Friday, October 17, 2014

నరులు - నాలుగు రకాలు

                 నరులు - నాలుగు రకాలు
Dr. Ch. Durga Prasada Rao

పర్షియన్ భాషలో ఒక సూక్తి ఉంది . ఆ సూక్తిని బట్టి చూస్తే మనుషుల్లో నాలుగు రకాల వాళ్ళుంటారు.
మొదటి రకం చూద్దాం .  వాడికేమీ తెలీదు.  అంతే కాకుండా  తనకేమీ తెలియదనే విషయం కూడ వాడికి తెలీదు. అటువంటి వాడు  మూర్ఖుడు.  వాణ్ణి దూరంగా ఉంచాలి.  విడిచిపెట్టెయ్యాలి.
రెండవరకం గమనిద్దాం. వాడికేమీ తెలియదు. కాని తనకేమీ తెలియదనే విషయం వాడికి తెలుసు.   వాడు చెబితే వింటాడు . కాబట్టి  వాడికి బోధ చెయ్యాలి.   
ఇక మూడో రకం పరికిద్దాం. వాడికన్నీ తెలుసు కాని తనకన్నీ తెలుసనే విషయం వాడికి తెలీదు . వాడు అజ్ఞానంలో ఉన్నాడు. అటువంటి వాణ్ణి మేల్కొల్పాలి .
ఇక నాలుగో రకం పరిశీలిద్దాం. . వాడికన్నీ తెలుసు . తనకన్నీ తెలుసనే విషయం కూడ వాడికి  స్పష్టంగా తెలుసు . అటువంటి వాడు తత్త్వవేత్త . ఆతన్ని  అనుసరించాలి .

He, who knows not and knows not that he knows not
is a fool-Shun him
He, who knows not and knows that he knows not
can be taught –Teach him.

He, who knows and knows not that he knows,
is asleep – Wake him.

He, who knows and knows that he knows
is a prophet- Follow him.

( ENGLISH TRANSLATION)
                                        ****


No comments: