Monday, March 3, 2014

మినీ కవితలు

మినీ కవితలు
డా|| చిలకమర్తి  దుర్గాప్రసాదరావు

1. ఆడ బ్రతుకు కోడి బ్రతుకు ఒకటే నేమో
ఇద్దరూ బలికావలసిందే
ఎటొచ్చీ ఒకరు అత్తకు
వేరొకటి కత్తికి

2. ఈ ప్రపంచం చాల విచిత్రమైoది
భయపడితే భయపెడుతుంది
భయపెడితే భయపడుతుంది

౩. పసలేని ఇజాలకోసం
పడతావెందుకుతొందర
అసలైన నిజం కోసం
అడుగు వెయ్యి ముందర

4. మనిషి చేసిన లోహయంత్రం
వాడుకుంటే  అరుగుతుంది
దేవుడిచ్చిన దేహయంత్రం
వాడకుంటే తరుగుతుంది  
 

No comments: