10. వ్యాకరణ శాస్త్రంలో అద్వైత సిద్ధాంత భావాలు
కాళి. రంగాచార్యులు గారు& మధురా కృష్ణమూర్తి శాస్త్రి గారు
అనువాదం :- డాక్టర్ . చిలకమర్తి
దురాప్రసాదరావు
వ్యాకరణశాస్త్రం షడంగాల్లో ఒకటి . వేదమునకు శిక్ష , వ్యాకరణం , ఛందస్సు , నిరుక్తం , జ్యోతిషం , కల్పం అనేవి మొత్తం ఆఱు అంగాలు. ఈ వ్యాకరణ శాస్త్రం వేద వాక్యం యొక్క అర్థాన్ని చక్కగా వివరించడం కోసమే ఏర్పడింది . వ్యాకరణ కర్తలు వేదవాక్యార్థాన్ని
వివరించడంతో బాటుగా శాస్త్ర పరమావధి అద్వైతమే అని స్పష్టంగా వివరించారు
నందికేశ్వరుడు మహేశ్వర సూత్రాలు వివరిస్తూ అకారమును సర్వవ్యాపకమైన నిర్గుణ పరబ్రహ్మగాను , ఈశ్వరునిగాను భావించాడు. అది చిత్కళ యగు ఇకారముతో కలసి ఈ జగత్తుగా పరిణమించిందని వివరించాడు . అకారం సర్వవ్యాపకమైన పరమేశ్వరుడు . మాహేశ్వరసూత్రాల్లో
మొదటి సూత్రంలోని మొదటి అక్షరం ‘అ’ ఆఖరి
సూత్రంలోని అక్షరం ‘హ’ కలిస్తే అహం ఔతుంది. అకారం జ్ఞాన స్వరూపం .ఇకారం చిత్కళ. అకారం సర్వ
వ్యాపకం . ఇకారం జగత్కారణం . అవి విష్ణు
శివ స్వరూపాలు . దీన్ని బట్టి నిర్గుణ బ్రహ్మ జగత్కారణంగాను ఇ జగత్తుగాను భావించడం
చేత హరిహరులకు మధ్య భేదం లేదని తెలుస్తోంది.
న్యాయ రక్షామణి లో కొన్ని
వాక్యాలు వైయాకరణుల స్ఫోట సిద్దాంతానికి వేదాంత వేద్యమైన బ్రహ్మకూ ఏటువంటి భేదం లేదని చెప్పడం ద్వారా వ్యాకరణ శాస్త్రానికి అద్వైత
సిద్ధాంతానికి ఎన్నో పోలికలు కనిపిస్తు న్నాయి.
వ్యాకరణ వేత్త లైన హరి, పాణిని మొదలైన వారి అభిప్రాయం ప్రకారం మాహేశ్వర సూత్రాలలో మొదటిదైన వృద్ధిరాదైచ్ సూత్రంలోని వృద్ధి పదం బ్రహ్మ తత్వాన్ని సుచిస్తూ అద్వైత బ్రహ్మ సిద్ధాంతాన్ని బోధిస్తోంది. వార్తికకారుడైన
వరరుచి కాత్యాయనుల వాక్యాలు విశ్లేషిస్తే
అద్వైత వేదాంత విషయాలు గోచరిస్తాయి.
వీరు కూడ బ్రహ్మమే ప్రపంచానికి కారణభూత మని శివునకు విష్ణువునకు బేధం లేదని పేర్కొన్నారు.
అకారము జ్ఞానమని ఇకారము చిత్కళ ఈ రెండూ విష్ణు శివస్వరూపములని అభిప్రాయపడ్డాడు
మహాభాష్య కారుడు పతంజలి
అద్వైత సిద్దాంతం , మా౦ డూక్యోపనిషత్తులోని వాక్యాల పట్ల తన ఆదరగౌరవాలను వ్యక్తం
చేశారు.
స్ఫోట వాదాన్ని వివరించిన న్యాయరక్షామణి స్ఫోటసిద్దాంతానికి, బ్రహ్మవాదానికి ఎటువంటి భేదం లేదని కేవలం నామమాత్ర భేదమేనని అభిప్రాయపడింది
సర్వదర్శన సంగ్రహ కర్త విద్యారణ్యుడు వ్యాకరణశాస్త్రాన్ని పాణిని దర్శనంగా పేర్కొనడం వ్యాకరణ శాస్త్రానికి అద్వైత సిద్ధాంతానికిగల ఏకత్వాన్ని తెలియజేస్తోంది.
<><><><><>
1 comment:
వ్యాకరణశాస్త్రానికి అద్వైతానికి చాలా చోట్ల దగ్గరసంబాంధాలున్నాయని వాక్యపదీయం బ్రహ్మకాండ వలన తెలుస్తుంది. శబ్దమే బ్రహ్మమని, దాని వివర్తమే లోగమని మొదటి శ్లోకంలోనే భర్తృహరి ప్రతిపాదిస్తారు. అద్వైతం లో చెప్పిన వివర్తవాదమే భర్తృహరి వాక్యపదీయం లో ఆశ్రయించారు. అయితే స్ఫోటవిషయం లో రెండు దర్శనాలకు చాలా భేదమున్నది. వ్యాకరణసిద్ధాంతాలలో స్ఫోటము ముఖ్యమైనది, అయితే దానిని అద్వైతులు ఖండిస్తారు.
Post a Comment