Monday, October 24, 2016

ఆర్యాశతకం---3

శ్రీ అప్పయ్యదీక్షితులు రచించిన
ఆర్యాశతకం
డాక్టర్. చిలకమర్తి దుర్గాప్రసాద రావు

ఓ పరమశివా! నేను గుణహీనుడననే వంకతో  నీ కొడుకునని  కూడ చూడకుండా నన్ను విడిచిపెట్టేస్తున్నావు. ఇదే౦ న్యాయం ? గుణవంతునకు ఇది సబబు కావచ్చు . ఎ౦దుకంటే తాను గుణవంతుడు కాబట్టి గుణహీనుని విడిచిపెట్టడంలో కొంత న్యాయం ఉంది. కాని నిర్గుణుడవైన నువ్వు నన్ను అలా విడిచి పెట్టడం నాకు న్యాయంగా తోచడం లేదు.  నీలోనే గుణాలు లేవు .ఇక నీలో  లేనివి నాలో ఎందుకు వెదుకుతున్నావో నాకర్థం కావడంలేదు . కాబట్టి నన్ను విడిచిపెట్టకు . నన్ను రక్షించు .
       
గుణహీనతాం తనూజే మయి దృష్ట్వా కిం పరిత్యజస్యేవం  
ఉచితం గుణినస్త్వేతన్నిర్గుణరూపస్య తేsనుచితం (15)

తనూజే =కుమారుడనైనటువంటి
మయి = నా యందు 
గుణహీనతాం= ఏ మంచిగుణములు లేకపోవుటను
దృష్ట్వా = చూసి
ఏవం = ఈ విధంగా
కిం పరిత్యజసి = ఎందుకు విడిచి పెట్టేస్తున్నావు ?
ఏతత్= ఇది   
గుణిన: + తు= గుణవంతునకైతే
ఉచితం = తగినదే  
నిర్గుణరూపస్య= ఎటువంటి గుణాలులేని నిర్గుణరూపుడవైన   
తే= నీకు
అనుచితం = తగినది కాదు (తగదని భావం)
<*><*><*><*><*><*>
  



No comments: