సంభాషణ
సంస్కృతం -4
Dr. Chilakamarthi. Durga Prasada Rao
+91 9897959425
ఇంతవరకు మనం ఒక వ్యక్తి ఒక పని చేస్తున్నప్పుడు
ఆవ్యక్తి ఏపని చేస్తున్నాడో మనం సంస్కృత౦లో చెప్పడానికి కొంత సాధన చేసాం. ఇప్పుడు
మనం ఒక పని చెయ్యమని ఎదుటి వ్యక్తిని ఎలా అడగాలో తెలుసుకుందాం .
ముఖ్య
గమనిక :
మనం ఎదుటివారితో మాట్లాడవలసి
వచ్చినప్పుడు त्वम् (నీవు)
అనే ఏకవచన పదానికి బదులు भवान्/ भवती / అని
గౌరవప్రదమైన ఏకవచనం यूयम् (మీరు ) అనే బహువచనపదానికి బదులు भवन्त: / भवत्य: అనే పదాలు వాడినప్పుడు ప్రథమపురుషక్రియాపదమే రెంటికి (అనగా I&II persons కు) సరిపోతుంది .
అందువల్ల సంస్కృతసంభాషణలో त्वम् కు బదులుగా ఎదుటివ్యక్తి
మగవాడైతే भवान् అని
ఆడువారైతే भवती అని అలాగే / यूयम् కు
బదులుగా ఎదుటివ్యక్తులు మగవారైతే भवन्त: అని ఆడువారైతే भवत्य: అని ప్రయోగించాలి.
ప్రయోగాలు పరిశీలించండి (Observe the examples)
(स:) गच्छति (అతడు వెళ్ళు చున్నాడు ) (सा
) गच्छति ఆమె
వెళ్ళుచున్నది (III person)
ప్రథమ పురుష
(भवान् )నీవు गच्छति (भवती) నీవుगच्छति( II person) (भवन्त:) गच्छन्ति (भवत्य:)
गच्छन्ति (II
person) మధ్యమపురుష
(ते) गच्छन्ति (ता:)
गच्छन्ति (
III person) ప్రథమ పురుష
Lesson -4/1
लोट्
लकाररूपाणि (విధి లేక ప్రార్థన )
Imperative Mood
This is used in request or
order.
Complete chart of Imperative
Mood
దీనికి సంబంధించిన క్రియాపదరూపాలు ఇలా ఉంటాయి
వర్తమానకాలంలోని ‘తి’ ని ‘తు’ గా
మారిస్తే విధి లేక ఆజ్ఞగా మారిపోతుంది . వర్తమాన కాలం క్రియాపదాలను గుర్తు
పెట్టుకుని ఇక్కడ ఏఏ మార్పులొచ్చాయో గమనించండి .
पठतु (భవతు) पठताम्
( భవతాం) पठन्तु
(పఠ౦తు)
पठ (పఠ) पठतम् (పఠత౦) पठत (పఠత)
पठानि (పఠాని) पठाव
(పఠావ) पठाम (పఠామ)
(स:
/ सा) पठतु అతడు
/ఆమె చదువుగాక (he/she should read)
(तौ) पठताम् వారిద్దరూ (they two should read)
(ते) पठन्तु వారందరూ
(they
all should read)
(त्वं) पठ నీవు
చదువుము
(you should read)
(युवां) पठतम् మీరిద్దరూ చదవండి ( you two should read
(यूयं ) पठत మీరందరు చదవండి (you all should read)
(अहं)
पठानि నేను
చదువుదునుగాక (I should read)
(आवां)
पठाव మేమిద్దరం
(we two should read)
(वयं) पठाम మేమందరం (we all should read)
ఒకవేళ ఎదుటివ్యక్తికి ప్రార్థనా పూర్వకంగా చప్పవలసివస్తే कृपया (కృపయా) అనే పదం ముందు చేర్చితే బాగుంటుంది .
भवान् पठतु (ఆజ్ఞ) भवान्
कृपया पठतु (ప్రార్థన )
भवती पठतु (ఆజ్ఞ)
भवती कृपया पठतु (ప్రార్థన)
You should read
you
please read
भवान् / भवती ---लिखतु =You write
(చదువుము)
भवान् / भवती--- क्रीडतु =You play (ఆడుము)
भवान् / भवती ---गच्छतु = You go =(వెళ్ళుము)
भवान् / भवती ---आगच्छतु = You come (రమ్ము)
भवान् /भवती ---खादतु = You eat (తినుము)
भवान् /भवती ---पिबतु = You drink
(త్రాగుము )
भवान् / भवती ---आह्वयतु =You call or you invite
(ఆహ్వానింపుము)
भवान् / भवती ---प्रेषयतु = You
send (పంపుము)
भवान् / भवती---पृच्छतु =You ask
(అడుగుము )
भवान् / भवती--नयतु =You take (తీసుకొనుము )
भवान् / भवती---आनयतु = you bring (తీసికొని రమ్ము )
भवान् / भवती ---क्रीणातु = You buy / purchase (కొనుము )
भवान् / भवती विक्रीणातु = You
sell (అమ్ముము )
भवान् / भवती पततु =You fall (నీవు
పడుము)
भवान्
/ भवती हसतु =You smile
(నవ్వుము )
भवान् / भवती ददातु =You give
(ఇమ్ము )
भवान्
/ भवती गृह्णातु = you catch or hold
(పట్టుకొనుము )
भवान् / भवती शृणोतु = You listen (to)
(వినుము)
भवान् / भवती मुञ्चतु = You leave or give up (విడిచిపెట్టుము)
भवान् / भवती प्रक्षालयतु = You clean or wash
(శుభ్రము చేయుము )
भवान् / भवती मापयतु = You measure
(కొలువుము)
भवान् / भवती उत्तिष्ठतु = You stand (నిలబడుము )
भवान् / भवती उपविशतु = You sit
(కూర్చొ నుము )
भवान् / भवती चालयतु = You drive
(నడుపుము)
भवान् / भवती करोतु = You do
(చేయుము)
भवान् / भवती आस्वादयतु = You taste or enjoy
(ఆస్వాదింపుము )
भवान् / भवती पालयतु = You rule or protect
(రక్షింపుము )
भवान्
/ भवती चुम्बतु = you kiss (ముద్దు
పెట్టుకొనుము )
Lesson -4/2
NUMBERS IN SANSKRIT
ఇప్పుడు మనం సంస్కృత౦లో సంఖ్యావాచక శబ్దాలు ఎలా
ఉంటాయో తెలుసు కుందాం .
1-एकम् (ఏకం )ఒకటి
-2-द्वे (ద్వే)
రెండు -3-त्रीणि(త్రీణి)
మూడు -4-चत्वारि (చత్వారి)నాలుగు
-5-पञ्च
(పంచ)
ఐదు-6-षट् (షట్) ఆఱు-7 सप्त (సప్త) ఏడు
- 8अष्ट(అష్ట)
ఎనిమిది - 9-नव (నవ)తొమ్మిది
-10-दश
(దశ) పది
20-विंशतिः(వింశతి:) 30-త్రింశత్)-40-चत्वारिंशत् (చత్వారింశత్)
50-पञ्चाशत् (పంచాశత్)- 60-षष्टिः(షష్టి
:)- 70-सप्ततिः(సప్తతి:)
80-अशीति: (అశీతి:)--90-नवति: (నవతి:)--100-शतम् (శతం)
Lesson -4/3
समयशिक्षणम्
5.00—पञ्चवादनम् (పంచ వాదనం ) --- 5.15--- सपाद पञ्चवादनम्--- (సపాద
పంచవాదనం 5.30---
सार्धपञ्चवादनम् (సార్ధ పంచవాదనం )
5.45--- पाद –ऊन- षट् वादनम्--- (పాద ఊన షడ్వాదనం) 6.00---
षट् –वादनम्
(షడ్వాదనం).
*****
5.00- पञ्चवादनम् 5.05- पञ्चाधिक
पञ्चवादनम्—పంచాధిక
పంచవాదనం
5.10- दशाधिक पञ्चवादनम् పంచవాదనం 5.20- विंशत्यधिक पञ्चवादनम् వింశత్యధిక
పంచవాదనం
5.25- पञ्चविंशत्यधिक पञ्चवादनम् (పంచవింశత్యధికపంచవాదనం)
5.35-पञ्चत्रिंशत्यधिक पञ्चवादनम् (పంచత్రింశత్యధిక
పంచవాదనం)
5.40- चत्वारिंशत्यधिक पञ्चवादनम् (చత్వారింశత్యధిక
పంచవాదనం)
5.50-पञ्चाशदधिक पञ्चवादनम् పంచాశదధిక
పంచవాదనం
5.55-पञ्चपञ्चाशदधिक पञ्चवादनम्- పంచవాదనం
6.00-षड् वादनम् షడ్వాదనం
1.00-एकवादनम् --- 2.00-द्विवादनम् 3.00- त्रिवादनम्--- 4.00-चतुर्वादनम्
ఈ క్రింది వాక్యాలను మీకు
తెలిసిన విధంగా సంస్కృతంలో అనువదించండి .
- మోహన్ 5
గంటలకు లేస్తాడు
Example:- मोहन: पञ्चवादने
उत्तिष्ठति
- మోహన్ 5.15
కి దంతధావనం చేస్తాడు .
- మోహన్ 5.30
కి వ్యాయామం చేస్తాడు
- సీత 5.45
పాలు త్రాగును
- మోహన్ 6.00
స్నానం చేస్తాడు .
- మోహన్ 7.00
లకు యోగాభ్యాసం చేయును
- సీత 8. ౦౦ కు
అల్పాహారం తినును .
- సీత 9.౦౦ లకు
పాఠశాలకు వెళ్ళును .
- సీత 10గం||లకు
పాఠము వినును
- సీత 2గం||లకు
ఇంటికి వచ్చును .
***
సంస్కృత శ్లోక౦ --4
अधमा: धनमिच्छन्ति धनं मानं च मध्यमा:
उत्तमा: मानमिच्छन्ति मानं हि महतां धनम् ||
(అధమా: ధనమిచ్ఛంతి ధనం మానం చ మాధ్యమా:
ఉత్తమా: మానమిచ్ఛంతి మానం హి మహతాం ధనం)
అధములు ధనమునే కోరుకొందురు. మధ్యములు ధనం-గౌరవం రెంటిని కోరుకొందురు. ఉత్తములు
గౌరవమునే కోరుకొందురు. ఉత్తములకు గౌరవమే(కీర్తియే)ధనం. వారికి కీర్తి కంటే ధనం
గొప్పది కాదు .
***********11
No comments:
Post a Comment