సంభాషణ సంస్కృతం -13
Dr. Durga
Prasada Rao Chilakamarthi
dr.cdprao@gmail.com
Lesson—13
Unit-1
एक:
- एका - एकम्
సంస్కృతభాషలో ఒక నియమం ఉంది . నామ వాచకం ఏ లింగం, ఏ వచనం, ఏ
విభక్తిలో ఉంటుందో విశేషణ౦ కూడ అదే లింగం, అదే వచనం, అదే విభక్తిలో ఉండాలి . यल्लिङ्गं यद्वचनं या च विभक्ति: विषेष्यस्य
तल्लिङ्गं तद्वचनं सा च विभक्ति: विशेषणस्यापि. ఈ నియమం సంఖ్యా వాచకాలకు
కూడ వర్తిస్తుంది . సంస్కృతంలో 1,2,3,4 సంఖ్యలను తెలిపే एकं (one), दवे (two), त्रीणि (three), चत्वारि (four) పదాలు
మూడు లింగాలలోను వేర్వేరుగా ఉంటాయి. 5 నుంచి ఒకే విధంగా ఉంటాయి .
पुंलिङ्ग:
स्त्रीलिङ्ग: नपुंसकलिङ्ग:
एक:
एका
एकम्
एक: बालक: एका
बालिका एकं पुस्तकम्
एक: वृक्ष: एका
लता एकं
पुष्पम्
एक: चमस: एका दर्वी (గరిటె) एकं
पत्रम्
एक: पुरुष: एका महिला एकं
मन्दिरम्
एक: समुद्र: एका नदी एकं
सर:
द्वौ
-- द्वे
-- द्वे
द्वौ बालकौ द्वे बालिके द्वे
पुस्तके
द्वौ वृक्षौ द्वे
लते द्वे
पत्रे
द्वौ पुरुषौ द्वे
महिले
द्वे
वाहने
त्रय:
तिस्र:
त्रीणि
त्रय: पुरुषा:
तिस्र: - वनिता: त्रीणि
पुस्तकानि
त्रय: वृक्षा:
तिस्र: लता:
त्रीणि
पत्राणि
त्रय: क्रीडाकारा: तिस्र: क्रीडाकारिण्य: त्रीणि दिनानि
चत्वार: चतस्र:
चत्वारि
चत्वार: पुरुषा: चतस्र: महिला: चत्वारि
फलानि
चत्वार: बालका: चतस्र: बालिका: चत्वारि पुस्तकानि
SOME EXAMPLES:
1. एक: बालक: एका बालिका एकं
पुस्तकं गृहीत्वा पठत:
ఒక బాలుడు ఒక బాలిక ఒక పుస్తకము తీసుకొని చదువుచున్నారు
2. द्वौ बालकौ द्वे बालिके
द्वे कन्दुके गृहित्वा क्रीडन्ति
ఇద్దరు బాలురు ఇద్దరు బాలికలు రెండు బంతులను తీసుకొని ఆడుచున్నారు
3. त्रय: युवका: तिस्र:
युवतय: त्रीणि पुस्तकानि गृहित्वा पाठशालां गच्छन्ति
ముగ్గురు యువకులు, ముగ్గురు యువతులు, మూడు పుస్తకములను
పుచ్చుకొని బడికి వెళ్ళుచున్నారు .
4. चत्वार: पुरुषा: चतस्र:
महिला: चत्वारि फलानि स्वीकृत्य देवालयं गच्छन्ति
నలుగురు పురుషులు , నలుగురు స్త్రీలు నాలుగు పండ్లను
తీసుకొని గుడికి వెళ్ళు చున్నారు .
5 నుండి సంఖ్యావాచక పదాలు అన్ని లి౦గములయందు ఒకే విధ౦గా ఉంటాయి.
From five it is common for all
genders
पञ्च
बालका: -- पञ्च
बालिका: - पञ्च
फलानि .
पञ्चबालका: पञ्चबालिका: च पञ्चपुष्पै: देवं पूजयन्ति
ఐదుగురు బాలురు ఐదుగురు బాలికలు ఐదు పువ్వులతో దేవుని పూజించుచున్నారు .
Unit 2. भोजनसंबन्धिशब्दा:
अन्नम् (అన్నము) सूप: (పప్పు) सार:(చారు) शाक:
(కూర) तक्रम्
(మజ్జిగ) दधि ( పెరుగు) घृतम् (నెయ్యి) अवलेह:
(ఊరగాయ) क्वथितम् (సాంబారు) etc
अहं भोजनप्रिय: || मम
माता अन्नं परिवेषयति || अनन्तरं सूपं परिवेषयति , तत: शाकं, ततोsनन्तरं , सारं
, क्वथितं , मध्ये मध्ये यथावसरं घृतम् , अवलेहं, पेयजलं च परिवेषयति ||
अन्तत: दधि परिवेषयति || भोजनानन्तरं तक्रम् अपि पानार्थं ददाति || నేను
భోజనప్రియుణ్ణి. మా అమ్మ నాకు ముందుగా అన్నం వడ్డిస్తుంది . ఆ తరువాత పప్పు
వడ్డిస్తుంది . ఆ తరువాత కూర, ఆపై చారు , సాంబారు , మధ్యలో నేయి , ఊరగాయ, మంచినీరు
ఆఖరులో పెరుగు వడ్డిస్తుంది . భోజనం అయ్యాక త్రాగడానికి మజ్జిగ ఇస్తుంది .
కొన్ని ఖాద్య పదార్థాల పేర్లు :
1. |मुद्ग: = Green gram= పెసలు (मूंग) 2. माष:= Black gram=మినుములు (उड़द)
3. तुवरिदल: Red Gram= కందులు (अरहर) 4. सर्षप:= Black mustered=ఆవాలు (राई-सरसों)
5. मरीचकम् = Black pepper =మిరియాలు (काली मिर्च) 6.
धनीयक: = Coriander
seeds= ధనియాలు (धनिया) 7. जीरक: =Cumin
seeds =జీలకర్ర (जीरा) 8.हिंगु: Asafetida =ఇంగువ (हिंग) 9.जातिकोश: Mace ( జాపత్రి)
10.एला= Cardamom (యాలకులు) (इलायची) 11. (मेंथी) Fenugreek (మెంతులు)
12. वरांग: Cinnamon (దాల్చిన చెక్క) 13. सर्ज: Pearl
millet ( సజ్జలు)
14.
जूर्ण: (Great millet = జొన్నలు) 15. लशुनम्
(Garlic (వెల్లుల్లి)
16. पलाण्डु: (Onion (ఉల్లి) 17.
घुसृणम् /काश्मिर्यम् (Saffron (కుంకుమపువ్వు)
18. भल्लातकी = Cashew nut ( జీడిపప్పు) 19.
अर्द्रक:/शृंगबेर: (Ginger (అల్లం)
20.हरिद्र:(Turmeric) (పసుపు) 21. आम्रार्द्रक: ( Mango ginger) (మామిడి అల్లం)
22. कटिज:/ शिखालु:
(Corn (మొక్కజొన్న)23. कूष्माण्ड (Ash gourd (బూడిదగుమ్మడి)
24. जम्बू Jam bun fruit (నేరేడు) 25. चणक: =Bengal
gram (సెనగలు)
26. दाडिमी= Pomegranate ( దానిమ్మ) 27. सीताफलम् Custard apple (సీతాఫలం )
28. रामाफलम् =Bullock’s
heart= (రామాఫలం ) 29. गोजिह्व: ( Lady’s finger) (బెండకాయ) 30. पटोलिका Snake guard (పొట్లకాయ) 31.कारवेल्लम्
(Bitter guard (కాకరకాయ) 32.
कोशातकी (Ribbed guard (బీరకాయ)
33. उर्वारुक Cucumber (దోసకాయ) 34. कर्कारुक: /कालिंग: / कृष्णबीज: Watermelon (పుచ్చకాయ) 35.
आलुक: /म्लेच्छ कन्द: Potato (బంగాళాదుంప )36.
वार्ताक: = Brinjal/egg
plant వంకాయ)
37.
बृहन्मरीच: /रक्तमरीच: Red
pepper (మిరపకాయ) 38. कपित्थ: Elephant apple (వెలగపండు) 39.
कर्पूर: Camphor (కర్పూరం ) 40.
गुग्गुल: =Guggul (గుగ్గిలం )
41. एरण्ड = Caster (ఆముదం) 42. तैलम् = oil 43. घृतम् = ghee నేయి 44. पनसफलम्
= Jackfruit( పనస పండు ) 45.तालफलम्= Toddy nut (తాటికాయ ) 46.शिग्रु: (Drumsticks)( ములగ కాడ) 47. कर्तारि:
(Radish) (ముల్ల౦గి) 48. आमलक: Indian gooseberry (ఉసిరి) 49.
द्राक्षाफलम् Grapes (ద్రాక్ష) 50. खर्जूरं: Date fruit ( ఖర్జూరం )
51. तिन्त्रिणीफलम् Tamarind( చింతపండు 52. लवङ्ग: Cloves( లవంగాలు)
Unit-3 तृतीयाविभक्ति: తృతీయా విభక్తి (instrumental case)
Note: The main instrument
used in every activity is expressed through तृतीयाविभक्ति ||
ప్రతి పనియందు ఏ వస్తువు సాధనముగా చెప్పబడునో అది తృతీయావిభక్తి ద్వారా వ్యక్త0
చెయ్య బడును
1. बालक: चमसेन अन्नं
खादति
బాలుడు చెంచాతో అన్నం తింటున్నాడు
(The boy
is eating food with a spoon)
2.
अध्यापक: सुधाखण्डेन लिखति
అధ్యాపకుడు
సుద్దముక్కతో వ్రాయుచున్నాడు
(The teacher is writing with a piece of chalk)
3. रक्षकभट: दण्डेन ताडयति
రక్షక భటుడు లాఠీతో కొట్టుచున్నాడు
(The police man is beating with a stick)
4. अहं नेत्राभ्यां पश्यामि
నేను (నా) రెండు కళ్ళతో చూచుచున్నాను
( I am seeing with my two eyes)
5. बालक: कन्दुकेन क्रीडति
బాలుడు బంతితో ఆడుచున్నాడు
(The boy is playing with a ball)
6. भवान् दन्तकूर्चेन दन्तधावनं
करोतु
నీవు పళ్ళ
పొడితో పళ్ళు తోముకొనుము
( You clean your teeth with a tooth
brush)
7.
नरसिंह: नखै: हिरण्यकशिपं
विदारयति
నరసింహస్వామి
గోళ్ళతో హిరణ్యకశిపుని చీల్చుచున్నాడు
(Lord
Narasimha tears Hiranyakashipa with nails)
Unit - 4. सह = (తో
/కలసి )along with/with
1. रामेण
सह सीता वनं गतवती
రామునితో బాటుగా సీత అడవికి వెళ్ళెను
Sita went to forest along with Rama.
2. अहं मम मित्रेण
सह संभाषणं करोमि
నేను నా మిత్రునితో మాట్లాడు చున్నాను
I am speaking to my friend.
3. पिता पुत्रेण
सह क्रीडति
తండ్రి కుమారునితో ఆడుచున్నాడు
Father is playing with his son.
3.
राजा सेवकेन
सह मन्दिरं प्रविशति
రాజు
సేవకునితో మందిరంలో ప్రవేశిస్తున్నాడు
A king is entering in to
temple along with his servant.
4.
पाण्डवा: पत्न्या सह वनं गतवन्त:||
పాండవులు
భార్యతో సహా అడవికి వెళ్ళిరి
Pandavas went to forest along with their wife.
Unit -5 विना
(లేకుండా ) = with out
1. रामेण विना सीता
न जीवति
రాముడు లేనిచో సీత బ్రతుక లేదు
Sita can not live without Rama.
2. जलेन विना जीवनं
नास्ति
నీరు లేనిచో జీవితమే లేదు
There is no life with out water.
3. विद्यया विना जीवनं
फलवन्तं न भवति
విద్య లేనిచో జీవితం సఫలం కాదు
Life is not worth while /fruitful without education.
4.
चक्रै: विना वाहनं
न चलति
చక్రములు లేకుండా వాహనము నడవదు
A vehicle does not move without wheels
5. अध्यापकेन विना पाठनं
नास्ति
అధ్యాపకుడు లేకుండా బోధన జరుగదు
There is no teaching without teacher.
6. मुखेन विना भाषणं
न प्रचलति
నోరు లేకుండా మాట్లాడలేము
There is no speech without mouth.
A
Sanskrit Sloka for fun: 13.
चितां प्रज्वलितां
दृष्ट्वा वैद्यो विस्मयमागत:
नाsहं
गतो न मे भ्राता कस्येदं हस्तलाघवम् ?
చితాం ప్రజ్వలితాం దృష్ట్వా వైద్యో
విస్మయమాగత:
నాsహం గత: న మే భ్రాతా కస్యేదం
హస్తలాఘవం?
ఒక చోట చితిపై ఒక శవం కాలుతో౦ది. అది
చూచి ఒక వైద్యుడు ఇలా అనుకుంటున్నాడు . ఇతనికి నేను గాని మా అన్నయ్య గాని వైద్యం
చెయ్యలేదు . ఇది ఎవరి హస్త లాఘవ౦ అయ్యుంటుంది ?
On seeing a dead body being burnt on a pyre, a doctor
exclaimed and thought for himself “neither I nor my brother treated him. Whose
marvelous act it is”?
No comments:
Post a Comment