వల్లమాలిన
బాధ ఆ నల్లిబాధ
చిలకమర్తి
దుర్గాప్రసాదరావు
మానవశరీరం ఏ బాధకు తట్టు కోలేదు. పాము కరిచినా తట్టుకోలేదు చివరకు దోమ కుట్టినా తట్టుకోలేదు . మన చుట్టూ ఉండి
మనల్ని బాధ పెట్టే క్రిమికీటకాలు ఎన్నో ఉన్నాయి . అట్టివానిలో నల్లికి ఎంతో ప్రాముఖ్యం
ఉంది . అది మన నిద్రను పూర్తిగా హరిస్తుంది.
మన రక్తం త్రాగుతుంది . మనకు కనబడకుండ కన్నంలో
దాక్కుంటుంది .
క్షణంలో మాయమౌతుంది .ఎవరికీ దొరక్కుండా చాల వేగంగా సంచరిస్తుంది . దాని
నోరు చాల పదునైనది. పాము ఒకసారే చంపుతుంది
కాని ఇది ప్రతి రోజు మనల్ని చంపుతూనే ఉంటుంది . నల్లికి మనుషులే కాదు దేవతలు సైతం
భయపడతారట . ఇది శ్రీనాథ మహాకవి భావన .
ఈశ్వరుడు
హిమాలయాల్లోను , సూర్య చంద్రులు ఆకాశంలోనూ
, శ్రీమహావిష్ణువు ఆది శేషుని మీద పడుక్కోడానికి కారణం నల్లికి భయపడే అని
అభిప్రాయపడ్డాడు .
ఆయనే స్వయంగా చెప్పిన చాటువు చూడండి .
శివుడద్రిని శయనించుట
రవిచంద్రులు మి౦టనుంట రాజీవాక్షుం
డవిరళముగ శేషునిపై
పవళించుట నల్లిబాధ పడలేక సుమీ!
No comments:
Post a Comment