ట మౌతోంది. మరో విషయం. వేదం లోని ప్రతి వర్తమాన కాల క్రియకు 'విధి' అర్థం. స్మృ తి వేదానికనుబంధం. దీన్ని బట్టి 'రక్షతి' అనే క్రియకు 'రక్షించవలెను' అనే అర్థం వస్తుంది. ఈ విషయాన్ని మనం గమనించకపోవడం వల్లనే నేడు పసి కందుల్ని రక్షించవలసిందిపోయి గర్భంలోనే తుంచేస్తున్నారు. యౌవనంలో అత్యాచారాలెక్కువయ్యాయి. వార్ధక్యంలో నిరాదరణకు గురి ఔతున్నారు.
पिता रक्षति कौमारॆ भर्ता रक्षति यौवने
तनय: स्थविरे भावे न स्त्री स्वातन्त्र्यमर्हति ( मनु :)
Father protects in child hood ; Husband protects in youth; Son protects in old age; woman does not deserve freedom” is the literal meaning of the verse. Here the word रक्षति (Rakshati ) meaning ' protection'. The first three lines should be correlated with the fourth line to get its true meaning and purport. It is not out of p lace to mention here that the Vedic sentences ar e meaning ful so far as they are related to some action. More over , every verb used there in present tense should be understood in imperative sense. So the verb ”rakshati “ which means 'protection ' should be understood as “should be protected “. Then it sounds that a woman should always b e protected at every stage in her life and should not be left without protection under any circumstances . The result of ignoring this dictum, causes many problems in the present day world. Father is not taking care in bringing up his daughters; husband his wife and children their mother. Female children are killed before they see the light of the day. Gang rapes are witnessed. Old women are left without proper care.









No comments: